కల్వకుంట్ల కవిత

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కల్వకుంట్ల కవిత
కల్వకుంట్ల కవిత

పదవీ కాలము
2014-
ముందు మధూ యాష్కీ
నియోజకవర్గము నిజామాబాదు

జననం 1978 (age 39–40)
కరీంనగర్, తెలంగాణ, భారత దేశము
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
సంతానము 2
నివాసము హైదరాబాదు, తెలంగాణ, భారతదేశము
మతం హిందూ

కల్వకుంట్ల కవిత (జననం మార్చి 13, 1978) భారతదేశ రాజకీయ ఉద్యమకారిణి. ఆమె తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు.ఈ సంస్థ తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమములను నిర్వహిస్తుంది.[1] ఈమె తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం అనేక ఉద్యమాలు నడపడంలో క్రియాశీలక పాత్ర పోషించారు.[2]

ప్రారంభ జీవితం[మార్చు]

కవిత కరీంనగర్లో తెలంగాణ రాష్ట్ర సమితి అద్యక్షుడు మరియు తెలంగాణ రాష్త్ర తొలి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరియు శోభలకు జన్మించింది.[3] ఆమె స్టాన్లీ బాలికల పాఠశాలలో విద్యనభ్యసించింది. ఆ తర్వాత VNRVJIET నుండి ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. 2001 లో అమెరికన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.[4]

జీవిత విశేషాలు[మార్చు]

2006 లో ఆమె నల్గొండ జిల్లాలోని కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని అచటి పేద పిల్లలకు ఉచిత విద్యనందించి స్థానిక ప్రజలకు ఎంతో సహకరించింది. 2009 లో కొన్ని తెలుగు చలన చిత్రాలలో తెలంగాణ భాష మరియు సంస్కృతిని అవహేళనకు గురి అగుచున్నదని నంది అవార్డుల ప్రదానోత్సవంలో నిరసన తెలియజేశారు. 2010 లో అదుర్స్ సినిమా తెలంగాణలో విడుదల అయినపుడు వ్యతిరేకించి వార్తలలో ప్రముఖంగా నిలిచింది. అదుర్స్ సినిమాలోని నిర్మాణ వర్గం తెలంగాణ రాష్ట్ర యేర్పాటును వ్యతిరేకిస్తున్నందున ఆ సినిమా విడుదలను అడ్డుకొని వార్తలకెక్కింది.

ఆమె తెలంగాణ రాష్ట్ర యేర్పాటు ఉద్యమంలో క్రియాశీలక పాత్రను 2009 నుండి 2014 వరకు పోషించారు. 2014 లో ఆమె 16 వ లోక సభకు నిజామాబాదు లోకసభ నియోజకవర్గం నుండి ఎన్నికైనారు.[1][2].[5]

వ్యక్తిగత జీవితం[మార్చు]

కల్వకుంట్ల కవిత దేవన్‌పల్లి అనిల్ ను వివాహమాడారు. ఆయన ఒక మెకానికల్ ఇంజనీరు. వారికి ఇద్దరు కుమారులు. వారు ఆదిత్య (జ.2003) మరియు ఆర్య (జ.2007).[6]

మూలాలు[మార్చు]

వంశవృక్ష ఆధారం[మార్చు]