కమ్యూనిటీ రేడియో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కమ్యూనిటీ రేడియో అనేది వ్యాపారాత్మక మరియు ప్రజా సేవ తరువాత మూడవ నమూనా రేడియో ప్రసారం అందించే రేడియో సేవ. కమ్యూనిటీ స్టేషన్లు భౌగోళిక సముదాయాలకు మరియు ఔత్సాహిక సముదాయాలకు సేవలు అందించవచ్చు. అవి వ్యాపారాత్మక లేదా ప్రజా మాధ్యమ ప్రసారకులు తరచూ విస్మరించినటువంటి, స్థానిక/నిర్దిష్ట శ్రోతలలో ప్రసిద్ధమైన విషయాల్ని ప్రసారం చేస్తాయి.

కమ్యూనిటీ రేడియో స్టేషన్లు అవి సేవలందించే సమాజాలచే నడపబడుతూ, వాటికి స్వంతమై, వాటిచే నిర్వహించబడుతూ ఉంటాయి. కమ్యూనిటీ రేడియో అనేది లాభం కోసం కాదు మరియు వ్యక్తులు, వర్గాలు, మరియు సముదాయాలకు, వారి స్వంత విభిన్న కథలను చెప్పడానికి, అనుభవాలు పంచుకోవడానికి, మరియు మాధ్యమాలు అధికంగా ఉన్న ప్రపంచంలో, మాధ్యమానికి చురుకైన సృష్టికర్తలు మరియు భాగస్వాములుగా తయారవడానికి ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది.

ప్రపంచంలో ఎన్నో ప్రాంతాలలో, కమ్యూనిటీ రేడియో అనేది సముదాయానికి మరియు స్వఛ్ఛంద విభాగానికి, పౌర సంఘానికి, ఏజెన్సీలకు, NGOలకు మరియు పౌరులకు, సముదాయ అభివృద్ధి మరియు లక్ష్యాల ప్రసారం వృద్ధికి మాధ్యమంగా పనిచేస్తుంది.

ఫ్రాన్స్, అర్జెంటీనా, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, మరియు ఐర్లాండ్ వంటి ఎన్నో దేశాలలో కమ్యూనిటీ రేడియోను నిర్దిష్ట ప్రసార విభాగంగా చెప్పే గణనీయమైన చట్టపర నిర్వచనం ఉంది. చట్టంలోని నిర్వచనంలో భాగంగా చాలావరకూ సాంఘిక ప్రయోజనం, సాంఘిక లక్ష్యాలు, సాంఘిక లబ్ధి వంటి పదాలు చేర్చడం జరిగింది.

చారిత్రికంగా వివిధ దేశాల్లో వివిధ రకాలుగా కమ్యూనిటీ రేడియో వృద్ధి చెందింది, కాబట్టి ఈ పదానికి యునైటెడ్ కింగ్‍డం, ఐర్లాండ్, సంయుక్త రాష్ట్రాలు, కెనడా, మరియు ఆస్ట్రేలియాలలో కాస్త భిన్నమైన అర్థాలు ఉన్నాయి.

ఐర్లాండ్లో, కమ్యూనిటీ రేడియో 1970ల చివరి నుండి పనిచేస్తోంది; కానీ, ఇండిపెండెంట్ రేడియో అండ్ టెలివిజన్ కమిషన్, ఒక 18-నెలల కమ్యూనిటీ రేడియో పైలట్ ప్రాజెక్టును స్థాపించి, ఐరిష్ నేపథ్యంలో సముదాయ ప్రసారాల సాధ్యతను తెలుసుకుని, లెక్క కట్టడానికి సుమారు 1994 వరకూ సాధ్యం కాలేదు. దేశం మొత్తమ్మీద పదకొండు సముదాయాలు మరియు సముదాయాలలో ఆసక్తి చూపే బృందాలకు అనుమతులు లభించాక, ఈ ప్రాజెక్ట్ 1995లో ప్రారంభమైంది. ఐర్లాండ్లో కమ్యూనిటీ రేడియో అనేది ప్రక్రియ (కార్యక్రమాల రూపకల్పనలో సముదాయాల భాగస్వామ్యం) మరియు ఉత్పత్తి (అందించిన కార్యక్రమాల ద్వారా సముదాయానికి లభించే సేవ), రెండింటికీ సంబంధించింది. ఈ ప్రక్రియ మరియు ఉత్పత్తుల మిశ్రమం అనేది, సముదాయం యొక్క అవసరాల ద్వారా నిర్ణయింపబడుతుంది మరియు సముదాయం నియంత్రణలో పనిచేసే ఒక నిర్వహణా యంత్రాంగం ద్వారా అమలుచేయబడుతుంది. ఐర్లాండ్లోని స్టేషన్లు భౌగోళిక మరియు నిర్దిష్ట-సముదాయాలపై ఆధారపడినవి.

UKలో, సముదాయ-ఆధారిత సేవల ఆలోచన, కనీసం ప్రారంభ 1960లలో BBC స్థానిక రేడియో యొక్క విశిష్ట భావనతో మొదలైందని చెప్పుకోవచ్చు. ఆ తరువాత ప్రాంత-ఆధారితమైన అనుమతిలేని పైరేట్ రేడియో స్టేషన్లు (ఈస్ట్ లండన్ రేడియో, మరియు రేడియో AMY: ఆల్టర్నేటివ్ మీడియా ఫర్ యు, వంటివి) ఈ ఆలోచనను మరింతగా వృద్ధి చేసాయి. 1970ల చివర్లో మరియు 1980ల ప్రారంభంలో, ఈ పైరేట్ స్టేషన్లు త్వరితంగా వృద్ధి చెందడంతో, వీటిలో బలహీన వలస సముదాయాలకు ప్రత్యేకమైన ప్రసారాలను అందించే స్టేషన్లు కూడా ఇందులో చేరాయి (ఆఫ్రో-కారిబ్బియన్ మరియు ఆసియన్ మొదలైనవి.), ప్రత్యేకంగా లండన్, బర్మింగ్హాం, బ్రిస్టల్, మరియు మాంచెస్టర్ వంటి నగరాలలో. UKలో కొందరికి "కమ్యూనిటీ రేడియో" అనేది "పైరేట్ రేడియో"కు పర్యాయపదంలా అనిపించినా, చాలావరకూ బలహీనవర్గాల వలస స్టేషన్లు కేవలం నిర్దిష్ట సంగీత శైలులపై కేంద్రీకృతమై, (కనీసం సిద్ధాంత పరంగా) లాభాపేక్షతో నడపబడేవి. UKలోని కమ్యూనిటీ రేడియో సేవలు, సముదాయ యాజమాన్యం మరియు నియంత్రణ కలిగి, లాభాపేక్ష లేకుండా పనిచేస్తాయి. మునుపటి UK ప్రసార నియంత్రణ సంస్థ, ది రేడియో అథారిటీ, 2001లో ప్రారంభించిన ప్రయోగాన్ని అనుసరించి, 2005 నుండి సుమారు 200 అటువంటి స్టేషన్లకు UK ప్రసార నియంత్రణ సంస్థ ఆఫ్‍కామ్, అనుమతి జారీ చేసింది. చాలావరకూ అటువంటి స్టేషన్లు FM పై ప్రసారాలను సామాన్యంగా సుమారు 25 వాట్లు (ప్రతి తలానికి) వికిరణ శక్తి స్థాయిలో అందిస్తాయి, కానీ ప్రత్యేకంగా మరింత గ్రామీణ ప్రాంతాలలో, కొన్ని AM (మధ్య తరంగం)పై కూడా పనిచేస్తాయి.

U.S.లో, కమ్యూనిటీ రేడియో స్టేషన్లు అనేవి, ది ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ద్వారా, FM బ్యాండ్లో వ్యాపారాత్మకం-కాని, బహిరంగ విభాగ ప్రసారానికి అనుమతి పొందిన లాభాపేక్ష-లేని, సముదాయ-ఆధారిత కార్యకలాపాలు. U.S. లోని ఇతర ప్రజా రేడియో సంస్థలకు భిన్నంగా, ఈ స్టేషన్లు సముదాయ స్వఛ్ఛంద వ్యక్తులకు ప్రసారకులుగా చురుకైన భాగస్వామ్యం కల్పిస్తాయి.[1] ఆస్ట్రేలియాలో పైరేట్ రేడియో అనేది దాదాపు తెలియదు, ఎందుకంటే ప్రసార పౌనఃపున్యాల కేటాయింపు నియంత్రణ కఠినంగా ఉంటుంది, మరియు నేరస్తులకు తీవ్ర, చట్టపరమైన జరిమానాలతో పాటు, కారాగార శిక్ష కూడా ఉండవచ్చు.

దార్శనికత, తత్త్వం, మరియు హోదా[మార్చు]

ఆధునిక-కాలంలో కమ్యూనిటీ రేడియో స్టేషన్లు తరచూ తమ శ్రోతలకు, పెద్ద వ్యాపారాత్మక రేడియో స్టేషన్లు సాధారణంగా అందించని ఎన్నో రకాల విషయాలను అందిస్తాయి. కమ్యూనిటీ రేడియో సంస్థలు స్థానిక ప్రాంతానికి చెందిన, ప్రత్యేకంగా ఇతర ప్రధాన మీడియా సంస్థలు సరైన సేవలు అందించని వలస లేదా బలహీన వర్గాలకు సంబంధించిన, వార్తలు మరియు సమాచార కార్యక్రమాలు ప్రసారం చేయవచ్చు, . ఎన్నో కమ్యూనిటీ రేడియో స్టేషన్లలో మరిన్ని ప్రత్యేకమైన సంగీత ప్రదర్శనలు కూడా తరచూ చోటు చేసుకుంటాయి. కమ్యూనిటీ స్టేషన్లు మరియు పైరేట్ స్టేషన్లు (అవి అనుమతించిన చోట), ఒక ప్రాంతానికి విలువైన ఆస్తులు కావచ్చు. కమ్యూనిటీ రేడియో స్టేషన్లు సామాన్యంగా వ్యాపార సంస్థలలోని విషయాల్ని, ఉదాహరణకు టాప్ 40 సంగీతం, క్రీడలు, మరియు "బలమైన" వ్యక్తుల గురించినవి, ప్రసారం చేయవు.

సాహిత్యంలో సముదాయం యొక్క భావనలు[మార్చు]

సముదాయాలు అనేవి సంక్లిష్ట సమూహాలు మరియు కమ్యూనిటీ రేడియోలో "కమ్యూనిటీ" యొక్క అర్థం తరచూ వివాదాస్పదం మరియు గమ్మత్తైన వాదన, ఇంకా ఇది దేశ దేశానికీ మారుతుంది. కమ్యూనిటీ అనే పదాన్ని, తరచూ "ప్రత్యామ్నాయ (alternative)", "వినూత్న (radical)", లేదా "పౌర (citizen)" రేడియో వంటి పదాలతో కూడా సూచిస్తారు. . సాంప్రదాయకంగా, ఒక "సంఘం" అనేది 'ఉమ్మడి ప్రాంతములో నివసించే పరస్పర ప్రభావితులయ్యే ప్రజల సమూహము. కమ్యూనిటీ రేడియో అనేది తరచూ సామీప్యం మరియు భాగస్వామ్య భావనల చుట్టూ నిర్మింపబడుతుంది, కాబట్టి కమ్యూనిటీ అనేది తరచూ రేడియో యొక్క సంకేతం చేరగల భౌగోళిక సముదాయాలకు చెందినదిగా భావించవచ్చు, అంటే, సందేశం అందుకోగల ప్రజలు, మరియు అటువంటి సందేశాలు తయారు చేయడంలో పాల్గొనే సాధ్యతలకు సంబంధించింది. నిజానికి, ప్రస్తుతం ఎన్నో రేడియో స్టేషన్లు ఇంటర్నెట్లో కూడా కావడం వలన, తద్వారా ప్రపంచ శ్రోతలు మరియు సముదాయాలకు చేరడం వలన, సమస్యగా మారింది.

కమ్యూనిటీ రేడియో నమూనాలు[మార్చు]

సైద్ధాంతికంగా, కమ్యూనిటీ రేడియో గురించి రెండు విభిన్న భావనలు ఉన్నాయి, కానీ ఈ రెండూ పరస్పరం నిర్దిష్టమైనవి కావు. ఒకటి సేవ లేదా సముదాయ-భావనను నొక్కి చెబుతుంది, ఇందులో సముదాయం కోసం ఆ స్టేషన్ ఏం చేయగలదన్న విషయం ఉంటుంది. మరొకటి, శ్రోత యొక్క జోక్యం మరియు భాగస్వామ్యంపై శ్రద్ధ చూపుతుంది.

సేవ నమూనాలో అంతర్గతంగా, స్థానికతను తరచూ గొప్పగా భావిస్తారు, ఎందుకంటే, తృతీయ స్థాయిగా, కమ్యూనిటీ రేడియో, పెద్ద కార్యకలాపాలకంటే, మరింత స్థానికంగా లేదా ప్రత్యేక సముదాయానికి చెందిన విషయాలపై శ్రద్ధ చూపవచ్చు. కానీ, కొన్నిసార్లు, స్టేషన్ యొక్క సేవా ప్రాంతంలో మునుపే లేనట్టి విషయాన్ని, ఇతరుల సహకారంతో అందించడాన్ని కూడా ఆశించడం జరుగుతుంది. ఉదాహరణకు, సంయుక్త రాష్ట్రాలలో ఎన్నో స్టేషన్లు, పసిఫికా రేడియో వంటి బృందాల నుండి సహకారంతో, డెమాక్రసీ నౌ! వంటి కార్యక్రమాల్ని, ఇతరత్రా లభ్యం కాని విషయాల్ని అందించే భావనతో అందించడం జరుగుతుంది. ఎందుకంటే అటువంటి కార్యక్రమాలు ప్రకటనకర్తలకు నచ్చకపోవచ్చు లేదా (ప్రత్యేకంగా పసిఫికా యొక్క సందర్భంలో) రాజకీయపరంగా వివాదాస్పదం కావచ్చు.

