Jump to content

కరమన నది

వికీపీడియా నుండి
కరమన
River
అరువిక్కార ఆనకట్టు దగ్గర కరమన
దేశం భారత దేశం
రాష్ట్రం కేరళ
Source
 - స్థలం అగస్త్యార్ కూటం, పడమర కనుమలు
పొడవు 66 km (41 mi)

కరమన నది కేరళలోని తిరువనంతపురంలో ప్రవహించే నది. ఇది పడమర కనుమలులోని అగస్త్యార్ కూటంలో పుట్టి పడమర వైపున 66 కిలోమీటర్లు ప్రవహించాకా కోవళం దగ్గర అరేబియా సముద్రంలలో కలిసిపోతుంది. ఈనదికి కరమన పేరు తిరువనంతపురంలోని కరమన అనే ఒక శివారు నుంచి వచ్చింది.

ఈ నది ఒడ్డున ఎక్కువ అడవి ఉండగా, కొన్ని చోట్ల మాత్రం‌ కొబ్బరి తోటలు, వరి పంటలు ఉన్నాయి.

కరమనలో కలిసిపోయె నదులు

[మార్చు]

కరమన అగస్త్యార్ కూటం దగ్గర సముద్రపు మట్టం కన్నా 1600 మీటర్లు ఎత్తున మొదలవుతుంది. చెమ్ముంజి, మొట్ట, ఆతిరమల, కావియార్, అట్టయార్, వయప్పాడ్యార్, తోడయార్ మరియి కిఌయార్ కరమనలో కలిసిపోయే ఏర్లు. వీటిలో అందరిలోకి పెద్దది కిఌయార్, ఏదైతే కరమనలో కలిసిపోయే ముందు 24 కిలోమీటర్లు ప్రవహిస్తుందో. ఈ యేటి పైన ఐదు ఆకట్లు కట్టబడ్డాయి. కరమన వడ్డున అట్టుకళ్, పద్మనాభస్వామి మొదులు ఎన్నో పేరుగాంచిన గుడులు కూడా ఉన్నాయి.

ఆనకట్లు

[మార్చు]
కరమనపై అరువిక్కార ఆనకట్టు

కరమన పైన రెండు కీలకమైన ఆనకట్లు ఉన్నాయి. ఒకటేమో అరువిక్కార, మరొకటేమో పెప్పార. అరువిక్కార ఆనకట్టు తిరువనంతపురంకి తాగునీరు అందించడానికి 193౩లో లార్డ్ విలియంచే కట్టించబడింది. పెప్పార ఆనకట్టు, అరువిక్కార ఆనకట్టులోకి వచ్చే నీటిని అదుపుచేయడాని కట్టించబడింది. పెప్పార ఆనకట్టు వల్న ఎన్నొ సార్లు తిరువనంతపురంకి వరదలు రాకుండా ఆగిపోయాయి.

వంతెనలు

[మార్చు]

కరమన నదిపై ఎన్నో వంతెనలు ఉన్నాయి. వీటిలో అందరిలోకి కీలకమైనది NH-47.


మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కరమన_నది&oldid=2984085" నుండి వెలికితీశారు