కర్ణాటక జిల్లాలు
కర్ణాటక రాష్ట్రం, నాలుగు డివిజన్లు, 30 జిల్లాలుగా పాలనాపరంగా వ్యవస్థీకరించబడి ఉంది.
జిల్లాల చరిత్ర[మార్చు]
కర్ణాటక ప్రస్తుత స్వరూపంలో 1956లో మైసూరు రాజ్యం, కూర్గు సంస్థానము, బొంబాయి, హైదరాబాదు, మద్రాసు రాష్ట్రాలలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలు ఏకమై ఏర్పడింది. మైసూరు రాజ్యం పది జిల్లాలుగా విభజించబడి ఉంది. అవి - బెంగుళూరు, కోలార్, తుముకూరు, మాండ్యా, మైసూరు, హసన్, చిక్‌మగలూరు (కదూర్), షిమోగా జిల్లాలు. 1953లో మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ఉత్తర జిల్లాలు వేరుపడి ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పుడు, బళ్లారి జిల్లాను మద్రాసు రాష్ట్రం నుండి విడదీసి మైసూరు రాష్ట్రంలో కలిపారు. ఆ తరువాత కొడగు జిల్లా ఏర్పడింది. 1956లో మద్రాసు రాష్ట్రం నుండి దక్షిణ కన్నడ జిల్లాను, బొంబాయి రాష్ట్రం నుండి ఉత్తర కన్నడ, ధార్వడ్, బెల్గాం, బీజాపూర్ జిల్లాలను, హైదరాబాదు రాష్ట్రం నుండి బీదర్, గుల్బర్గా, రాయచూరు జిల్లాలు తరలించబడ్డాయి.
1989లో బెంగుళూరు గ్రామీణ జిల్లా బెంగుళూరు నుండి ఏర్పడింది. 1997లో కొత్తగా బీజాపూర్ నుండి బగళ్‌కోట్ జిల్లాను, మైసూరు నుండి చామరాజనగర్ జిల్లా, ధార్వాడ్ నుండి గదగ్, హవేరి జిల్లాలు, రాయచూరు నుండి కొప్పళ్ జిల్లా, దక్షిణ కన్నడ జిల్లా నుండి ఉడిపి జిల్లాలను ఏర్పరచారు. చిత్రదుర్గ, షిమోగా, బళ్ళారి జిల్లాలనుండి కొంతభాగాన్ని తీసి దావణగేరే జిల్లాను ఏర్పరచారు.
2007 జూన్ 1న కర్ణాటక ప్రభుత్వం మరో రెండు జిల్లాలను (రామనగర్, చిక్‌బళ్లాపూర్ జిల్లాలు) సృష్టించడానికి మంత్రివర్గ ఆమోదాన్ని ప్రకటించింది. బెంగుళూరు గ్రామీణ జిల్లానుండి రామనగర్ జిల్లా, కోలార్ జిల్లా నుండి చిక్‌బళ్ళాపూర్ జిల్లాలు ఏర్పడ్డాయి.[1]
2009 డిసెంబరు 30న 30వ జిల్లాగా, యాద్గిర్ జిల్లాను సృష్టిస్తూ అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.[2]
జిల్లాల పట్టిక[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "2 new districts notified in Bangalore". Online Edition of The Times of India, dated 2007-08-06. Retrieved 2007-08-09.
- ↑ "Creation of Yadgir district". Online Edition of The Hindu, dated 2009-12-30.
![]() |
Wikimedia Commons has media related to Districts of Karnataka. |