కరోలిన్ దీవులు
| Native name: Islas Carolinas Nickname: New Philippines | |
|---|---|
Map of the Caroline Islands within the Federated States of Micronesia (Palauan islands not shown) | |
![]() Location of Caroline Islands in the Pacific | |
| భూగోళశాస్త్రం | |
| ప్రదేశం | Western Pacific Ocean |
| అక్షాంశ,రేఖాంశాలు | 7°N 147°E / 7°N 147°E |
| ద్వీపసమూహం | Micronesia |
| ప్రక్కన గల జలాశయాలు | Pacific Ocean |
| మొత్తం ద్వీపాలు | 963 |
| ముఖ్యమైన ద్వీపాలు | Yap, Chuuk, Pohnpei, Kosrae, Palau |
| విస్తీర్ణం | 1,300 km2 (500 sq mi) |
| పొడవు | 3,540 km (2,200 mi) |
| అత్యధిక ఎత్తు | 791 m (2,595 ft) |
| ఎత్తైన పర్వతం | Dolohmwar, Pohnpei |
| నిర్వహణ | |
Federated States of Micronesia and Palau | |
| జనాభా వివరాలు | |
| Demonym | Carolinian |
| జనాభా | 125,000 (2024) |
| భాషలు | Micronesian languages, English |
| జాతి సమూహాలు | Micronesian, Filipino, Japanese |
| అదనపు సమాచారం | |
| సమయం జోన్ |
|
| Area and population estimates include Federated States of Micronesia and Palau | |


కరోలిన్ దీవులు అనేవి పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో, న్యూ గినియాకు ఉత్తరాన విస్తరించి ఉన్న అనేక చిన్న ద్వీపాల సమూహం. రాజకీయంగా ఈ ద్వీప సమూహం మధ్య, తూర్పు భాగాలలో ఉన్న ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రొనేషియా (ఎఫ్‌ఎస్‌ఎమ్) పరిధిలోనూ, అత్యంత పశ్చిమ చివరన ఉన్న పాలౌ పరిధిలోనూ విభజించబడి ఉంది. చారిత్రకంగా ఈ ప్రాంతాన్ని న్యూవాసు ఫిలిప్పీన్సు లేదా న్యూ ఫిలిప్పీన్సు అని కూడా పిలిచేవారు.[1] ఎందుకంటే ఇవి స్పానిషు ఈస్టు ఇండీసులో భాగంగా ఉండి ఫిలిప్పీన్స్ లోని మనిలా నుండి పరిపాలించబడేవి. కరోలిను దీవులు, పలౌలోని అత్యంత పశ్చిమ ద్వీపమైన టోబి నుండి, ఎఫ్‌ఎస్‌ఎం (మైక్రోనేషియా సమాఖ్య రాష్ట్రాలు) లోని ఒక రాష్ట్రమైన అత్యంత తూర్పు ద్వీపం కొస్రయె వరకు సుమారు 3,540 కిమీ(2,200 మై(1,910 నా.మై) దూరం మేర విస్తరించి ఉన్నాయి.[2]
వివరణ
[మార్చు]ఈ దీవుల సమూహం పసిఫికు మహాసముద్రంలో ఫిలిప్పీన్స్కు తూర్పున సుమారు 500 చిన్న పగడపు దీవులను కలిగి ఉంది. యాప్ (పెద్ద కరోలిన్ దీవులలో ఒకటి) నుండి మనీలా వరకు ఉన్న దూరం 1,200 మై(1,900 కిమీ).
ఈ దీవులలో చాలా వరకు సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉండే చదునైన పగడపు దిబ్బలతో (పగడపు దీవులు) ఏర్పడి ఉన్నాయి; అయితే సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండే కొన్ని దీవులు కూడా ఇక్కడ ఉన్నాయి.[3]
కరోలిన్ దీవులు
[మార్చు]కరొలిన్ దీవుల సమూహంలో భాగమైన కొన్ని ముఖ్యమైన దీవులు ఇవి: యాప్, చుక్ (ట్రక్), ఫొన్పీ, కోస్రే, బాబెల్డాబు, సతావాల్, కపింగమరంగి, నుక్వోరు, ఫైచుకు, నమోనుయిటొ, హాల్ దీవులు, నొమొయి దీవులు, వెనొ, రుమంగు, మాప్, కనిఫే, న్గులు, నెట్, పింజిలాప్, లెలు.
ప్రజలు - సంస్కృతి
[మార్చు]

ఈ ప్రాంతపు స్థానిక నివాసులు వివిధ రకాల భాషలను మాట్లాడతారు. వీటిలో మైక్రోనేషియన్ భాషలైన పొహ్నుపెయిన్, చుకెసె, కరోలినియన్, కోస్రేయన్; పశ్చిమ మలయో-పాలినిషియన్ భాషలైన పలుయాను,చమొరొ; అలాగే వర్గీకరించబడని భాష అయిన యాపెసె (బహుశా ఇది అడ్మిరల్టీ దీవుల భాషలలో ఒకటి కావచ్చు) ఉన్నాయి. స్థానికేతర జాతులకు చెందిన ఇతర భాషలు మాట్లాడే నివాసులు కూడా ఇక్కడ గణనీయమైన సంఖ్యలో ఉన్నారు; వీరిలో ఫిలిప్పీన్స్ ప్రజలు, జపాన్ ప్రజలు ముఖ్యులు. ఒకే భాష మాట్లాడని దీవుల నివాసుల మధ్య వాణిజ్య, వ్యాపార వ్యవహారాల కోసం ( ఉమ్మడి భాషగా) ఆంగ్లం ఉపయోగించబడుతుంది.
