కాకివెదురు
స్వరూపం


కాకివెదురు వాగులు, వంకల వెంబడి పెరుగే గడ్డి జాతి మొక్క. ఇది కొమ్మలు లేకుండా నిటారుగా సుమారు 8 అడుగుల ఎత్తు పెరుగుతుంది.
ఉపయోగాలు
[మార్చు]దీనిని ఎక్కువగా ఇళ్ల చుట్టు, పొలాల చుట్టు, పశువుల కొట్టముల చుట్టు దడి కట్టు కొనుటకు ఉపయోగిస్తారు.
పందిరిపైన నీడ కొరకు వీటిని పేర్చుతారు.
ఆటలు
[మార్చు]పిల్లలు వీటి గెనుపు వద్ద లోపలి వైపు ఒక రంధ్రం, పైభాగాన మరొక రంధ్రం చేసి పై భాగాన ఉన్న రంధ్రమునకు తాటి ఆకు రెబ్బను దారంతో అడ్డుగా కట్టి ఈల వలె ఉపయోగిస్తారు. వీటిని ఎవరికివారు సొంతంగా తయారు చేసుకుంటారు. (పిల్లన గ్రోవి లేక మురళి వలె ఇవి బజారులో అమ్మరు)
పిల్లలు వీటి చివరి ఆకులను పెరికి రాకెట్ ఆట ఆడుకుంటారు.
లోపాలు
[మార్చు]ఇవి పశువులకు దాణాగా ఉపయోగపడవు.
[[zh:蘆荻]