Jump to content

కళానిధి (మాసపత్రిక)

వికీపీడియా నుండి
కళానిధి
సంపాదకులుకొడవటిగంటి కృష్ణమూర్తి
వర్గాలుకథల పత్రిక
తరచుదనంమాసపత్రిక
మొదటి సంచికఫిబ్రవరి 1, 1935 (1935-02-01)
దేశం India
భాషతెలుగు

కళానిధి ప్రత్యేకముగా కథలను ప్రచురించేందుకు ఉద్భవించిన తెలుగు మాసపత్రిక. కొడవటిగంటి కృష్ణమూర్తి ఈ పత్రికకు సంపాదకుడు. దీని తొలి సంచిక 1935 ఫిబ్రవరిలో వెలువడింది. తెనాలి నుండి ఈ పత్రిక ప్రచురితమయ్యింది. ఈ పత్రిక విడి ప్రతి వెల నాలుగు అణాలు కాగా వార్షిక చందా మూడు రూపాయలు.

రచనలు

[మార్చు]
  • నిలవనీరు
  • చుక్కమ్మ
  • అదృష్టవంతుడు

రచయితలు

[మార్చు]

విశేషాలు

[మార్చు]

ఈ పత్రిక ప్రత్యేకతను ఆంధ్రభూమి ఈ విధంగా ప్రస్తావించింది."కళానిధి వ్యాసకారులను సత్కరింపకుండ వారి రచనలను గైకొనదు. తెనుగున ధనవంతులు నడుపు పత్రికలే ఈ పద్ధతి నింతవఱకు పూర్తిగ నవలంబింపలేదు. కొన్నిచోట్ల మొగమాటముగలవారికి, సంపాదకుని స్నేహితులకు మాత్రము డబ్బు ముట్టుచున్నది. మఱియొక సచిత్రమాసపత్రిక సంపాదకుడు పత్రికమీద లాభము తీయుచున్నను రచయితలకు కానీయైన రాల్పడు. ఇట్టిస్థితిలో కళానిధి ఇట్టి ఉన్నతాదర్శమును బెట్టుకొనుట తెనుగు జర్నలిజమునకొక నైతికాదర్శమును చూపుటయే."[1]

మూలాలు

[మార్చు]
  1. ఆండ్ర శేషగిరిరావు (1 February 1935). "సంపాదకీయ సమాలోచన". ఆంధ్రభూమి మాసపత్రిక. 3 (10): 764. Retrieved 2 March 2025.