సామీప్య లేదా భాగస్వామ్య నమూనాలో, విషయ సృష్టిలో సముదాయ సభ్యులు పాల్గొనడాన్నే మంచి విషయంగా చూడడం జరుగుతుంది. ఈ నమూనా సేవా భావనను తొలగించకపోయినా, ఈ రెండింటి మధ్యా ఘర్షణ ఉంది, ఉదాహరణకు, జాన్ బెక్కెన్ యొక్క కమ్యూనిటీ రేడియో అట్ ది క్రాస్‍రోడ్స్ లో చెప్పినట్టూ.

ప్రాంతంలో పెరుగుదల[మార్చు]

భౌగోళిక ప్రాంతాన్ని బట్టి ఉదాహరణలు[మార్చు]

ఆస్ట్రేలియా[మార్చు]

కమ్యూనిటీ ప్రసారం అనేది ఆస్ట్రేలియా యొక్క మూడవ మీడియా విభాగం, దీనిని అధికారికంగా ది కమ్యూనిటీ బ్రాడ్‍కాస్టింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా (CBAA) గా చెబుతారు. జూన్ 2005 నాటికి, 442 పూర్తిగా-అనుమతి పొందిన కమ్యూనిటీ రేడియో స్టేషన్లు (సుదూర దేశీయ సేవలతో కలిపి) ఉండేవి.[ఉల్లేఖన అవసరం] ఆస్ట్రేలియాలోని కమ్యూనిటీ రేడియో విభాగం, ప్రత్యేకంగా స్థానిక విషయాల మూలంగా, ఆస్ట్రేలియన్ మీడియా దృశ్యంలో, ఒక విస్తారమైన, కానీ పెద్దగా గుర్తింపు పొందని పాత్ర పోషిస్తుంది. కాలక్రమేణా శ్రోతల సంఖ్య మరియు స్టేషన్ల సంఖ్యలో కమ్యూనిటీ రేడియో పెరిగినప్పటికీ, ఈ విభాగంలో, వివిధ స్టేషన్లు వారి సమయంలో ఎక్కువ భాగాన్ని, వారి సముదాయ సేవా కార్యకలాపాలకు నిధులు చేకూర్చడంలో గడపడం వలన, తక్కువ నిధులు కలిగి ఉంటాయి.

ఒక 2002 నివేదిక ప్రకారం, కమ్యూనిటీ రేడియో విభాగంలో క్రమ ప్రాతిపదికపై, 20,000 (లేదా మొత్తం ఆస్ట్రేలియన్లలో 0.1%) స్వఛ్ఛందంగా పాల్గొంటున్నారని, మరియు వీరు ప్రతి సంవత్సరమూ, $145 మిలియన్లకు సమానమైన పనిని, వేతనం ఆశించకుండా చేస్తారని తెలిసింది;[2] దేశవ్యాప్తంగా, 7 మిలియన్ ఆస్ట్రేలియన్లు (లేదా 15 ఏళ్ళకు పైబడిన వారిలో 45%) ప్రతినెలా కమ్యూనిటీ రేడియో వింటారు (మూలం: మెక్ నైర్ ఇంజెన్యుయిటీ).

కమ్యూనిటీ బ్రాడ్‍కాస్టింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా అభిప్రాయం ప్రకారం, ఆస్ట్రేలియాలో కమ్యూనిటీ ప్రసారాల పాత్ర, ఇతర విభాగాలు సాధించని మార్గాల్లో సముదాయ అవసరాలను తీర్చే విభిన్న రకాల సేవలు అందించడం. కమ్యూనిటీ బ్రాడ్‍కాస్టింగ్ అనేది సామీప్యం మరియు భాగస్వామ్యం, స్వఛ్ఛందభాగం, భిన్నత్వం, స్వేచ్ఛ మరియు స్థానికత అనే సూత్రాలపై ఆధారపడింది.

కొన్ని సందర్భాలలో కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ప్రత్యేకమైన సంగీతపు స్టేషన్లు, లేదా అవి స్థానిక సంగీతం మరియు కళలకు బలంగా ప్రతినిధిత్వం వహిస్తాయి. ఇతరులు వ్యాపారాత్మక లేదా ప్రభుత్వ రేడియో విషయాల్లోని లోపాలను సరిదిద్దడానికి, ప్రత్యామ్నాయం, స్వదేశీ ఆస్ట్రేలియన్, వాతావరణం, స్త్రీవాదం లేదా పురుష లేదా స్త్రీ స్వలింగ సంపర్కుల హక్కుల వంటి చర్చలు మరియు ప్రస్తుత పరిణామాల కార్యక్రమాలు ప్రసారం చేయవచ్చు. 53% కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ముద్రణ వైకల్యం కలిగిన ప్రజలు, యువకులు, వృద్ధులు, కళలు/మృదు సంగీతం, మత, మరియు పురుష మరియు స్త్రీ స్వలింగ సంపర్కుల సముదాయాలకు చెందిన వివిధ స్వదేశీ మరియు తేగల సముదాయాలకు సేవలు అందించవచ్చు. మిగిలిన స్టేషన్లు సాధారణమైనదిగా చెప్పబడే సేవలు అందించవచ్చు, ఇందులో ప్రత్యేక భౌగోళిక ప్రదేశానికి చెందిన సముదాయాలకు సంబంధించినవి, కానీ విభిన్న ప్రత్యేకమైన విషయాలకు చెందిన వాటిని అందించవచ్చు.

ఈ దేశంలోని ఎలాంటి ఇతర మాధ్యమం కన్నా కమ్యూనిటీ ప్రసారం ఎక్కువగా ఉండడం అనేది, జాతీయ వ్యక్తిత్వాన్ని సంపూర్ణ వైవిధ్యంతో రూపొందించి, ప్రతిబింబిస్తుంది. ఈ విభాగం అనన్యమైనది, మరియు ఆ స్థాయిలో, స్వదేశీ, తెగలకు-చెందిన మరియు RPH సముదాయాల కొరకు, వారే తయారుచేసిన కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది. ఇంకా కమ్యూనిటీ ప్రసార స్టేషన్లు స్థానిక వార్తలు, సమాచారానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాయి; ఇందులో స్థానిక మరియు ఆస్ట్రేలియన్ సంగీతం, కళలు మరియు సంస్కృతి అభివృద్ధి; మరియు మీడియా నైపుణ్యాలకు సంబంధించిన శిక్షణ అందించడం ఉంటాయి.

ఒక లాభాపేక్ష-లేని కమ్యూనిటీ సమూహం, నియంత్రణ సంస్థ అయిన ది ఆస్ట్రేలియా కమ్యూనికేషన్స్ అండ్ మీడియా అథారిటీకి కమ్యూనిటీ ప్రసారాల అనుమతి కొరకు దరఖాస్తు చేసినప్పుడు, వారు ఎలాంటి సముదాయానికి సంబంధించిన ప్రసారాలను అందిస్తారో, తెలుపవలసి ఉంటుంది. దరఖాస్తుదారులను అనుకూలత మరియు అనుమతి దరఖాస్తు విశ్వసనీయత మరియు ప్రత్యేక సముదాయ విషయాలకు సేవలందించే సామర్థ్యాల ఆధారంగా, నియంత్రణ సంస్థ ఎంపిక చేస్తుంది. 5 ఏళ్ళలో తిరిగి పొందవలసిన అనుమతి పొందాక, ప్రతి స్టేషన్ అనుమతి పొందిన సముదాయ విషయాలకు చెందిన సేవలు అందించడం కొనసాగించాలి.

బొలీవియా[మార్చు]

అత్యంత ప్రసిద్ధమైన కమ్యూనిటీ రేడియో ఉదాహరణలలో ఒకటి బొలీవియాలోని మైనర్స్ రేడియో. ట్రేడ్ యూనియన్ రాబడుల నిధి కలిగి, మరియు ప్రధానంగా స్థానిక మరియు ప్రాంతీయ స్థాయిలలో పనిచేసే రేడియో స్టేషన్లు 1960 నుండి 1985 వరకూ 25 పైగా ఉండేవి. ప్రభుత్వ విధానాలలో మార్పుల వలన 1985 తరువాత ఎన్నో యూనియన్లు కలిగిన మైనింగ్ ఉద్యోగాలు నిర్మూలించబడడం వలన, కొన్ని రేడియోలు అమ్మబడడం లేదా ఎత్తివేయడం జరిగింది. ఇన్ని కష్టాలలో సైతం, ఐదు స్టేషన్లు ప్రసారాలను కొనసాగిస్తున్నాయి.[ఉల్లేఖన అవసరం]

బొలీవియన్ మైనింగ్ వర్కర్ల ద్వారా సృష్టింపబడి, నిధులు పొంది, నిర్వహింపబడే అత్యంత ప్రసిద్ధ రేడియో స్టేషన్లలో కొన్ని లా వోజ్ డెల్ మినేరో, రేడియో పియో XII, రేడియో వాన్‍గార్డియా డె కోల్క్విరి, రేడియో అనిమాస్, రేడియో 21 డె డిసెంబర్, మరియు రేడియో నేసనల్ డె హ్వానూని అనేవి.[3] ఇదంతా 1949లో కటవి మైనింగ్ జిల్లాలో ఒక రేడియో స్టేషన్‍తో మొదలైంది. తరువాతి 15 సంవత్సరాలలో, ఇతర జిల్లాలూ అనుసరించాయి: అక్కడ పరికరాల కొనుగోలు, వారి గ్రామాల నుండి యువకులకు శిక్షణ ఇవ్వడం జరిగింది, మరియు స్వయంగా వర్కర్లు వారి జీతం నుండి కొంత శాతాన్ని వారి రేడియో స్టేషన్ల నిర్వహణకు ఇవ్వడంతో అనుభవాన్ని అందించారు.

చాలావరకూ రేడియో స్టేషన్లు చిన్నవిగా మొదలయ్యాయి, మరియు ప్రమాదకరంగా, అతి తక్కువ రాబడి కలిగి ఉండేవి. వాటిలో కొన్ని విదేశీ సహకారం పొందాయి మరియు మెరుగైన పరికరాలు మరియు స్థాపనలతో మరింత నాణ్యమైన రేడియో స్టేషన్లుగా రూపొందాయి. వాటిలో కొన్ని అక్కడి పరిసరాల్లో థియేటర్ సైతం నిర్మించడం జరిగింది, ఇందులో సమావేశాలు జరగవచ్చు మరియు అవి రేడియో ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయవచ్చు. ఉదాహరణకు, రేడియో వాన్‍గార్డియాలో కోల్క్విరి మైనింగ్ కేంద్రం కథను వివరిస్తూ పెద్ద కుడ్య చిత్రాలు కలిగిన అందమైన థియేటర్ ఉండేది. ఆ కుడ్యచిత్రంలో ఒక ప్రత్యేకమైన దృశ్యం, ఆ దేశం సైన్య పాలనలో ఉన్నప్పుడు, 1967లో జరిగిన బొలీవియన్ ఎయిర్ ఫోర్స్ విమానాల దాడిని వివరిస్తుంది.

1970ల ప్రారంభంలో, బొలీవియాలోని పర్వతప్రాంతాలలో మైనింగ్ జిల్లాలలో 26 రేడియో స్టేషన్లు పనిచేసేవి. ఆ సమయంలో, బొలీవియాలోని మైనర్ల యూనియన్లు ఎంతో శక్తివంతమైనవిగా ఉండేవి మరియు లాటిన్ అమెరికాలో అత్యంత ముఖ్యమైనవి మరియు రాజకీయంగా ఉన్నతమైనవిగా భావింపబడేవి.

శాంతి మరియు ప్రజాస్వామ్య సమయాల్లో, మైనర్ల రేడియో స్టేషన్లు సముదాయం యొక్క దినసరి జీవితంలో భాగంగా మారాయి. అవి టెలిఫోన్ మరియు తపాలా సేవలకు అతి సమీపమైన మరియు అత్యంత ప్రభావవంతమైన ప్రత్యామ్నాయంగా మారాయి.

ప్రజలు వారి మెయిల్ స్టేషన్ల ద్వారా అందుకోనేవారు, మరియు సందేశాలు పంపేవారు, వాటిని రోజులో ఎన్నోసార్లు చదవడం జరిగేది: కమిటే డె అమాస్ డె కాసా (గృహిణుల సంఘం) నుండి సభకు పిలుపులు; రాజధానిలో ప్రభుత్వంతో వారి చర్చల గురించి యూనియన్ నాయకుల సందేశాలు; యువతలో ప్రేమ సందేశాలు; నువోస్ హారిజాన్టేస్ నాటక సమాజం ద్వారా క్రొత్త నాటక ప్రకటన (దీనిని తరచూ దృశ్యాన్ని వర్కర్లు వారి స్వంత దీపాల ద్వారా ప్రకాశవంతం చేసి, ఒక పెద్ద ట్రక్కు యొక్క వేదికపై ప్రదర్శించేవారు) ; మరియు క్రీడా కార్యకలాపాలు, ఖననాలు, పుట్టుకలు మరియు వేడుకల ప్రకటనల వంటివి.

