కరెన్సీ ఫ్యూచర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:Foreign Exchange FX ఫ్యూచర్ లేదా విదేశీ మారక ఫ్యూచర్‌ గా (ఫారిన్ ఎక్స్ఛేంజ్ ఫ్యూచర్) కూడా గుర్తించే కరెన్సీ ఫ్యూచర్ అనేది ఒక ఫ్యూచర్స్ కాంట్రాక్టు, దీనిలో కొనుగోలు చేసిన తేదీన నిర్ణయించే ఒక ధరకు (మారకపు రేటు) భవిష్యత్‌లో ఒక నిర్ణీత తేదీన ఒక కరెన్సీని మరో కరెన్సీగా మారుస్తారు; ఫారిన్ ఎక్స్ఛేంజ్ డెరివేటివ్‌ను (విదేశీ మారక ఉత్పన్నం) చూడండి. ఎక్కువగా, దీనిలో ఒక కరెన్సీగా US డాలర్ ఉంటుంది. ఫ్యూచర్ యొక్క ధర తరువాత, US డాలర్ యూనిట్‌కు ఇతర కరెన్సీ మారకపు విలువపై ఆధారపడివుంటుంది. తక్షణ విదేశీ మారకపు విఫణుల్లో ధర పేర్కొనే ప్రామాణిక పద్ధతికి ఇది భిన్నంగా ఉంటుంది. ఆపై ప్రతి ఒప్పందం యొక్క ట్రేడ్ యూనిట్ ఒక నిర్దిష్ట ఇతర కరెన్సీ పరిమాణాన్ని కలిగివుంటుంది, ఉదాహరణకు €125,000. చివరి ట్రేడింగ్ (క్రయవిక్రయాలు) రోజు ముగిసేవరకు నిలిపివుంచే ఎక్కువ కాంట్రాక్టులకు భౌతిక సరఫరా ఉంటుంది, వాస్తవ చెల్లింపులను ప్రతి కరెన్సీలో చేస్తారు. ఇదిలా ఉంటే, ఎక్కువ ఒప్పందాలు దీనికి ముందుగానే ముగించడం జరుగుతుంది. ఒప్పందం యొక్క బట్వాడా తేదీ ముందుగా ఏ సమయంలోనైనా పెట్టుబడిదారులు ఒప్పందాన్ని ముగించవచ్చు.

చరిత్ర[మార్చు]

బంగారం ప్రమాణంతోపాటు నిర్ణీత మారకపు రేటుల పద్ధతిని నిలిపివేసిన ఏడాది తరువాత, మొదటిసారి చికాగో మర్చెంటైల్ ఎక్స్ఛేంజ్ (CME)లో 1972లో కరెన్సీ ఫ్యూచర్‌లు సృష్టించబడ్డాయి. నగదు విఫణిలో గణనీయమైన మార్పులు సంభవిస్తాయని ఊహించినప్పుడు, CMEలోని కొందరు సరుకు వ్యాపారులకు 1970వ దశకంలో బ్యాంకుల మారకపు విఫణుల్లోకి ప్రవేశం ఉండేది కాదు. దీంతో వారు అంతర్జాతీయ ద్రవ్య విఫణి (IMM)ని స్థాపించారు, మే 16, 1972న వారు ఏడు నగదు ఫ్యూచర్‌ల క్రయవిక్రయాలను (క్రయవిక్రయాలు) ప్రారంభించారు. ఇప్పుడు CMEలో IMM ఒక విభాగంగా ఉంది. 2009 నాలుగో త్రైమాసికంలో, CME గ్రూపు FX సగటు పరిమాణం రోజుకు 754,000 ఒప్పందాల వద్ద ఉంది, అంటే ఈ ఒప్పందాల క్రయవిక్రయాలు రోజుకు $100 బిలియన్‌ల సగటు జాతీయ విలువ కలిగివున్నాయి. ప్రస్తుతం ఈ ఒప్పందాల క్రయవిక్రయాలు వైద్యుత పద్ధతి (ఎలక్ట్రానిక్ విధానం)లో జరుగుతున్నాయి [1].

