కరావోకే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిన్ని చిన్ని అశ పల్లవి కరావోకే ట్రాక్ ఉదాహరణ

కరావోకే ( జపాన్ మూలానికి ఆంగ్లంలో KARAOKE)  పరస్పర వినోదకార్యక్రమము లేక దృశ్యపర ఆట.  దీనిలో ఔత్సాహిక గాయకుడు ముద్రించిన సంగీతముతోపాటు  ధ్వని గ్రాహక యంత్రము (మైక్రోఫోన్), శబ్దవిస్తారకము(స్పీకర్) వుపయోగించి పాడుతాడు.  సంగీతం సాధారణంగా ప్రజాదరణపొందిన  పాట, ప్రధాన గాత్రము లేకుండా వున్నదై వుంటుంది. పాట సాహిత్యం  తెరపై  పాడే అక్షరాలను తెలిపే స్థాన సూచికతో చూపబడి గాయకునికి సహాయకంగా వుంటుంది.  చైనా, కంబోడియా లాంటి దేశాలలో  కరావోకే పరికరాన్ని కేటీవి అని అంటారు. ధ్వని ముద్రణ సాంకేతిక నిపుణులు ఈ పదాన్ని గాత్రధ్వనులు లేకుండా ముద్రించిన సంగీతానికి వాడతారు. ప్రపంచంలో కరావోకే వ్యాపారం 10000 కోట్ల డాలర్లుగా అంచనా వేయబడింది.[1]

చరిత్ర[మార్చు]

కరావోకే బార్  వ్యూహాన్, చైనా

ప్రధాన గాత్రాలు లేకుండా ధ్వని ముద్రించడం ధ్వని ముద్రణ చరిత్ర ప్రారంభం నుండి ఉంది.  చాలామంది కళాకారులు పూర్తి వాద్య బృందం లేకుండా పాడవలసివుంటుంది. వారు అప్పుడు కరావోకే ముద్రణను వాడతారు.  వారు మూలపు పాటను పాడినవారైవుంటారు.  (  ప్రధానగాత్రంకల ధ్వని ముద్రణకు  కళాకారుడు  పెదాలు కదుపుతూఅభినయించడానికి వాడే  రికార్డు డాన్స్ అనే మాటతో కరావోకేకు తేడావుందని గమనించండి)

1960లు: దృశ్యశ్రవణ ముద్రణ పరికరాల అభివృద్ధి.[మార్చు]

1961–1966 సంవత్సరాలలో  ఎన్బిసి అనే అమెరికా టీవి కేంద్రం సింగ్ ఎలాంగ్ విత్ మిచ్ అనే కరావోకే  లాంటి కార్యక్రమం ప్రసారం చేసింది.  మిచ్ మిల్లర్, బృందం పాడే పాటను తెర క్రింది భాగంలో చూపడంద్వారా వీక్షకులు గొంతు కలిపే వీలుని కల్పించింది. [2]  

గొంతు కలిపే పాటలు కొత్త సాంకేతికాలతో ప్రాథమికంగా మారిపోయాయి.  1960 దశకం చివరి, 1970 దశకం మొదట్లో  కేసెట్ టేపులు విరివిగా వాడకంలోకి రావటంతో  సంగీతాన్ని సులభంగా నకలు చేయటం వీలయింది. 

1970లు: కరావోకే యంత్రం అభివృద్ధి[మార్చు]

కరావోకే  కనిపెట్టిన వ్యక్తి గురించి వివాదాలున్నాయి.  ఒక వాదన ప్రకారం  ఈ యంత్రం జపాన్ సంగీతకారుడు  డెయిజుకే ఇనో[3]  కోబె, జపాన్  లో  1971 లో కనిపెట్టాడు.[4][5] ధ్వని కంపెనీ  క్లేరియన్  వాణిజ్యాత్మకంగా  యంత్రాన్ని తయారు చేసింది.  కాని దీనికి పేటెంట్ లేదు.

జపాన్ లో రాత్రి భోజనం సమయంలో సంగీత కార్యక్రమం ఏర్పాటు చేయడం సాధారణం. జపాన్ తబలా వాదకుడైన డెయిజుకో ఇనో  తన  సంగీత కార్యక్రమం ముద్రణ నకలును తాము పాడుకోవటానికి వీలుగా  ఇవ్వమని చాలామంది కోరడంతో ఇనో టేప్ రికార్డర్ లాంటి యంత్రాన్ని తయారు చేశాడు. దీనితో 100యెన్ నాణంవేసి ఒక  పాట వింటూ పాడవచ్చు.    

