కళ్యాణి (ధారావాహిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కళ్యాణి (ధారావాహిక)
Gemini TV Kalyani Serial Title.jpeg
కళ్యాణి (ధారావాహిక) పోస్టర్
వర్గంకటుంబ కథ
రచయితమునుస్వామి పులయలమ్ (మాటలు), చంద్రశేఖర్ ఆజాద్ (1- 43), కరీముల్లా (44-ప్రస్తుతం)
దర్శకత్వంగోపి కసిరెడ్డి (1- 43)
కోలా నాగేశ్వరరావు (44 - ప్రస్తుతం)
తారాగణంహారిక, జాయ్ డిసౌజా, ప్రభాకర్, ప్రియ, నిహారిక
టైటిల్ సాంగ్ కంపోజర్లీలామోహన్
ఓపెనింగ్ థీమ్"కడలికి కన్నీళ్ళు" (గానం: మాళవిక, రచన: రామచంద్రమౌళి)
మూల కేంద్రమైన దేశంభారతదేశం
వాస్తవ భాషలుతెలుగు
సీజన్(లు)1
ఎపిసోడ్ల సంఖ్య131 (2019, నవంబరు 30 వరకు)
నిర్మాణం
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుతూట మాధవుడు
నిర్మాతలుజాస్తి రవీంద్రనాథ్ ఠాగూర్, జాస్తి శరత్
సంపాదకులుసామ్రాట్
సినిమాటోగ్రఫీనాగేంద్ర కుమార్ గుమ్మడి
కెమెరా సెటప్మల్టీ కెమెరాలు
మొత్తం కాల వ్యవధి20-22 నిముషాలు
ప్రొడక్షన్ సంస్థ(లు)శ్లోక్ & శ్రీనిక ఎంటర్టైన్మెంట్స్
ప్రసారం
వాస్తవ ప్రసార ఛానల్జెమినీ టీవీ
చిత్ర రకం576ఐ ఎస్.డి, 1080ఐ హెచ్.డి
Original airing17 జూన్, 2019 - ప్రస్తుతం
క్రోనోలజీ
Preceded byనాగిని 3
Followed byమధుమాసం

కళ్యాణి 2019, జూన్ 17న జెమినీ టీవీలో ప్రారంభమైన ధారావాహిక. ప్రారంభంలో సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 9 గంటలకు ప్రసారంకాబడిన ఈ ధారావాహిక 2019, సెప్టెంబరు 2వ తేదినుండి మధ్యాహ్నం 1 గంటలకు ప్రసారం చేయబడుతుంది.[1] ఇందులో హారిక, జాయ్ డిసౌజా, ప్రభాకర్, ప్రియ, నిహారిక తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.

కథా సారాంశం[మార్చు]

జన్మలోపం కారణంగా తన తల్లి వ్యాపారవేత్త తులసిదేవి చేత వదిలిపెట్టబడిన అంధ అమ్మాయి కల్యాణి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. తన తల్లి బ్రతికుందనిన తెలియకుండా తండ్రి సహాయంతో తాతనానమ్మల వద్ద కళ్యాణి పెరుగుతుంది. అనుకోనివిదంగా కళ్యాణి తన తల్లిని కలుస్తుంది, తరువాత వారి మధ్య విభేదాలు వస్తాయి. తులసిదేవి కళ్యాణిని ద్వేషిస్తుంటుంది. తల్లి, కుమార్తె కలుసుకుంటారా అనేది కథాంశం.

నటవర్గం[మార్చు]

 • హారిక (కళ్యాణి)[2]
 • జాయ్ డిసౌజా (అరవింద్)[3]
 • ప్రభాకర్ (రాజశేఖర్-కళ్యాణి, నేహా ల తండ్రి)[4]
 • ప్రియ (తులసిదేవి-కళ్యాణి, నేహా ల తల్లి)
 • జ్యోతిక మణిరత్నం (నేహా)
 • నిహారిక (గాయత్రి-అరవింద్ తల్లి)[5]
 • అఖిల్ సర్తక్[6] (కార్తీక్)

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: గోపి కసిరెడ్డి (1- 43), కోలా నాగేశ్వరరావు (44 - ప్రస్తుతం)
 • టైటిల్ సాంగ్ కంపోజర్: లీలామోహన్
 • ఓపెనింగ్ థీమ్: "కడలికి కన్నీళ్ళు" (గానం: మాళవిక, రచన: రామచంద్రమౌళి)
 • ఎగ్జిక్యూటివ్ నిర్మాతం తూట మాధవుడు
 • నిర్మాతలు: జాస్తి రవీంద్రనాథ్ ఠాగూర్, జాస్తి శరత్
 • ఎడిటింగ్: సామ్రాట్
 • సినిమాటోగ్రఫీ: నాగేంద్ర కుమార్ గుమ్మడి

ఇతర వివరాలు[మార్చు]

46వ ఎపిసోడ్ లో సంపూర్ణేష్ బాబు అతిథి పాత్రలో నటించాడు.

మూలాలు[మార్చు]

 1. "SunNetwork - Program Detail". www.sunnetwork.in. Retrieved 1 December 2019.
 2. Gup Chup Masthi (12 July 2019), Unknown facts about Kalyani serial actress Harika | Gemini Tv | Gup Chup Masthi, retrieved 1 December 2019
 3. "Jay Jujje D'Souza". The Times of India (in ఇంగ్లీష్). 27 November 2018. Retrieved 1 December 2019.
 4. "Telugu Tv Actor Prabhakar Podakandla Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2019. Retrieved 1 December 2019.
 5. "Niharika". Onenov (in ఇంగ్లీష్). 13 June 2011. Archived from the original on 20 July 2019. Retrieved 1 December 2019.
 6. "🌟I was actually waiting for this day to come and it's here now , revealing my look from KALYANI SERIAL ' and I promise you guys that ull love th by akhilsarthak_official". Pintaram. Archived from the original on 20 July 2019. Retrieved 1 December 2019.