రాజకీయ సంక్షోభ సమయంలో, ప్రభుత్వ రేడియో స్టేషన్లు మాత్రమే నమ్మదగిన సమాచారాన్ని అందించే ఏకైక ఆధారంగా ఉండేవి. రాజధాని మరియు ఇతర నగరాలలోని వార్తాపత్రికలు, రేడియో మరియు TV స్టేషన్లను సైన్యం ఆక్రమించుకోవడంతో, సమాచారం అందించే ఏకైక సాధనం మైనర్ల రేడియో స్టేషన్లు అయ్యేవి. సైన్యం ఆ మైనింగ్ క్యాంపులలో ప్రవేశించి, స్టేషన్లపై దాడిచేసేవరకూ, అవన్నీ కాడెనా మినేరా ("మైనింగ్ హారం") లో భాగంగా ఉండేవి, వీటిని సామాన్యంగా వర్కర్లు మరణించే వరకూ కాపాడేవారు. బొలీవియన్ చిత్రనిర్మాత జార్జ్ సాన్జైన్స్ చిత్రం, ది కరేజ్ ఆఫ్ ది పీపుల్ లో, జూన్ 1967లో సిగ్లో XX మైనింగ్ జిల్లాపై సైన్యం జరిపిన దాడిని తిరిగి సృష్టించడం జరిగింది. మరొక చిత్రం, ఆల్ఫాన్సో గుముసియో డాగ్రన్ మరియు ఎడ్వర్డో బారియోస్, దర్శకత్వంలో UNESCO నిర్మించిన లఘుచిత్రం, వాయిసెస్ ఆఫ్ ది మైన్, వారి రాజకీయ మరియు సాంఘిక ప్రాముఖ్యతను వివరిస్తుంది.

రాజకీయ మరియు సాంఘిక సంక్షోభంలో, మైనర్ల రేడియో స్టేషన్లు రాజకీయ పరిస్థితిపై నివేదికలను ప్రసారం చేసేవి; ఆ మైనింగ్ జిల్లాలో ఒక ప్రధానమైన క్రీడా లేదా సాంస్కృతిక కార్యక్రమం జరిగినప్పుడు కూడా ప్రత్యక్ష ప్రసారాలు అందించేవి. ఇంతేకాక, ప్రతి స్టేషనుకూ మరొక దాని నుండి పూర్తి స్వతంత్రం ఉండేది.

కచ్చితంగా, మైనర్ల రేడియో స్టేషన్లు ముఖ్యమైనవి, ఎందుకంటే మైనర్లు ముఖ్యమైనవారు కాబట్టి. కానీ ఇంకా, బొలీవియన్ మైనర్లు మునుపటికన్నా ఎంతో ప్రభావవంతంగా మారారు, ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా వారికి వారి ఆలోచనలను తెలిపే శక్తివంతమైన మాధ్యమం ఉండేది. బొలీవియాలో మైనింగ్ యొక్క ప్రాముఖ్యత 1980లలో తగ్గేసరికి, ఈ యూనియన్లు బలహీనం అయ్యాయి, మరియు కొన్ని రేడియో స్టేషన్లు మైనింగ్ జిల్లాలతో పాటుగా అదృశ్యమయ్యాయి.

బంగ్లాదేశ్[మార్చు]

బంగ్లాదేశ్ NGOల నెట్‍వర్క్ ఫర్ రేడియో అండ్ కమ్యూనికేషన్ (BNNRC) దృష్టిలో కమ్యూనిటీ రేడియో అనేది, జోక్యానికి సంబంధించిన ప్రత్యేకమైన భాగం. 2000లో ప్రారంభమైనప్పటినుండి కమ్యూనిటీ రేడియోకు సంబంధించి BNNRC ఇతర సంస్థలతో సంబంధం గురించి ప్రభుత్వ సహకారాన్ని ప్రోత్సహిస్తూ ఉంది.[ఉల్లేఖన అవసరం]

BNNRC యొక్క కమ్యూనిటీ రేడియో జోక్యం యొక్క లక్ష్యం, ప్రధానమైన సాంఘిక సమస్యలైన పేదరికం మరియు సాంఘిక బహిష్కరణలను ఎదుర్కొనడం, వెనుకబడిన గ్రామీణ సమూహాలకు అధికారం కల్పించడం మరియు ప్రజాస్వామ్య ప్రక్రియలను, మరియు అప్పటి అభివృద్ధి ప్రయత్నాలను ప్రేరేపించడం.

కమ్యూనిటీ రేడియో యొక్క ప్రాథమిక పాత్ర ఏమిటంటే, జనబాహుళ్యంలోని మీడియాలో సముదాయ అభివృద్ధి గురించి తమ ఆలోచనలు మరియు అభిప్రాయాలు చెప్పలేని ప్రజలకు, తమ గళం వినిపించే అవకాశం కల్పించడం. మాట్లాడే హక్కును ప్రోత్సహించడం, సముదాయానికి సమాచారం అందించే ప్రక్రియను వేగవంతం చేయడం, సమాచారం నిరంతరాయంగా లభించేలా చూడడం, తద్వారా మార్పుకు ప్రేరకంగా వ్యవహరించడం అనేవి, కమ్యూనిటీ రేడియో ప్రధాన చర్యల్లో కొన్ని. ఇది ఇంకా సముదాయ స్థాయిలో సృజన పెంపుదల మరియు ప్రజాస్వామ్య భావనలకు ఊతమిస్తుంది.

ఫలితంగా, బంగ్లాదేశ్ ప్రజా గణతంత్ర రాజ్యం యొక్క సమాచార శాఖ, కమ్యూనిటీ రేడియో స్థాపన, ప్రసారం మరియు కార్యశీలత విధానం 2008ను ప్రకటించింది. ఈ విధానం క్రింద, సమాచార శాఖ, ఇటీవల [22 ఏప్రిల్ 2020] 14 కమ్యూనిటీ రేడియో స్టేషన్ల స్థాపన, ప్రసారం మరియు కార్యశీలతను మొట్టమొదటిసారి బంగ్లాదేశ్‍లో అనుమతించింది. సమాచారం నిరంతరాయంగా లభించడానికి, మరియు ప్రజల సమాచార హక్కు కొరకు, ప్రభుత్వం, సమాచార హక్కు చట్టం 2009ను అమలు చేసింది. ఈ విషయంలో, గ్రామీణ ప్రజలకు అధికారం కల్పించడం కొరకు, కమ్యూనిటీ రేడియో అనుమతించడం అనేది బలీయమైన మెట్టు.

ప్రభుత్వం మొదటగా, చిట్టగాంగ్‍లోని సీతాకుండాకు యంగ్ పవర్ ఇన్ యాక్షన్ (YPSA), సత్ఖిరాకు నల్టా కమ్యూనిటీ హాస్పిటల్, బొగ్రాకు LDRO, మౌలివి బజేర్‍కు BRAC, నౌగాఁవ్‍కు బరండ్రో కమ్యూనిటీ రేడియో, చాపై నబాబ్‍గంజ్‍కు ప్రోయాస్, రాజ్‍షాహీకి CCD, ఝినైదాకు శ్రిజోని, మున్సిహీగొంజ్‍కు EC బంగ్లాదేశ్, బర్గునాకు MMC - మరియు కురిగ్రాంకు RDRS, కోయరా (ఖుల్నా) కు సుందర్బాన్ కమ్యూనిటీ రేడియో, తెల్నాఫ్ (కాక్స్ బాజేర్) కు ACLAB మరియు అమ్తోలి (బర్గునా) లోని కమ్యూనిటీ రూరల్ రేడియోకు అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (AIS), వంటి 14 ప్రారంభక స్టేషన్లను అనుమతించింది.

కమ్యూనిటీ రేడియో దరఖాస్తు ప్రక్రియలో సుమారు 200 సంస్థలకు ఢాకాలోని BNNRC సెక్రటేరియట్లో కమ్యూనిటీ రేడియోలోని ఒక నేషనల్ హెల్ప్ డెస్క్ ద్వారా BNNRC సాంకేతిక సహాయం అందించింది. ఈ అనుభవం ద్వారా బంగ్లాదేశ్‍లో కమ్యూనిటీ రేడియో కొరకు మానవ వనరులు, పరిశోధన మరియు అభివృద్ధి, ఇంకా సాంకేతిక సహకారం కోసం, ఒక వ్యూహాత్మక కేంద్రం ప్రారంభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, BNNRC ఒక కమ్యూనిటీ రేడియో అకాడెమీ (CRA) ని ప్రారంభించింది. ఈ అకాడెమీ, కమ్యూనిటీ రేడియో సంబంధిత శిక్షణ, పరిశోధన, సాంకేతిక సహాయం మరియు ఇతర సహకారాన్ని సంవత్సరం పొడుగునా, కమ్యూనిటీ రేడియో ప్రారంభ స్టేషన్లకు అందిస్తుంది.

కమ్యూనిటీ రేడియోను గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన జనాభా, తమ గళంతో తమ ఆలోచనల్ని తమదైన శైలిలో వినిపించేందుకు ఒక ప్రత్యామ్నాయ, ప్రభావవంతమైన ప్రజా మాధ్యమంగా పరిగణిస్తారు.

కెనడా[మార్చు]

సామాన్యంగా కెనడాలో కమ్యూనిటీ రేడియో స్టేషన్లు చాలావరకూ వ్యాపారపరంగా తక్కువ సేవలు పొందే బలహీన భాషా సముదాయాలైన ఫ్రాంకో-ఒంటారియన్లు, అకాడియన్లు లేదా ఫస్ట్ నేషన్స్ లక్ష్యంగా ఉంటాయి, కానీ కొన్ని సముదాయాలు ఆంగ్ల భాషా కమ్యూనిటీ స్టేషన్లు కూడా కలిగి ఉంటాయి. ఈ స్టేషన్లు తరచూ స్వఛ్ఛంద సేవకులచే మరియు సహకార సంస్థలు లేదా ఇతర లాభాపేక్ష-లేని కార్పోరేషన్లచే నడపబడుతుంటాయి.

పెద్ద నగరాల్లో, కమ్యూనిటీ-సంబంధిత కార్యక్రమాలు సామాన్యంగా పరిసర రేడియో స్టేషన్లలో ప్రసారమవుతాయి. కానీ, కొన్ని నగరాలు కమ్యూనిటీ రేడియో స్టేషన్లు కూడా కలిగి ఉంటాయి. కెనడాలోని ఎక్కువ శాతం కమ్యూనిటీ స్టేషన్లు నేషనల్ కాంపస్ అండ్ కమ్యూనిటీ రేడియో అసోసియేషన్, లేదా NCRAలో సభ్యత్వం కలిగి ఉంటాయి. కెనడాయొక్క అధికశాతం ఫ్రెంచ్ భాష కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ల'అసోసియేషన్ డెస్ రేడియో దిఫ్యూస్యుర్స్ కంయూనిటైరే డూ క్యూబెక్ (ARCQ) లేదా ల'అలయన్స్ డెస్ రేడియోస్ కంయూనౌటైర్స్ డూ కెనడా ఇంక్ (l'ARC) లో సభ్యత్వం కలిగి ఉంటాయి.[4]

కెనడాలో అత్యధిక సంఖ్యలో కమ్యూనిటీ రేడియో స్టేషన్లు కలిగిన ప్రాంతం సస్కాత్చేవాన్. ఆ స్టేషన్లలో ఎక్కువ శాతం ఒక ఆదిమ ప్రజా రేడియో నెట్‍వర్క్ మిస్సినిపి బ్రాడ్‍కాస్టింగ్ కార్పోరేషన్ యొక్క అనుబంధ సంస్థలుగా ఉంటాయి.

కమ్యూనిటీ స్టేషన్లకు ది కెనడియన్ రేడియో-టెలివిజన్ అండ్ టెలికమ్యూనికేషన్స్ కమిషన్ యొక్క (CRTC) కమ్యూనిటీ రేడియో విధానం వర్తిస్తుంది.[5]

ఈ విధానం ప్రకారం, ది CRTC నిర్దేశించినట్టూ, కమ్యూనిటీ స్టేషన్లు

 • కార్యక్రమాలకు సముదాయాల సామీప్యాన్ని కల్పించాలి;
 • సముదాయం మొత్తమ్మీద శిక్షణ లభించేలా చూడాలి; మరియు
 • నిరంతర శిక్షణ అందించాలి మరియు కార్యక్రమంలో పాల్గొనే కోరిక కలిగిన సముదాయంలోని వారిని గమనించాలి.

ఈ ప్రకారం, స్టేషన్లు సముదాయం యొక్క అవసరాలు మరియు హక్కులను ప్రతిబింబించే క్రింది విషయాల్ని అందించే విభిన్న కార్యక్రమాలు అందించాలి:

 • క్రొత్త మరియు స్థానిక కళాకారులచే సంగీతం;
 • సాధారణంగా వ్యాపారాత్మక స్టేషన్లు ప్రసారం చేయని సంగీతం;
 • పదప్రయోగ కార్యక్రమాలు; మరియు
 • స్థానిక సమాచారం.

