కర్నాల్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కర్నాల్ జిల్లా
करनाल जिला
ਕਰਨਾਲ ਜ਼ਿਲਾ
హర్యానా పటంలో కర్నాల్ జిల్లా స్థానం
హర్యానా పటంలో కర్నాల్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంహర్యానా
డివిజనురోహ్‌తక్
ముఖ్య పట్టణంకర్నాల్
Government
 • శాసనసభ నియోజకవర్గాలు5
Area
 • మొత్తం1,967 km2 (759 sq mi)
Population
 (2001)
 • మొత్తం12,74,183
 • Density650/km2 (1,700/sq mi)
 • Urban
26.51%
జనాభా వివరాలు
 • అక్షరాస్యత67.74%
Websiteఅధికారిక జాలస్థలి

హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాలలో కర్నాల్ జిల్లా (హిందీ: करनाल जिला, పంజాబీ: ਕਰਨਾਲ ਜ਼ਿਲਾ) ఒకటి. కర్నాల్ నగరం ఈ జిల్లాకు కేంద్రం. జిల్లా లోని ఇతర ప్రధాన నగరాలు అస్సంధ్, ఘరౌండా, నిలోఖెరి, ఇంద్రి, జుండ్ల. ఈ జిల్లా రోహ్‌తక్ డివిజనులో భాగంగా ఉంది.

చరిత్ర[మార్చు]

కర్నాల్ జిల్లా ప్రాంతం పంజాబు రాష్ట్ర జిల్లాలలో ఒకటిగా ఉండేది. 1966 నవంబరు 1 న హర్యానా రాష్ట్రం రూపొందించిన సమయంలో ఇది హర్యానా రాష్ట్రంలో జిల్లాగా చేరింది. తరువాత 1973 జనవరి 26 న ఈ జిల్లా లోని కొంత భూభాగాన్ని విడదీసి కురుక్షేత్ర జిల్లాను ఏర్పాటు చేసారు. 1989 నవంబరు 1 ఈ జిల్లా లోని మరో కొంత భూభాగం వేరిచేసి కైతల్ జిల్లాను ఏర్పాటు చేసారు. 1991 జూలై 24 న ఈ జిల్లాలో పానిపట్ కలుపబడి తిరిగి 1992 జనవరి 1 తిరిగి వేరుచేయబడింది.

పేరువెనుక చరిత్ర[మార్చు]

ఈ ప్రాంతం మహాభారతంతో సంబ్ంధించబడి ఉంది. ఇది కర్ణుడి నివాస స్థానంగా ఉండేదని విశ్వసించబడి ఉంది.

భౌగోళికం[మార్చు]

కర్నాల్ జిల్లా యమునానది పశ్చిమతీరంలో ఉంది కనుక యమునానది జిల్లాకు తూర్పు సరిహద్దుగానూ హర్యానా, ఉత్తర ప్రదేశ్ ఉంది. కర్నాల్, పానిపట్ జిల్లాలు 29 09' 50", 29 50' ఉత్తర అక్షాంశం, 76 31' 15", 77 12' 45" తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా సముద్రమట్టానికి 240మీటర్ల ఎత్తులో ఉంది. జిల్లా వైశాల్యం 1967చ.కి.మీ, 2001 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 1,274,183. జిల్లా ఉత్తర వాయవ్య సరిహద్దులో కురుక్షేత్ర జిల్లా, పశ్చిమ సరిహద్దులో జింద్, కైతాల్ జిల్లాలు, దక్షిణ సరిహద్దులో పానిపట్ జిల్లా, తూర్పు సరిహద్దులో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఉన్నాయి. భౌగోళికంగా జిల్లా గంగా సింధు మైదానంలో భాగంగా ఉంది. అంతేకాక జిల్లాలో పశ్చిమ యమునా కాలువలు ఉన్నాయి. పశ్చిమ కాదర్ నుండి బంగర్ ప్రాంతం ఆరంభం ఔతుంది.

విభాగాలు[మార్చు]

విభాగాల వివరణ[మార్చు]

విషయాలు వివరణలు
ఉపవిభాగాలు 2 కర్నాల్, అస్సంధ్.
కర్నాల్ ఉప విభాగం కర్నాల్, నిలోఖెరి, గరౌండా, ఇంద్రి
ఉప తాలూకాలు 2 నిస్సంగ్, నిగ్డు.
అసెంబ్లీ నియోజక వర్గం
పార్లమెంటు నియోజక వర్గం

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,506,323, [1]
ఇది దాదాపు. గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. హవాయ్ నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 333 వ స్థానంలో ఉంది..[1]
1చ.కి.మీ జనసాంద్రత. 598 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 18.22%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 886:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 76.4%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం
ప్రధాన భాషలు హిందీ & పంజాబీ

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Gabon 1,576,665
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Hawaii 1,360,301