కలమట వెంకటరమణ మూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కలమట వెంకటరమణ మూర్తి
కలమట వెంకటరమణ మూర్తి

కలమట వెంకటరమణ మూర్తి


ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
పాతపట్నం శాసనసభ నియోజకవర్గం
పదవీ కాలము
8 జూన్ 2014 – 2019
ముందు శత్రుచర్ల విజయరామరాజు

వ్యక్తిగత వివరాలు

జననం (1963-01-15) 1963 జనవరి 15 (వయస్సు: 57  సంవత్సరాలు)
మాతల, కొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా
రాజకీయ పార్టీ తెలుగు దేశం
తల్లిదండ్రులు కలమట మోహనరావు , వేణమ్మ
జీవిత భాగస్వామి ఇందిర
నివాసము మాతల, కొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా[1]
పూర్వ విద్యార్థి ప్రభుత్వ కళాశాల, గరివిడి
వృత్తి వ్యవసాయం, కొన్ని వ్యాపారసంస్థలలో వాటాదారుడు
మతం హిందూ

కలమట వెంకటరమణమూర్తి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు, తెలుగుదేశంపార్టీ నాయకుడు.

జీవిత విశేషాలు[మార్చు]

కలమట వెంకటరమణ మూర్తి శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలానికి చెందిన మాతల గ్రామంలో 1963 జనవరి 15 న జన్మించాడు. అతని తండ్రి కలమట మోహనరావు[2] పాతపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి ఐదు సార్లు శాసనసభ్యునిగా గెలుపొందాడు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పాతపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి శత్రుచర్ల విజయరామరాజు చేతిలో ఓడిపోయాడు. 2014 ఎన్నికలలో అతను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి శత్రుచర్ల విజయరామరాజు పై గెలుపొందాడు. 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. మే 2016న అతను గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తిగిరి తెలుగుదేశం పార్టీలోకి చేరాడు. నియోజకవర్గ అభివృద్ధి కోసం, తెదేపా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితుడై పార్టీలో చేరినట్టు వెంకటరమణ తెలిపారు.[3]

2019 శాసనసభ ఎన్నికలలో పాతపట్నం నియోజకవర్గం నుండి పోటీ చేసి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డి శాంతి చేతిలో ఓడిపోయాడు[4].

మూలాలు[మార్చు]

  1. "KALAMATA VENKATARAMANA MURTHY(Criminal & Asset Declaration)". Cite web requires |website= (help)
  2. "Kalamata Venkataramana Murty". Cite web requires |website= (help)
  3. "Kalamata crosses over to Telugu Desam". Cite web requires |website= (help)
  4. "AP Assembly Winners 2019 List: ఏపీ అసెంబ్లీ ఫలితాలు.. జిల్లాలవారీగా విజేతల వివరాలు". Samayam Telugu. 2019-05-23. Retrieved 2019-07-21.

బయటి లంకెలు[మార్చు]