Jump to content

కలలే కేశవమూర్తి

వికీపీడియా నుండి
కలలే కేశవమూర్తి

పదవీ కాలం
2016 – 2018 మే 15
ముందు శ్రీనివాస్ ప్రసాద్
తరువాత బి. హర్షవర్ధన్
నియోజకవర్గం నంజన్‌గూడ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు జనతాదళ్ (సెక్యులర్)
వృత్తి రాజకీయ నాయకుడు

కలలే కేశవమూర్తి కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2016లో నంజనగూడు శాసనసభ నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

కలలే కేశవమూర్తి జనతాదళ్ (సెక్యులర్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో చేరి వివిధ హోదాల్లో పని చేసి 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో నంజనగూడు శాసనసభ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి శ్రీనివాస్ ప్రసాద్ చేతిలో 8941 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీనివాస్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీని వీడి తన ఎమ్మెల్యేగా పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరడంతో ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికకు ముందు కలలే కేశవమూర్తి జనతాదళ్ (సెక్యులర్) పార్టీని వీడి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు.

కలలే కేశవమూర్తి 2016లో జరిగిన ఉప ఎన్నికలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ ప్రసాద్పై 21,334 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బి. హర్షవర్ధన్ చేతిలో 12,479 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

మూలాలు

[మార్చు]
  1. "Keshavamurthy of JD(S) joins Cong" (in Indian English). The Hindu. 15 February 2017. Archived from the original on 14 May 2025. Retrieved 14 May 2025.
  2. "Congress rebuffs BJP, wins both Karnataka seats with big margin". The Times of India. 14 April 2017. Archived from the original on 14 May 2025. Retrieved 14 May 2025.