Jump to content

కహ్ఫా బెంగియా

వికీపీడియా నుండి
కహ్ఫా బెంగియా

పదవీ కాలం
1995 – 2004
ముందు చేరా టాలో
తరువాత లోకం తస్సార్
నియోజకవర్గం కొలోరియాంగ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

కహ్ఫా బెంగియా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు కొలోరియాంగ్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

కహ్ఫా బెంగియా స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి 1995 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కొలోరియాంగ్ శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి చేరా టాలోపై 89 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1999 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అరుణాచల్ కాంగ్రెస్ అభ్యర్థి లోకం తస్సార్ పై6,499 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

కహ్ఫా బెంగియా 2004 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి లోకం తస్సార్ చేతిలో 229 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2009 శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి లోకం తస్సార్ చేతిలో1,099 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

ఆయన 2016 నుండి పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. "People's Party of Arunachal suspends its lone MLA" (in ఇంగ్లీష్). The Indian Express. 4 December 2020. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
  2. "PPA releases party manifesto". The Arunachal Times. 9 March 2024. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
  3. "Arunachal: President of People's Party Kahfa Bengia withdraws candidature from assembly elections" (in హిందీ). India Today NE. 14 April 2024. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.