కరణ్ సింగ్ గ్రోవర్
కరణ్ సింగ్ గ్రోవర్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయుడు |
విద్యాసంస్థ | ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్, ముంబై |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2004 – ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | దిల్ మిల్ గయ్యే కుబూల్ హై కసౌతి జిందగీ కే (2018 టీవీ సిరీస్) |
జీవిత భాగస్వామి | |
పిల్లలు | 1 |
సంతకం | |
కరణ్ సింగ్ గ్రోవర్ (జననం 1982 ఫిబ్రవరి 23) భారతీయ మోడల్, నటుడు. ఆయన దిల్ మిల్ గయే, ఖుబూల్ హై వంటి టెలివిజన్ ధారావాహికలలో తన నటనకు ప్రసిద్ధి చెందాడు. అలాగే అలోన్, హేట్ స్టోరీ 3 వంటి బాలీవుడ్ చిత్రాలలో నటనకు కూడా ఆయన ప్రేక్షకాదరణ పొందాడు.
2019లో కసౌతి జిందగీ కే 2 అనే టెలివిజన్ షో చేసిన ఆయన అదే సంవత్సరం BOSS: బాప్ ఆఫ్ స్పెషల్ సర్వీసెస్‌తో తన డిజిటల్ అరంగేట్రం చేశాడు. 2020లో యాక్షన్-థ్రిల్లర్ వెబ్ సిరీస్ డేంజరస్‌లో, 2021లో కుబూల్ హై 2.0 వెబ్ సిరీస్‌లో నటించాడు.[3]
జీవితం తొలి దశలో
[మార్చు]కరణ్ సింగ్ గ్రోవర్ 1982 ఫిబ్రవరి 23న న్యూఢిల్లీలో పంజాబీ సిక్కు కుటుంబంలో జన్మించాడు. అతనికి ఒక తమ్ముడు ఉన్నాడు.[4] ఆయన చిన్నతనంలో వారి కుటుంబం సౌదీ అరేబియాలోని అల్ ఖోబార్‌కు వెళ్లింది. ఆయన సౌదీ అరేబియాలోని దమ్మామ్‌లో తన పాఠశాల విద్యను అభ్యసించాడు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (IHM), ముంబై నుండి హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు. ఆ తర్వాత ఒమన్‌లోని షెరటన్ హోటల్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా కొంతకాలం పనిచేశాడు.[5]
వ్యక్తిగత జీవితం
[మార్చు]భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటి శ్రద్ధా నిగమ్‌ని 2008లో కరణ్ సింగ్ గ్రోవర్ వివాహం చేసుకున్నాడు. వారు 10 నెలల తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆయన మళ్ళి 2012లో సినీ నటి జెన్నిఫర్ వింగెట్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ జంట 2014లో విడిపోయారు.
ఆ తరువాత ఆయన నటి బిపాషా బసును 2016 ఏప్రిల్ 30న వివాహం చేసుకున్నాడు. వీరికి 2022 నవంబరు 12న కుమార్తె దేవి బసు సింగ్ గ్రోవర్ జన్మించింది.[6]
బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ తాము మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ఆగస్టు 2016లో ప్రకటించారు. కాగా ఈ జంట 2015లో భూషణ్ పటేల్ తెరకెక్కించిన అలోన్ సినిమాలో మొదటిసారి కనిపించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఈ జంట థ్రిల్లర్ వెబ్ సిరీస్ డేంజరస్ లోనూ కూడా కలిసి నటించారు.
