కాకిచెరకు
Kans grass | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | S. spontaneum
|
Binomial name | |
Saccharum spontaneum |
కాకిచెరకు అనునది దక్షిణ ఆసియాలో సహజంగా పెరిగె ఒక రకపు గడ్డి పేరు. ఈ గడ్డి సుమారుగా మూడు మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దుంప వేరుల ద్వారా ఈ గడ్డి విస్తరిస్తుంది. దీని ఆకులు వరుసగా గరుకుగా 0.5 నుంచి 1 మీటరు పొడవు, 6 నుంచి 15 మిల్లీ మీటర్ల వెడల్పు ఉంటాయి.
చరిత్ర
[మార్చు]దీనిని తెలుగులో రెల్లుగడ్డి, నాగసరము, బిల్లుగడ్డి, వెర్రిచెరకు, కాకి చెరుకు అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం Saccharum spontaneum. భారతదేశం లోఉష్ణ, తక్కువగా వుండే ఉష్ణోగ్రతలో, తేమ ప్రాంతాలలోపెరుగుతుంది . ఉత్తర భారతదేశంలోని హిమాలయాల వాలుల నుండి ఆగ్నేయ ఆసియాలోని భూమధ్యరేఖ ప్రాంతాలలో వుంది . తుర్కెస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ నుండి ఆఫ్రికా యొక్క ఉత్తర, తూర్పు ప్రాంతాల వరకు కాకి చెరకు విస్తరించింది [1] కాకిచెరకును మనదేశము అస్సాలో ఖాగోరి, కహువా, ఖాగ్రా, ఖాగోరి, లిహిరా, కన్హి-బోన్, ఇంగ్లీష్ లో కాన్స్ గ్రస్స్, అడవి చెరకు, తాచ్ గడ్డి, మలయాళంలో కుసా, నన్నానా, కుసదర్భ, చుట్టపుల్లు, కురువికరింబు, థాచ్‌గ్రాస్, న్జంగనా, కన్నడలో కడు కబ్బు, బెంగాల్ లో కాన్ష్, సాచరం బైఫ్లోరం ఫోర్స్క్. హిందీలో కాన్స్, తమిళములో పెక్కరింపు, గుజరాతీలో కాన్సాడో, మరాఠిలో సెరియో గ్రాస్ కామిస్ అని వివిధ పేర్లతో పిలుస్తారు. మన దేశంలో అస్సాం ( రాష్ట్రము అంతటా), ఒడిశా, రాజస్థాన్, విస్తరించింది.[2]
ఉపయోగము
[మార్చు]కాకి చెరకు బెరడుతో మూల (పైల్స్ ), కడుపులో మంట, గ్యాస్ట్రిక్ సంబంధిత ఆయుర్వేద కషాయం తయారీలో వాడతారు [3] కాకి చెరకు గడ్డిని పశువులకు, ఏనుగులకు పశుగ్రాసంగా ఉపయోగిస్తారు. ఇసుక నేలల భూమి కోతను నివారించడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు. కాకి చెరకు మొక్కను కాగితాలను తయారు చేయడం కోసం దీని గుజ్జును ఉపయోగిస్తారు [4] చెరకు పెంచడంలో దాని పెరుగుదలలో కాకి చెరకును విలువైన జన్యు పదార్ధంగా ఉపయోగిస్తారు [5]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Saccharum spontaneum (wild sugarcane)". www.cabi.org. Retrieved 2020-08-13.
- ↑ "Saccharum spontaneum L." India Biodiversity Portal. Retrieved 2020-10-27.
- ↑ Pandey, Vimal; Bajpai, Omesh; Pandey, Deep; Singh, Nandita (2015-03-01). "Saccharum spontaneum: an underutilized tall grass for revegetation and restoration programs". Genetic Resources and Crop Evolution. 62. doi:10.1007/s10722-014-0208-0.
- ↑ "Saccharum spontaneum (PROSEA) - PlantUse English". uses.plantnet-project.org. Retrieved 2020-08-16.[permanent dead link]
- ↑ "Saccharum spontaneum Linn. [family POACEAE]". plants.jstor.org/. 2020-08-16. Retrieved 2020-08-16.
{{cite web}}
: CS1 maint: url-status (link)