Jump to content

కర్షన్ సోలంకి

వికీపీడియా నుండి
కర్షన్ సోలంకి

పదవీ కాలం
2017  2025 ఫిబ్రవరి 4
ముందు రమేష్‌భాయ్ చావ్డా
తరువాత రాజేంద్ర చావ్డా
నియోజకవర్గం కడి

వ్యక్తిగత వివరాలు

జననం (1957-01-01)1957 జనవరి 1
కాడి, మెహెసానా జిల్లా, గుజరాత్
మరణం 2025 ఫిబ్రవరి 4(2025-02-04) (వయసు: 68)
అహ్మదాబాద్, గుజరాత్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం అహ్మదాబాద్, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

కర్షన్‌భాయ్ సోలంకి (1957 జనవరి 1 - 2025 ఫిబ్రవరి 4) గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కడి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

కర్షన్ సోలంకి 1980లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి కాడి గ్రామా సర్పంచ్‌గా ఎన్నికై ఆ తరువాత 20 సంవత్సరాలకు పైగా నిరంతరం కాడి పంచాయతీ న్యాయ సమితి ఛైర్మన్‌గా పని చేశాడు. ఆయన 2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో కడి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి రమేష్ భాయ్ చావ్డాపై 7,746 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

కర్షన్ సోలంకి 2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ప్రవీణ్‌భాయ్ గణపత్‌భాయ్ పర్మార్ పై 28,194 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

మరణం

[మార్చు]

కర్షన్ సోలంకి క్యాన్సర్‌తో దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ 68 సంవత్సరాల వయసులో 2025 ఫిబ్రవరి 4న అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.ఆయనకు భార్య సవితాబెన్, ముగ్గురు పిల్లలు ఉన్నారు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  2. India Today (9 December 2022). "Gujarat Election 2022: Winning candidates from BJP, Congress, AAP" (in ఇంగ్లీష్). Archived from the original on 9 December 2022. Retrieved 9 December 2022.
  3. "BJP MLA from Kadi loses battle against cancer". The Times of India. 4 February 2025. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.
  4. "Gujarat BJP legislator Karshanbhai Solanki passes away at 68" (in ఇంగ్లీష్). The Indian Express. 4 February 2025. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.