కళ్యాణలక్ష్మి పథకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కళ్యాణలక్ష్మి
కళ్యాణలక్ష్మి లోగో
పథకం రకంఆడబిడ్డల వివాహానికి ₹1,00,116 సాయం
ప్రాంతంతెలంగాణ, భారతదేశం
ప్రధాన వ్యక్తులుతెలంగాణ ప్రజలు
స్థాపనఅక్టోబర్‌ 2, 2014
బడ్జెట్ప్రతి సంవత్సరం ₹1450 కోట్లు
వెబ్ సైటుఅధికారిక వెబ్ సైట్
నిర్వాహకులుముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,
తెలంగాణ ప్రభుత్వం

కళ్యాణలక్ష్మి పథకం తెలంగాణ రాష్ట్రం లోని నిరుపేద (దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన) యువతుల వివాహాల కోసం రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014, అక్టోబర్ 2న ప్రవేశపెట్టిన పథకం.[1] 2017, మార్చి 13న ప్రవేశపెట్టిన 2017-18 తెలంగాణ బడ్జెట్ లో ఈ పథక ఆర్థిక సాయాన్ని రూ.51వేల నుండి రూ.75,116 లకు పెంచారు. 2018, మార్చి 19న రూ.1,00,116 కు పెంచారు.[2] దివ్యాంగ ఆడబిడ్డలకు రూ.1,25,016 అందజేస్తోంది.

ప్రారంభం[మార్చు]

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అక్టోబరు 2, 2014 నుంచి ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు.[1][3] 18ఏళ్లు వయోపరిమితి ఉన్న బీసీ, ఓబీసీ యువతులకు ఈ పథకం వర్తిస్తుంది. గ్రామాల్లో ఆదాయం రూ.లక్షన్నర, పట్టణాల్లో రూ.2 లక్షల ఆదాయం ఉన్న వారు ఈ పథకానికి అర్హులు.

పథకం[మార్చు]

ఈ పథకానికి 2014-15 బడ్జెటులో 230 కోట్ల రూపాయలు, 2016-17 బడ్జెటులో 738 కోట్ల రూపాయలు, 2018 బడ్జెట్లో 1,450 రూపాయలు కేటాయించబడ్డాయి.[4][5] 2018 మార్చి 19న ఆర్థిక సహాయం ₹75,116 నుండి ₹1,00,116కి పెంచబడింది. ఇది పెళ్లి సమయంలో వధువు కుటుంబానికి పెళ్లి ఖర్చుల కోసం అందించబడుతుంది.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద 2021, సెప్టెంబరు 18వ తేదీనాటికి 7,14,575 మంది ఆడపిల్లలకు లబ్ధిచేకూరింది. దీనికోసం ప్రభుత్వం రూ.5,556.54 కోట్లు వెచ్చించింది. 2022, నవంబరు 18వ తేదీనాటికి 11,62,917 మంది ఆడపిల్లల పెళ్ళిలకు రూ.10,000 కోట్లు అందజేయబడింది. ఆర్థికసాయాన్ని అందజేశారు. ఇప్పటివరకు ఈ పథకానికి 13,18,983 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 11,62,917 మందికి ఈ పథకం వచ్చింది.[6]

నిధుల కేటాయింపు[మార్చు]

 • 2018–19 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ లో ₹1450 కోట్లు కేటాయించబడింది.
 • కళ్యాణలక్ష్మి పథకం కింద 2020-21, 2022-23 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌లో ₹1850 కోట్లు కేటాయించి,[7][8] ఒకేసారి విడుదల చేసింది.
 • 2023–24 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ లో ₹2000 కోట్లు కేటాయించి, 2023 ఏప్రిల్ 19న ఆ మొత్తం నిధులను మొదటి త్రైమాసికం విడతలోనే విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.[9][10]

నియమాలు - అర్హతలు[మార్చు]

 1. అర్హులైన యువతులు తమ వివాహానికి నెల రోజుల ముందు మీ-సేవ కేంద్రాల నుంచి దరఖాస్తు చేసుకోవాలి
 2. దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన యువతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు
 3. ధరఖాస్తుదారులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. వారి కుటుంబ సభ్యుల ఆదాయం రూ. 2 లక్షలకు మించకూడదు
 4. వివాహ సమయానికి అమ్మాయి వయసు 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి
 5. బ్యాంకు ఖాతా పుస్తకం (వధువు పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి తీసుకున్న బ్యాంకు ఖాతా పుస్తకంపై వధువు ఫొటో తప్పనిసరిగా ఉండాలి)