ప్రస్తుతం నగదు ఫ్యూచర్‌ల క్రయవిక్రయాలు జరుపుతున్న ఫ్యూచర్స్ ఎక్స్ఛేంజ్‌లు యూరోనెక్స్ట్.లైఫ్ [2], టోక్యో ఫైనాన్షియల్ ఎక్స్ఛేంజ్ [3] మరియు ఇంటర్‌కాంటినెంటల్ఎక్స్ఛేంజ్ [4].

పదాలు[మార్చు]

ఇతర ఫ్యూచర్‌లు మరియు ప్రత్యామ్నాయాలు మాదిరిగా, IMM తేదీలుగా పిలిచే సాంప్రదాయిక గడువు తేదీలు ఉన్నాయి, అవి మార్చి, జూన్, సెప్టెంబరు మరియు డిసెంబరు మాసాల్లో మూడో బుధవారం.

ఉపయోగాలు[మార్చు]

హెడ్జింగ్[మార్చు]

విదేశీ మారకపు నష్ట సంభావ్యత నుంచి రక్షణ కోసం పెట్టుబడిదారులు ఈ ఫ్యూచర్‌లను ఉపయోగిస్తారు. ఒక భవిష్యత్ తేదీన ఒక విదేశీ కరెన్సీలో పేర్కొన్న నగదును పెట్టుబడిదారు పొందడాటానికి సిద్ధపడినట్లయితే, గడువుతీరే రోజున నగదు ఫ్యూచర్‌ల స్థాయిని రద్దు చేయడం ద్వారా ఆ పెట్టుబడిదారు ప్రస్తుత నగదు మారకపు రేటును పొందవచ్చు.

డిసెంబరు 1వ తేదీన €1,000,000 పొందే జాన్ అనే ఒక US-కు చెందిన పెట్టుబడిదారును ఉదాహరణగా తీసుకుందాము. ఫ్యూచర్‌ల ద్వారా ప్రస్తుత మారకపు రేటు $1.2/€ వద్ద ఉంది. ఆమె డిసెంబరు 1వ తేదీన గడువుతీరే తన ఒప్పందాలను ఈ మారకపు రేటు వద్ద విక్రయించి €1,000,000 నగదు పొందవచ్చు. అంటే, గడువు సమయంలో మారకపు రేటులో హెచ్చుతగ్గులకు సంబంధం లేకుండా, ఆమెకు $1.2/€ మారకపు రేటు లభిస్తుంది.

సట్టా వ్యాపారం[మార్చు]

కరెన్సీ ఫ్యూచర్‌లను సట్టా వ్యాపారానికి కూడా ఉపయోగించవచ్చు, ఒక నష్ట భయాన్ని స్వీకరించడం ద్వారా, పెరుగుతున్న లేదా క్షీణిస్తున్న మారకపు రేట్ల నుంచి లాభాలు పొందే ప్రయత్నం చేయవచ్చు.

ఉదాహరణకు, పీటర్ సెప్టెంబరు 10న CME యూరో ఎఫ్ఎక్స్ ఫ్యూచర్‌లను $1.2713/€ వద్ద కొనుగోలు చేశాడనుకుందాము. ఈ రోజు ముగిసే సమయానికి, ఫ్యూచర్‌లు $1.2784/€ వద్ద ముగిశాయి. ధరలో మార్పు $0.0071/€. అతని వద్ద ఒక్కొక్కటి €125,000 విలువైన 10 కాంట్రాక్టులు ఉంటే, అతనికి $8,875 లాభం వస్తుంది. ఎటువంటి ఫ్యూచర్‌తోనైనా, ఇది అతనికి తక్షణమే చెల్లించబడుతుంది.

సాధారణంగా, ప్రతి $0.0001/€ మార్పుకు (కనీస సరుకు హెచ్చుతగ్గుల పరిమాణం), ప్రతి ఒప్పందానికి $12.50 లాభం లేదా నష్టం వస్తుంది.

వీటిని కూడా చూడండి[మార్చు]

  • ఆర్థిక అంశాల జాబితా
  • ఫార్వర్డ్ కాంట్రాక్ట్
  • విదేశీ మారక ఉత్పన్నం

సూచనలు[మార్చు]