Jump to content

కమలా మార్కండేయ

వికీపీడియా నుండి
కమలా మార్కండేయ
జననంకమలా పూర్ణయ్య
(1924-06-23)1924 జూన్ 23
మైసూరు, మైసూరు రాజ్యం, బ్రిటిష్ భారతదేశం
(ప్రస్తుతం మైసూరు, కర్ణాటక, భారతదేశం)
మరణం2004 మే 16(2004-05-16) (వయసు: 79)
లండన్, ఇంగ్లాండ్
వృత్తినవలా రచయిత్రి, పాత్రికేయురాలు
పూర్వ విద్యార్థిమద్రాస్ విశ్వవిద్యాలయం

కమలా మార్కండేయ (23 జూన్ 1924 – 16 మే 2004),[1] అసలు పేరు కమలా పూర్ణయ్య, వివాహానంతర పేరు కమలా టేలర్, ఒక బ్రిటిష్ - భారతీయ నవలా రచయిత్రి, పాత్రికేయురాలు. ఆంగ్లంలో రచనలు చేసిన అత్యంత ప్రాముఖ్యమైన భారతీయ నవలా రచయిత్రుల్లో ఒకరిగా ఆమెను పేర్కొన్నారు.[2]

జీవితం

[మార్చు]

ప్రారంభ జీవితం

[మార్చు]

మార్కండేయ ఒక ఉన్నత మధ్యతరగతి దేశస్థ మాధ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది.[3][2] ఆమె భారతదేశం లోని మైసూరుకు చెందినది. మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైన తర్వాత భారతీయ వార్తాపత్రికల్లో అనేక చిన్న కథలను ప్రచురించింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆమె బ్రిటన్ కు వెళ్లింది. అయినప్పటికీ, చాలా కాలం పాటు తనను భారతీయ ప్రవాస రచయిత్రిగా పేర్కొనేది.

కమలా, మైసూరు దివాన్ పూర్ణయ్య వంశానికి చెందిన వారసురాలు. ఆమెకు కన్నడ, మరాఠీ భాషలపై మంచి పట్టు ఉండేది.[4][5]

రచనా జీవితం

[మార్చు]

భారతదేశంలోని పట్టణ, గ్రామీణ సమాజాల మధ్య ఉన్న సంస్కృతి ఘర్షణలను చిత్రీకరించిన రచయిత్రిగా కమలా మార్కండేయ ప్రసిద్ధి చెందింది. ఆమె తొలి ప్రచురిత నవల నెక్టర్ ఇన్ ఎ సీవ్ (1954) అత్యంత ప్రజాదరణ పొందిన బెస్ట్‌సెల్లర్‌గా నిలిచింది. 1955లో దీనిని అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ ప్రాముఖ్యమైన పుస్తకాల జాబితాలో చేర్చింది.

ఆమె ఇతర నవలలు:

  • Some Inner Fury (1955)
  • A Silence of Desire (1960)
  • Possession (1963)
  • A Handful of Rice (1966)
  • The Coffer Dams (1969)
  • The Nowhere Man (1972)
  • Two Virgins (1973)
  • The Golden Honeycomb (1977)
  • Pleasure City (1982)

ఆమె చివరి నవల Bombay Tiger మరణానంతరం 2008లో ఆమె కుమార్తె కిమ్ ఒలివర్ ద్వారా ప్రచురించబడింది.

Nectar in a Sieve అనే నవల శీర్షికను సామ్యూయెల్ టేలర్ కోలరిడ్జ్ రచించిన Work without Hope అనే కవితలోని ఈ పంక్తుల నుండి తీసుకున్నారు:[6]

Work without Hope draws nectar in a sieve,\\ And Hope without an object cannot live.

మరణం

[మార్చు]

కమలా మార్కండేయ 16 మే 2004న 79 సంవత్సరాల వయస్సులో మరణించింది.

