కర్తార్ సింగ్
| Personal information | |
|---|---|
| Nationality | |
| Born | 7 October 1953 సుర్ సింగ్ గ్రామం, తరన్ తరణ్, పంజాబ్, భారతదేశం |
| Occupation | రెజ్లర్ |
కర్తార్ సింగ్ (జననం 7 అక్టోబర్ 1953) అంతర్జాతీయ భారతీయ రెజ్లర్. ఆయన ఆసియా క్రీడలలో (1978 & 1986) రెండు బంగారు పతకాలు (ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో) గెలుచుకున్న ఏకైక భారతీయ పురుషుల రెజ్లర్.[1]
కర్తార్ సింగ్ 1984 వేసవి ఒలింపిక్స్ - పురుషుల ఫ్రీస్టైల్ 100 కిలోల రెజ్లింగ్‌లో 7వ స్థానంలో నిలిచాడు. ఆయన 1993 నుండి పంజాబ్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఆ తరువాత భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ సెక్రటరీ జనరల్ పని చేశాడు.[2]
వ్యక్తిగత జీవితం
[మార్చు]కర్తార్ సింగ్ పంజాబ్‌లోని ప్రస్తుత తర్న్ తరన్ జిల్లాలోని సుర్ సింగ్ గ్రామంలో జన్మించాడు. ఆయన 1978 బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా క్రీడలలో, 1986 సియోల్‌లో జరిగిన ఆసియా క్రీడలలో ఆయన బంగారు పతకాలు గెలుచుకున్నాడు. కర్తార్ సింగ్ 1982 ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో రజత పతకాన్ని, 1978 ఎడ్మంటన్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో కాంస్య పతకాన్ని, 1982 బ్రిస్బేన్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.
కర్తార్ సింగ్ పోలీసు సూపరింటెండెంట్‌గా, పంజాబ్ స్పోర్ట్స్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఆయన రెజ్లింగ్‌లో మాస్టర్ వరల్డ్ ఛాంపియన్‌గా, 2013లో పంజాబ్‌లో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పదవీ విరమణ చేశాడు.
అవార్డులు & గౌరవాలు
[మార్చు]కర్తార్ సింగ్ 1982లో అర్జున అవార్డు,[3] 1987లో పద్మశ్రీ అందుకున్నాడు. ఆయన 1992లో కొలంబియాలో, 1993లో టొరంటోలో, 1997లో మార్టియోనీ (స్విట్జర్లాండ్)లో, 1998లో బోడెక్స్ (ఫ్రాన్స్)లో జరిగిన వెటరన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లలో అనేకసార్లు బంగారు పతకాలు గెలుచుకున్నాడు.
రాజకీయ జీవితం
[మార్చు]కర్తార్ సింగ్ 2016లో చండీగఢ్‌లో ఆప్ నాయకులు సుఖ్‌పాల్ ఖైరా, సంజయ్ సింగ్, భగవంత్ మాన్ సమక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడు.[4][5] ఆయన 2017 పంజాబ్ శాసనసభ ఎన్నికలలో తరన్ తరణ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Kartar Singh-Remembering India's only two-time Asiad gold medallist wrestler" (in ఇంగ్లీష్). The Bridge. 23 September 2019. Archived from the original on 5 January 2026. Retrieved 5 January 2026.
- ↑ "India's only two-time Asiad gold medallist is busy promoting wrestling these days" (in ఇంగ్లీష్). The Tribune. 7 October 2020. Archived from the original on 5 January 2026. Retrieved 5 January 2026.
- ↑ "Arjuna Award Winners for Wrestling". Department of Sports, Government of India website. Archived from the original on 19 July 2011. Retrieved 21 October 2010.
- ↑ "Renowned wrestler joins AAP" (in ఇంగ్లీష్). The Tribune. 3 April 2016. Archived from the original on 5 January 2026. Retrieved 5 January 2026.
- ↑ "Olympian wrestler enters poll arena". The Times of India. 8 October 2016. Archived from the original on 5 January 2026. Retrieved 5 January 2026.
- ↑ "AAP: Khaira gets ticket; Kanwar Sandhu, former wrestler Kartar also on 3rd list" (in ఇంగ్లీష్). Hindustan Times. 7 October 2016. Archived from the original on 5 January 2026. Retrieved 5 January 2026.