కరీంనగర్ రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కరీంనగర్ రెవెన్యూ డివిజను
కరీంనగర్ పట్టణంలోని చారిత్రిక, పర్యాటక ప్రదేశాలు
కరీంనగర్ పట్టణంలోని చారిత్రిక, పర్యాటక ప్రదేశాలు
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాకరీంనగర్

కరీంనగర్ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. కరీంనగర్ జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 10 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం కరీంనగర్ లో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవిన్యూ డివిజను కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలోని, కరీంనగర్ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.

వివరాలు[మార్చు]

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]

పరిపాలన[మార్చు]

కరీంనగర్ డివిజనులోని మండలాలు:[4]

క్ర.సం కరీంనగర్ రెవెన్యూ డివిజను మండలంలోని రెవిన్యూ గ్రామాల సంఖ్య
1 కరీంనగర్ మండలం 1 రెవెన్యూ గ్రామం (2 నిర్జన గ్రామాలు)
2 కొత్తపల్లి మండలం 12 రెవెన్యూ గ్రామాలు
3 కరీంనగర్ గ్రామీణ మండలం 14 రెవెన్యూ గ్రామాలు
4 మానకొండూరు మండలం 18 రెవెన్యూ గ్రామాలు
5 తిమ్మాపూర్ మండలం 14 రెవెన్యూ గ్రామాలు
6 గన్నేరువరం మండలం 10 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)
7 గంగాధర మండలం 19 రెవెన్యూ గ్రామాలు
8 రామడుగు మండలం 18 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
9 చొప్పదండి మండలం 12 రెవెన్యూ గ్రామాలు
10 చిగురుమామిడి మండలం 1 రెవెన్యూ గ్రామాలు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-03-20.
  3. "Administrative Setup | Karimnagar | India". Archived from the original on 2022-01-27. Retrieved 2022-03-20.
  4. "కరీంనగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-02-20.