కాకతీదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జైన దేవత గుమ్మడమ్మ (కుష్మాండిని) కి మరోపేరు కాకతి. కాకతీయుల ఆరాధ్య దైవం కాకతీదేవి. మొదట వారు కాకతి ఆరాధకులు కాబట్టి కాకతీయులయ్యారనీ, ఆ తర్వాత స్వయంభు లింగేశ్వరుని ఆరాధకులయ్యారనీ చారివూతక సమాచారం ఉంది.

కాకతిని జీవుల్ని అనారోగ్యం నుండి కాపాడే ఆరోగ్య దేవతగా జైనులు భావించేవారట. కాకలు తీరిన వీరులుగా కాకతీయులు కాకతిని యుద్ధదేవతగా కొలిచారు.

‘కాకతికి సైదోడు ఏకవీర’ అనే నానుడి ఆ రోజుల్లో ప్రచారంలో ఉండేది. ఏకవీరాదేవి ఆలయం ఓరుగల్లు సమీపంలోని మొగిలిచర్లలో ఉంది.

22వ జైన తీర్థంకరుడైన నేమినాధుడు కుష్మాండినిని తన ఆరాధ్య దైవంగా పేర్కొన్నాడు. రెండవ బేతరాజు ఈ దేవతను దుర్గాదేవి అవతారంగా భావించాడు. కాకతీదేవిని శైవమతదేవతగా ప్రచారం చేసినవాడు రామేశ్వర పండితుడు.

కాకతీయులు వేయించిన శాసనాలలో కాకతీయ అనే పదానికి పర్యాయ పదాలుగా కాకతి, కాకత్య, కాకెత, కాకర్త్య మొదలగు పదాలు కనిపిస్తుంటాయి.