కల్వకుర్తి రెవెన్యూ డివిజను
కల్వకుర్తి రెవెన్యూ డివిజను | |
|---|---|
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | నాగర్‌కర్నూల్ |
కల్వకుర్తి రెవెన్యూ డివిజను అనేది తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం. నాగర్‌కర్నూల్ జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. దీని పరిపాలనలో 5 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం కల్వకుర్తి పట్టణంలో ఉంది.[2] 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[3] ఇది నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంలోని కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.
వివరాలు
[మార్చు]ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[4]
పరిపాలన
[మార్చు]కల్వకుర్తి డివిజన్‌లోని మండలాలు:[5]
| క్ర.సం | కల్వకుర్తి రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
|---|---|---|
| 1 | కల్వకుర్తి మండలం | 19 రెవెన్యూ గ్రామాలు |
| 2 | ఊర్కొండ మండలం | 12 రెవెన్యూ గ్రామాలు |
| 3 | వెల్దండ మండలం | 15 రెవెన్యూ గ్రామాలు |
| 4 | వంగూరు మండలం | 19 రెవెన్యూ గ్రామాలు |
| 5 | చారకొండ మండలం | 7 రెవెన్యూ గ్రామాలు |
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "Suryapet district" (PDF). New Districts Formation Portal. the original (PDF) నుండి 11 October 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-11-25.
- ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-11-25.
- ↑ "REVENUE DIVISIONS | Nagarkurnool District,Telangana | India". the original నుండి 2022-10-20 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-11-25.
- ↑ "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. ఒరిజినల్ నుండి 2021-12-28 న ఆర్కైవు చెయ్యబడింది (PDF) చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-11-25.