కరావోకే యంత్రాన్ని అమ్మకుండా, ఇనో  వాటిని అద్దెకు ఇవ్వసాగాడు.  కొత్త పాటలను కొనుక్కోవటానికి అవసరం లేకుండా వాడుకొనే వీలుకలిగింది.  మొదట్లో దీనిని ఖరీదైన వినోదంగా పరిగణించినా కాలక్రమేణా  ప్రజాదరణ పొందింది. కరావోకే యంత్రాలు హోటళ్ల గదులలో వుంచబడేవి. తదుపరి కరావోకే బాక్స్  అనే పేరుతో చిన్ని చిన్ని గదుల వ్యాపారం ప్రారంభమైంది. 2004లో,  డెయిజుకే ఇనోకి ఎక్కిరింపుగా ఇచ్చే  ఇగ్నోబెల్ శాంతి బహుమతి లభించింది.  "ఇతరులతో సహనం పాటించేటందులకు వీలుకలిగించే  కొత్త పద్ధతి"ని కనిపెట్టినందుకే ఈ బహుమతి అని వివరణలో పేర్కొన్నారు. [6]

1990లు[మార్చు]

తాయ్పేయ్, థాయవాన్ లో కరావోకే బాక్స్  ప్రవేశపుగది.

తదుపరి త్వరగా కరావోకే  ఆసియాలో మిగతా దేశాలకు, ఇతర ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ఇంటిలో వాడుకునే కరావోకే యంత్రాలు అమెరికా, కెనడా దేశాలలో ఆదరణపొందకపోవటంతో తదుపరి వచ్చిన హోమ్ థియేటర్ పరికరాలకు కరావోకే అదనపు సౌకర్యంగా మారింది.

కరావోకే యంత్రాలకు మరింత సంగీతం అందుబాటులోకి రావటంతో   పారిశ్రమకారులు రాత్రివినోదానికి మంచి లాభకరమైనదిగా  భావించారు.  కరావోకే బార్ లలో  ప్రతిరోజు  కరావోకే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.  నాట్యానికి తగినట్లుగా, కాంతి ప్రభావాలతో కూడిన  వేదికలు, మంచి నాణ్యతతోకూడిన ధ్వని పరికరాలతో, చాలా తెరలపై పాటలసాహిత్యాన్ని ప్రదర్శించే ఏర్పాట్లు సాధారణమైనవి. 

సాంకేతిక అంశాలు[మార్చు]

పాతకాలపు కరావోకే యంత్రం

సాధారణ కరావోకే యంత్రంలో సంగీతం నడిపించే సదుపాయ, మైక్రోఫోనులు అనుసంధానించే సౌకర్యం,  సంగీతపు పౌనపుణ్యం మార్చే సౌకర్యం, ధ్వనివర్ధకాలకు అనుసంధానించే సౌకర్యం వుంటుంది.  కొన్ని యంత్రాలలో  సాధారణ పాటలలో గాత్రపు ధ్వనిని  తగ్గించే సౌకర్యం వుంటుంది. కాని ఇది అంత సమర్ధవంతంగా పనిచేయదు.  ఇటీవలి కాలంలో  చాలా యంత్రాలు   సిడి+జి (CD+G), లేసర్ డిస్క్ (Laser Disc), విసిడి (VCD)  లేక డివిడి (DVD) ప్లేయర్లు మైక్రోఫోన్, ధ్వని మిశ్రమము చేసే సౌకర్యం కలిగి వుంటుంది.  [7]   సిడి+జి ప్లేయర్ లో సబ్ కోడ్ అనే ప్రత్యేక ట్రాక్ లో  బొమ్మల పాట సాహిత్యం వుంటుంది. ఇతరాలలో సంగీతంతోపాటు  దృశ్యం కలిపి వుంటుంది.

మొబైల్ ఫోన్ లో  కరావోకే[మార్చు]

చాలా కంపెనీలు 2003లో మొబైల్ ఫోన్ల ద్వారా కరావోకే సౌలభ్యం కలిగించాయి.  మిడి (MIDI) ఫైల్ తో పాటు సాహిత్యం కలిసిన  ఫైల్ నడిపించగల ఫైల్ ( .Kar)  తీరు అందుబాటులోకి వచ్చింది.

