కస్తూరి మురళీకృష్ణ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కస్తూరి మురళీకృష్ణ
Kasthuri-Murali-Krishna.jpg
కస్తూరి మురళీకృష్ణ
జననం కస్తూరి మురళీకృష్ణ
10-01-65 /జనవరి 10, 1965
షక్కర్ నగర్, బోధన్ తాలూకా, నిజామాబాద్ జిల్లా
ఇతర పేర్లు నీలిమ, సూరజ్, లక్ష్మీలత, నీరజ్, శ్రీమాన్ సత్యవాది, పల్లవ్
వృత్తి రైల్వే ఉద్యోగి
ప్రసిద్ధి తెలుగు రచయిత,తెలుగు సాహితీకారులు
మతం హిందూ
పిల్లలు నాగసంధ్యాలక్ష్మీ
తండ్రి కె. సూర్యనారాయణ రావు
తల్లి కె. సత్యవతి
వెబ్‌సైటు
www.kasturimuralikrishna.com
కస్తూరి మురళీకృష్ణ వ్రాసిన పుస్తకాలు

కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని సృష్టించిన మురళీకృష్ణ రచనలు పాఠకాదరణ పొందాయి. మురళీకృష్ణ కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, భయానక, క్రైం మొదలైన పలు విభాగాలలో రచనలు చేశారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన పలు రచనలకు పాఠకుల ఆదరణతో పాటు రచనల పోటీల్లో బహుమతులు లభించాయి.

వ్యక్తిగత జీవితం[మార్చు]

రచన రంగం[మార్చు]

తెలుగు సాహిత్యంలో ఉన్న వీలైనన్ని ప్రక్రియలలో రచనలు చేసారు. విభిన్నాంశాల ఆధారంగా రచనలు చేస్తున్నారు. ఈయన ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి పత్రికలకు యెన్నొ నవలలు మరియు మరెన్నో సంకలనాలు, శీర్శికలు వ్రాసారు, అలాగే యెన్నో కాల్పనికేతర రచనలు చేసారు ఇవి కాక టివి స్స్రిప్టు రాస్తున్నారు. అసిధార, అంతర్మధనం, మర్మయోగం, సౌశీల్య ద్రౌపది , నవలలు పుస్తక రూపంలో వచ్చాయి. జీవితం – జాతకం, 4 x 5 , రాజతరంగిణి కథలు ,రియల్ స్టోరీస్, సైన్స్ ఫిక్షన్ కథలు , తీవ్రవాదం వంటి సంకలనాలు కూడా పుస్తక రూపంలో వచ్చాయి. భారతీయ తత్వ చింతన, మన ప్రధాన మంత్రులు, మన ముఖ్య మంత్రులు , భారతీయ వ్యక్తిత్వ వికాసం, తీవ్రవాదం, పాప్ ప్రపంచానికి రారాజు మైకెల్ జాక్సన్, అక్షరాంజలి పుస్తక రూపంలోకి వచ్చిన కాల్పనికేతర రచనలు. ఇవికాక, 2001 నుంచి ఆంధ్ర భూమి వార పత్రికలో ‘పవర్ పాలిటిక్స్ ‘ శీర్షిక వారం వారం రాస్తున్నారు. ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రతి గురువారం వెలువడే చిత్రప్రభ అనుబంధంలో సినీ సిత్రాలు అనే శీర్షికను నిర్వహిస్తున్నారు. ఈ శీర్షికలో సినిమా స్క్రిప్టు, దర్శకత్వం, ఎడిటింగ్ వంటి సాంకేతిక అంశాల గురించి వివరిస్తున్నారు. ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో సగటుమనిషి స్వగతం అనే శీర్షికను రచిస్తున్నారు. ఈభూమిలో సినీ సంగీత కళాకారులను పాడుతా తీయగా అనే శీర్షికన పరిచయం చేస్తున్నారు. ఇదే పత్రికలో సినిమాలుగా మారిన నవలల పరిచయం చేస్తున్నారు. ఆంధ్రభూమి దిన పత్రిక ప్రతి బుధవారం ప్రచురించే యువత ప్రత్యేక అనుబంధం యువ లో ఏదయినా ఏమయినా శీర్షికను నిర్వహిస్తున్నారు. కౌముది దాట్ నెట్ అనే వెబ్ పత్రికలో కథాసాగరమథనం శీర్షికన ప్రతినెలా ఆనెల ప్రచురితమయిన కథల విశ్లేషణ చేస్తున్నారు. ద్రష్ట అనే చారిత్రాత్మక సీరియల్ రచిస్తున్నారు. చిత్ర మాస పత్రికలో ఉపక్రమణము అనే సీరియల్ వస్తోంది, తీవ్రవాదం ఈ సీరియల్ నేపథ్యం. ఇవికాక, టివి స్క్రిప్ట్లు రాస్తున్నారు. కస్తూరి ప్రచురణలు స్థాపించి ఉత్తమ సాహిత్యాన్ని పుస్తక రూపంలో అందిస్తున్నారు.

దృక్పథం[మార్చు]

తెలుగు సాహిత్యంలోని అన్ని రకాల ప్రక్రియలూ, విభాగాలలో రచనలు చేయాలనేది మురళీకృష్ణ సంకల్పం. ఈ క్రమంలోనే వైవిధ్యభరితమైన రచనలు చేశారు.

బహుమతులు, పురస్కారాలు[మార్చు]

 • 1995లో ఆంధ్ర ప్రభ ’దీపావళి ‘ నవలల పోటీలో ‘అంతర్యాగం ‘ నవలకు ద్వితీయ బహుమతి
 • 1999 లో ఆంధ్ర భూమి సస్పెన్స్ నవలల పోటీలో న ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి.

నవలలు[మార్చు]

 1. దీపావళి
 2. అంతర్యాగం
 3. ఆపరేషన్ బద్ర్
 4. అసిధార
 5. అంతర్మధనం
 6. మర్మయోగం
 7. సౌశీల్య ద్రౌపది

సంకలనాలు[మార్చు]

 1. జీవితం – జాతకం
 2. 4 x 5
 3. రాజతరంగిణి కథలు
 4. రియల్ స్టోరీస్
 5. సైన్స్ ఫిక్షన్ కథలు

కాల్పనికేతర రచనలు[మార్చు]

 1. భారతీయ తత్వ చింతన
 2. మన ప్రధాన మంత్రులు
 3. మన ముఖ్య మంత్రులు
 4. 1857-మనం మరవ కూడని మహా యుద్ధం
 5. భారతీయ వ్యక్తిత్వ వికాసం
 6. తీవ్రవాదం
 7. పాప్ ప్రపంచానికి రారాజు మైకెల్ జాక్సన్
 8. అక్షరాంజలి

శీర్షికలు[మార్చు]

 1. పవర్ పాలిటిక్స్
 2. సినీ సిత్రాలు
 3. సగటుమనిషి స్వగతం
 4. పాడుతా తీయగా
 5. ఏదయినా ఏమయినా
 6. కథాసాగరమథనం
 7. పసిడిపుటలు

నాటికలు[మార్చు]

 1. ద్రష్ట
 2. ఉపక్రమణము

మూలాలు[మార్చు]


బయటి లింకులు[మార్చు]