Jump to content

కమల్ నారాయణ్ సింగ్

వికీపీడియా నుండి
కమల్ నారాయణ్ సింగ్
22వ భారత ప్రధాన న్యాయమూర్తి
In office
25 నవంబర్ 1991  12 డిసెంబర్ 1991
Appointed byరామస్వామి వెంకట్రామన్
అంతకు ముందు వారురంగనాథ్ మిశ్రా
తరువాత వారుఎం.హెచ్. కనియా
చైర్మన్, 13వ లా కమిషన్ ఆఫ్ ఇండియా
In office
1991–1994
వ్యక్తిగత వివరాలు
జననం(1926-12-13)1926 డిసెంబరు 13
మరణం2022 సెప్టెంబరు 8(2022-09-08) (వయసు: 95)
అలహాబాద్, ఉత్తర్ ప్రదేశ్, భారతదేశం
జాతీయతభారతీయుడు
కళాశాలఅలహాబాద్ విశ్వవిద్యాలయం

కమల్ నారాయణ్ సింగ్ (13 డిసెంబర్ 1926 - 8 సెప్టెంబర్ 2022) భారతదేశానికి 22వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన భారతీయ న్యాయవేత్త. ఇతడు సిర్సాలోని ఎల్.ఆర్.ఎల్.ఎ. ఉన్నత పాఠశాలలో, పిమ్మట అలహాబాద్‌లోని ఈవింగ్ క్రిస్టియన్ కళాశాలలో విద్యనభ్యసించాడు. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు. ఇతడు ప్రధాన న్యాయమూర్తిగా అతి తక్కువ సమయం అంటే 17 రోజుల పాటు పదవిలో ఉన్నాడు .[1]

న్యాయవృత్తి

[మార్చు]

న్యాయవాదిగా, సింగ్ 1957 నుండి పౌర, రాజ్యాంగ, పన్నుల చట్టాలలో అనుభవం సంపాదించాడు. 1970లో అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, తరువాత 1972లో శాశ్వత న్యాయమూర్తిగా ఇతడి మొదటి న్యాయ నియామకం జరిగింది. 1986లో ఇతడు సుప్రీంకోర్టులో చేరాడు. 1991 నవంబర్ 25 నుండి 1991 డిసెంబర్ 12 వరకు భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు.

సుప్రీమ్‌ కోర్టులో ఇతడు 100 తీర్పులను ఇచ్చాడు. 336 బెంచిలలో కూర్చున్నాడు.[2]

ఇతడిని అలహాబాద్ విశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థుల అసోసియేషన్ "గర్వించదగిన పూర్వ విద్యార్థి"గా సత్కరించింది.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Nanjappa, Vicky (19 June 2018). "Convention breached just twice: How is the Chief Justice of India appointed". One India (in ఇంగ్లీష్). Retrieved 2 May 2019.
  2. "K.N. Singh". Supreme Court Observer (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-09-30.
  3. "Our Proud Past". Allahabad University Alumni Association. Retrieved 14 October 2020.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  4. "Our Proud Past". Allahabad University Alumni Association. Archived from the original on 15 January 2008. Retrieved 14 October 2020.
[మార్చు]