ఈ దీవుల స్థానిక ప్రజలు ప్రధానంగా తోటల ఉత్పత్తులు, చేపలు, అనేక రకాల అరటిపండ్లు, టారో (దీనిలో "చిత్తడి నేల" లేదా "ఊదా" రకాలు) వంటి ఆహార పదార్థాల మీద ఆధారపడి జీవిస్తారు. కొన్ని దీవులలో గృహనిర్మాణానికి ఇప్పటికీ కొబ్బరి ఆకుల కప్పుల వంటి స్థానిక పదార్థాలనే ఉపయోగిస్తారు. శతాబ్దాలుగా సాగిన మిషనరీ కార్యకలాపాల ఫలితంగా క్రైస్తవ మతం మైక్రోనేషియా ప్రాంతంలో అత్యంత విస్తృతంగా ఆచరించబడే మతంగా మారింది. స్థానిక ప్రజలలో చాలామంది "యలాఫరు" అనే సర్వోన్నత దైవం, "కాన్" అనే దుష్టశక్తి మీద ఉన్న సంప్రదాయ విశ్వాసాలను పాటిస్తారు. అయితే చాలా వరకు వారు సంప్రదాయ మతపరమైన ఆచారాలలో పాల్గొనరు.
యాప్ ద్వీప నివాసులు ఒక అసాధారణమైన కరెన్సీని కలిగి ఉండటం ద్వారా ప్రసిద్ధి చెందారు. సాధారణ గవ్వల కరెన్సీతో పాటు అక్కడ ఒక రకమైన రాతి కరెన్సీ కూడా వాడుకలో ఉంది; ఇది 6 అంగుళాల నుండి 12 అడుగుల వ్యాసం కలిగిన దాదాపు 5 టన్నుల వరకు బరువు ఉండే భారీ కాల్సైటు లేదా సున్నపురాయి చక్రాలు లేదా పలకల రూపంలో ఉంటుంది. ఈ రాళ్లన్నింటినీ దక్షిణ దిశలో 200 మైళ్ల దూరంలో ఉన్న ( పెలేవ్) దీవులలో తవ్వి తీస్తారు; వీటిని స్థానిక పడవలు లేదా తెప్పల ద్వారా ఇక్కడికి తీసుకువచ్చి ఉంటారని భావిస్తున్నారు. ఆ తర్వాతి కాలంలో వీటిని యూరోపియను నౌకల ద్వారా రవాణా చేశారు. డబ్బు కంటే ఒక టోకెన్లుగా పరిగణించబడే ఈ రాళ్లు, చేతులు మారవు (చలామణిలో ఉండవు); బదులుగా వీటిని ఆయా నాయకుల ఖజానా గృహాల చుట్టూ పోగు చేసి ఉంచుతారు. అలాగే వీటిని సామూహిక ఆస్తిగా పరిగణిస్తున్నట్లు కనిపిస్తుంది.కొన్ని రాళ్లు ఏళ్ల తరబడి ఎవరికీ కనిపించకపోయినా సరే ఆ రాయికి ఇప్పుడు కొత్త యజమాని వచ్చాడనే పరస్పర అవగాహన ద్వారా సంపద బదిలీ ప్రక్రియ సులభతరం అవుతుంది. [4]
మైక్రోనేషియా నావికుడు మౌ (1932–2010) స్వతహాగా కరోలినియను ద్వీపమైన సతవాలుకు చెందినవాడు. ఇతర సంప్రదాయ నావిగేషను పద్ధతులు (కరోలినియను ద్వీపాల దూరస్థత కారణంగా పాక్షికంగా) మరుగున పడిపోయిన తర్వాత కూడా భద్రపరచబడిన వెరియెంగు సంప్రదాయ నావిగేషను పద్ధతులను ఆయన నేర్చుకున్నారు. 1970వ దశకంలో మౌ తన జ్ఞానాన్ని పాలినేషియన్ వాయేజింగు సభ్యులతో సభ్యులతో పంచుకున్నారు. ఇది సంప్రదాయ పాలినిషియను నావిగేషను పద్ధతుల పునరుద్ధరణకు దారితీసింది. అంతేకాక మానవశాస్త్రవేత్తలకు పాలినిషియను, మైక్రోనేషియను ప్రజల చరిత్ర మీద మరింత లోతైన అవగాహనను కల్పించింది.[5]
1985లో కరోలిను దీవులలో ఉపయోగించే నక్షత్ర ఆధారిత దిక్సూచి మూలాలను పరిశీలిస్తూ ఒక అధ్యయనం ప్రచురించబడింది. [6]
చరిత్ర
[మార్చు]కరోలిన్సు దీవులలోని వివిధ ద్వీపాలు తమ ప్రజల మూలాలు, తొలి చరిత్రలకు సంబంధించి భిన్నమైన గాథలను తరతరాలుగా భద్రపరుస్తూ వచ్చాయి. ఉదాహరణకు పొహ్నుపీ ద్వీపంలో స్థానికులు వలస పాలనకు పూర్వపు తమ చరిత్రను మూడు యుగాలుగా విభజించి వివరిస్తారు: అవి నిర్మాణ లేదా జనావాస యుగం; (సా.శ. 1100కు పూర్వం); సాడెలూర్ల పాలన కాలం, (సుమారు 1100 నుండి 1628 వరకు); సాడెలూర్ల యుగం సుమారు 500 సంవత్సరాల పాటు కొనసాగింది. పురాణాల ప్రకారం వారి పతనం సాధారణంగా 1500ల కాలంలో సంభవించిందని భావిస్తారు. [7]అయితే పురావస్తు శాస్త్రవేత్తలు సౌడెలూరు శిథిలాల కాలాన్ని సుమారు క్రీ.శ. 1628గా నిర్ధారించారు. [note 1] వెహిను గిరిజన నాయకుల యుగం; సుమారు 1628 నుండి 1885 వరకు అంటే స్పెయిను ఈ ద్వీపాలను వలస పాలనలోకి తీసుకునేంత వరకు ఉన్న కాలం). [8][10]