కావలసిన ధ్రువపత్రాలు[మార్చు]

 1. పుట్టిన తేదీ ధృవపత్రం (మీసేవ ద్వారా సంబంధిత అధికారులు జారీ చేసినది)
 2. కులం ధృవీకరణ పత్రం (మీసేవ ద్వారా సంబంధిత అధికారులు జారీ చేసినది)
 3. ఆదాయ ధృవీవకరణ పత్రం (వివాహం జరుగు తేదీ నాటికి 6 నెలలలోపు మీ-సేవ ద్వారా సంబంధిత అధికారిచేత జారీ చేసినది)
 4. పెళ్లికూతురు, పెళ్ళికుమారుడికి చెందిన ఇద్దరి ఆధార్ కార్డులు
 5. బ్యాంకు ఖాతా పుస్తకం (వధువు పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి తీసుకున్న బ్యాంకు ఖాతా పుస్తకంపై వధువు ఫొటో తప్పనిసరిగా ఉండాలి)
 6. వివాహ ఆహ్వాన పత్రిక

ధరఖాస్తు విధానం[మార్చు]

తెలంగాణ ఈపాస్లో ధరఖాస్తు చేసుకోవాలి. పెళ్ళికి 10 రోజుల ముందు ఆర్థిక సహాయం అందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

ఇతర వివరాలు[మార్చు]

వివాహం జరిగిన తరువాత కళ్యాణలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం చేయాలనే నిబంధనను మార్చి, పెళ్ళి అవసరాలకోసం డబ్బును ముందే అందించాలన్న ఉద్దేశంతో దరఖాస్తు చేసిన కొద్ది రోజులలోనే ఆ దరఖాస్తు ఫారాలను పరిశీలించి, రూ.1,00,116 ఆర్థిక సాయం వధువు పేరుమీద ఉన్న బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయంలో, లేదా దగ్గరలోని తహసీల్దార్ కార్యాలయంలో పూర్తి సమాచారం పొందవచ్చు. ఈ పథకం ద్వారా మార్చి 2018 నాటికి 3,65,000 మందికి లబ్ధి చేకూరింది.[11]

 1. 2020లో 1.67 లక్షల పైచిలుకు మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు అందాయి.

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వం, పథకాలు. "Kalyana Lakshmi". www.telangana.gov.in. Archived from the original on 22 November 2016. Retrieved 18 December 2016.
 2. నమస్తే తెలంగాణ, తెలంగాణ న్యూస్ (20 March 2018). "1,00,116 కల్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ సాయం పెంపు". Retrieved 20 March 2018.[permanent dead link]
 3. మన తెలంగాణ వార్తలు. "నేటి నుంచి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ప్రారంభం". manatelanganavarthalu.com. Archived from the original on 13 April 2017. Retrieved 14 March 2017.
 4. "తెలంగాణ బడ్జెట్ 2018: ఈటల ప్రసంగం". Samayam Telugu. 2018-03-15. Archived from the original on 2022-10-12. Retrieved 2022-10-12.
 5. Mar 15, TIMESOFINDIA COM / Updated:; 2018; Ist, 13:23 (2018-03-15). "Telangana Budget 2018: Highlights of Telangana budget 2018-19 | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2018-04-17. Retrieved 2022-10-12. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
 6. telugu, NT News (2022-11-21). "సంక్షేమంలో తెలంగాణ సరికొత్త రికార్డు.. కల్యాణలక్ష్మి @ 10000 కోట్లు". www.ntnews.com. Archived from the original on 2022-11-21. Retrieved 2022-11-23.
 7. ""Kalyana Lakshmi Information"". Archived from the original on 2021-11-28. Retrieved 2021-11-28.
 8. మన తెలంగాణ, రాష్ట్ర వార్తలు (26 November 2021). "కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలకు నిధులు మంజూరు". Punnam Venkatesh. Archived from the original on 28 November 2021. Retrieved 28 November 2021.
 9. telugu, NT News (2023-04-20). "Kalyana Lakshmi | కల్యాణలక్ష్మికి 2000 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం". www.ntnews.com. Archived from the original on 2023-04-20. Retrieved 2023-04-22.
 10. "Kalyanalakshmi: కల్యాణలక్ష్మికి రూ.2 వేల కోట్లు". Sakshi Education. 2023-04-20. Archived from the original on 2023-04-22. Retrieved 2023-04-22.
 11. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (2 June 2019). "మన తెలంగాణ ఘన తెలంగాణ". Archived from the original on 2 June 2019. Retrieved 15 June 2019.