కళ్యాణదుర్గం
కళ్యాణ దుర్గం | |
— పట్టణం — | |
కళ్యాణదుర్గం కొండలు | |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళ్యాణదుర్గం స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 14°33′00″N 77°06′00″E / 14.5500°N 77.1000°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనంతపురం |
మండలం | కళ్యాణదుర్గం |
వైశాల్యము | |
- మొత్తం | 34.92 km² (13.5 sq mi) |
ఎత్తు | 656 m (2,152 ft) |
జనాభా (2011) | |
- మొత్తం | 32,328 |
- పురుషుల సంఖ్య | 16,036 |
- స్త్రీల సంఖ్య | 16,292 |
- గృహాల సంఖ్య | 7,220 |
పిన్ కోడ్ | 515761 |
ఎస్.టి.డి కోడ్ | 08497 |
కళ్యాణదుర్గం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం మండలానికి చెందిన పట్టణం, మండల, కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజనుకు కేంద్రం. ఇది పురపాలకసంఘం హోదా కలిగి ఉంది.[1] ఇది అనంతపురం లోకసభ నియోజకవర్గంలోని, కళ్యాణ దుర్గం శాసనసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.
చరిత్ర[మార్చు]
శ్రీ కృష్ణదేవరాయలు పాలించిన విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉంది. రాజలు పరిపాలించిన కాలంనాటి గజెటర్ ప్రకారం రాయదుర్గ్, చిత్రదుర్గ, కళ్యాణదుర్గ్ ఈ మూడు ముఖ్యమైన కోటలుగా ఉండేవని తెలుస్తుంది. వీటిని ఒకప్పుడు బోయ పాలెగర్ పాలించాడు. కల్యాణదుర్గ అనే పేరు 16 వ శతాబ్దంలో పాలేగర్ బోయ కల్యాణప్ప నుండి వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది. 1893 డిసెంబరులో బ్రిటిష్ పాలకులు అప్పటి మద్రాసు ప్రెసెడెన్సీలోని ధర్మవరం, రాయదుర్గ్ (బళ్లారి) తాలూకాల నుండి చీల్చి కల్యాణదుర్గ్ తాలూకాను ఏర్పాటు చేశారు. 2012 మార్చిలో కళ్యాణదుర్గం పురపాలక సంఘంగా ఏర్పడింది.
భౌగోళికం[మార్చు]
జిల్లా కేంద్రమైన అనంతపూరు కు పశ్చిమంగా 60 కి.మీ. దూరంలో వుంది.
జనగణన గణాంకాలు[మార్చు]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, కళ్యాణదుర్గం పట్టణ పరిధిలో మొత్తం జనాభా 32,328 మంది ఉన్నారు. అందులో పురుషులు 16,036 కాగా, మహిళలు 16,292 మంది ఉన్నారు. లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 1016 మంది మహిళలుగా ఉంది. పట్టణంలో పిల్లలు 0-6 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న పిల్లలు 3,404 మంది ఉన్నారు.ఇది కళ్యాణదుర్గం పట్టణ జనాభాలో 10.53% గా ఉంది. పట్టణంలో లింగ నిష్పత్తి 1016. ఇది రాష్ట్ర సగటు 993 కంటే మెరుగు. పురుషుల అక్షరాస్యత 80.93% కాగా, మహిళా అక్షరాస్యత 67.51% గా ఉంది.[2]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం పట్టణ పరిధిలో మొత్తం 7,220 గృహాలున్నాయి.[2]
పరిపాలన[మార్చు]
కళ్యాణదుర్గం పురపాలకసంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
పర్యాటక ఆకర్షణలు[మార్చు]
- అక్కమాంబ ఆలయం: గ్రామ దేవత. ఈ ఆలయంలో సప్తమాతలకు ప్రతీకగా శ్రీ అక్కమాంబాదేవి సజీవ జీవకళ ఉట్టిపడే రీతిలో భాసిల్లుతోంది.
- శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం: పట్టణం నడిబొడ్డున ఉంది. ఈ ఆలయం 16 వ శతాబ్దంలో నిర్మించబడింది.
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-20. Retrieved 2020-06-26.
- ↑ 2.0 2.1 "Kalyandurg Census Town City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-26.
వెలుపలి లంకెలు[మార్చు]