పొహ్నుపీ పురాణాల ప్రకారం: సౌడెలూరు పాలకుల మూలాలు ద్వీపాల ఆవల ఉన్నాయి; పొహ్నుపీకి పరిపాలనా వ్యవస్థను పరిచయం చేసిన మొట్టమొదటి వారు వారే; వారు ద్వీపవాసుల మీద సంపూర్ణ, కేంద్రీకృత పాలనను రుద్దారు—శతాబ్దాలు గడిచేకొద్దీ ఈ పాలన మరింత అణచివేతపూరితంగా మారింది; అంతేకాక వారి ఏకపక్ష, భారమైన డిమాండ్లు, పొహ్నుపీ దేవతలకు వ్యతిరేకంగా వారు చేసిన అపచారాలతో కలిసి, పొహ్నుపీ ప్రజల మనస్సులలో తీవ్ర అసంతృప్తిని రగిలించాయి. మరొక విదేశీయుడైన ఐసొకెలెకలు ఈ ద్వీపాల మీద దండెత్తి సౌడెలూరు పాలకులను పదవీచ్యుతులను చేసి మరింత వికేంద్రీకృతమైన గిరిజన నాయకత్వ వ్యవస్థను ప్రవేశపెట్టడంతో సౌడెలూరు వంశపాలన అంతమైందని ఒక ఐతిహ్యం ప్రచారంలో ఉంది (ఈ వ్యవస్థ తర్వాతి వలస పాలన కాలంలో కూడా కొనసాగింది. నేటికీ ఉనికిలో ఉంది).[12][13] [14]

స్పానిషు విదేశీ ప్రావిన్సు
[మార్చు]
కరోలిను దీవులతో యూరోపియను అన్వేషకులకు ఏర్పడిన మొట్టమొదటి పరిచయం 1525లో జరిగింది. ఆ సమయంలో ఒక వేసవి తుఫాను, పోర్చుగీసు నావికులు డియాగొ డా రోచా, గోంసు డీ సెక్యుయేరా లను మొలుక్కాసు నుండి ( సెలెబెసు మీదుగా) తూర్పు దిశగా కొట్టుకుపోయేలా చేసింది. వారు చివరికి కరోలిను దీవులలోని కొన్నింటిని చేరుకుని 1526 జనవరి 20 వరకు అక్కడ కొన్ని నెలల పాటు బస చేశారు.[15] ఆ వెంటనే 1526 ఆగస్టు 22న స్పానిషు అన్వేషకులు టోరిబియో అలోన్సో డి సలాజారు, డియెగో డి సావెడ్రా ఈ ప్రాంతానికి చేరుకుని ( శాన్ బార్టోలోం దీవిని (టయోగుయి) చూసినట్లు నమోదు చేశారు. సుమారు 8 నెలల తర్వాత 1528 జనవరి 1న అన్వేషకుడు ఆల్వారో డి సావెద్రా సెరోను, స్పానిష్ రాజు తరపున ఉలితి దీవుల యాజమాన్యాన్ని ప్రకటించుకున్నారు. తన పోషకుడి గౌరవార్థం, అలాగే రాబోయే కాథలికు పండుగ అయిన ఎపిఫనీ సందర్భంగా గౌరవించబడే ముగ్గురు జ్ఞానుల స్మృత్యర్థం, ఆయన ఆ దీవులకు రాజుల దీవులు స్పానిషు:ఐసిల్స్ డీ లాస్ రాయెస్;ఐలేసు డెస్ రాహిసు) అని పేరు పెట్టారు. స్పానిషు అన్వేషకులు 1542 (మటెలొటెసు దీవులు), 1543, 1545 సంవత్సరాలలో ఈ ద్వీపసమూహాన్ని తిరిగి సందర్శించారు. 1565లో ఫిలిప్పీన్సు మొదటి గవర్నరు-జనరలు అయిన మిక్యుయలు లోపెజ్ డీ లెగాజ్పీ (1565 నుండి 1572 వరకు పదవిలో ఉన్నారు) ఈ దీవులను క్లుప్తంగా సందర్శించారు.[16]
1686లో ఫ్రాంసిస్కొ డీ లెజ్కానో 'యాప్' దీవికి చేరుకునేంత వరకు యూరోపియన్లు మళ్ళీ ఈ దీవులను సందర్శించలేదు. స్పెయిను రాజు 2వ చార్లెసు గౌరవార్థం ఆయన ఈ దీవులకు లాస్ కరోలిన్ అని పేరు పెట్టారు.[3] ఈ పేరు తర్వాతి కాలంలో పాలౌ దీవులకు, అలాగే ఒక శతాబ్దం తర్వాత (1788, 1799 మధ్య) సందర్శించిన బ్రిటిషు అన్వేషకులు గిల్బర్టు దీవులు, మార్షల్ దీవులు అని పిలిచిన ఇతర ద్వీపసమూహాలకు కూడా విస్తరించబడింది (నేటికీ స్పానిషు వారు కరోలిను దీవులను ఇస్లాస్ డీ లాస్ హర్మనాసు, హోంబ్రెసు పింటాడోసు,లాస్ జార్డినెసు అని పిలుస్తారు).
