కవిత (నటి)
కవిత | |
![]() | |
జననం | నిడమర్రు, పశ్చిమగోదావరి జిల్లా | 1965 సెప్టెంబరు 28
భార్య/భర్త | దశరథ్‌రాజ్ (1984 - 2021) |
ప్రముఖ పాత్రలు | పొట్టేలు పున్నమ్మ ప్రెసిడెంట్ పేరమ్మ కదలి వచ్చిన కనకదుర్గ |
కవిత తెలుగు చలనచిత్ర నటి. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలలో నటించింది. తమిళం, కన్నడ, మలయాళ భాషలలో 130 చిత్రాలలో నటించింది. ప్రస్తుతము కొన్ని టెలివిజన్ ధారావాహికలలో కూడా నటించింది.
నేపధ్యము[మార్చు]
పశ్చిమగోదావరి జిల్లా, నిడమర్రులో జన్మించింది. ఈవిడ ఆరు నెలల పిల్లగా ఉన్నప్పుడే వీరి కుటుంబం హైదరాబాద్ వచ్చేసింది. ఈమెకు ఆరేళ్లున్నప్పుడు మద్రాస్ కు మకాం మార్చారు. అక్కడ వీళ్ళ నాన్న వ్యాపారం చేసి సర్వం నష్ట పోయి, కుటుంబం రోడ్డున పడింది. ఒక్క పూట మాత్రం వీరికి తిండి పెట్టగలిగేవారు వీళ్ళ నాన్న. చదువులు చెప్పించే స్తోమత అసలే లేదు. దాంతో మద్రాసు లో తెలుగువారి కోసం ఉచితంగా చదువు చెప్పే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నది. అలాంటి సమయంలో వీళ్ళ నాన్నకు కృష్ణయ్య అనే నిర్మాత పరిచయమయ్యారు. ఆయన కవితను చూసి... 'చక్కగా ఉన్నావ్, సినిమాల్లో నటిస్తావా' అనడిగారు. ఈవిడ 'చదువుకోవాలీ అనేసి తిరస్కరించింది. కానీ వీరి నాన్న బలవంతంపై ఆడిషన్స్ కు హాజరైనది. అలా 'ఓ మంజు ' అనే తమిళ సినిమాలో 11 ఏళ్ళ వయస్సులో కథానాయికగా సినీరంగ ప్రవేశం చేసింది.
సినీరంగ ప్రవేశము[మార్చు]
ఓ మంజు అనే తమిళ చిత్రంలో కథానాయికగా 11 ఏళ్ళ వయసులో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ చిత్రం విజయం కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగులో సిరిసిరిమువ్వ చిత్రంలో జయప్రదకు చెల్లెలి పాత్రలో మొదటగా నటించింది. పూర్తి స్థాయి కథానాయికగా 'చుట్టాలున్నారు జాగ్రత్త' చిత్రంలో నటించింది.
రాజకీయ జీవితము[మార్చు]
ఈవిడ కొంతకాలం తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరించింది.
వ్యక్తిగత జీవితము[మార్చు]
1984 లో, 19 ఏళ్ళ వయస్సులో ఈవిడ వివాహం సింగపూర్ వ్యాపారవేత్త దశరథరాజ్ తో జరిగింది. వీరు చెన్నై లో మొదట తర్వాత హైదరాబాద్ లో స్థిరపడ్డారు. వారికీ ముగ్గురు కమార్తెలు, ఒక కొడుకు సంజయ్ రూప్ ఉన్నాడు.[1][2]
సమాజసేవ[మార్చు]
తన వలన నలుగురికీ కాస్తయినా మంచి జరగాలన్న ఉద్దేశంతో ‘హెల్పింగ్ హ్యాండ్స్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఇప్పటి వరకూ కొందరిని చదివించింది. కొందరు పేద యువతీ యువకులకు పెళ్ళిళ్లు జరిపించిందు. కొందరికి జీవితంలో స్థిరపడేందుకు సాయపడింది. కానీ ఇవన్నీ ప్రచారం చేసుకోలేదు.
కవిత నటించిన తెలుగు చిత్రాలు[మార్చు]
- సోగ్గాడు (1975)
- సిరిసిరిమువ్వ (1976)
- పొట్టేలు పున్నమ్మ (1978)
- శభాష్ గోపి (1978)
- ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
- అల్లుడు పట్టిన భరతం (1980)
- ఆరని మంటలు (1980)
- పారిజాతం (1980)
- బడాయి బసవయ్య (1980)
- బొమ్మల కొలువు (1980)
- మూగకు మాటొస్తే (1980)
- రక్తసంబంధం (1980)
- వెంకటేశ్వర వ్రత మహాత్యం (1980)
- సుబ్బారాయుడు సుబ్బలక్ష్మి (1980)
- అమృతకలశం (1981)
- గోలనాగమ్మ (1981)
- చిన్నారి చిట్టిబాబు (1981)
- శ్రీరస్తు శుభమస్తు (1981)
- కదలి వచ్చిన కనకదుర్గ (1982) - పార్వతి
- బంగారు భూమి (1982)
- డాక్టర్ సినీ యాక్టర్ (1982)
- ప్రతిజ్ఞ (1982)
- అగ్నిజ్వాల (1983)
- ఛండీ చాముండీ (1983)
- పల్లెటూరి పిడుగు (1983)
- ప్రళయ గర్జన (1983)
- బందిపోటు రుద్రమ్మ (1983)
- మాయగాడు (1983)
- ప్రేమ దీపాలు (1987)
- హలో డార్లింగ్ (1992)
- హైక్లాస్ అత్త లోక్లాస్ అల్లుడు (1997)
- నిన్నే పెళ్ళాడతా
- సాంబయ్య (1999)
- హోలీ (2002)
- నీతో వస్తా (2003)
- అదిరిందయ్యా చంద్రం (2005)
- సీతారాముడు (2006)
- గల్లీ కుర్రోళ్ళు (2011)
- రావే నా చెలియా (2021)
మూలాలు[మార్చు]
- ↑ V6 Velugu (30 June 2021). "సీనియర్ నటి కవిత ఇంట్లో తీవ్ర విషాదం." (in ఇంగ్లీష్). Archived from the original on 7 జూలై 2021. Retrieved 7 July 2021.
- ↑ Eenadu (30 June 2021). "నటి కవిత ఇంట్లో మరో విషాదం - senior actor kavitha husband passed away". www.eenadu.net. Archived from the original on 7 జూలై 2021. Retrieved 7 July 2021.