Jump to content

కలకప్ప బండి

వికీపీడియా నుండి
గురుపాదగౌడ పాటిల్

పదవీ కాలం
2012 జూలై 12 – 2013 మే 13

పదవీ కాలం
2018 – 2023 మే 13
తరువాత గురుపాదగౌడ పాటిల్
నియోజకవర్గం రాన్
పదవీ కాలం
2004 – 2013
ముందు గురుపాదగౌడ పాటిల్
తరువాత గురుపాదగౌడ పాటిల్

వ్యక్తిగత వివరాలు

జననం 1948
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సంయుక్త[1]
వృత్తి రాజకీయ నాయకుడు

కలకప్ప గురుశాంతప్ప బండి కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు రాన్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2012 జూలై 12 నుండి 2013 మే 13 వరకు మహిళా & శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

కలకప్ప బండి భారతీయ జనతా పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో రాన్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి గురుపాదగౌడ పాటిల్‌పై 8065 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2008 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి గురుపాదగౌడ పాటిల్‌పై 1830 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికై,[3] 2012 జూలై 12 నుండి 2013 మే 13 వరకు మహిళా & శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు.[4]

కలకప్ప బండి 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో రాన్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి గురుపాదగౌడ పాటిల్‌ చేతిలో 18227 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి గురుపాదగౌడ పాటిల్‌పై 7,334 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5]

కలకప్ప బండి 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో రాన్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి గురుపాదగౌడ పాటిల్‌ చేతిలో 24,688 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Karnataka polls 2023: Ron sitting MLA Kalakappa Bandi faces competition for ticket from wife and brother". The Times of India. 9 April 2023. Archived from the original on 23 April 2025. Retrieved 23 April 2025.
  2. "Karnataka Election: 12 ministers fall as Congress regain state" (in అమెరికన్ ఇంగ్లీష్). Firstpost. 8 May 2013. Archived from the original on 23 April 2025. Retrieved 23 April 2025.
  3. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-09.
  4. "New CM, old problems" (in ఇంగ్లీష్). The New Indian Express. 13 July 2012. Archived from the original on 23 April 2025. Retrieved 23 April 2025.
  5. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  6. "Karnataka Assembly Elections 2023: Ron". Election Commission of India. 13 May 2023. Archived from the original on 23 April 2025. Retrieved 23 April 2025.