కర్టిస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కర్టిస్

బాబా శిరిడీలో ఉన్న కాలంలో మనదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తూ ఉండేవారు కదా ! సర్ జాన్ కర్టిస్ అనే ఆయన ప్రభుత్వ కేంద్ర విభాగానికి కమిషనర్ గా పనిచేస్తూ ఉండేవాడు . ఆయనకు పిల్లలు లేరు . కనుక బాబాను దర్శించి తమకు సంతానం ప్రసాదించమని కోరడానికి కర్టిస్ దంపతులు శిరిడీ బయలుదేరారు . కానీ వారికి ఎంతో గర్వము, బాబా పట్ల చులకన భావమూ ఉన్నాయి . బాబా పట్ల నిజమైన భక్తి విశ్వాసమూ లేవు . అయినా పిల్లలకోసం వారు బాబాను దర్శించాలను కున్నారు . ఈ విషయం బాబాకు తెలియకపోతే కదా !

ఆ రోజు మార్చి,10,1911, ఉదయం 7 గం॥లు . బాబా మసీదులో ఉన్నారు . అకస్మాత్తుగా ఆయనెంతో కోపంగా తమ కఫ్నీని పైకెత్తి, "ఆ దుర్మార్గులు నా దర్శనానికి రావడమెందుకు ? నేను సరైన గుడ్డలు గూడా లేని పేద ఫకీరునేగా !" అన్నారు . బాబా ఎవరిని గురించి కోపగించు కుంటున్నారో అక్కడున్న ఎవ్వరికీ అర్ధంకాలేదు. కొద్దిసేపట్లో కర్టిస్ తన భార్యను తీసుకుని శిరిడీ చేరాడు . వారితో కొద్దిమంది ప్రభుత్వోద్యోగులు కూడా వచ్చారు .

వారంతా ఎంతో దాంభికంగా చావడి చేరారు . ఊరిలోంచి కుర్చీలు తెప్పించుకున్నారు . ఆ పవిత్రమైన చావడిలోనే కుర్చీలలో కూర్చున్నారు . అక్కడ ఉన్న ఒక సాయి భక్తుని పిలిచి "పెద్ద పెద్ద బ్రిటిష్ ఆఫీసర్లు బాబా దర్శనానికి వచ్చారు . ఆయనను తొందరగా తయారవ్వమని చెప్పు "అన్నారు . అప్పుడా భక్తుడు ,"బాబా అంతటి గొప్ప మహాత్ముడు మన కోసం సిద్ధమై ఎదురుచూడాలా ?మనమే ఆయన కృపకోసం ఎదురుచూడాలి . ఆయనతో అలా చెప్పకూడదు "అన్నాడు . ఆ భక్తునికి ,వీరికి ఎంత తేడా !అతడికెంత వివేకం ! మనం కూడా ఎల్లప్పుడు మహాత్ముల కృపకోసం, దర్శనం కోసం ఎదురుచూడాలి గాని మన సౌకర్యం కోసం వారు మనకిష్టమైనప్పుడు దర్శనమివ్వాలని కోరుకోకూడదు .

దురహంకారంతో ,దుష్టత్వంతోనూ ప్రవర్తించే కర్టిస్ లాంటి వారంటే బాబాకు చాలా కోపం . వారు దర్శనానికి వెళ్లేసరికి బాబా అప్పుడే భిక్ష కెళ్ళి తిరిగి వచ్చారు . అప్పుడు శ్రీమతి కర్టిస్ బాబా దగ్గరకు వెళ్లి ,"బాబా ,మీతో కొద్దిసేపు మాట్లాడాలి !"అన్నది . బాబా ముక్తసరిగా ,"ఒక అరగంట ఆగు !"అని మళ్ళీ వెళ్ళిపోయారు . కొద్దిసేపటికి ఆయన తిరిగీ మసీదుకు వచ్చారు . ఈసారి మరలా బాబాతో మాట్లాడడానికి ఆమె బాబా దగ్గరకు వెళ్ళింది . ఆయన ఆమెకేసి కోపంగా చూసి ,"ఒక గంట ఆగు !" అన్నారు .

బాబా తమలాంటి 'గోప్పవారితో 'అలా ప్రవర్తించడం వారికి నచ్చలేదు . వారు మరొక గంట గూడా ఆగకుండా ఆయన ఆశీస్సులు తీసుకోకుండానే వెళ్ళిపోయారు . వారికి సంతానం కలుగలేదు . అలా గాకుండా వారు బాబా కృప లభించే దాకా ఓర్పుగా ప్రయత్నించి ఉంటే బాబా వారికి సంతానము ప్రసాదించేవారు . వారిలోని చెడ్డ గుణాలను తొలగించి మంచి మార్గంలో నడిపించేవారు . కనుక మనము మహాత్ముల కృప లభించేవరకు వారిని ప్రార్థిస్తూ వారి కృపకై ఎదురుచూడాలి .

"https://te.wikipedia.org/w/index.php?title=కర్టిస్&oldid=1984286" నుండి వెలికితీశారు