1707 అక్టోబరు 19న జారీ చేయబడిన ఒక స్పానిషు రాజ శాసనం కరోలిను దీవులకు అనేక యాత్రలు చేపట్టడానికి స్పానిషు మిషనరీలకు అధికారం కల్పించింది. అయితే 1731లో అటువంటి మిషనరీలలో ఒకరైన జుయాన్ అంటానియొ కాంటోవా హత్యకు గురయ్యారు. ఫలితంగా స్పెయిను కరోలిను దీవులతో తన సంబంధాలను తెంచుకుంది. వారు 1787లో సంబంధాలను పునఃప్రారంభించినప్పుడు వారి దృష్టి వాణిజ్యం మీద ఉంది. [17]
1852లో కోయెల్లో అనే ఒక స్పానిషు కల్నలు కరోలిను దీవులను స్పానిషు ప్రభుత్వం సమర్థవంతంగా ఆక్రమించుకోవడం ద్వారా ఫిలిప్పీన్సు, ఆస్ట్రేలియా, న్యూ గినియా, అమెరికా ఖండాలతో వాణిజ్యం, వ్యాపారం సాగించడానికి వీలవుతుందని స్పానిషు ప్రభుత్వానికి సూచించారు. మొదట్లో ఆయన సూచనను విస్మరించినప్పటికీ 1885లో బుట్రాను అనే స్పానిషు ప్రభుత్వ ప్రతినిధి కొరోరు, ఆర్టింగలు ప్రాంతాల గిరిజన నాయకులతో ఒక ఒప్పందం కుదుర్చుకుని కరోలిను దీవుల మీద స్పానిషు సార్వభౌమాధికారాన్ని స్థాపించారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో జరిగే వాణిజ్య లావాదేవీల మీద కస్టమ్సు సుంకాలు విధించడానికి స్పెయిను ప్రయత్నించింది. అయితే స్పెయిను గతంలో ఈ దీవులను విస్మరించడం వలన అక్కడ జర్మనీ, బ్రిటిషు మిషన్లు (కేంద్రాలు) ఏర్పడటానికి అవకాశం కలిగింది; దీనితో జర్మనీ, యునైటెడు కింగ్‌డమ్ దేశాలు, కస్టమ్సు ఆదాయాన్ని వసూలు చేసే స్పెయిను హక్కును సవాలు చేస్తూ వివాదం లేవనెత్తాయి. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి యూరోపియను శక్తులు పోప్ 13వ లియోని మధ్యవర్తిగా ఆశ్రయించాయి. 164వ తూర్పు రేఖాంశానికి పశ్చిమాన ఉన్న దీవుల మీద స్పెయినుకు, మార్షలు దీవుల మీద జర్మనీకి ఈ హక్కులు ఉంటాయని ఆయన తీర్పు ఇచ్చారు. (కరోలిను దీవులలో ఒకదానిలో నౌకాదళ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే హక్కును కూడా ఆయన జర్మనీకి కల్పించారు. కానీ జర్మనీ ఆ హక్కును ఎప్పుడూ వినియోగించుకోలేదు.)[18]
1898 నాటి స్పానిషు-అమెరికను యుద్ధం ముగిసిన తర్వాత 1899 నాటి జర్మనీ-స్పానిషు ఒప్పందం ద్వారా స్పెయిను కరోలిను దీవులను, ఉత్తర మరియానా దీవులను జర్మనీ సామ్రాజ్యానికి విక్రయించింది. ఈ విక్రయం విలువ 25 మిలియన్ల స్పానిషు పెసెటాలు (ఇది 17 మిలియన్ల జర్మనీ బంగారు మార్కులకు లేదా దాదాపు ఒక మిలియను పౌండ్ల స్టెర్లింగుకు సమానం);[3] అయితే ఆ ప్రాంతంలో బొగ్గు గనిని ఏర్పాటు చేసుకునే హక్కును మాత్రం స్పెయిను తన వద్దే ఉంచుకుంది. జర్మనీ ఈ దీవుల సమూహాన్ని 'కరోలినెను' పేరుతో పరిపాలించింది. పరిపాలనాపరంగా దీనిని జర్మనీ న్యూ గినియాతో అనుసంధానించింది.
