కర్ణభేరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కర్ణభేరి
చెవి అంతర్నిర్మాణం.
Right tympanic membrane as seen through a speculum.
లాటిన్ membrana tympani
గ్రే'స్ subject #230 1039
MeSH Tympanic+Membrane

కర్ణభేరి (tympanic membrane) బాహ్య, మధ్య చెవి నిర్మాణాలను వేరుచేసే బిగుతుత్వచం. దీనిలో రెండు బహిస్త్వచాలు, మధ్య సంయోజక కణజాలం ఉంటుంది. బయటినుండి వచ్చే శబ్ద తరంగాలు కర్ణభేరిని తాకుతాయి. అక్కడి నుండి మధ్య చెవిలోని కర్ణాస్థులు లోపలి చెవిలోకి చేరవేస్తాయి. అంటే ధ్వని వల్ల గాలిలో కలిగే తరంగాలను చెవిలోపల ఉండే ద్రవంలోకి పంపుతుంది.

కర్ణభేరి పగలడం వలన బయటి శబ్దాలు చెవి లోపలికి ప్రసరింపక చెవుడు వస్తుంది.

వైద్యశాస్త్ర ప్రాముఖ్యత

[మార్చు]

బాంబులు పేలే సమయాల్లో,[1] లేక గాలిలో ప్రయాణించేటపుడు, మనం పీల్చేగాలి మధ్య చెవిలో గాలి పీడనం రెండూ సమతూకంలో లేనపుడు [2] అనుకోకుండా కర్ణభేరి పగలవచ్చు. ఇంకా ఆటలు ఆడేటప్పుడు, ఈత కొట్టేటపుడు, తెలిసీ తెలియకుండా నీళ్ళలోకి దూకినప్పుడు కూడా ఈ ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. ఇప్పటిదాకా ప్రచురించిన పరిశోధన ప్రకారం 80% నుంచి 95% పరిస్థితుల్లో ఎటువంటీ శ్రద్ధా అవసరం లేకుండానే రెండు నుంచి నాలుగు వారాల్లో అంతా సర్దుకున్నది.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. Ritenour AE, Wickley A, Retinue JS, Kriete BR, Blackbourne LH, Holcomb JB, Wade CE (February 2008). "Tympanic membrane perforation and hearing loss from blast overpressure in Operation Enduring Freedom and Operation Iraqi Freedom wounded". J Trauma. 64 (2 Suppl): S174-8. doi:10.1097/ta.0b013e318160773e.
  2. Mirza S, Richardson H (May 2005). "Otic barotrauma from air travel". J Laryngol Otol. 119 (5): 366–70. doi:10.1258/0022215053945723. PMID 15949100.
  3. Kristensen S (December 1992). "Spontaneous healing of traumatic tympanic membrane perforations in man: a century of experience". J Laryngol Otol. 106 (12): 1037–50. doi:10.1017/s0022215100121723. PMID 1487657.
  4. Lindeman P, Edström S, Granström G, Jacobsson S, von Sydow C, Westin T, Aberg B (December 1987). "Acute traumatic tympanic membrane perforations. Cover or observe?". Arch Otolaryngol Head Neck Surg. 113 (12): 1285–7. doi:10.1001/archotol.1987.01860120031002. PMID 3675893.
  5. Garth RJ (July 1995). "Blast injury of the ear: an overview and guide to management". Injury. 26 (6): 363–6. doi:10.1016/0020-1383(95)00042-8.
"https://te.wikipedia.org/w/index.php?title=కర్ణభేరి&oldid=4319200" నుండి వెలికితీశారు