కరీం సాదిక్
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | కరీం ఖాన్ సాదిక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1984 ఫిబ్రవరి 28 నంగ్రాహర్ ప్రావిన్స్ , ఆఫ్ఘనిస్తాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బంధువులు | హస్తి గుల్ (సోదరుడు) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి వన్‌డే (క్యాప్ 5) | 2009 జనవరి 19 - స్కాట్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి వన్‌డే | 2016 జనవరి 4 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 84 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి T20I (క్యాప్ 4) | 2012 జింబాబ్వే 12 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి T20I | 2018 జింబాబ్వే 6 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| T20Iల్లో చొక్కా సంఖ్య. | 84 (గతంలో 10) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2011 | ఆఫ్ఘన్ చీతాస్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2017 | బూస్ట్ డిఫెండర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2017 | కాబూల్ ఈగల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Medal record
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2021 9 January | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కరీం ఖాన్ సాదిక్ ( పాష్టో : كريم خان صادق ; జననం 28 ఫిబ్రవరి 1984) ఆఫ్ఘన్ క్రికెటర్. ఆయన కుడిచేతి బ్యాట్స్‌మన్, అప్పుడప్పుడు ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జట్టుకు వికెట్ కీపర్‌గా పని చేస్తాడు. ఆయన ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేయగలడు, 2009 ఐసీసీ ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌లో డెన్మార్క్‌పై వారి మొదటి మ్యాచ్‌లో 27 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు.
తొలినాళ్లలో కెరీర్
[మార్చు]సాదిక్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆఫ్ఘన్ క్రికెట్ జట్టులో ఒక భాగం, ఈ జట్టు ఒక సంవత్సరం లోపు వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ ఫైవ్, డివిజన్ ఫోర్, డివిజన్ త్రీలను గెలుచుకుంది తద్వారా వారిని డివిజన్ టూకు ప్రమోట్ చేసి 2009 ఐసిసి వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో పాల్గొనడానికి వీలు కల్పించింది.
ఆయన 2009 ఐసీసీ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ సందర్భంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో "అనుచితమైన & ఉద్దేశపూర్వక శారీరక సంబంధం" కారణంగా ఒక మ్యాచ్‌కు సస్పెండ్ చేయబడ్డాడు.[1] ఆ టోర్నమెంట్ సమయంలో బ్యాట్‌తో బాగా రాణించాడు, 92 పరుగులతో అత్యధిక స్కోరు సాధించాడు, ఆశ్చర్యకరంగా వికెట్ కీపర్‌గా బంతితో రాణించాడు.
ఆఫ్ఘనిస్తాన్ నుండి నిష్క్రమించడం
[మార్చు]ఆఫ్ఘనిస్తాన్ వన్డే హోదా పొందిన కొద్దికాలానికే, జింబాబ్వే XI తో జరిగిన ఐసీసీ ఇంటర్ కాంటినెంటల్ కప్ మ్యాచ్ నుండి తన సోదరుడు హస్తి గుల్‌ను తొలగించడం పట్ల బాధపడ్డ సాదిక్ జాతీయ జట్టును విడిచిపెట్టాడు. జాతీయ కోచ్ కబీర్ ఖాన్ జట్టు ప్రయోజనాల కోసం వ్యవహరించడం లేదని ఆయన ఆరోపించాడు.[2]
రిటర్న్
[మార్చు]సాదిక్ అంతర్జాతీయ రిటైర్మెంట్ స్వల్పకాలికం, ఎందుకంటే ఆయన జనవరి 2010లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసి 19 & 1 పరుగులు చేశాడు.
ఆయన ఫిబ్రవరి 2010లో ఐర్లాండ్‌తో జరిగిన శ్రీలంక అసోసియేట్స్ టీ20 సిరీస్‌లో తన ట్వంటీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. సాదిక్ బంతితో 2/17 వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తరువాత, ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచ ట్వంటీ20 క్వాలిఫైయర్ విజేత జట్టులో కీలక సభ్యుడు. ఆ తరువాత ఆయన 2010 ఐసీసీ ప్రపంచ ట్వంటీ20 కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.[3]
ఆయన 2010 ఏసీసీ ట్రోఫీ ఎలైట్ విజేత ఆఫ్ఘనిస్తాన్ జట్టులో సాదిక్ కీలక సభ్యుడు, ఈ జట్టు ఫైనల్లో నేపాల్‌ను 95 పరుగుల తేడాతో ఓడించింది. సాదిక్ ఫైనల్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరపున అత్యధికంగా 58 పరుగులు చేశాడు. ఆయన టోర్నమెంట్‌లో ఆఫ్ఘనిస్తాన్ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 393 పరుగుల చేయగా ఆయన 92 బంతుల్లో 130 పరుగులు చేశాడు.
ఆయన తరువాత 2011-12లో ఫేసల్ బ్యాంక్ ట్వంటీ-20 కప్‌లో కొత్తగా ఏర్పడిన ఆఫ్ఘన్ చీతాస్ జట్టు తరపున ఆడాడు. ఆ తరువాత ఫిబ్రవరి 2012లో షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పాకిస్తాన్‌తో ఆడినప్పుడు పూర్తి సభ్య టెస్ట్ హోదా కలిగిన దేశంతో ఆఫ్ఘనిస్తాన్ మొదటి వన్డే ఇంటర్నేషనల్‌లో ఆడాడు. షాదిక్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో 40 పరుగులతో అత్యధిక స్కోరు సాధించాడు, ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో గెలిచింది.[4]
ఆయన సెప్టెంబర్ 2018లో ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ మొదటి ఎడిషన్‌లో కాందహార్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ staff, Cricinfo. "Cricinfo - Afghanistan's Karim Khan suspended for one match". content.cricinfo.com. Archived from the original on 2009-04-10. Retrieved 2025-12-31.
- ↑ "Historical Five-fer – quitting in protest". Archived from the original on 5 March 2012. Retrieved 31 March 2010.
- ↑ ICC World Twenty20 Afghanistan squad
- ↑ Sundar, Nitin (10 February 2012). "Afridi sets up victory against spirited Afghanistan". ESPNcricinfo. Retrieved 12 February 2012.
- ↑ "Afghanistan Premier League 2018 – All you need to know from the player draft". CricTracker. 10 September 2018. Retrieved 10 September 2018.
బయటి లింకులు
[మార్చు]- క్రిక్ఇన్ఫో లో కరీం సాదిక్ ప్రొఫైల్