తిమింగల వేటగాళ్లకు ఒక ఆశ్రయం
[మార్చు]19వ శతాబ్దంలో తిమింగల వేట నౌకలకు ఈ ద్వీపాలు ఒక ప్రసిద్ధ ఆశ్రయంగా ఉండేవి. ఈ ద్వీపాలను సందర్శించినట్లుగా తెలిసిన మొట్టమొదటి నౌక లండనుకు చెందిన తిమింగల వేట నౌక బ్రిటానియా; ఇది 1793 డిసెంబరులో న్గాటిక్ వద్ద లంగరు వేసింది. బ్రిటను, అమెరికా, ఆస్ట్రేలియా, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ఇటువంటి నౌకలు—నీరు, కలప, ఆహారం కోసం, అలాగే కొన్నిసార్లు నౌకలలో సిబ్బందిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తుల కోసం ఇక్కడికి వచ్చేవి. ఈ నౌకలు వాణిజ్యాన్ని ప్రోత్సహించాయి. మార్పుకు (మంచి, చెడు రెండింటికీ) ముఖ్యమైన వాహకాలుగా నిలిచాయి. ఈ ద్వీపాలలో అత్యధికంగా సందర్శించబడినవి కోస్రే,మోకిల్,న్గాటిక్,పింగెలపు, పోన్‌పే.
జపనీస్ వలస పాలన
[మార్చు]మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ వలస ప్రాంతాలను ఆక్రమించుకునే తమ పోరాటంలో భాగంగా 1914లో జపాన్ ఈ ద్వీపాల మీద దండెత్తి వాటిని ఆక్రమించుకుంది. ఈ ఆక్రమణలో భాగంగా వారు రెండు నావికా దళ స్క్వాడ్రనులను ఇక్కడ మోహరించారు. పశ్చిమ కరోలిను దీవులు, రియరు అడ్మిరలు మాట్సుమురా టాట్సుయొ (1868–1932) నేతృత్వంలోని దళం నియంత్రణలో ఉండేవి; కాగా తూర్పు కరోలిను దీవులు వైసు అడ్మిరలు యమయా టానిను (1866–1940) నియంత్రణలో ఉండేవి. 1920లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత కరోలిను, మార్షలు దీవులను పాలించేందుకు జపాన్‌కు నానాజాతి సమితి నుండి ఒక ఆదేశం లభించింది.[19] రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ ట్రక్ లగూన్ వద్ద ఒక భారీ సైనిక స్థావరాన్ని నిర్వహించింది; ఆగ్నేయ పసిఫికు ప్రాంతంలో తన విస్తరణ కార్యకలాపాల కోసం జపాన్ దీనిని ఉపయోగించుకుంది. ఆ యుద్ధం చివరి దశలలో జపాన్ దళాలు తమ స్వదేశీ దీవులకు వెనక్కి మళ్లుతున్న సమయంలో మిత్రరాజ్యాల దళాలు 'ఆపరేషను హెయిలుస్టోను' ద్వారా ట్రక్ స్థావరాన్ని సమర్థవంతంగా నిర్వీర్యం చేశాయి. యుద్ధానంతరం ఈ దీవులు (మార్షలు దీవులతో కలిపి) అమెరికా సంయుక్త రాష్ట్రాల ఆధ్వర్యంలోని ట్రస్ట్ భూభాగాలుగా మారాయి. మైక్రోనేషియా సమాఖ్య రాష్ట్రాలు 1986లో స్వాతంత్ర్యం పొందగా ఆ తర్వాత 1994లో పలౌ స్వాతంత్ర్యం సాధించింది.
వలస పాలకులు లేదా అధికారులు
[మార్చు]
జిల్లా అధికారులు (1889 నుండి వీరిని జిల్లా అధికారులు ( బెజిర్క్సం ట్ల్యూటె )అని వ్యవహరించేవారు):
పశ్చిమ కరోలిను దీవులలో (యాప్, పలౌ, 1907 నుండి సైపాను)
- 1886 జూన్ 29 – 18?? మాన్యువలు డి ఎలిసా
- 1897 నవంబరు కి ముందు – 1898 నవంబరు తర్వాత, S. కోర్టెసు
- 1899–1909, ఆర్నో సెన్‌ఫ్ట్ (జననం: 1864 – మరణం: 1909)
- 1909–19??, రుడాల్ఫు కార్లోవా
- 1909–1910, జార్జి ఫ్రిట్జు
- 1910–1911, హెర్మను కెర్స్టింగు
- 1911–1914, బామర్టు
తూర్పు కరోలిను దీవులలో (పొనాపే, 1911 నుండి మార్షల్ దీవులతో కలిపి)
- 1886 జూన్ – 1887 కాప్రిలెసు
- 1887 మార్చి 14 – 1887 ఇసిడ్రో పొసాడిల్లో (మరణం: 1887)
- 1887 అక్టోబరు – 1891 జనవరి లూయిసు కాడార్సో వై రే (మరణం: 1898)
- 1894 సుమారు, కొంచా
- 1897 నవంబరుకి ముందు – 1898 నవంబరు తర్వాత, J. ఫెర్నాండెజు డి కోర్డోబా
