కవితా కృష్ణన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Kavita Krishnan
Kavita Krishnan 02.jpg
జననంKavita Krishnan
1973 (age 45–46)[1]
Coonoor, Tamil Nadu[1]
జాతీయతIndia
చదువుSt. Xavier's College, Mumbai, Jawaharlal Nehru University
సంస్థAll India Progressive Women's Association (AIPWA)
రాజకీయ పార్టీCommunist Party of India (Marxist-Leninist) Liberation

కవితా కృష్ణన్ అఖిల భారతీయ అభ్యుదయ మహిళా సమాఖ్య (AIPWA) కార్యదర్శి. భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్టు-లెనినిస్టు) (సిపిఐ-ఎంఎల్) ఆధ్వర్యంలో వెలువడుతున్న 'విమోచన ' మాస పత్రికకు సంపాదకురాలు కూడా. మహిళా హక్కుల ఉద్యమకారిణి. ఆమె నిర్భయ ఢిల్లీ గ్యాంగ్ రేప్ సంఘటనపై, ఆ తర్వాత మహిళలపై జరిగిన అనేక హింసాత్మక సంఘటనలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసింది.

స్వస్థలం[మార్చు]

కవిత తమిళనాడులోని కూనూర్లో జన్మించింది. చత్తీస్‌ఘఢ్ లోని భిలాయిలో పెరిగింది. ఆమె తండ్రి ఒక స్టీల్ ప్లాంట్‌లో ఇంజనీర్గా పనిచేసేవాడు. ఆమె తల్లి సునితా కృష్ణన్ ఆంగ్లం భాష అధ్యాపకురాలు. కవిత జె.ఎన్.యూనివర్సిటిలో ఇంగ్లీష్ సాహిత్యంలో ఎం.ఫిల్., పూర్తి చేసింది.

స్వేచ్చా శృంగార ఉద్యమం[మార్చు]

ఇటీవల (మే,2016) కవితా కృష్ణన్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. 'ఫ్రీ సెక్స్ ' (స్వేచ్ఛా శృంగారం') పేరుతో సామాజిక మాధ్యమాలలో ఆమె తన అభిప్రాయాలను వెలుబుచ్చి వార్తల్లో నిలిచారు[2]. పరస్పర అంగీకారంతో ఎవరు ఎవరితోనైనా, ఏ సమయంలో నైనా స్వేచ్ఛగా శృంగారంలో పాల్గొనే అవకాశం ఉండాలన్నది ఆమె అభిప్రాయం. అన్ ఫ్రీ సెక్స్ అనేది మహిళలను బలవంతపెట్టడం లాంటిదేనని.. సెక్సువల్ విషయాలకు సంబంధించి స్త్రీకి పూర్తి వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలన్నది ఆమె అభిప్రాయం. ఈ విషయంపై ఆమెకు కొంతమంది మద్దతుగా నిలిస్తే, మరికొందరు తీవ్రంగా విమర్శించారు. అలాంటి వారిలో డీఎం దాస్ ఒకరు. ఆయన కవితా కృష్ణన్‌ను "అమ్మ లేక మీ కూతురు ఫ్రీ సెక్స్ లో పాల్గొన్నారేమో అడుగు " అని ప్రశ్నించాడు. దీనిపై కవితా కృష్ణన్ కుడా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అవును "మా అమ్మ ఫ్రీ సెక్స్ చేసింది. మా అమ్మ లాగే మీ అమ్మ కూడా చేసే ఉంటుంది. లేకపోతే అది రేప్ అవుతుంది.. అర్థమైందా?" అంటూ సమాధానం ఇచ్చింది. ఇది ఇంతటితో ఆగకుండా.. కవితా కృష్ణన్ అమ్మకూడా ఇందులో భాగం అయింది. హాయ్ దాస్ నేను కవితా అమ్మను. నేను ఫ్రీ సెక్స్ లో పాల్గొన్నాను. అది నా ఇష్టపూర్వకంగా జరిగింది. నాకు నచ్చిన వ్యక్తులతో నాకు నచ్చిన సమయంలో సెక్స్ లో పాల్గొనే హక్కు నాకుంది. ప్రతి మహిళా లేదా పురుషుడు సెక్స్ విషయంలో తమకు నచ్చినట్టుగా ఉండే హక్కు ఉంది. బలవంతపు సెక్స్ చేయవద్దు. ఫ్రీ సెక్స్ చేయండి అంటూ కవితా కృష్ణన్ అమ్మ కుడా చెప్పింది. మహిళా హక్కుల కోసం గొంతెత్తి కొత్త నినాదం వినిపిస్తున్న ఈ తల్లీ కూతుళ్లను అభ్యుదయ మహిళాలోకం అభినందిస్తుంది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "The Mass Mobiliser". Cite web requires |website= (help)
  2. /తొవ్వ