కమ్యూనిటీ స్టేషన్ల జాబితాను ది CRTC కలిగి ఉంటుంది.[6] కెనడాలో, కాల్ లెటర్లు మరియు పౌనఃపున్యాలు ఇండస్ట్రీ కెనడాయొక్క స్పెక్ట్రం మేనేజ్‍మెంట్ ద్వారా నియంత్రించబడతాయి.[7]

ఈక్వెడార్[మార్చు]

ఈక్వెడార్లో, ఎన్నో కమ్యూనిటీ రేడియో స్టేషన్లు మతపరమైన సమూహాలచే నడపబడతాయి. ఇందులో కేథలిక్, ప్రొటెస్టెంట్ మరియు బహాయి స్టేషన్లు ఉంటాయి. సముదాయ భాగస్వామ్యం మరియు స్వీయ-నిర్వహణ పరిమాణం మారుతుంది. తెల్లవారు జామున ప్రసారం చేయడానికి ప్రతి వారం ప్రసారమయ్యే కార్యక్రమాలు రికార్డ్ చేయడానికి దేశీయ సంస్థలకు సరళమైన పరికరాలు అందించే ప్రాజెక్టులో రేడియో లటకుంగా పాలుపంచుకుంది. ఇంకా, ఈక్వెడార్లో కొన్ని దేశీయ సమూహాలు వారి స్వంత రేడియోలను నడుపుతాయి. ఇటువంటివి ఉష్ణమండల వర్షారణ్యంలో షువర్ ఫెడరేషన్, మరియు బోలివార్ ప్రాంతంలో సిమియాటగ్. బొలీవియాకు భిన్నంగా, ఈక్వెడార్లో ట్రేడ్-యూనియన్ రేడియో చారిత్రికంగా బలహీనంగానే ఉండేది.

హంగరీ[మార్చు]

మొట్టమొదటి కమ్యూనిటీ స్టేషన్లు పైరేట్లుగా మొదలయ్యాయి, ఇవి సోషలిస్టు వ్యవస్థ నుండి మార్పు తరువాత రాజకీయంగా స్వేచ్ఛా సందేశాలు మరియు సంగీత కార్యక్రమాలు ప్రసారం చేసేవి. అటువంటి వాటిలో మొదటిది 1991లోని టిలోస్ రేడియో, తరువాతివి ఫిక్స్ రేడియో మరియు సివిల్ రేడియో. 2004 నుండి ఒక క్రొత్త వర్గం మొదలైంది, ఇవి తక్కువ-శక్తి స్టేషన్లు అయిన కిస్కూజోస్సేగి (kisközösségi) లేదా చిన్న కమ్యూనిటీ స్టేషన్లు. 2008కల్లా 60కి పైగా అటువంటి మైక్రోస్టేషన్లు దేశవ్యాప్తంగా ప్రసారాలు ప్రారంభించాయి. ఇంకా గ్రామ-స్టేషన్లు, చిన్న పట్టణ-స్టేషన్లు, విశ్వవిద్యాలయ స్టేషన్లు, ఉప-సాంస్కృతిక మరియు మతపరమైన స్టేషన్లు కూడా ఉన్నాయి. బుడాపేస్ట్‌లో కూల్ FM, ఎల్సో పెస్టి ఎగ్యేతేమి రేడియో (Első Pesti Egyetemi Rádió), ఫ్యూజియో రేడియో (Fúzió Rádió) అనేవి చిన్న కమ్యూనిటీ స్టేషన్లు.

భారతదేశం[మార్చు]

భారతదేశంలో, కమ్యూనిటీ రేడియోను చట్టబద్ధం చేసే ప్రచారం మధ్య 1990లలో, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తన ఫిబ్రవరి 1995 తీర్పులో "వాయుతరంగాలు ప్రజల సంపద"గా నిర్ణయించిన వెంటనే మొదలైంది.[2] దేశవ్యాప్తంగా సమూహాలకు ఇది ప్రేరణ కలిగించింది, కానీ ప్రారంభంలో, కొద్దిగా కఠిన పరిస్థితులలో కేవలం విద్యాసంబంధ (పరిసర) రేడియో స్టేషన్లను అనుమతించడం జరిగింది.

భారతదేశంయొక్క మొట్టమొదటి పరిసర 'కమ్యూనిటీ' రేడియో, అణ్ణా FM, 1 ఫిబ్రవరి 2004న ప్రారంభించబడింది, ఇది ఎడ్యుకేషన్ అండ్ మల్టిమీడియా రిసెర్చ్ సెంటర్ (EM²RC) ద్వారా నడపబడుతుంది, మరియు అన్ని కార్యక్రమాలూ అణ్ణా విశ్వవిద్యాలయంలోని మీడియా సైన్సెస్ విద్యార్థుల ద్వారా నిర్మింపబడతాయి.

16 నవంబరు 2006 నాడు, భారత ప్రభుత్వం NGOలు మరియు ఇతర పౌర సమాజ సంస్థలు కమ్యూనిటీ రేడియో స్టేషన్లను స్వంతంగా నడపవచ్చునని క్రొత్త కమ్యూనిటీ రేడియో సూచనలు ప్రకటించింది. ప్రభుత్వ ఆధారాల ప్రకారం, భారతదేశం మొత్తమ్మీద సుమారు 4,౦౦౦ కమ్యూనిటీ రేడియో అనుమతులు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. 30 నవంబరు 2008 నాటికి, భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కమ్యూనిటీ రేడియో అనుమతులు కోరుతూ 297 దరఖాస్తులు స్వీకరించింది, ఇందులో 141, NGOలు మరియు ఇతర పౌర సమాజ సంస్థల నుండి, 105 విద్యా సంస్థల నుండి మరియు 51 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు వ్యవసాయ విస్తరణ కేంద్రాలు ('కృషి విజ్ఞాన కేంద్రాలు') నడిపే 'వ్యవసాయ రేడియో' స్టేషన్లకు చెందినవి ఉన్నాయి. వీటిలో, ఉద్దేశ పత్రాల జారీ ద్వారా 107 కమ్యూనిటీ రేడియో స్టేషన్లకు అనుమతి ఇవ్వడానికి నిశ్చయించబడింది. ఈ క్రొత్త పథకం క్రింద అనుమతికి దరఖాస్తు చేసినవారు 13 గ్రాంట్ ఆఫ్ పర్మిషన్ అగ్రీమెంట్లపై (GOPA) సంతకం చేసారు.

30 నవంబరు 2008 నాటికి, దేశంలో 38 కార్యశీల కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ఉన్నాయి. వీటిలో, రెండింటిని NGOలు నడుపుతుండగా, మిగిలిన వాటిని విద్యా సంస్థలు నడిపేవి. ఒక NGOకు అనుమతినిచ్చిన మొట్టమొదటి సముదాయ-ఆధారిత రేడియో స్టేషన్ (పరిసర-ఆధారిత రేడియోకు భిన్నంగా) 15 అక్టోబరు 2008 నాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో, పస్తపూర్ గ్రామంలో 'సంఘం రేడియో' ఉదయం 11.00 గంటలకు ఆన్ చేసినప్పుడు, ప్రారంభమైంది. సంఘం రేడియో 90.4 MHz పై ప్రసారమవుతుంది, దీని అనుమతి ఆంధ్ర ప్రదేశ్ లోని సుమారు 75 గ్రామాల్లో స్త్రీ సమూహాలతో పనిచేసే NGO అయిన డెక్కన్ డెవలప్‍మెంట్ అథారిటీ (DDS) కి ఇవ్వబడింది. ఈ కమ్యూనిటీ రేడియో స్టేషన్ నిర్వహణ 'జనరల్' నరసమ్మ మరియు అల్గోల్ నరసమ్మల ఆధ్వర్యంలో ఉంది. భారతదేశంలో రెండవ NGO-నేతృత్వ కమ్యూనిటీ రేడియో స్టేషన్ మధ్య ప్రదేశ్ రాష్ట్రం యొక్క ఓర్చాలోని 'తారాగ్రాం'లో 23 అక్టోబరు 2008 నాడు ప్రారంభించబడింది. మధ్య భారతదేశంలోని బుందేల్‍ఖండ్ ప్రాంతంలో ఉండడం ఆధారంగా 'రేడియో బుందేల్‍ఖండ్' పేరొందిన ఈ రేడియో స్టేషన్ అనుమతి ఢిల్లీ-ఆధారిత NGO అయిన ది సొసైటీ ఫర్ డెవలప్‍మెంట్ ఆల్టర్నేటివ్స్ (DA) అధీనంలో ఉంది. రేడియో బుందేల్‍ఖండ్ రోజుకు రెండు గంటల పునఃప్రసారంతో సహా, నాలుగు గంటల పాటు 90.4 MHz పై కూడా ప్రసారాలు అందిస్తుంది.

సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో 1 నవంబరు 2009 నాటికి, 47 కమ్యూనిటీ రేడియో స్టేషన్లు పనిచేసేవి, ఇందులో NGOలు నడిపే 45 పరిసర-ఆధారిత స్టేషన్లు మరియు రెండు CRS కూడా ఉన్నాయి. డిసెంబరు 2009 నాటికి, పౌర సమాజ సమూహాలచే నడపబడే CR స్టేషన్ల సంఖ్య బహుశా ఏడుగా పెరిగింది, ఇందులో సంఘం రేడియో (పస్తాపూర్, మెదక్ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్), రేడియో బుందేల్‍ఖండ్ (ఓర్చా, మధ్య ప్రదేశ్), మన్ దేశి తరంగ (సతారా, మహారాష్ట్ర), నమ్మ ధ్వని (బుడికోటే, కర్ణాటక), రేడియో మట్టోలి (వయనాడ్, కేరళ), కలన్జియం సమూగ వానొలి (నాగపట్టిణం, తమిళ నాడు) మరియు బేర్‍ఫుట్ (టిలోనియా, రాజస్తాన్) ఉన్నాయి.

4 డిసెంబరు 2009 నాటికి, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ 'గ్రాంట్ ఆఫ్ పర్మిషన్ అగ్రీమెంట్లు' (GOPA) 62 కమ్యూనిటీ రేడియో స్టేషన్లకు జారీ చేసింది. చాలావరకూ GOPAలు విద్యా సంస్థలకు జారీ చేయబడ్డాయి.

కమ్యూనిటీ రేడియో సారంగ్ 107.8 అనేది మంగళూరు జేస్యూట్ ఎడ్యుకేషనల్ సొసైటీ (MJES) నిర్వహణలో ఉంది మరియు కర్ణాటకలోని తీరప్రాంత పట్టణమైన మంగళూరులోని సెం. అలాసియస్ కళాశాల (స్వతంత్ర) ద్వారా నడపబడుతుంది. ఒక రకంగా, రేడియో సారంగ్ అనేది విద్యా సంస్థ పరిసరాల్లో ఉన్న కాంపస్ రేడియోగా చెప్పవచ్చు. కానీ ఇది కేవలం సేవా సంస్థగా కాక, రైతులు, బెస్తవారు, రోగులు, వ్యాపారులు, సైకిల్ రిపేరు చేసేవారు, మరియు చెప్పులు కుట్టే సేవలందించేవారి కార్యక్రమాలు నిర్మిస్తూ, స్థానిక సముదాయ ప్రజలకు చెంది ఉంటుంది.

20 జూన్ 2010 నాటికి, రేడియో సారంగ్ ప్రతిరోజూ కొంకణి, కన్నడ, తుళు, మరియు ఆంగ్ల భాషల్లో ప్రసారాలు అందిస్తుంది, అంతేకాక ప్రతి వారం మలయాళం, బెరీ (స్థానిక ముస్లిముల మాతృభాష), మరియు హిందీ భాషల్లో ప్రసారాలు అందిస్తుంది. అదనంగా, రేడియో సారంగ్ స్థానిక సిఖ్ సముదాయం కోరినప్పుడు పంజాబీలో కూడా ప్రసారాలు అందిస్తుంది. 15 జూన్ 2010 నుండి, ఈ CR స్టేషన్ నిరంతరాయంగా 14 గంటలపాటు, 6.30 నుండి 20.30 గంటలవరకూ ప్రసారాలు అందిస్తుంది. ఈ కార్యక్రమ పద్ధతుల్లో సంభాషణలు, ఇంటర్వ్యూలు, ఫోన్-ఇన్లు, పాటలు, కవిత్వం, కథలు, చాట్-షోలు, మొదలైనవి చోటుచేసుకుంటాయి. డా రిచర్డ్ రేగో SJ ఈ పరిసర-ఆధారిత కమ్యూనిటీ రేడియో సారంగ్ 107.8FM యొక్క స్థాపకుడు మరియు సంచాలకుడు.