- 1899 అక్టోబరు 12 – 1901 ఆగస్టు , ఆల్బర్టు హాలు (జననం: 1868 – మరణం: 1945)
- 1901 సెప్టెంబరు 1 – 1907 ఏప్రిల్ 30, విక్టరు బెర్గు (జననం: 1861 – డి. 1907)
- 1907–198?, మాక్సు గిర్ష్నరు (నటన)
- 1908–1909 జార్జి ఫ్రిట్జు
- 1909 – 18 1910 అక్టోబరు గుస్తావు బోడెరు (మ. 1910)
- 1910 – 7 1914 అక్టోబరు ఆగస్టు ఉబెరుహార్స్టు
మతసంబంధ చరిత్ర
[మార్చు]1731లో జువాను ఆంటోనియో కాంటోవా (జాన్ ఆంథోనీ కాంటోవా అని కూడా పిలుస్తారు) విక్టరు వాల్టరు అనే ఇద్దరు జెసూయిట్లు అక్కడ మిషనరీ పని చేయడానికి ప్రయత్నించారు; వారిలో మొదటి వ్యక్తి త్వరలోనే హత్య చేయబడ్డాడు, రెండవ వ్యక్తి పారిపోవలసి వచ్చింది. ఆ తర్వాత మరో ఇద్దరు జెసూయిట్లు కూడా చంపబడ్డారు. 1767లో స్పానిషు అధీనంలో జెసూయిట్లను అణచివేశారు. తరువాతి 120 సంవత్సరాల పాటు ఆ ద్వీపాలలో ఏ మిషనరీ జాడ కూడా కనబడలేదు.[20]
కరోలైన్సు ద్వీపాల స్వాధీనం మీద 1886లో జర్మనీ, స్పెయిను మధ్య తలెత్తిన వివాదాన్ని పోప్ 13వ లియో స్పెయినుకు అనుకూలంగా పరిష్కరించిన తర్వాత స్పెయిను రాజు స్పానిషు కాపుచిన్సును ఆ ద్వీపాలకు వెళ్ళమని ఆదేశించాడు. 1886 మార్చి 15న రాజ శాసనం జారీ చేయబడింది. ప్రొపగాండా ఫైడు 1886 మే 15న ఆ మిషనును అధికారికంగా స్థాపించి దానిని వెస్టు కరోలిన్సు, ఈస్టు కరోలిన్సు అనే రెండు విభాగాలుగా విభజించింది. అప్పటి వరకు ఆ ద్వీపాలు మతపరంగా వికారియేటు అపోస్టోలికు ఆఫ్ మైక్రోనేషియాకు చెందినవిగా ఉన్నాయి. స్పానిషు కాపుచినులు పోనాపే భాషలో ఒక కాటెకిజం ప్రార్థన పుస్తకాన్ని ముద్రించారు. 1890లో వాలెంటియాకు చెందిన ఫాదరు ఆంథోనీ యాప్ భాషకు ఒక చిన్న వ్యాకరణం, నిఘంటువును రాశారు.
1899లో స్పానిషు పూజారులు మిషనుకు పునాదులు వేసిన తర్వాత ఆ ద్వీపాలు కొనుగోలు ద్వారా జర్మనీ చేతులలోకి వెళ్ళాయి. స్పెయిను ఆ మిషను కోసం సంవత్సరానికి $5,000 కంటే ఎక్కువ విరాళం ఇచ్చింది. కానీ జర్మనీ ఎటువంటి మద్దతు ఇవ్వలేదు. స్పెయిను స్థానిక ప్రజలను వారి పిల్లలను పాఠశాలకు పంపమని బలవంతం చేసింది; జర్మనీ ప్రజలకు తమ పిల్లలను పంపాలా వద్దా అని ఎంచుకునే స్వేచ్ఛను ఇచ్చింది. దాని ఫలితంగా చాలా మంది చర్చికి వెళ్లడం, తమ పిల్లలను పాఠశాలకు పంపడం మానేశారు. మిషను ప్రాభవం దెబ్బతింది. దీనికి ప్రతిస్పందనగా ప్రొపగాండా ఫైడు 1904 నవంబరు 7న స్పానిషు కాపుచినుల స్థానంలో జర్మనీ మిషనరీలను నియమించాలని 1905 డిసెంబరు 18న రెండు వేర్వేరు మిషన్ల స్థానంలో ఒకే అపోస్టోలికు ప్రిఫెక్చరును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ సమయంలో జర్మనీలోని ప్రిచాటల్కు చెందిన అత్యంత గౌరవనీయులైన ఫాదరు వెనాంటియసు మొట్టమొదటి అపోస్టోలికు ప్రిఫెక్టుగా నియమితులయ్యారు.[20]
1906లో 24 మంది మిషనరీలు (12 మంది ఫాదర్లు, 12 మంది బ్రదర్లు) 13 కేంద్రాలలో పనిచేస్తుండగా పలువురు సెయింటు ఫ్రాన్సిసు సిస్టర్సు 10 ప్రాథమిక పాఠశాలల బాధ్యతలను స్వీకరించడానికి లక్సెంబర్గు నుండి బయలుదేరారు; ఈ పాఠశాలలలో మొత్తం 262 మంది పిల్లలు చేరారు. ఆ సంవత్సరంలో 90 మంది వయోజనులు క్రైస్తవ మతంలోకి మారారని ఆ మిషనరీలు సగర్వంగా ప్రకటించారు. అలాగే అక్కడ 1900 మంది కాథలిక్కులు, కొద్దిమంది ప్రొటెస్టెంట్లు, క్రైస్తవ మతంలోకి మారని 11,600 మంది నివాసులు ఉన్నారని వారు నివేదించారు.