కంప్యూటర్ , అంతర్జాలంలో కరావోకే [మార్చు]

2003 నుండి, కంప్యూటర్ అధారిత కరావోకే సాఫ్ట్వేర్ అందుబాటులోకి వచ్చింది.  కొత్త సాఫ్ట్వేర్ తో  అంతర్జాలం ద్వారా గాయకులు ఒకరు ఇంకొకరి పాట వినే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. సిడి+జి తీరులోని కరావోకే పాటలను కంప్యూటర్ ద్వారా వినే సౌకర్యం కూడా ఇటీవలి కాలంలో ఏర్పడింది.

కొన్ని సంగీతసంస్థలు యూట్యూబ్ ద్వారా వినగలిగే పాటలకు పాట సాహిత్యం తెరపై కనిపించేటట్లుగా వుండే వీడియోలు (నిజమైన కరావోకే కాదిది) అందచేస్తున్నారు. కరావోకే సాధనకు ఇవి ఉపయోగపడతాయి.

కరావోకే సంస్కృతి [మార్చు]

కరావోకే సార్వజనిక ప్రదేశాలు [మార్చు]

 జపాన్ లో కరావోకే  బాక్స్  పరామర్శ  ప్రదేశం
చైనాలో కరావోకే బాక్స్  ప్రవేశ ద్వారం
హేంబర్గ్ లో ఐరిష్ మద్యపాన కేంద్రంలో కరావోకే 

భారతదేశం[మార్చు]

భారతదేశంలో ప్రధాన నగరాలలో కొన్ని హోటళ్లలో కరావోకే కార్యక్రమాలు ప్రతిరోజు లేక వారానికి కొన్ని రోజులలో నిర్వహించుతారు.[8]

కరావోకే తయారీ పద్ధతులు[మార్చు]

ఆసియా దేశాలలో కరావోకే చాలా ప్రజాదరణ పొందింది.  పాట విడుదల సమయంలోనే చాలామంది సంగీతకారులు కరావోకే రూపం కూడా విడుదలచేస్తారు.  ఎమ్ఐడిఐ (MIDI) పద్ధతిలో నేపథ్య దృశ్యాలపై సాహిత్యం కనబడే డివిడి సాధారణంగా విడుదలచేస్తారు. .

ఐరోపా, ఉత్తర అమెరికాలలో కరావోకే  రూపపు సంగీతం మూల సంగీతకారులు చేయరు. ఇతర సంగీత కారులు మలి ముద్రణగా కరావోకే రూపం విడుదల చేస్తారు. 

కరావోకే పోటీ [మార్చు]

పాటలు పాడడం ప్రవృత్తిగా కలవారికి గుర్తింపునివ్వటానికి కరావోకే పోటీలు  నిర్వహించడం మొదలైంది.   ప్రేక్షకుల  తీర్పు, న్యాయనిర్ణేతల తీర్పు కలిపి విజేతలను నిర్ణయించటం సాధారణంగా జరుగుతుంది..

ప్రపంచ రికార్డులు [మార్చు]

రాబీ విలియమ్స్  నెబ్వర్త్ 2003 లో 120,000 మందితో పాడినందులకు అత్యధికులు పాల్గొన్న కరావోకే ప్రపంచ రికార్డు పొందాడు.  

మూలాలజాబితా[మార్చు]

  1. ~$10B business globally.
  2. Brooks, Tim; Marsh, Earle (1992), The Complete Directory to Prime Time Network TV Shows, Ballantine Books, ISBN 0-345-37792-3
  3. "Who Invented the Karaoke Machine?". Archived from the original on 2008-03-05. Retrieved 2016-02-23.
  4. 井上大祐【カラオケ発明者】 J-ONE/INOUE Archived 2009-03-21 at the Wayback Machine Events-in-Music.com
  5. Time 100:Daisuke Inoue, 23–30 August 1999 VOL. 154 NO. 7/8
  6. "The 2004 Ig Nobel Prize Winners". Winners of the Ig Nobel Prize. Improbable Research. Retrieved 2009-10-17.
  7. "The History of Karaoke in America". Karaoke Cloud. Archived from the original on 17 జనవరి 2014. Retrieved 15 January 2014.
  8. "కూనిరాగమొచ్చినా.. కరా ఓకే!". సాక్షి. సాక్షి. Archived from the original on 23 ఫిబ్రవరి 2016. Retrieved 23 February 2016.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
"https://te.wikipedia.org/w/index.php?title=కరావోకే&oldid=3610799" నుండి వెలికితీశారు