ఉత్తరాఖండ్లోని స్థానిక సూపి సముదాయాలకు ఉమ్మడి వేదిక నిర్మించే లక్ష్యంతో TERI మార్చి 11, 2010 నాడు, ఒక కమ్యూనిటీ రేడియో సేవ 'కుమవోన్ వాణి'ని ప్రారంభించింది. ఉత్తరాఖండ్ గవర్నర్ మార్గరెట్ ఆల్వా రాష్ట్రంలో మొదటిదైన ఈ కమ్యూనిటీ రేడియో స్టేషన్‍ను ప్రారంభించారు. ఈ 'కుమవోన్ వాణి' పర్యావరణం, వ్యవసాయం, సంస్కృతి, వాతావరణం మరియు విద్యకు సంబంధించిన కార్యక్రమాలను స్థానిక భాషలో మరియు సముదాయాలు చురుకుగా పాల్గొనే విధంగా ప్రసారం చేస్తుంది. ఈ రేడియో స్టేషన్ 10 కి.మీ. పరిధిలో ప్రసారమవుతూ, ముఖ్తేశ్వర్లోని సుమారు 2000 మంది స్థానికులకు చేరుతుంది.[8]

ఈ క్రొత్త (2006) కమ్యూనిటీ రేడియో విధానంలో లాభాపేక్ష-లేని 'చట్టబద్ధ సమూహం' - వ్యక్తులు, రాజకీయ పార్టీలు మరియు వారి అనుయాయులు, నేరస్థులు మరియు నిషిద్ధ సంస్థలు మినహాయించి - ఏదైనా ఒక CR అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అటువంటి స్టేషన్లకు కేంద్ర నిధులు అందవు, మరియు ఇతర ఆధారాల నుండి నిధుల సేకరణపై కఠిన నిర్బంధాలు ఉన్నాయి. కనీసం మూడు సంవత్సరాల కాలం నమోదైన సంస్థలు, స్థానిక సముదాయ సేవలో 'రుజువైన' చరిత్ర కలిగినవి మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. అనుమతి నియమాలు తక్కువ ఖర్చుతో కూడిన తక్కువ-శక్తి కార్యకలాపాల కన్నా నిస్సందేహంగా అధిక-నిధులు కలిగిన స్టేషన్లకు పక్షపాతంగా ఉంటాయి, ఇలాంటి తక్కువ నిధులు కలిగిన ఎన్నో (ఉదా, ఆంధ్ర ప్రదేశ్‍లో మన రేడియో మరియు బీహార్లో రాఘవ్ FM వంటివి), ఎలాంటి కమ్యూనిటీ రేడియో విధానమూ అమలుకాక మునుపు కాలంలో అతితక్కువ-ఖర్చుతో విజయవంతంగా నడిచాయి.

ఈ అనుమతితో వాటికి ఒక 100 వాట్ (ERP) రేడియో స్టేషన్ నడిపే అర్హత లభిస్తుంది, ఇందులో అవి చేరగల ప్రాంతం దాదాపు 12 కిలోమీటర్ల వ్యాసార్థంతో ఉంటుంది. పరిమిత గరిష్ఠ ఆంటెనా ఎత్తు 30 మీటర్లు. కమ్యూనిటీ రేడియో స్టేషన్లు వారి కార్యక్రమాల్లో కనీసం 50% స్థానికంగా, వీలైనంతవరకూ స్థానిక భాష లేదా మాండలికాల్లో చేయాలని భావించడం జరుగుతుంది. వినోదంపై నిర్దిష్ట నిషేధం లేకపోయినప్పటికీ, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఒత్తిడి ఉంటుంది. భారతదేశంలో కమ్యూనిటీ రేడియో, మరియు వ్యాపారాత్మక FM రేడియోలలోనూ, వార్తా కార్యక్రమాలు నిషిద్ధం. అయినప్పటికీ, ఇటీవల ప్రభుత్వం ప్రత్యేక తరహా వార్తలు, క్రీడా వార్తలు మరియు కామెంటరీలు, ట్రాఫిక్ మరియు వాతావరణ సమాచారం, సాంస్కృతిక వేడుకలు మరియు పండుగల వివరాలు, విద్యుత్తూ మరియు నీటి పంపిణీకి సంబంధించిన ప్రజా ప్రకటనలు, ప్రమాద హెచ్చరికలు మరియు ఆరోగ్య ప్రకటనల వంటివి, ప్రసారం చేయవచ్చని స్పష్టం చేసింది.

ఒక గంటకు అయిదు నిమిషాల ప్రకటనలు కమ్యూనిటీ రేడియోలో అనుమతింపబడతాయి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించినప్పుడు మినహా, ఇతరత్రా ప్రాయోజిత కార్యక్రమాలు నిషిద్ధం.

దేశవ్యాప్తంగా క్రియాశీలక వ్యక్తులు మరియు సముదాయ ఉద్యోగులు 'కమ్యూనిటీ రేడియో ఫోరం ఆఫ్ ఇండియా' ఆధ్వర్యంలో, కమ్యూనిటీ రేడియో స్టేషన్ల శిక్షణ మరియు సహకారాన్ని సరిచూడడానికి, మరియు మరింత వ్యూహాత్మక కమ్యూనిటీ రేడియో విధానం కొరకు విన్నపాలు కొనసాగించడానికి, ఏకం అయ్యారు. భారతదేశంలోని ది కమ్యూనిటీ రేడియో ఫోరం, ఒక 'సొసైటీ' మరియు 'ట్రస్ట్'గా 26 ఫిబ్రవరి 2008 నాడు నమోదైంది. ఈ మధ్య కాలంలో, మొబైల్ టెలిఫోన్ ఆపరేటర్లు వ్యాపారాత్మక ప్రసార సేవలను GSM పై అందించే ప్రయత్నాలు ప్రారంభించారు, దీంతో ప్రసార సాంకేతికత యొక్క సంప్రదాయ భావనల చుట్టూ నిర్మించిన ప్రభుత్వ నిర్బంధాలు పూర్తిగా తప్పించడం జరిగింది.

1 జూలై 2010 నాటికి, భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, CR అనుమతుల కొరకు 715 దరఖాస్తులు స్వీకరించినట్టూ ప్రకటించడం జరిగింది, వీటిలో 104 పాత (కాంపస్ రేడియో) సూచనల ఆధారంగా కూడా ఉన్నాయి. 231 ఉద్దేశ పత్రాలు, పాత సూత్రాల ఆధారంగా 63, జారీ చేయడం జరిగింది. 102 మంది దరఖాస్తుదారులకు గ్రాంట్ ఆఫ్ పర్మిషన్ అగ్రీమెంట్లు సంతకం చేయడం జరిగింది, మరియు 68 కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ప్రసారాలు ప్రారంభించాయి. (107 దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి మరియు 377 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి).

12 ఆగస్టు 2010 నాటికి, భారతదేశంలో పనిచేస్తున్న కమ్యూనిటీ రేడియో స్టేషన్ల సంఖ్య 82గా పెరిగింది.

ఐర్లాండ్[మార్చు]

ఐర్లాండ్లో 1970ల చివరి నుండి స్వీయ-ప్రకటిత కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ఉండేవి, కానీ 1995లో మాత్రమే ఇండిపెండెంట్ రేడియో అండ్ టెలివిజన్ కమిషన్ నిర్వహించిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదటి 11 అనుమతి పొందిన స్టేషన్లు ప్రసారాలు ప్రారంభించాయి. ప్రారంభ స్టేషన్లు ది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ కమ్యూనిటీ-రేడియో బ్రాడ్‍కాస్టర్స్ ప్రతినిధిత్వంలో ఉండేవి, ఇది 1988లో క్రొత్త స్టేషన్లు నెలకొల్పడానికి గైడ్ ప్రచురించింది.

ఐర్లాండ్లో ప్రస్తుతం 20 అనుమతి పొందిన స్టేషన్లు ఉన్నాయి, ఇంకా నాలుగు స్టేషన్లకు 2010లో అనుమతి లభించవచ్చు. 2004లో, అనుమతి పొందిన స్టేషన్లు ఒక సహకార CRAOL ఏర్పాటు చేసాయి, ఇది స్టేషన్లు షేర్‍హోల్డర్లుగా 2004లో ఒక ప్రతినిధిత్వ సమూహంగా ఏర్పడింది. 2007లో, ఆశించే స్టేషన్ల కొరకు క్రొత్త సభ్యత్వ వర్గాలు సృష్టింపబడ్డాయి, మరియు క్రొత్త స్టేషన్ల అభివృద్ధిలో సాయం చేయడానికి "అభివృద్ది నిచ్చెన" స్థాపించబడింది, 2010 నాటికి, వివిధ అభివృద్ధి దశలలో 42 ఆశించే స్టేషన్లు ఉన్నాయి. ప్రసార చట్టం 2009, కమ్యూనిటీ రేడియోకు చట్టపరమైన నిర్వచనం అందించింది, ఇది మునుపు బ్రాడ్‍కాస్టింగ్ కమిషన్ ఆఫ్ ఐర్లాండ్, ప్రస్తుతం బ్రాడ్‍కాస్టింగ్ అథారిటీ ఆఫ్ ఐర్లాండ్, యొక్క కమ్యూనిటీ రేడియో విధానం ద్వారా నిర్ణయింపబడేది. ఈ చట్టం ఇంకా చట్టపరమైన నిర్వచనానికి సరిపోయే ఆశించే సమూహాలకు 12 నెలల వ్యవధిలో 100-రోజుల అనుమతిని అందిస్తుంది.

2008లో పరస్పర సహకారానికి ఒక ఒప్పందం CRAOL ద్వారా ఏర్పాటైంది, దీనిద్వారా సంబంధిత సంస్థలు (వీటిలో పూర్తిగా-అనుమతి పొందిన స్టేషన్లు సైతం ఉన్నాయి) నిధి కొరకు దరఖాస్తులు, శిక్షణా సామగ్రి, విధానాలను విజయవంతంగా పంచుకోవచ్చు. దీనివలన నెట్‍వర్కింగ్ మరియు సమాచార బట్వాడా గణనీయంగా పెరిగింది. ఈ ఒప్పందంలో కార్యక్రమ విభజన గురించి కూడా ఉంది మరియు క్రొత్త నెట్‍వర్క్ వెబ్‍సైట్ ఈ కార్యకలాపాలను ఒక వనరుల బ్యాంకు మరియు ఆన్-లైన్ కార్యక్రమ బదిలీ ద్వారా అందిస్తుంది.

ఐర్లాండ్లో కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ఒక భౌగోళిక సముదాయానికి సేవలందించే మరియు ప్రత్యేక సముదాయాలకు (కాంపస్ స్టేషన్లు, క్రైస్తవులు, మరియు ఐరిష్ భాషకు చెందినవి వంటివి) చెందిన రెండురకాల స్టేషన్లకూ చెందినవి ఉంటాయి. కమ్యూనిటీ రేడియో అధికారిక అనుమతి పొందిన శిక్షణ CRAOL ద్వారా 2004 నుండి లభిస్తోంది. ఈ శిక్షణ ఫలితాలు మధ్య-2009 నుండి, 95% క్రయోల్ (Craol) సభ్య స్టేషన్ల భాగస్వామ్యంతో గణనీయంగా పెరిగాయి. జూన్ 2010లో, డబ్లిన్లోని క్రోక్ పార్కులో మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఐర్లాండ్లోని నాలుగు ప్రాంతాలలోనూ స్టేషన్లు ఉన్నాయి, కానీ ప్రసారాలు సర్వత్రా వ్యాపించలేదు. డబ్లిన్లో అత్యధిక సంఖ్యలో స్టేషన్లు ఉన్నాయి మరియు నార్త్ మరియు వెస్ట్ కన్నాట్ మరియు మన్స్టర్ మధ్యలో గణనీయమైన సమూహం ఉంది.

జపాన్[మార్చు]

జపాన్లో దేశవ్యాప్తంగా, తక్కువ శక్తి కమ్యూనిటీ రేడియో స్టేషన్ల శ్రేణులు ఉన్నాయి.

జోర్డాన్[మార్చు]

జోర్డాన్లో మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో ఇంటర్నెట్ ద్వారా స్థాపించబడింది. అమ్మన్‍నెట్.నెట్ (అమ్మన్‍నెట్.net) నవంబరు 2000లో ప్రైవేటు ప్రభుత్వేతర రేడియోపై ప్రభుత్వ నిర్బంధాలను తప్పుకోవడానికి స్థాపించబడింది. 2005లో, అమ్మన్‍నెట్ రేడియో ఒక FM స్టేషనుగా అనుమతి పొందింది మరియు జోర్డాన్ రాజధాని అమ్మన్ ప్రజలకు ప్రసారాలు అందించగలిగింది. అమ్మన్‍నెట్ ఇంకా జోర్డాన్లోని ఇతర కమ్యూనిటీ రేడియో స్టేషన్ల శిక్షణలో, ఇందులో లిబ్ మరియు మ్లే జంట గ్రామాలలో ఇ-విలేజ్ భాగంగా, మరొక పాత్ర దక్షిణాది నగరమైన మన్‍లోని కింగ్ హుసేన్ విశ్వవిద్యాలయంలో భాగంగా రెండు పాత్రలు పోషించింది. ఇంకా, అమ్మన్‍నెట్ ఇంటర్నెట్ రేడియోలో అరబ్ మీడియా ఉద్యమకారుల శిక్షణలోనూ పాలు పంచుకుంది. ఖలీజ్‍నెట్.నెట్‍ (khaleejnet.net) లో భాగంగా తొమ్మిది గల్ఫ్-ఆధారిత రేడియో స్టేషన్లకు శిక్షణ అందించి ప్రారంభించే కార్యక్రమం ప్రారంభించబడింది.

