Jump to content

కల్పనా పటోవరీ

వికీపీడియా నుండి
కల్పనా పటోవరీ
జననం
సోర్భోగ్, అస్సాం, భారతదేశం
ఇతర పేర్లుభోజ్‌పురి రాణి[1][2][3]
విద్యాసంస్థకాటన్ విశ్వవిద్యాలయం
భట్‌ఖండే మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్ డీమ్డ్ యూనివర్శిటీ
వృత్తిగాయని, నటి
క్రియాశీల సంవత్సరాలు1993–ప్రస్తుతం
జీవిత భాగస్వామిపర్వేజ్ ఖాన్
పిల్లలు2

కల్పనా పటోవరీ అస్సాం రాష్ట్రానికి చెందిన భారతీయ నేపథ్య గాయని, జానపద గాయని. ఆమె అనేక భారతీయ భాషలలో పాటలు, జానపద సంగీతాన్ని రికార్డ్ చేసింది. ఆమె పాటలలో భోజ్‌పురి సంగీతం ప్రధాన శైలిగా ఉంటుంది.[4][5]

ఆమె 4 సంవత్సరాల వయస్సులో కెరీర్ ప్రారంభించింది. లక్నోలోని భట్ఖండే సంగీత విశ్వవిద్యాలయంలో హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంలో సంగీత బిషారద్ కోసం దీపేన్ రాయ్, శిఖా దత్తా ల వద్ద శిక్షణ పొందింది.[6][7] ఆమె తన సోలో సంగీత ప్రయాణంలో భోజ్‌పురి, అస్సామీ, హిందీ, మరాఠీ, బెంగాలీ, ఇంగ్లీష్ లతో సహా 32 భాషలలో పాటలు పాడింది.[8][9][10]

ప్రారంభ జీవితం

[మార్చు]

కల్పనా పటోవరీ అస్సాంలోని బార్పేట జిల్లాలో నాథ్ సంప్రదాయ సమాజానికి చెందిన యోగి-నాథ్ కుటుంబంలో జన్మించింది. ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రురాలైన ఆమె గౌహతిలోని కాటన్ కళాశాల పూర్వ విద్యార్థి. తన తండ్రి జానపద గాయకుడు బిపిన్ నాథ్ పటోవరీ వద్ద కామరూపియా, గోల్పోరియా జానపద సంగీతంలో శిక్షణ పొందింది. ఆమె 4 సంవత్సరాల వయస్సులో తన తండ్రితో కలిసి బహిరంగంగా ప్రదర్శన ఇవ్వడం ప్రారంభించింది. భట్ఖండే మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ యూనివర్శిటీ, లక్నో నుండి భారతీయ శాస్త్రీయ సంగీతంలో సంగీత విశారద్ పూర్తిచేసింది.[11][12] ఆమె పూర్వి, పచ్రా, కజ్రి, సోహర్, వివాహ్ గీత్, చైతా, నౌటంకి వంటి అనేక రకాల భోజ్‌పురి జానపద సంగీతాన్ని పాడుతుంది.[13][14]

ఆమె భిఖారి ఠాకూర్ పనిని గుర్తుచేస్తూ ఒక ఆల్బమ్ ను విడుదల చేసింది.[15][16]

కెరీర్

[మార్చు]

పాత ఖాదీ బిర్హా సంప్రదాయాన్ని అంతర్జాతీయ వేదికలకు పరిచయం చేసిన ప్రారంభ భోజ్‌పురి గాయకురాలిగా కల్పనా పటోవరీ విశిష్టతను కలిగి ఉంది.[17]

2013 డిసెంబరు 8న విడుదలైన బిడెసియా ఇన్ బంబాయి అనే డాక్యుమెంటరీ చిత్రంలో ఆమె నటించింది. ఈ డాక్యుమెంటరీ వలస కార్మికుల దృక్పథాన్ని అందిస్తుంది.[18]

భారత సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నాలుగు లాటిన్ అమెరికన్ దేశాలలో 15 రోజుల పర్యటనలో ప్రదర్శన ఇవ్వడానికి ఆమెకు ఆహ్వానం అందింది.[19]

గతంలో పురుష కళాకారుల ఆధిపత్యం ఉన్న ఛప్రాహియా పూర్వి శైలిలో రికార్డ్ చేసి పాడిన మొదటి మహిళగా ఆమె సాధించిన మార్గదర్శక సాధన ఒక ముఖ్యమైన విజయం.

ఆమె భోజ్‌పురి చిత్రం "చలత్ ముసాఫర్ మొహ్ లియో రే" లో తన తొలి నటనా ప్రవేశం చేసింది, ఇందులో సహ నటుడు దినేష్ లాల్ యాదవ్ తో కలిసి జానకీ పాత్రను పోషించింది.[20][21]

ఆమె ఎన్డిటివి ఇమాజిన్ లో రియాలిటీ షో జునూన్-కుచ్ కర్ దిఖానే కా (2008)లో పాల్గొంది.