పురస్కారాలు
[మార్చు]Year | Award | Category | Work | Result | Source |
---|---|---|---|---|---|
2004 | గ్లాడ్రాగ్స్ మాన్‌హంట్ కాంటెస్ట్ | మోస్ట్ పాపులర్ మోడల్ అవార్డు | విజేత | ||
2007 | కళాకర్ అవార్డ్స్ | బెస్ట్ ప్రామిసింగ్ స్టార్ | దిల్ మిల్ గయ్యే | విజేత | |
2008 | ఇండియన్ టెలీ అవార్డ్స్ | బెస్ట్ యాక్టర్ ఇన్ లీడ్ రోల్ (పాపులర్) | దిల్ మిల్ గయ్యే | నామినేట్ చేయబడింది | |
2008 | ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్ | శిల్పా ఆనంద్ తో కలిసి బెస్ట్ ఆన్ స్క్రీన్ కపుల్ | దిల్ మిల్ గయ్యే | విజేత | |
2008 | గోల్డ్ అవార్డ్స్ | బెస్ట్ యాక్టర్ ఇన్ లీడ్ రోల్ (పాపులర్) | దిల్ మిల్ గయ్యే | నామినేట్ చేయబడింది | |
2008 | గ్లోబల్ ఇండియన్ ఫిల్మ్ & టీవీ ఆనర్స్ | శిల్పా ఆనంద్ తో కలిసి బెస్ట్ ఆన్ స్క్రీన్ కపుల్ | దిల్ మిల్ గయ్యే | నామినేట్ చేయబడింది | |
2008 | ఇండియన్ టెలీ అవార్డ్స్ | బెస్ట్ యాక్టర్ | జరా నాచ్కే దిఖా | నామినేట్ చేయబడింది | |
2010 | గోల్డ్ అవార్డ్స్ | మోస్ట్ ఫిట్ యాక్టర్ (మేల్) | — | విజేత | |
2013 | ఇండియన్ టెలీ అవార్డ్స్ | సుర్భి జ్యోతి తో కలిసి బెస్ట్ ఆన్ స్క్రీన్ కపుల్ | ఖుబూల్ హై | నామినేట్ చేయబడింది | |
2013 | ఇండియన్ టెలీ అవార్డ్స్ | బెస్ట్ యాక్టర్ ఇన్ లీడ్ రోల్ | ఖుబూల్ హై | నామినేట్ చేయబడింది | |
2013 | ఇండియన్ టెలీ అవార్డ్స్ | బెస్ట్ టెలివిజన్ పర్సనాటిటి ఆఫ్ ది ఇయర్ | ఖుబూల్ హై | విజేత | |
2013 | ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్ | దేశ్ కా సితార – బెస్ట్ యాక్టర్ పాపులర్ | ఖుబూల్ హై | విజేత | |
2013 | ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్ | బెస్ట్ యాక్టర్ డ్రామా | ఖుబూల్ హై | నామినేట్ చేయబడింది | |
2013 | జీ గోల్డ్ అవార్డ్స్ | సుర్భి జ్యోతి తో కలిసి బెస్ట్ ఆన్ స్క్రీన్ కపుల్ | ఖుబూల్ హై | విజేత | |
2013 | జీ గోల్డ్ అవార్డ్స్ | బెస్ట్ యాక్టర్ పాపులర్ | ఖుబూల్ హై | విజేత | |
2017 | జీ గోల్డ్ అవార్డ్స్ | రైజింగ్ స్టార్ | బాలీవుడ్ | విజేత | |
2019 | జీ గోల్డ్ అవార్డ్స్ | బెస్ట్ యాక్టర్ నెగేటివ్ (పాపులర్) | కసౌతి జిందగీ కే | విజేత |
మూలాలు
[మార్చు]- ↑ "I am getting divorced this Monday: Shraddha Nigam – Lifestyle – DNA". Dnaindia.com. 16 July 2010. Retrieved 28 December 2013.
- ↑ "First Pics: Bipasha Basu and Karan Singh Grovers Mehendi". NDTV. Retrieved 29 April 2016.
- ↑ "Karan Singh Grover shares the first poster of Qubool Hai 2.0 with Surbhi Jyoti". Bollywood Hungama. 10 January 2021. Retrieved 10 January 2021.
- ↑ "Do you know Karan Singh Grover has a hot brother called Ishmeet Singh Grover? - daily.bhaskar.com". daily.bhaskar.com. 17 May 2014. Retrieved 29 December 2014.
- ↑ "Unknown facts about Karan Singh Grover on his birthday, fans pray for his comeback". Filmibeat. 24 February 2014. Archived from the original on 5 మార్చి 2014. Retrieved 31 July 2014.
- ↑ "Bipasha basu: తల్లైన బిపాసా". web.archive.org. 2023-02-21. Archived from the original on 2023-02-21. Retrieved 2023-02-21.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)