1905 జూలై 1న యునైటెడ్ స్టేట్సు ప్రభుత్వం యాప్ ద్వీపంలో ఒక వాతావరణ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మనీలా అబ్జర్వేటరీ నుండి ఒక జెసూయిటు ఫాదరును పంపింది; ఆ కేంద్రానికి కాపుచిను ఫాదరు కాలిస్టసును డైరెక్టరుగా నియమించింది. తూర్పు ఆసియా తుఫానులు కరోలైను దీవుల ప్రాంతంలోనే ఆవిర్భవిస్తున్నాయని ఈ కేంద్రం గుర్తించగలిగింది. ఈ కేంద్రం రోజుకు రెండుసార్లు వాతావరణ పరిశీలనలు జరిపి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల గురించి మనీలాకు ముందస్తు సమాచారాన్ని పంపేది.[20]
తపాలా బిళ్ళలు
[మార్చు]
జర్మనీ పాలన కాలంలో జర్మనీ ఈ ద్వీపాల కోసం ప్రత్యేక తపాలా బిళ్ళలను విడుదల చేసింది.
రవాణా
[మార్చు]ఈ ద్వీపాల మధ్య రవాణా పడవలు లేదా విమానాల ద్వారా (విమానాశ్రయం సమీపంలో ఉన్నట్లయితే) జరుగుతుంది. ఇక్కడి విమాన ప్రయాణం ప్రధానంగా ద్వీపాల అంతర్గత ప్రాంతాలకే పరిమితం; ఎందుకంటే ఇక్కడి విమానాశ్రయ సౌకర్యాలు పెద్ద విమానాలను నిర్వహించడానికి సరిపోవు. కరోలిన్ ఐలాండ్సు ఎయిరు అనేది ఇక్కడి ఏకైక అంతర్గత విమానయాన సంస్థ.
వృక్షజాలం - జంతుజాలం
[మార్చు]ఫిలిప్పీన్స్ వెలుపల కల్లికార్పా మైక్రాంథా సహజసిద్ధంగా పెరిగే ఏకైక ప్రదేశాలు పాలౌ, యాప్.[21]
జర్మనీ వృక్షశాస్త్రవేత్త జార్జి వోల్కెన్సు యాప్ ద్వీపంలో పరిశోధనలు చేస్తున్నప్పుడు క్యాంప్నోస్పెర్మా బ్రెవిపెటియోలాటం మొట్టమొదటగా పేరు పెట్టి దానిని వర్గీకరించారు. ఆయన 1901లో 'కరోలిను దీవుల వృక్షజాలం ముఖ్యంగా యాప్‌లోని వృక్షజాలం మీద ప్రత్యేక పరిశీలనతో' అనే వ్యాసంలో వర్గీకరణ శాస్త్రం, వృక్ష చరిత్ర, వృక్ష భౌగోళిక శాస్త్రాల కోసం వృక్షశాస్త్ర వార్షిక గ్రంథాలు (లీప్‌జిగూ భౌగోళికం)[22] [23]
క్రినం బేకరీ అనేది కరోలిను, మార్షలు దీవులకు చెందినది. దీనిని మొదటిసారిగా 1887లో కార్లు మోరిట్జు షూమాను వర్ణించారు.[24]
సైకోట్రియా హోంబ్రోనియానా అనేది కరోలిను, మరియానా ద్వీపాలకు మాత్రమే పరిమితమైన స్థానిక జాతి; దీనికి సంబంధించిన ఐదు ఉపజాతులు కరోలిన్స్ లోనూ, మూడు ఉపజాతులు మరియానా లోనూ కనిపిస్తాయి.[25][26][27][28][29]
పొనపీ ప్రజాతిలోని నాలుగు జాతులలో మూడు, కరోలిను దీవులకు మాత్రమే పరిమితమైన (స్థానిక) జాతులుగా ఉన్నాయి.[30]
కరోలిను దీవులలో కనిపించే వృక్షజాలం మరిన్ని వివరాల కోసం చూడండి.
కోస్రే ద్వీపంలో, ఆ ద్వీపానికి మాత్రమే పరిమితమైన పదిహేను రకాల నేల నత్తల జాతులు ఉన్నాయి. [31]
ఇంకా చూడండి
[మార్చు]- ↑ Rosser, William Henry (1870). North Pacific pilot: The seaman's guide to the islands of the North Pacific, with an appendix on the winds, weather, currents, &c., of the North and South Pacific. J. Imray. pp. 183–184. Archived from the original on 20 June 2013. Retrieved 28 March 2011.
- ↑ "Distance from Tobi Island to Kosrae". Google. Archived from the original on 6 January 2020. Retrieved 15 November 2021.
- ↑ 3.0 3.1 3.2 One or more of the preceding sentences incorporates text from a publication now in the public domain: Chisholm, Hugh, ed. (1911). "Caroline Islands". ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్). Vol. 5 (11th ed.). Cambridge University Press. pp. 380–381.
- ↑ Goldstein, Jacob; Kestenbaum, David (10 December 2010). "The Island Of Stone Money". NPR – Planet Money. NPR. Archived from the original on 17 May 2015. Retrieved 24 August 2010.
"But the stone doesn't move. It's just that everybody in the village knows the stone now has a new owner."
- ↑ Michael McCoy (1973). "A Renaissance in Carolinian-Marianas Voyaging". Journal of the Polynesian Society, Auckland University. Archived from the original on 28 December 2021. Retrieved 11 October 2021.
- ↑ Halpern, M. D. (1985) "The Origins of the Carolinian Sidereal Compass" Archived 3 మార్చి 2016 at the Wayback Machine, Master's thesis, Texas A & M University
- ↑ Flood, Bo; Strong, Beret E.; Flood, William (2002). Micronesian Legends. Bess Press. pp. 145–7, 160. ISBN 1-57306-129-8. Archived from the original on 20 June 2013. Retrieved 1 January 2012.