జోర్డాన్లో ఇటీవల రెండు క్రొత్త కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ప్రారంభమయ్యాయి. ఇర్బెడ్లో పాఠశాలయొక్క జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్స్ కార్యక్రమంలో భాగంగా యార్మౌక్ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన యార్మౌక్ FM. ఫరా FM ప్రస్తుతం నిర్మాణంలో ఉంది, అమ్మన్ మరియు జోర్డాన్లోని రెండవ పెద్ద నగరమైన జార్కాలలో ప్రసారాలకు అనుమతి కలిగి ఉంది. ఈ స్టేషన్ ప్రాథమికంగా యువత మరియు స్త్రీల సమస్యలపై కేంద్రీకృతం అవుతుంది.

ఫిలిప్పీన్స్[మార్చు]

ఫిలిప్పీన్స్‌లో ఎంతో ప్రసిద్ధ కమ్యూనిటీ రేడియో రాడ్యో నాటిన్. రాడ్యో నాటిన్ అనేది ఫిలిప్పీన్స్‌లో రేడియో స్టేషన్ల సమితి. దాని స్టేషన్లు ప్రత్యక్ష మనీలా ప్రసారాలను ఉపగ్రహం ద్వారా దేశవ్యాప్తంగా ప్రసారం చేస్తాయి. కానీ కొన్ని సార్లు, కొన్ని స్టేషన్లు మనీలా ప్రసారాలను నిలిపివేసి, స్థానిక కార్యక్రమాలను ప్రసారం చేస్తాయి. స్థానిక కార్యక్రమాలు వివిధ RN స్టేషన్ల ద్వారా ప్రసారం కావడం మూలాన దీనిని కమ్యూనిటీ నెట్‍వర్కుగా భావించవచ్చు. రాడ్యో నాటిన్, మనీలా బ్రాడ్‍కాస్టింగ్ కంపెనీ యాజమాన్యంలో ఉంది.

రాడ్యో నాటిన్ ఫిలిప్పీన్స్‌లో కమ్యూనిటీ రేడియో స్టేషన్ల అతిపెద్ద నెట్‍వర్క్, ఇందులో ఉత్తరాన బాటనెస్ నుండి దక్షిణాన చివరి తవి-తవి వరకూ ద్వీపసమూహం మొత్తమ్మీద 150కి పైగా చిన్న FM స్టేషన్లు ఉన్నాయి. RN స్టేషన్లు వ్యాపార హక్కులు కలిగినవారికి స్వంతమై, వారిచే నడపబడతాయి, వీరు తమకు తామే ప్రజా ప్రయోజన-సంబంధిత సందేశకులు. అద్భుత ప్రత్యక్ష శబ్ద ప్రసారం వలన, ప్రస్తుతం ఇంటర్నెట్ ద్వారా ప్రపంచ వ్యాప్త శ్రోతలకు జాతీయ ప్రసారాలు చేరే అవకాశం ఉంది, మరియు ఈ వ్యాపార హక్కులు కలిగిన స్టేషన్లను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినగల రోజు దూరంగా లేదని మనం భావించవచ్చు. రాడ్యో నాటిన్ ఫిలిప్పీన్స్‌లో అతిపెద్ద రేడియో నెట్‍వర్క్. దేశవ్యాప్తంగా వ్యూహాత్మకంగా 100 స్టేషన్లు కలిగిన రాడ్యో నాటిన్, మునుపెలాంటి రేడియో స్టేషన్ కూడా చేరని శ్రోతలకు చేరుతుంది.

రాడ్యో నాటిన్ FM బ్యాండ్లో ఉన్నప్పటికీ, ఉదయాన రాడ్యో నాటిన్ మనీలా బ్రాడ్‍కాస్టింగ్ కంపెనీ యొక్క ప్రధాన స్టేషన్, DZRHతో అనుసంధానమై, దేశ పరిస్థితిపై శ్రోతలకు సమాచారం అందిస్తుంది.

క్రమంతప్పని కార్యక్రమాల్లో, మధ్యాహ్నాలు రాడ్యో నాటిన్, దేశంలోని అత్యాధునిక మరియు అతి పెద్ద హిట్లను అందించే మ్యూజిక్ స్టేషనుగా మారుతుంది.

పసాయ్ లోని స్టార్ సిటీ కంప్లేస్ లోపల MBC భవనంలో ఉన్న సెంట్రల్ స్టూడియోస్ ద్వారా రాడ్యో నాటిన్, దాని 100 స్టేషన్లకు అత్యాధునిక ఉపగ్రహ సాంకేతికత ఉపయోగించి సంకేతాలు పంపుతుంది. ఈ 100 స్టేషన్లూ ఆ తరువాత, వాటి సంకేతాలను అవి బాధ్యతవహించే ప్రాంతాలకు వరుసగా పంపుతాయి.

కానీ, ఈ వివిధ రాడ్యో నాటిన్ స్టేషన్లు మనీలా సెంట్రల్ స్టూడియోస్ నుండి "విడివడి" ప్రత్యేకమైన నిర్దిష్ట సమయాల్లో వారి స్థానిక సంఘటనలను ప్రసారం చేయవచ్చు, కాబట్టి, రాడ్యో నాటిన్ వ్యాప్తిలో దేశావ్యాప్తమైనా, స్వభావంలో స్థానికం.

2005లో, రాడ్యో నాటిన్‍కు నేషనల్ టెలికమ్యూనికేషన్స్ కమిషన్ ద్వారా మూసివేయవలసిందిగా ఒక షో కాజ్ ఉత్తర్వు జారీ అయింది, దీంతో ఇందులో పనిచేసే అన్ని రేడియో స్టేషన్లనూ మూసివేయవలసివచ్చింది. ' మనీలా బ్రాడ్‍కాస్టింగ్ కంపెనీకి జారీ చేసిన ఉత్తర్వులో, NTC కమిషనర్ రోనాల్డ్ ఆలివర్ సోలిస్ ఈ కంపెనీ "కమిషన్ నుండి అవసరమైన అధికారం పొందకుండా తక్కువ-శక్తి FM స్టేషన్లను వ్యాపారాత్మక ప్రసారాల స్టేషన్లుగా ఉపయోగిస్తోందని" అన్నారు.[ఉల్లేఖన అవసరం]

నేపాల్[మార్చు]

నేపాల్ కమ్యూనిటీ రేడియోను 1997లో ప్రారంభించింది రేడియో సాగర్‍మాతా 102.4 MHz అనేది కేవలం నేపాల్‍లోనే కాక, పూర్తి దక్షిణాసియాలో మొట్టమొదటి స్వతంత్ర కమ్యూనిటీ రేడియో స్టేషన్.[ఉల్లేఖన అవసరం] ఇది ది నేపాల్ ఫోరం ఆఫ్ ఎన్విరాన్‍మెంటల్ జర్నలిస్ట్స్ (Nefej) ద్వారా మే 1997లో స్థాపించబడింది. రేడియో సాగర్‍మాతా ఎల్లప్పుడూ నేపాలీస్ పౌరుల వాక్స్వాతంత్ర్యం మరియు సమాచార హక్కుల కొరకు పోరాటంలో ముందువరుసలో ఉంది. నేపాల్ ప్రభుత్వం ద్వారా అనుమతి పొందినవి ప్రస్తుతం 150 పైగా కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ఉన్నాయి. నేపాల్‍లో, కమ్యూనిటీ రేడియో నడిపేందుకు ప్రత్యేకమైన విధానాలు లేదా చట్టాలు లేవు. ప్రస్తుతం ఉన్న విధానం మరియు చట్టం, కమ్యూనిటీ మరియు వ్యాపారాత్మక రేడియో స్టేషన్లు, రెండింటికీ వర్తిస్తుంది. ప్రారంభ కమ్యూనిటీ రేడియో అయిన, రేడియో సాగర్‍మాతాతో పాటుగా, కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ప్రభుత్వం, కమ్యూనిటీ రేడియో స్టేషన్ల సౌకర్యానికి భిన్నమైన విధానం మరియు చట్టం ప్రవేశపెట్టాలని కోరుతూనే ఉన్నాయి. కమ్యూనిటీ రేడియో స్టేషన్ల ఆదర్శం సాంఘిక మార్పు మరియు సాంఘిక న్యాయం. అవి నేపాల్ దేశాన్ని రాజ్యం నుండి గణతంత్ర దేశంగా మార్చడంలో, మరియు ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడంలో ప్రముఖ పాత్ర పోషించాయి. చట్ట పాలన, లైంగిక సమానత్వం, విద్య, ఆరోగ్యం, పౌర విద్య, అవినీతి-నిర్మూలన, మంచి పాలన, పర్యావరణం మరియు దినసరి సమస్యలు మరియు విషయాలను స్థానిక కమ్యూనిటీ రేడియో స్టేషన్లు భిన్న కోణంలో పరిశీలిస్తాయి. కమ్యూనిటీ రేడియోలు నేపాల్ మొత్తమ్మీద ఎక్కువ ప్రాంతానికి సేవలు అందిస్తాయి. నేపాలీస్ కమ్యూనిటీ రేడియో స్టేషన్లలోని ప్రసిద్ధ రూపాల్లో వార్తలు ముఖ్యమైనవి.

రేడియో సాగర్‍మాతా (ఎవరెస్ట్ శిఖరం) 102.4 MHz

దక్షిణాసియా యొక్క స్వతంత్ర ప్రజా ప్రయోజన ప్రసారంలో మొట్టమొదటి ప్రయోగం రేడియో సాగర్‍మాతా చరిత్ర, నేపాల్‍లో వాయుతరంగాలపై ప్రభుత్వం క్రమంగా పట్టుకోల్పోవడంతో ముడిపడి ఉంది. క్రొత్త రాజ్యాంగం నవంబరు 1990లో ఏర్పాటైన తరువాత, ఒక క్రొత్త సమాచార వాతావరణం మరియు స్వతంత్ర, ప్రజా-ప్రయోజన ప్రసారం ప్రాముఖ్యత గురించి క్రొత్త విజ్ఞానం తీసుకురావడంలో రేడియో సాగర్‍మాతా ప్రసారం ప్రారంభించే ప్రయత్నం, ప్రముఖ పాత్ర పోషించింది.

నేపాల్‍లో ప్రజా మాధ్యమాలకు కఠినమైన అడ్డంకులు ఉన్నాయి. దేశం యొక్క భౌగోళిక స్వరూపం, ముద్రణ మాధ్యమం ఎక్కువ మందికి చేరడానికీ లేదా ఎలక్ట్రానిక్ మాధ్యమాలు చూపడానికి ప్రతికూలంగా ఉంటుంది. విస్తారమైన పేదరికం కారణంగా వార్తాపత్రికలు, రేడియో మరియు టెలివిజన్ సెట్లు, ఇంకా విద్య లభించడం పరిమితంగా ఉంటుంది. అంతేకాకుండా, నేపాల్‍లో, ముఖ్యంగా గ్రామీణప్రాంతాల్లో మరియు ప్రత్యేకంగా స్త్రీలలో అక్షరాస్యత స్థాయిలు చాలా తక్కువ. ముద్రణ మరియు ఎలక్ట్రానిక్ మాధ్యమాలు కాఠ్మండు వంటి పట్టణ కేంద్రాలలో నెలకొని ఉంటాయి, మరియు గ్రామీణ ప్రజలకు పరిమిత సంబంధం కలిగి ఉంటాయని భావిస్తారు.

1990లో, నేపాల్ అధికారికంగా పార్టీలు-లేని రాచరిక వ్యవస్థ నుండి పార్లమెంటరీ నమూనాగా మారింది. క్రొత్త రాజ్యాంగం వ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కు కల్పించింది, దీని వలన ప్రత్యేకంగా ప్రతి పౌరుడికీ ప్రజా ప్రాముఖ్యత కలిగిన ఎలాంటి విషయం గురించైనా సమాచారం కోరి, పొందే హక్కు లభించింది. రాజ్యాంగంలోని ప్రాథమిక సమాచార హక్కుల వ్యక్తీకరణ తరువాత మరింత నిర్దిష్టమైన విధానం మరియు ఆచరణ సూచనలు పొందుపరచబడ్డాయి: 1992లో, ఒక నేషనల్ కమ్యూనికేషన్స్ పాలసీ; 1993లో, ఒక నేషనల్ బ్రాడ్‍కాస్టింగ్ ఆక్ట్; మరియు 1995లో, బ్రాడ్‍కాస్ట్ రెగ్యులేషన్స్.

1994కు మునుపు, రేడియో ప్రసారం కేవలం 1950లలో స్థాపించబడిన ప్రభుత్వ ప్రసారక సంస్థ, రేడియో నేపాల్ అధీనంలో ఉండేది. 1990 తరువాత కూడా రాష్ట్ర ప్రభుత్వాలు రేడియో ప్రసారాల ఏకస్వామ్య నియంత్రణను రద్దు చేయడంలో నెమ్మదిగా పనిచేయడం జరిగింది. మొట్టమొదటి స్వతంత్ర అనుమతిని కేవలం 1997లో, ప్రారంభ దరఖాస్తు తరువాత నాలుగున్నర సంవత్సరాలకు ఇవ్వబడింది. ఈ అనుమతి కోసం జరిపిన పోరాటం దీర్ఘమైనది, కష్టించి-పోరాడింది మరియు గణనీయమైనది. అస్థిర రాజకీయ వాతావరణం, సంప్రదాయ రాజకీయవేత్తలు మరియు మార్పును అంగీకరించని అధికారులు మరియు రేడియో నేపాల్ యొక్క స్థిరమైన ఉనికి ప్రధానమైన అడ్డంకులుగా ఉండేవి. అక్టోబరు 1992లో దరఖాస్తు నమోదు కావడం మరియు మే 1997లో అనుమతి జారీ కావడం మధ్య, నేపాల్‍లో నాలుగు ప్రభుత్వాలు, నలుగురు మంత్రులు మరియు నలుగురు సమాచార కార్యదర్శులూ మారడం జరిగింది. ప్రాథమికంగా, వ్యక్తీకరణ స్వేచ్ఛ మరియు ప్రజా-ప్రయోజన ప్రసారాలకు అంకితమైన పాత్రికేయులు ప్రారంభించిన ఈ పోరాటంలో జాతీయ ప్రముఖులు, వృత్తిపర సంఘాలు, NGOలు, ముద్రణా మాధ్యమాలు, విదేశీ రాయబారి సంస్థలు, UN సంస్థలు, మరియు INGOలు కూడా పాల్గొనడం జరిగింది.

