కరెన్సీ సంకేతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కరెన్సీ సంకేతం అనేది ఒక దృశ్యమాపక చిహ్నం. దానిని తరచూ కరెన్సీ (ద్రవ్యం లేదా డబ్బు) పేరును సూచించడానికి సంక్షిప్తలిపిగా వాడుతుంటారు. అంతర్జాతీయంగా, కరెన్సీ సంకేతాలను ఆయా దేశాల్లో సాధారణంగా వాడుతున్నప్పటికీ, వాటికి బదులు ISO 4217 కోడ్లు ఉపయోగిస్తుంటారు. ప్రపంచంలోని పలు కరెన్సీలకు ప్రత్యేకమైన గుర్తంటూ లేదు.

అయితే అంతర్జాతీయ కరెన్సీలకు కరెన్సీ సంకేతం అనేది ప్రస్తుతం ఒక హోదా చిహ్నంగా అవతరించిన నేపథ్యంలో 2009లో భారతదేశం తన రూపాయి (ప్రస్తుతం దాని సూచిక Rs.)కి సంకేతం కోసం బహిరంగ పోటీ నిర్వహించింది. యూరో సంకేతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం ద్వారా యూరో కరెన్సీ కొంత వరకు విజయవంతమైనట్లు ఐరోపా సంఘం అభిప్రాయపడింది.[1]

వినియోగం[మార్చు]

కరెన్సీ (డబ్బు) మొత్తాలను రాసేటప్పుడు సంకేతం యొక్క స్థానం కరెన్సీని బట్టి మారుతుంటుంది. పలు కరెన్సీలు, ప్రత్యేకించి లాటిన్ అమెరికా మరియు ఆంగ్లం మాట్లాడే ప్రపంచ దేశాల్లో సంకేతాన్ని డబ్బు మొత్తానికి పూర్వ భాగంలో (ఉదాహరణకు, £50.00 ) రాస్తారు. మరికొన్ని దేశాలు డబ్బు మొత్తం విలువకు ఆవల (ఉదాహరణకు, 50.00 S₣ ) చూపిస్తారు. పోర్చుగల్ ఎస్కుడో మరియు ఫ్రాన్స్ ఫ్రాంక్‌లు రద్దవడానికి ముందు కరెన్సీ సంకేతాలను వాటి దశాంస స్థానం వద్ద (ఉదాహరణకు, 50$00 లేదా 12₣34 ) చూపించేవారు. జాతీయ ప్రమాణం లేని నేపథ్యంలో ఉపయోగిస్తున్న ప్రామాణిక ఐరోపా సంకేతం (€). దీనిని ద్రవ్య మొత్తానికి పూర్వ భాగంలో వాడుతారు. అయితే పలు యూరోజోన్ (యూరో చెలామణి దేశాలు) దేశాలకు ఆధార లేదా ఉత్పాదక ప్రత్యామ్నాయ నిబంధనలు ఉన్నాయి.

దశాంస విభాగిణి (వేరుచేసే ప్రమాణం) స్థానిక దేశాల ప్రమాణాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఉదాహరణకు, యునైటెడ్ కింగ్‌డమ్ తరచూ ధరల స్టిక్కర్లపై మధ్య చుక్కను దశాంస స్థానంగా (ఉదాహరణకు,'£5·52')వాడుతుంటుంది. అయితే అది ముద్రణలో కనిపించదు. ఇతర దేశాల్లో కామా (ఉదాహరణకు, '5,00 €')ను ఒక సాధారణ విభాగిణిగా వాడతారు. అంతర్జాతీయ ప్రమాణాల సమాచారానికి వాడే దశాంస విభాగిణిని చూడండి.

రూపకల్పన[మార్చు]

పురాతన కరెన్సీ సంకేతాలు అంతకుముందున్న కరెన్సీల నుంచి మెల్లగా వెలుగులోకి వచ్చాయి. డాలర్/పెసో సంకేతం అనేది స్పెయిన్ డాలర్ నుంచి పుట్టిందని భావిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో 8 అనేది ఎనిమిదిలోని ఒక భాగాన్ని మాత్రమే సూచిస్తుంది. అదే విధంగా, పౌండ్/లిరా సంకేతం లిబ్రమ్‌ లోని L నుంచి జనించిందని అంటుంటారు. లిబ్రమ్ అనేది బరువును తెలిపేందుకు వాడే లాటిన్ పదం. కొత్తగా వెలుగులోకి వచ్చిన కరెన్సీలు మరియు కొత్త సంకేతాలను పొందిన కరెన్సీలు వాటి దత్తు స్వీకర్త (ఇక్కడ దేశం) యొక్క ప్రతీకవాదానికి దగ్గరగా ఉంటాయి. యూరో సంకేతం ఐరోపా నాగరికత, ఐరోపా మరియు స్థిరత్వాన్ని తెలిపే విధంగా ఉండగా, భారతదేశం భారతీయ సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఉండే ఒక సంకేతం కోసం ఎదురుచూస్తోంది.[1]

మరోవైపు వ్యాపార వర్గం (యూరోకు స్థిరత్వాన్ని తెలిపే రెండు రేఖలున్నాయి)ను అర్థం చేసుకోవడం మరియు సంకేతం కంప్యూటర్‌లో ఏ విధంగా చూపించబడుతుంది వంటి ఇతర విషయాలు కూడా ఉన్నాయి. కొత్తగా వాడనున్న ఒక సంకేతానికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయాలి. అలాగే గుర్తులను టైపు చేయడానికి కీబోర్డులను మార్చడం లేదా షార్ట్‌కట్‌లను చేర్చాలి. యూరో సంకేతం ఏ విధంగా కనిపించాలనే[1] దానిపై దృష్టి సారించలేదంటూ EU విమర్శలు ఎదుర్కొంటోంది (అది ఒక అసాధారణమైన రీతిలో విస్తృతంగా కూడా ఉంది. అంటే దానికి సంబంధించిన అత్యధిక దృశ్యాలు కుదించిన వెడల్పుతో మార్పిడి చేసిన వెర్షన్ల వలే ఉన్నాయి).

ఉదాహరణలు:[మార్చు]

వాడుకలో ఉన్న కరెన్సీ సంకేతాలు[6].7.

గతంలో వాడిన కరెన్సీ సంకేతాలు[మార్చు]

అని రాస్తుంటారు], మరియు ప్రస్తుతం CFA మరియు CFP ఫ్రాంక్ ప్రాంతాల్లో వాడుతున్నారు)

మూస:Currency signs

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 వెస్ట్‌కాట్, K. (2009) ఇండియా సీక్స్ రూపీ స్టేటస్ సింబల్, BBC 10 మార్చి 2009, 1 సెప్టెంబరు 2009న అందుబాటులోకి వచ్చింది.