కమల్ కిషోర్
| కమల్ కిషోర్ | |||
| పదవీ కాలం 2009 - 2014 | |||
| ముందు | రుబాబ్ సైదా | ||
|---|---|---|---|
| తరువాత | సావిత్రీ బాయి ఫూలే | ||
| నియోజకవర్గం | అమ్రోహా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1956 సెప్టెంబరు 1 రాజధాని , గోరఖ్‌పూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| నివాసం | గోరఖ్‌పూర్ & న్యూఢిల్లీ | ||
| పూర్వ విద్యార్థి | భారత సాయుధ దళాల సంస్థ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
కమల్ కిషోర్ ( జననం 1 సెప్టెంబర్ 1956) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బహ్రైచ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]కమల్ కిషోర్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బహ్రైచ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీపప్రత్యర్ధి బీఎస్‌పీ లాల్ మణి ప్రసాద్‌పై 38,953 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వాహక కమిటీ, రక్షణ కమిటీ, షెడ్యూల్డ్ కులాలు & షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ, రైల్వే మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ శాశ్వత ప్రత్యేక ఆహ్వానితులుగా, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ, విద్యుత్ మంత్రిత్వ శాఖ హిందీ రాజభాషా సమితి కమిటీలలో సభ్యుడిగా పని చేశాడు.[1]
కమల్ కిషోర్ 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బహ్రైచ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ పార్టీ అభ్యర్థిగా పోటీ 24,421 ఓట్లతో నాల్గొవ స్థానంలో నిలిచాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Kamal Kishor". Digital Sansad. 4 June 2024. Archived from the original on 30 June 2025. Retrieved 30 June 2025.
- ↑ "Bahraich Lok Sabha Election results 2014 - 2024". The Times of India. 4 June 2024. Archived from the original on 30 June 2025. Retrieved 30 June 2025.