కలర్ ఫోటో (2020 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కలర్ ఫోటో
Colour Photo Movie Poster.jpg
కలర్ ఫోటో సినిమా పోస్టర్
దర్శకత్వంసందీప్ రాజ్
కథా రచయితసందీప్ రాజ్
కథసాయి రాజేష్
నిర్మాతసాయి రాజేష్ నీలం
బెన్ని ముప్పానేని
తారాగణంసుహాస్‌
చాందిని చౌదరి
సునీల్
వైవా హర్ష
దివ్య దృష్టి
'కంచరపాలెం' సుబ్బారావు
ఛాయాగ్రహణంవెంకట్ ఆర్ శాఖమూరి
కూర్పుకోదాటి పవన్ కళ్యాణ్
సంగీతంకాల భైరవ
నిర్మాణ
సంస్థలు
అమృతా ప్రొడక్షన్స్
లౌక్యా ఎంటర్టైన్మెంట్
పంపిణీదారుఆహా (ఓటిటి)
విడుదల తేదీ
2020 అక్టోబరు 23 (2020-10-23)
దేశంభారతదేశం
భాషతెలుగు

కలర్ ఫోటో 2020, అక్టోబరు 23న విడుదలైన తెలుగు చలనచిత్రం. అమృతా ప్రొడక్షన్స్, లౌక్యా ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సాయి రాజేష్ నీలం, బెన్ని ముప్పానేని నిర్మించిన ఈ చిత్రానికి సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు. సుహాస్ తొలిసారిగా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష, 'కంచరపాలెం' సుబ్బారావు తదితరులు నటించారు.[1][2][3] 1990లలో మచిలిపట్నం నేపథ్యంలో, ఒక సాధారణ యువకుడి జీవిత కథతో ఈ సినిమా రూపొందించబడింది.[4][5][6]

2020, అక్టోబరు 23న ఈ చిత్రం ఆహా (ఓటిటి)లో విడుదలయింది.[7]

కథ నేపథ్యం[మార్చు]

సినిమా కథంతా మచిలీపట్నంలో జరుగుతుంది. ఊళ్ళో జనాలకి పాలు పోస్తూ పూటగడిపే జయకృష్ణ (సుహాస్), మరోవైపు కాలేజీలో చదువుకుంటాడు. కాలేజీలో చేరిన కొన్ని రోజులకే దీప్తి (చాందినీ చౌదరి)ను చూసి ప్రేమలో పడతాడు కిట్టు అలియాస్ జయకృష్ణ. ఇక కిట్టు అందంగా లేనప్పటికీ అతని మంచి మనసుకి ఫిదా అయి ప్రేమలో పడుతుంది దీపు అలియాస్ దీప్తి. ఎవరికీ తెలియకుండా ప్రేమించుకునే కిట్టు-దీపు ఓ ఇన్సిడెంట్ కారణంగా కాలేజీ ప్రిన్సిపాల్ తోపాటు దీపు అన్నయ్య రామరాజు (సునీల్)కి చిక్కుతారు. ఊళ్ళో పోలీస్ గా ఉద్యోగం చేస్తూ ప్రేమ వివాహాలను వ్యతిరేకించే రామరాజు, దీపుకి కిట్టుని దూరం చేసి తన చెల్లికి అందంగా ఉండే వ్యక్తితో పెళ్లి చేయాలని భావిస్తాడు. రామరాజు కారణంగా కిట్టు, దీపు విడిపోతారు. అలా ప్రేమించిన కిట్టుకి దూరమైన దీపు ఓ ఎన్.ఆర్.ఐ.ని తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోని సెటిల్ అవుతుంది. ఇక దీపుకి దూరమైన కిట్టు చివరికి ఏమయ్యాడు..? అనేది సినిమా కథాంశం.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • రచన, దర్శకత్వం: సందీప్ రాజ్ [8]
  • నిర్మాణం: సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని
  • కథ: సాయి రాజేష్
  • సంగీతం: కాల భైరవ
  • ఛాయాగ్రహణం: వెంకట్ ఆర్ శాఖమూరి
  • కూర్పు: కోదాటి పవన్ కళ్యాణ్
  • కళ: క్రాంతి ప్రియం
  • నిర్మాణ సంస్థ: అమృతా ప్రొడక్షన్స్, లౌక్యా ఎంటర్టైన్మెంట్
  • పంపిణీదారు: ఆహా (ఓటిటి)

పాటలు[మార్చు]

కలర్ ఫోటో
కాల భైరవ స్వరపరచిన పాటలు
విడుదల21 సెప్టెంబరు 2020
స్టుడియోస్టూడియో 47 & జెబి స్టూడియో
సంగీత ప్రక్రియసినిమా పాటలు
భాషతెలుగు
రికార్డింగ్ లేబుల్ఆదిత్యా మ్యూజిక్
External audio
Audio Jukebox యూట్యూబ్లో

ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించాడు. కిట్టు విస్సాప్రగడ, సాయి కిరణ్ పాటలు రాశారు. ఆదిత్యా మ్యూజిక్‌ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[9]

పాటల జాబితా
No.TitleLyricsగాయకులుLength
1."తరగతి గది"కాల భైరవ3:34
2."అరెరె ఆకాశం"అనురాగ్ కులకర్ణి, కాల భైరవ3:23

స్పందన[మార్చు]

ఈ చిత్రం "ఆకట్టుకునే ప్రేమకథ" అని ఈనాడు పత్రికలో రాశారు. శారీరక రంగు నేపథ్యంలో ఉన్న కథాంశాన్ని ఎంచుకున్నందుకు దర్శకుడిని అభినందిస్తూ, ఆ కథని స్క్రీన్ ప్లేలోకి మలచడం సరిగాలేదని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో నటించిన వారి నటన బాగుందని సమీక్ష పేర్కొంది.[10] కథాంశం, నటన, సంగీతం బాగుందని, స్క్రీన్ ప్లే నెమ్మదిగా ఉందని సాక్షి పత్రికలో రాశారు.[11]

మూలాలు[మార్చు]

  1. Sangam, Sowmya. "Suhas to grip viewers with intense character". Telangana Today. Retrieved 2020-10-25.
  2. "It's an absolute pleasure and honour to be part of this film, says Colour Photo actor Suhas". The Times of India. April 21, 2020. Retrieved 2020-10-25.
  3. "Chandini Chowdary pens an emotional note after wrapping up the shoot of 'Colour Photo' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-10-25.
  4. Dundoo, Sangeetha Devi (2020-08-11). "'Colour Photo', the story of a 'below average' guy". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Retrieved 2020-10-25.
  5. "I can assure that Sunil Garu has a terrifying role in Colour Photo: Suhas - Times of India". The Times of India. Retrieved 2020-10-25.
  6. "Comedian Suhas turns into a hero for 'Colour Photo': Kala Bhairava to compose the music - Times of India". The Times of India. Retrieved 2020-10-25.
  7. "Colour Photo (2020) | Colour Photo Movie | Colour Photo Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat. Retrieved 2020-10-25.
  8. Eenadu (30 May 2021). "ఓటీటీలో ఓహో అనిపించారు! - Sunday Magazine". EENADU. Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  9. "Colour Photo". Wynk. Retrieved 2020-10-25.
  10. "రివ్యూ: క‌ల‌ర్ ఫోటో" [Review: Colour Photo]. Eenadu. 2020-10-23. Retrieved 2020-10-25.{{cite web}}: CS1 maint: url-status (link)
  11. "క‌ల‌ర్ ఫొటో రివ్యూ". Sakshi. 2020-10-23. Retrieved 2020-10-25.{{cite web}}: CS1 maint: url-status (link)