- ↑ 8.0 8.1 Hanlon, David L (1988). Upon a Stone Altar: A History of the Island of Pohnpei to 1890. Pacific Islands Monograph. Vol. 5. University of Hawaii Press. pp. 13–25. ISBN 0-8248-1124-0. Archived from the original on 16 June 2013. Retrieved 1 January 2012.
- ↑ Morgan, William N (1988). Prehistoric Architecture in Micronesia. University of Texas Press. pp. 60, 63, 76, 85. ISBN 0-292-76506-1. Archived from the original on 16 June 2013. Retrieved 31 December 2011.
- ↑ 10.0 10.1 Panholzer, Tom; Rufino, Mauricio (2003). Place Names of Pohnpei Island: Including And (Ant) and Pakin Atolls. Bess Press. pp. xiii, xii, 101. ISBN 1-57306-166-2. Archived from the original on 16 June 2013. Retrieved 31 December 2011.
- ↑ Micronesica. University of Guam. 1990. pp. 92, 203, 277. Archived from the original on 16 June 2013. Retrieved 31 December 2011.
- ↑ Ballinger, Bill Sanborn (1978). Lost City of Stone: The Story of Nan Madol, the "Atlantis" of the Pacific. Simon and Schuster. pp. 45–48. ISBN 0-671-24030-7. Archived from the original on 20 June 2013. Retrieved 31 December 2011.
- ↑ Riesenberg, Saul H (1968). The Native Polity of Ponape. Contributions to Anthropology. Vol. 10. Smithsonian Institution Press. pp. 38, 51. ISBN 9780598442437. Archived from the original on 16 June 2013. Retrieved 1 January 2012.
- ↑ Petersen, Glenn (1990). "Lost in the Weeds: Theme and Variation in Pohnpei Political Mythology" (PDF). Occasional Papers. 35. Center for Pacific Islands Studies, School of Hawaiian, Asian & Pacific Studies, University of Hawaiʻi at Mānoa: ch. 5. "Isokelekel", pp. 34 et seq. Archived (PDF) from the original on 27 January 2012. Retrieved 31 December 2011.
- ↑ Galvano, Antonio (1563). The Discoveries of the World from Their First Original Unto the Year of Our Lord 1555 (2004 ed.). Kessinger Publishing, issued by the Hakluyt Society. p. 168. ISBN 0-7661-9022-6.
{{cite book}}: ISBN / Date incompatibility (help)[permanent dead link] - ↑ Miguel, Gregorio (1887). Estudio sobre las islas Carolinas (in స్పానిష్). Imprenta de J. Perales y Martinez. p. 171.
- ↑ José Saínz Ramírez. Colonial empires. Nacional, 1942, Madrid
- ↑ José Saínz Ramírez: Colonial empires. Nacional, 1942, Madrid.
- ↑ "Pacific Islands / 1.0 / encyclopedic". 1914-1918-Online (WW1) Encyclopedia (in ఇంగ్లీష్). Retrieved 2024-09-16.
- ↑ 20.0 20.1 20.2 మూస:Catholic
- ↑ "Callicarpa micrantha S.Vidal". Plants of the World Online (in ఇంగ్లీష్). Retrieved 2024-09-10.
- ↑ "Campnosperma brevipetiolatum | International Plant Names Index". www.ipni.org. Retrieved 2024-09-10.
- ↑ "ZooBank.org". zoobank.org. Retrieved 2024-09-10.[permanent dead link]
- ↑ "Crinum bakeri K.Schum". ప్రపంచంలోని మొక్కలు ఆన్‌లైన్ (in ఇంగ్లీష్). Retrieved 2024-09-10.
- ↑ "Psychotria hombroniana var. canfieldiae Fosberg". Plants of the World Online (in ఇంగ్లీష్). Retrieved 2024-09-10.
- ↑ "Psychotria hombroniana var. carolinensis (Valeton) ined". Plants of the World Online (in ఇంగ్లీష్). Retrieved 2024-09-10.
- ↑ "Psychotria hombroniana var. hirtella (Valeton) Fosberg". Plants of the World Online (in ఇంగ్లీష్). Retrieved 2024-09-10.
- ↑ "Psychotria hombroniana var. kusaiensis (Kaneh.) Fosberg". Plants of the World Online (in ఇంగ్లీష్). Retrieved 2024-09-10.
- ↑ "Psychotria hombroniana var. peliliuensis Fosberg". Plants of the World Online (in ఇంగ్లీష్). Retrieved 2024-09-10.
- ↑ Dransfield, John; Uhl, Natalie W.; Asmussen, Conny B.; Baker, William J.; Harley, Madeline M.; Lewis, Carl E. (2008). Genera Palmarum: The Evolution and Classification of Palms. Royal Botanic Gardens, Kew. ISBN 978-1-84246-182-2.
- ↑ Rundell, Rebecca J.; Czekanski-Moir, Jesse E. (2015). "A Survey of the Land Snails of Kosrae (Caroline Islands, Micronesia) Including the Rediscovery of Endemic Delos oualanensis (Pease, 1866) (Mollusca: Pulmonata: Rhytididae)". Malacologia. 59: 13–20. doi:10.4002/040.059.0103.
ఉల్లేఖన లోపం: "note" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="note"/> ట్యాగు కనబడలేదు