రచనలు

[మార్చు]
  • నెక్టర్ ఇన్ ఎ సీవ్ (Nectar in a Sieve), లండన్: పుట్నమ్; న్యూయార్క్: జాన్ డే, 1954
  • Some Inner Fury, లండన్: పుట్నమ్, 1955; న్యూయార్క్: జాన్ డే, 1956
  • A Silence of Desire, లండన్: పుట్నమ్; న్యూయార్క్: జాన్ డే, 1960
  • Possession; a Novel, లండన్: పుట్నమ్; న్యూయార్క్: జాన్ డే, 1963
  • A Handful of Rice, లండన్: హామిష్ హామిల్టన్; న్యూయార్క్: జాన్ డే, 1966
  • The Coffer Dams, లండన్: హామిల్టన్; న్యూయార్క్: జాన్ డే, 1969
  • The Nowhere Man, న్యూయార్క్: జాన్ డే, 1972; లండన్: అలెన్ లేన్, 1973
  • Two Virgins, న్యూయార్క్: జాన్ డే, 1973; లండన్: చాట్టో అండ్ విండస్, 1974
  • The Golden Honeycomb, లండన్: చాట్టో అండ్ విండస్; న్యూయార్క్: క్రోవెల్, 1977
  • Pleasure City, లండన్: చాట్టో అండ్ విండస్, 1982. అమెరికాలో Shalimar పేరుతో ప్రచురించబడింది; న్యూయార్క్: హార్పర్ అండ్ రో, 1982
  • Bombay Tiger, న్యూ ఢిల్లీ: పెంగ్విన్, 2008 (మరణానంతరం ప్రచురించబడింది)

సాహిత్య విమర్శ

[మార్చు]
  • Almeida, Rochelle. Originality and Imitation: Indianness in the Novels of Kamala Markandaya. జైపూర్: రావత్ పబ్లికేషన్స్, 2000.
  • Aror, Sudhir K. Multicultural Consciousness in the Novels of Kamala Markandaya. Authors Press, 2011.
  • Jha, Rekha. The Novels of Kamala Markandaya and Ruth Prawer Jhabvala: A Study in East-West Encounter. న్యూ ఢిల్లీ: ప్రెస్టీజ్ బుక్స్, 1990.
  • Joseph, Margaret P. Kamala Markandaya. Indian Writers Series, న్యూ ఢిల్లీ: ఆర్నాల్డ్-హైనెమన్, 1980.
  • Krishna Rao, A. V. The Indo-Anglian Novel and Changing Tradition: A Study of the Novels of Mulk Raj Anand, Kamala Markandaya, R. K. Narayan, Raja Rao, 1930–64. మైసూరు, 1972.
  • Parameswaran, Uma. Kamala Markandaya. జైపూర్: రావత్ పబ్లికేషన్స్, 2000.
  • Shrivastava, Manish. "Conflicts of Sensibility in Kamala Markandaya's A Silence of Desire". Synthesis: Indian Journal of English Literature and Language, సంపుటి 1, సంచిక 1.
  • Singh, Indu. "The Feminist Approach in Kamala Markandaya's Novels with Special Reference to Nectar in a Sieve". Synthesis: Indian Journal of English Literature and Language, సంపుటి 1, సంచిక 1.

మూలాలు

[మార్చు]
  1. ↑ "Kamala Markandaya" at Goodreads.
  2. 1 2 Marchionni, Paola (2002). "Markandaya, Kamala". In Alison Donnell (ed.). Companion to Contemporary Black British Culture. Routledge. pp. 192–193. ISBN 978-1-134-70025-7.
  3. ↑ World Literature Today, Volume 76, Issues 1-4. University of Oklahoma Press. 2002. p. 133.
  4. ↑ Indian Writing Today, Volumes 3-4. Nirmala Sadanand Publishers. 1969. p. 35.
  5. ↑ Angara Venkata Krishna Rao (1997). Kamala Markandaya: A Critical Study of Her Novels, 1954-1982. B.R. Publishing Corporation. p. 13. ISBN 9788170189411.
  6. ↑ Foundation, Poetry (2024-03-04). "Work without Hope by Samuel Taylor Coleridge". Poetry Foundation (in ఇంగ్లీష్). Retrieved 2024-03-04.

బాహ్య లంకెలు

[మార్చు]