ప్రారంభం నుండి రేడియో సాగర్‍మాతా అనుమతి పొందేందుకు ప్రచారానికి, మరియు ఒక రేడియో స్టేషన్ ఏర్పాటుకు ప్రధాన నిర్వాహక సంస్థగా ఒక ప్రభుత్వానికి చెందని సంస్థ మరియు పాత్రికేయుల సంఘమైన ది నేపాల్ ఫోరం ఆఫ్ ఎన్విరాన్‍మెంటల్ జర్నలిస్ట్స్ ఉండేది. స్థాపన దశలో ముఖ్యమైన అంతర్జాతీయ సహకారం అందించినవి UNESCO మరియు DANIDA. సంస్థాగత పరిస్థితి ప్రస్తుతం రేడియో సాగర్‍మాతా అనుమతి కలిగిన సంస్థ NEFEJ, కానీ ఈ స్టేషన్ అధికారికంగా మూడు ఇతర మీడియా ఆధారిత NGOల ఉమ్మడి ప్రయత్నం: హిమాల్ అసోసియేషన్, వరల్డ్‌వ్యూ నేపాల్ మరియు ది నేపాల్ ప్రెస్ ఇన్స్టిట్యూట్. ఈ స్టేషనుకు ప్రసార అనుమతి కలిగిన NEFEJ ఏర్పరచిన, ఏడుగురు సభ్యులు కలిగిన స్వతంత్ర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నేతృత్వం వహిస్తుంది. NEFEJ సూత్రాల ద్వారా, ఈ బోర్డ్ మొత్తం నాలుగు భాగస్వామ్య NGOలకూ ప్రతినిధిత్వం వహిస్తుంది, మరియు నెలకొకసారి సమావేశమై, కార్యాచరణ పథకాలు, విధానాలు సమీక్షించి, ఏర్పరచి, స్టేషనుకు దిశానిర్దేశం చేస్తుంది.

ఏప్రిల్ 1999 సమయానికి, రేడియో సాగర్‍మాతా ఈ క్రింది ఉద్యోగులతో నడిచేది: స్టేషన్ మేనేజర్, ఆరుగురు పూర్తి-స్థాయి నిర్మాతలు, ఇరువురు టెక్నీషియన్లు, ఒక సంగీత గ్రంతపాలకుడు, ఒక ఇంజనీరు, ఒక అకౌంట్స్ అధికారి మరియు ఒక స్టేషన్ హెల్పర్. ఈ స్టేషన్, ఇంకా అంతర్జాతీయ సహకార సంస్థలు మరియు ఇతర స్నేహితుల సహకారం మరియు అనుభవాల వలన లాభపడింది. రేడియో సాగర్‍మాతా యొక్క కార్యక్రమాలు మరియు కార్యశీలతలో స్వఛ్ఛంద సేవకులు ముఖ్య పాత్ర వహించారు, మరియు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కార్యక్రమాలు రేడియో సాగర్‍మాతా యొక్క కార్యక్రమాలు, వందలు, బహుశా వేలకొద్దీ ప్రజలకు, ఒక బహిరంగ వేదికపై తమ గళాన్ని మరియు అభిప్రాయాల్ని వినిపించే అవకాశం కల్పించాయి. దినసరిగా, ఈ స్టేషన్ శ్రోతలను వీధులకు మరియు దినవారీ జీవితపు ప్రదేశాలలోనికి తీసుకువెళుతుంది. ప్రపంచపు ఈ భాగంలో, ఇతర ప్రసారకులకు భిన్నంగా, విభిన్న గళాలు మరియు శబ్దాలు (అత్యాధునిక ఉపకరణాలు తక్కువైనా కూడా) వినిపించడం ద్వారా, ఈ స్టేషన్ ఎంతో భిన్నమైన అనుభవాన్ని కలిగిస్తుంది, ఇందులో అసలైన ప్రజలు గడిపే అసలైన జీవితాన్ని, చివరికి అసలైన ప్రజలు నిర్మించడం జరుగుతుంది. ఇంటర్వ్యూలలో పాల్గొనే వారు మరియు ఈ స్టేషన్లో చూపబదేవారు, విభిన్న నేపథ్యాలు మరియు వృత్తులకు చెందినవారి ఉంటారు.

ప్రారంభం నుండి, రేడియో సాగర్‍మాతా శ్రోతలకు 'ఒక మానవ సౌలభ్యం' అందించే ప్రయత్నం చేసింది, సమస్యలు మరియు వినోదాలు, సాంఘిక చర్చలు మరియు సంగీతాల సమ్మేళనంగా, ఇంకా మునుపెన్నడూ నేపాల్ యొక్క రేడియో చానళ్ళలో వినిపించని విధంగా, వివిధ రకాల గళాలు మరియు అభిప్రాయాలను అందించే మార్గంగా వ్యవహరించేది. ప్రభుత్వ ప్రసారక సంస్థ మరియు పాశ్చాత్య-శైలి వ్యాపారాత్మక స్టేషన్లకూ, ఈ స్టేషనుకూ తేడా, వీరి కార్యక్రమాలలో స్పష్టంగా తెలుస్తుంది. ప్రజా ప్రయోజన పాత్రికేయత మరియు ప్రసారం అనేవి రేడియో సాగర్‍మాతా యొక్క ధ్యేయం మరియు దార్శనికతగా ఉన్నాయి, ఇవి మరింత బాధ్యతాయుతమైన ప్రెస్ మరియు మరింత భిన్నత్వం కలిగిన సమాజం కొరకు పనిచేస్తాయి, కానీ దీర్ఘమైన, మరియు శక్తివంతమైన జానపద మాధ్యమ సంప్రదాయం మరియు గొప్ప సంగీత వారసత్వం, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా స్టేషన్ యొక్క దినసరి ఆరు గంటల ప్రసారాలలో చోటు చేసుకుంటాయి.

కార్యక్రమాల యొక్క ఇతర పార్శ్వాలలో 'సఫా రేడియో: ది క్లీన్ ఎయిర్ కాంపైన్' గా పిలిచే ఉద్యమం కూడా ఉంది, ఇందులో ఈ స్టేషన్, నేపాల్ ఎన్విరాన్‍మెంటల్ సైంటిఫిక్ సొసైటీతో కలిసి ఖాట్మండులో వాయు కాలుష్యాన్ని కొలిచి, రాజధానిలో గాలి నాణ్యతకు చెందిన సమాచారాన్ని ప్రసారం చేస్తుంది. మొదట్లో ఇందులో వార్తలు ప్రసారం చేయడం నిషిద్ధమైనా, ప్రస్తుతం ఇక్కడ సంగీతంతో మిశ్రమం చేసిన రోజువారీ వార్తా కథనాలు మరియు రోజువారీ సముదాయ వార్తా బులెటిన్లూ ప్రసారం చేయబడుతున్నాయి. కార్యక్రమాల్లో సముదాయానికి అవకాశం కల్పించడం ముఖ్య భాగం. ఇందులో 'ఇట్స్ మై టర్న్ నౌ' పేరుతొ ఒక రోజువారీ కార్యక్రమం ఉంది, ఇందులో మామూలుగా సముదాయానికి చెందిన వ్యక్తులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చు, మరియు ప్రతిరోజూ ప్రజానీకంతో చర్చలు, శ్రోతల ఉత్తరాలు మరియు నివేదనలు ఫోను ద్వారా నమోదు చేయడం ఉంటుంది. రేడియో సాగర్‍మాతా 1998 చివర్లో, BBC వరల్డ్ సర్వీసుతో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. సాయంత్రం మరియు ఉదయం కార్యక్రమ ప్రసారాలలో ముప్ఫై నిమిషాలు BBC నేపాలీ సర్వీస్ మరియు ఆంగ్లంలో ముప్ఫై నిమిషాల ప్రపంచ వార్తలు వరుసగా ప్రసారమవుతాయి.

న్యూజిలాండ్[మార్చు]

ది అసోసియేషన్ ఆఫ్ కమ్యూనిటీ ఆక్సెస్ బ్రాడ్‍కాస్టర్స్ (ACAB) అనేది పదకొండు న్యూజిలాండ్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ల సమూహం. 1981 మరియు 2000 మధ్య స్థాపించబడి, 1989 నుండి ప్రభుత్వ నిధులు అందుకొంటున్న ఈ స్టేషన్లు, సముదాయ కార్యక్రమాలను అందిస్తాయి, మరియు వ్యక్తులకు మరియు సముదాయ సమూహాలకు కార్యక్రమం నిర్మించే సౌకర్యాలు, శిక్షణ మరియు ప్రసార సమయాన్ని అందిస్తాయి.

ది ACAB గ్రూప్ అనేది న్యూజిలాండ్ ఆన్ ఎయిర్ యొక్క సముదాయ ప్రసార తంత్రంలోని ప్రధాన భాగం. సాలీనా సుమారు $2 మిలియన్ల ప్రభుత్వ నిధిని ఈ పదకొండు స్టేషన్లకూ, ప్రసార చట్టం 36 (c) ని అనుసరించి స్త్రీలు, యువత, పిల్లలు, తెగలు మరియు ఇతర బలహీన వర్గాలు మరియు వికలాంగులకు సంబంధించిన కార్యక్రమాలు నిర్మించేందుకు కేటాయింపబడుతుంది. విభిన్న స్టేషన్లకు ప్రేక్షకులకు చేరిక ఆధారంగా, ప్రతి స్టేషనుకీ $110,000 మరియు $220,000 మధ్య నాలుగు-స్థాయిల వ్యవస్థను అనుసరించి నిధి కేటాయింపబడుతుంది.[9]

ప్రభుత్వ నిధి విధానాలకు అదనంగా, ఇంకా ACAB స్టేషన్లకు విస్తార స్థాయి మతాలు, సంస్కృతులు, భాషలు, వయసులు మరియు లింగాలకు చెందిన కార్యక్రమాలు ప్రసారం చేసే వ్యక్తిగత మరియు సమూహ సూచనలూ ఉంటాయి. స్టేషన్లు అభిప్రాయ సేకరణ ద్వారా కార్యక్రమాలు మరియు ప్రసార సమయాల్ని నిర్ణయిస్తూ, స్వతంత్రంగా మరియు స్థానికంగా పనిచేస్తాయి.[10]

దక్షిణాఫ్రికా[మార్చు]

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత అనతికాలంలో, దేశంలోని నిర్బంధ ప్రభుత్వ విధానాల కారణంగా ది SABC (సౌత్ ఆఫ్రికన్ బ్రాడ్‍కాస్టింగ్ కార్పోరేషన్) కి దాదాపు ఎకస్వామ్యం లభించింది. సుమారు అర్ధ శతాబ్దకాలం అది, పనిచేయడానికి చట్టబద్ధంగా అనుమతి పొందిన ఏకైక ప్రసార సంస్థగా ఉండేది, మరియు దీనికి 1990ల ప్రారంభంలో ప్రజాస్వామ్యానికి మార్పు చెందేవరకూ, దక్షిణాఫ్రికాలో ఇతర రేడియో పోటీ ఉండేది కాదు. మొట్టమొదటగా చట్టబద్ధ-అనుమతి పొందిన, SABC-కాని ప్రసారం, గ్రహమ్స్‌టౌన్లో రోడ్స్ విశ్వవిద్యాలయంలోని ఆవరణలో రేడియో స్టూడియోల 'ఫెస్టివల్ రేడియో' ద్వారా 1991లో ప్రసారమైంది. చిన్న, కమ్యూనిటీ రేడియో స్టేషన్లు మొదటిసారి ప్రసారాలకు అనుమతి పొందాక, దేశంలోని వాయుతరంగాల విడుదల పట్ల నియంత్రణ కొరకు ఒక ఇండిపెండెంట్ బ్రాడ్‍కాస్ట్ అథారిటీ సృష్టించబడింది. పారదర్శకత మరియు జవాబుదారీ కొరకు అనువర్తనాల్ని బహిరంగ సమావేశంలో చర్చించడం జరిగింది. ప్రధానమైన ప్రారంభ కమ్యూనిటీ ప్రసారకులు కేప్ టౌన్లో బుష్ రేడియో మరియు ఉంటాటాలోని యూనిట్రా. ప్రస్తుతం ది ఇండిపెండెంట్ కమ్యూనికేషన్స్ అథారిటీ (ICASA) దూరవాణి మరియు ప్రసార విభాగాలను నియంత్రిస్తుంది.