రాజకీయ జీవితం

[మార్చు]

జూలై 2018లో, పాట్నా జరిగిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు అమిత్ షా, బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ సమక్షంలో ఆమె ఆ పార్టీ సభ్యుడరాలయింది.[22][23][24]

అక్టోబరు 2020లో గువహాటిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె అసోం గణ పరిషత్ తో అనుబంధం ఏర్పరచుకుంది.[25][26]

2021 అసోం శాసనసభ ఎన్నికలలో, ఆమె సరుఖేత్రి నియోజకవర్గం నుండి అసోం గణ పరిషత్ అభ్యర్థిగా పోటీ చేసింది. అయితే, భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి జాకీర్ హుస్సేన్ సిక్దర్ చేతిలో ఆమె ఓటమి చవిచూసింది.[27]

మూలాలు

[మార్చు]
  1. "Assam: Singer Kalpana Patowary awarded for contribution to Bhojpuri music". NorthEast Now. 25 January 2019.
  2. "'I became used to the fact that when I sing, guns go off': Bhojpuri star Kalpana Patowary". Scroll.in. 15 September 2015.
  3. "An audience with the Bhojpuri Queen". The Asian Age. 26 September 2016.
  4. "Assamese singer Kalpana Patowary resurrects Bhojpuri Shakespeare". easternfare.in. Eastern Fare Music Foundation. Retrieved 27 July 2015.
  5. Matta, Anubhuti (7 October 2017). "Spotlight on female voices at folk and fusion music festival". Hindustan Times.
  6. "Kalpana Patowary ने 4 साल की उम्र में ही शुरू कर दी थी सिंगिंग, 'बिरहा' गायकी से मचा डाली धूम...देखें Video". NDTVIndia. Retrieved 13 August 2023.
  7. "Meet Kalpana Patowary, the Assamese 'Bhojpuri Melody Queen' from Guwahati!". thenortheasttoday.com (in Indian English). 18 October 2016. Retrieved 13 August 2023.
  8. "To Be Able to Sing in Bhojpuri was my biggest achievement: Singer Kalpana Patowary". India Today NE (in ఇంగ్లీష్). 5 July 2022. Retrieved 13 August 2023.
  9. "Kalpana Patowary to pay tribute to Ray in 'Har Har Byomkesh'". Business Standard.
  10. "Kalpana patowary की ताज़ा ख़बर, ब्रेकिंग न्यूज़ in Hindi - NDTV India". ndtv.in. Retrieved 13 August 2023.
  11. "भोजपुरी सॉन्ग 'ऐ गणेश के पापा' ने बदली इस सिंगर की जिंदगी, सावन में हुआ वायरल- देखें Video". NDTVIndia. Retrieved 13 August 2023.
  12. "Kalpana Patowary OkListen!". OkListen.
  13. "Folk traditions to come alive". Deccan Herald. 21 July 2015. Retrieved 27 November 2018.
  14. "Bhojpuri Singer Kalpana Patowary: Latest News, Videos and Photos of Bhojpuri Singer Kalpana Patowary | Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 13 August 2023.
  15. Tripathi, Shailaja (16 June 2012). "On the Shakespeare of Bhojpuri". The Hindu.
  16. "Kalpana Patowary". Zee News (in హిందీ). Retrieved 13 August 2023.
  17. "Meet Kalpana Patowary, the Assamese 'Bhojpuri Melody Queen' from Guwahati!". The North East Today. 28 October 2016. Archived from the original on 21 October 2016. Retrieved 30 June 2017.
  18. Bhattacharya, Budhaditya (22 August 2013). "Of migration and mobiles". The Hindu.
  19. Digital Desk, Northeast Live (10 April 2018). "Kalpana Patowary to sing at the Commonwealth Games". Northeast Live (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 13 August 2023.
  20. "Kalpana Patowary: Top Bhojpuri songs of the popular singer". The Times of India. 1 November 2018.
  21. "Nirahua recalls first Bhojpuri film 'Ganga Maiyya Tohe Piyari Chadhaibo'". The Times of India. 23 February 2021.
  22. "Bhojpuri singer Kalpana Patowary joins BJP". The Indian Express (in ఇంగ్లీష్). 13 July 2018. Retrieved 13 August 2023.
  23. "Bhojpuri singer Kalpana Patowary joins BJP". The New Indian Express. Retrieved 13 August 2023.
  24. "Bhojpuri singer Kalpana Patowary joins BJP". DNA India (in ఇంగ్లీష్). Retrieved 13 August 2023.
  25. "Assam: Popular folk singer Kalpana Patowary joins AGP". India Today. 9 October 2020.
  26. "Assam: Bhojpuri queen Kalpana Patowary joins Asom Gana Parishad". EastMojo. 9 October 2020. Archived from the original on 22 ఆగస్టు 2023. Retrieved 12 ఫిబ్రవరి 2025.
  27. "Assam Election Result 2021 | Sarukhetri Assembly Constituency: Jakir Hussain Sikdar defeats Kalpana Patowary, Manik Chandra Bora". Moneycontrol (in ఇంగ్లీష్). 2 May 2021. Retrieved 13 August 2023.