Jump to content

కర్మణ్యే వాధికారస్తే

వికీపీడియా నుండి
కర్మణ్యే వాధికారస్తే
దర్శకత్వంఅమర్‌దీప్ చల్లపల్లి
స్క్రీన్ ప్లేఅమర్‌దీప్ చల్లపల్లి
కథశివ కుమార్ పెళ్లూరు
మాటలుశివ కుమార్ పెళ్లూరు
పాటలుశ్రేష్ఠ
నిర్మాతడి.ఎస్.ఎస్. దుర్గా ప్రసాద్
తారాగణం
ఛాయాగ్రహణంభాస్కర్ సామల
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంజ్ఞాని
నిర్మాణ
సంస్థ
ఉషస్విని ఫిల్మ్స్
విడుదల తేదీ
31 అక్టోబర్ 2025 (2025-10-31)(థియేటర్)
దేశంభారతదేశం
భాషతెలుగు

కర్మణ్యే వాధికారస్తే 2025లో విడుదలైన సినిమా. ఉషస్విని ఫిల్మ్స్ బ్యానర్‌పై డి.ఎస్.ఎస్. దుర్గా ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు అమర్‌దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించాడు.[1] ఐరా దయానంద్, బ్రహ్మాజీ, శత్రు, మహేంద్రన్, పృథ్వీరాజ్, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 5న విడుదల చేయగా,[2] సినిమా 2025 అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజై,[3] నవంబర్ 21 నుండి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4][5]

నటుడు పృథ్వీ(పృథ్వీ) కారు ప్రమాదం చేయడంతో ఒక వ్యక్తి మరణిస్తాడు. ఆ కేసు ఏసీపీ అర్జున్(శత్రు) దగ్గరికి వస్తుంది. కానీ ఆ వ్యక్తి ముందే చనిపోయాడు, యాక్సిడెంట్ వల్ల కాదు అని పోస్ట్ మార్టంలో తెలుస్తుంది. ఆ బాడీ కోసం కూడా ఎవరూ రారు. అలాంటి కేసులు వైజాగ్ లో చాలా ఉన్నాయని తెలిసి అర్జున్ ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెడతాడు. మరో కేసులో సస్పెండ్ అయిన కానిస్టేబుల్ కిరీటి (బ్రహ్మాజీ) తన వంతుగా ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. జై (మహింద్రన్) అమ్మాయిలను ట్రాప్ చేసి మత్తుమందు ఇచ్చి కిడ్నాప్ చేస్తూ ఉంటాడు. అసలు జై ఎవరు? కిరీటి, అర్జున్ లు వాళ్ళ కేసులని సాల్వ్ చేస్తారా? అనుమానాస్పద మృతుల వెనక మిస్టరీని ఎలా ఛేదించారు? చివరకు ఏమైంది అనేదే మిగతా సినిమా కథ.[6]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "కర్మణ్యే వాధికారస్తే." NT News. 9 May 2025. Archived from the original on 22 November 2025. Retrieved 22 November 2025.
  2. "Karmanye Vadhikaraste trailer: An intense investigation drama involving missing students" (in ఇంగ్లీష్). Cinema Express. 8 May 2025. Archived from the original on 22 November 2025. Retrieved 22 November 2025.
  3. "అక్టోబర్ 31న 'కర్మణ్యే వాధికారస్తే'". NTV Telugu. 20 October 2025. Archived from the original on 22 November 2025. Retrieved 22 November 2025.
  4. "ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. 20 రోజుల్లోనే డిజిటల్ ప్రీమియర్.. ఐఎండీబీలో 8.8 రేటింగ్". Hindustan Times. 20 November 2025. Archived from the original on 22 November 2025. Retrieved 22 November 2025.
  5. "అమ్మాయిలకు మత్తుమందిచ్చి.. ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో 8.8 రేటింగ్". TV9 Telugu. 21 November 2025. Archived from the original on 22 November 2025. Retrieved 22 November 2025.
  6. "'కర్మణ్యే వాధికారస్తే' రివ్యూ". Sakshi. 31 October 2025. Archived from the original on 22 November 2025. Retrieved 22 November 2025.

బయటి లింకులు

[మార్చు]