సాలమన్ ద్వీపాలు[మార్చు]

సాలమన్ ద్వీపాలలోని ఇసాబెల్ ప్రాంతంలో ఒక UNDP కార్యక్రమం క్రింద స్థాపించబడిన ఎన్నో కమ్యూనిటీ FM రేడియో స్టేషన్లు ఉన్నాయి. మార్చి–జూన్ 2009లో, ఇవి కామన్‍వెల్త్ ఆఫ్ లెర్నింగ్ అనే శాంతి-నిర్మాణ పథకం నేపథ్యంలో స్త్రీలు మరియు యువతలో చైతన్యం కలిగించేందుకు ఉపయోగించడం జరిగింది.[3]. ఈ స్టేషన్లు పీపుల్ ఫస్ట్ నెట్‍వర్క్ యొక్క గ్రామీణ ఇ-మెయిల్ స్టేషన్లతో అనుసంధానం చేయబడ్డాయి. ది డాన్ బోస్కో సాంకేతిక పాఠశాల కూడా హోనియారావద్ద ఒక కమ్యూనిటీ స్టేషన్ నడిపేందుకు, తెటేరే సముదాయానికి సాయం అందించింది, మరియు ది సాలమన్ ఐలాండ్స్ డెవలప్‍మెంట్ ట్రస్ట్, స్థానిక సామర్థ్యాన్ని పెంచేందుకు, ఒక కమ్యూనిటీ మీడియా సెంటర్ స్థాపించింది.

దక్షిణ కొరియా[మార్చు]

కొన్ని తక్కువ శక్తి కమ్యూనిటీ రేడియో స్టేషన్లకు 2005వ సంవత్సరంలో అనుమతి ఇచ్చింది. గరిష్ఠ శక్తి 1 వాట్ మరియు అది 5 కి.మీ. దూరానికి చేరేది.

స్వీడన్[మార్చు]

స్వీడన్లో, కమ్యూనిటీ రేడియో (నార్‍రేడియో ) ప్రయోగ ప్రసారాలతో 1978లో ప్రారంభించబడింది. తరువాతి సంవత్సరం క్రమమైన ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 1993 వరకూ వ్యాపారప్రకటనలు అనుమతింపబడలేదు, కానీ కార్యకలాపాలను ప్రధానంగా లాభాపేక్ష-లేని NGOలుగా నడిపారు. స్వీడన్లో 150 కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ఉన్నాయి.

స్టేషన్ల జాబితా కొరకు, ఈ పాక్షికమైన స్వీడన్లో కమ్యూనిటీ రేడియో స్టేషన్ల జాబితాను చూడండి.

థాయిలాండ్[మార్చు]

థాయిలాండ్లో కమ్యూనిటీ రేడియో, ప్రధాన మంత్రి తక్సిన్ షినవాత్ర సమయంలో, నియంత్రణ సంస్థ స్థాపనలో ఆలస్యాన్ని అదనుగా తీసుకుని, త్వరితంగా వృద్ధి చెందింది. థాయిలాండ్ యొక్క 2,000 నుండి 3,000 కమ్యూనిటీ రేడియో స్టేషన్లు, తరచూ అనుమతి లేకనే నడిచేవి, ఎయిర్ రేడియో మరియు ఇతర రేడియో స్టేషన్ల ప్రసారానికి అంతరాయం కలిగిస్తున్నాయనే ఆరోపణను ఎదుర్కొన్నాయి.[11] అయినా, ఎంపిక చేసిన కమ్యూనిటీ రేడియో స్టేషన్లు పోలీసు అణచివేతకు గురవుతూనే ఉన్నాయి, ఇందువలన విమర్శకులు దీనిని ప్రభుత్వం యొక్క రాజకీయ జోక్యంగా ఆరోపించడం జరిగింది.[12]

థాయిలాండ్లో కమ్యూనిటీ రేడియోకు అస్పష్టమైన హోదా ఉంది.

యునైటెడ్ కింగ్‌డమ్[మార్చు]

1978 నుండి కమ్యూనిటీ రేడియో స్టేషన్లు కేబుల్ వ్యవస్థల ద్వారా పనిచేసేవి[13] మరియు చాలావరకూ క్రొత్త పట్టణ ప్రాంతాల్లో ఉండేవి, అంతేకాక స్వఛ్ఛంద సేవకుల ద్వారా నడపబడేవి. 80ల చివర్లో మరియు 90ల ప్రారంభంలో, అప్పట్లో క్రొత్తగా రూపొందిన రేడియో అథారిటీ ఎన్నో క్రొత్త, పూర్వ-పైరేట్ మరియు కేబుల్-ఆధారిత ప్రయత్నాలకు అనుమతులు (వైదొలగిన ఇండిపెండెంట్ బ్రాడ్‍కాస్టింగ్ అథారిటీ ద్వారా "పురోగమన" అనుమతులుగా పిలువబడేవి) ప్రసాదించింది. వీటిలో ప్రధాన స్టేషన్లు రేడియో థేమ్స్‌మీడ్ (తరువాతి కాలంలో RTM రేడియో), ఇది 1978లో UKలోని ఆగ్నేయ లండన్ ప్రాంతంలో రీడిఫ్యూషన్ కేబుల్ వ్యవస్థను ప్రారంభించిన మొట్టమొదటి రేడియో స్టేషన్లలో ఒకటి. పాత తరం కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ఎయిర్ స్పేస్ అమ్మకం మరియు విరాళాలు లేదా నిధుల జారీ వలన నిధిసేకరణ చేసేవి.

సంయుక్త రాష్ట్రాలు[మార్చు]

U.S. కమ్యూనిటీ రేడియో స్టేషన్లను సామాన్యంగా స్వఛ్ఛంద సేవకులు నడుపుతారు మరియు విస్తారమైన రకాల కార్యక్రమాలను ప్రసారం చేస్తారు. వాటికి సాధారణంగా నేషనల్ పబ్లిక్ రేడియో (NPR) నెట్‍వర్క్ స్థలాల కన్నా తక్కువ వ్నిదులుంటాయి, ఎందుకంటే సహకారం మరియు/లేదా వ్యాపార దాతలయ్యే అవకాశాలు ఉన్న శ్రోతలు తక్కువైనందువలన. కమ్యూనిటీ రేడియో స్టేషన్లు NPR స్టేషన్లకు భిన్నమైనవి, ఎందుకంటే చాలావరకూ కమ్యూనిటీ రేడియో కార్యక్రమాలు స్థానికంగా వృత్తిపరమైనవారు కాని డిస్క్ జాకీలు మరియు నిర్మాతలచే నిర్మించబడతాయి, కాగా NPR మాత్రం, తమ స్వంత ఆధారాలు మరియు ఇతర సంస్థలైన PRI వంటి వాటి నుండి, సహకార కార్యక్రమాలపై ఆధారపడతాయి; NPR స్టేషన్లు దాదాపు ఎల్లప్పుడూ ఎక్కువ శాతం కార్యనిర్వహణకు వేతనం స్వీకరించే ఉద్యోగులను కలిగి ఉంటాయి. కమ్యూనిటీ స్టేషన్లు తరచూ, ఒక నియమం లాగా, ఇతర ప్రజా ప్రసారకులతో పోల్చినప్పుడు, కార్పోరేషన్లపై (మరియు చివరికి ప్రభుత్వాలు) నిదుల కొరకు తక్కువగా ఆధారపడతాయి. ఎన్నో కమ్యూనిటీ స్టేషన్లు సంపూర్ణ-శక్తి FM స్టేషన్లుగా అనుమతి పొందుతాయి, కాగా ఇతరమైనవి - ప్రత్యేకంగా క్రొత్తగా ఏర్పడిన కమ్యూనిటీ స్టేషన్లకు - తక్కువ-శక్తి ప్రసార నియమాల ఆధారంగా అనుమతి లభిస్తుంది. మునుపటివి ఎన్నో 1960లు మరియు 1970లలో U.S.లోని సాంస్కృతిక ప్రయోగాలు (ఉదా., ది న్యూ లెఫ్ట్), ప్రత్యేకంగా యువతలో, ఎక్కువగా అభిమానం సంపాదించిన సమయంలో స్థాపించబడ్డాయి.

ది నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కమ్యూనిటీ బ్రాడ్‍కాస్టర్స్ 1975 లో, సముదాయ-పరమైన, వ్యాపారాత్మకం-కాని రేడియో స్టేషన్లకు రక్షణ సంస్థగా రూపొందించబడింది. NFCB స్టేషన్లు మరియు లాబీలకు జాతీయ స్థాయిలో కమ్యూనిటీ రేడియో తరఫున సూచనావళి పుస్తకాలు ప్రచురిస్తుంది. దాని యొక్క హెల్దీ స్టేషన్ ప్రాజెక్ట్ ద్వారా కమ్యూనిటీ స్టేషన్ల ఏకరీతిని ప్రోత్సహించినందుకు విమర్శలకు గురయింది. నిర్వహణ మరియు వారి కార్యక్రమాలపై అధికారం నుండి స్వఛ్ఛంద సేవకులను తొలగించమని, మరియు మరింత ఊహాత్మక "స్ట్రిప్" కార్యక్రమాలను అందించమని, ఈ ప్రాజెక్ట్ స్టేషన్లను ప్రోత్సహించింది.[14] ది గ్రాస్‍రూట్స్ రేడియో కొయాలిషన్ అనేది ప్రజా రేడియో వ్యాపారసరళి పెరగడం మరియు స్వఛ్ఛంద-సేవల-ఆధారిత స్టేషన్లకు సహకారం కొరవడడం (NFCBలో సైతం) పట్ల వ్యతిరేకంగా మొదలైన ఒకరకం స్టేషన్ల సంఘం. కొన్ని స్టేషన్లు ఈ రెండు విభాగాల్లోనూ భాగంగా ఉన్నాయి.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • ఇంటర్నేషనల్ ఫ్రీడం అఫ్ ఎక్స్‌ప్రెషన్ ఎక్స్‌ఛేంజ్
 • వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ కమ్యూనిటీ రేడియో బ్రాడ్‍కాస్టర్స్ (AMARC)
 • CRAOL (కమ్యూనిటీ రేడియో ఫోరం ఆఫ్ ఐర్లాండ్ - ఐరిష్ సెక్టార్ బాడీ)
 • కమ్యూనిటీ మీడియా అసోసియేషన్ (UK సెక్టార్ బాడీ)
 • ప్రోమిథియస్ రేడియో ప్రాజెక్ట్
 • అల్లెఘెనీ మౌంటైన్ రేడియో
 • గ్రామ్ వాణి కమ్యూనిటీ మీడియా (CR స్టేషన్లకు సాంకేతిక వ్యవస్థలు)
 • బంగ్లాదేశ్ NGOస్ నెట్‍వర్క్ ఫర్ రేడియో కమ్యూనికేషన్ (బంగ్లాదేశ్ సెక్టార్ బాడీ)

సూచికలు[మార్చు]

 1. Dunaway, Ph.D., David (2002). Jankowski, Nicholas W.; Prehn, Ole (సంపాదకులు.). "Community Radio at the Beginning of the 21st Century: Commercialism vs. Community Power" (pdf). Community Media in the Information Age: Perspectives and Prospects. Cresskill, NJ: Hampton Press. Retrieved 2009-02-15.
 2. CBONLINE కల్చర్, కమిట్‍మెంట్, కమ్యూనిటీ: ది ఆస్ట్రేలియన్ కమ్యూనిటీ రేడియో సెక్టార్: సుసాన్ ఫోర్డ్, మైకేల్ మీడోస్ మరియు కెర్రీ ఫాక్స్‌వెల్[1]. 8 జనవరి 2007న తిరిగి పొందబడింది.
 3. Schaay, Michiel (September 1980). "A History of Bolivian Radio". Cite web requires |website= (help)
 4. ది నేషనల్ కాంపస్ అండ్ కమ్యూనిటీ రేడియో అసోసియేషన్
 5. కాంపస్ అండ్ కమ్యూనిటీ రేడియో పాలసీ
 6. "కెనడియన్ రేడియో-టెలివిజన్ అండ్ టెలికమ్యూనికేషన్స్ కమిషన్ కమ్యూనిటీ రేడియో స్టేషన్స్". మూలం నుండి 2007-11-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2020-01-07. Cite web requires |website= (help)
 7. ఇండస్ట్రీ కెనడా స్పెక్ట్రం మేనేజ్‍మెంట్ అండ్ టెలికమ్యూనికేషన్స్
 8. http://news.oneindia.in/2010/03/13/terilaunches-kumaon-vani-community-radio-service.html
 9. "Consultation paper for Community Access Radio and Regional Television funding - April 2008" (PDF). NZ On Air. మూలం (PDF) నుండి 2010-05-21 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-06-06. Cite web requires |website= (help)
 10. "Association of Community Access Broadcasters, Aotearoa New Zealand". Acab.org.nz. మూలం నుండి 2010-06-02 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-06-06. Cite web requires |website= (help)
 11. "Community-radio crackdown panned". The Nation. June 01, 2005. మూలం నుండి 2016-03-03 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-12-11. Check date values in: |date= (help)
 12. "Abuse blamed on regulation". Bangkok Post. June 1, 2005.
 13. హన్సార్డ్ 1981
 14. జెస్సీ వాకర్, రెబెల్స్ ఆన్ ది ఎయిర్: ఎన్ ఆల్టర్నేటివ్ హిస్టరీ ఆఫ్ రేడియో ఇన్ అమెరికా (న్యూ యార్క్ విశ్వవిద్యాలయ ముద్రణాలయం, 2001), పు.147-149

బాహ్య లింకులు[మార్చు]