Jump to content

కాకోలి ఘోష్ దస్తీదార్

వికీపీడియా నుండి
కాకోలి ఘోష్ దస్తీదార్

లోక్‌సభ చైర్‌పర్సన్ల ప్యానెల్ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 జూలై 4
నియమించిన వారు ఓం బిర్లా
ముందు రత్న దే[1]

తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ ఉప నాయకుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009 మే 25
నాయకుడు మమతా బెనర్జీ
సుదీప్ బంద్యోపాధ్యాయ
ముందు పోస్ట్ పునఃస్థాపించబడింది

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009 మే 16
ముందు సుబ్రతా బోస్
నియోజకవర్గం బరాసత్

వ్యక్తిగత వివరాలు

జననం (1959-11-23) 1959 నవంబరు 23 (వయసు: 66)
కోల్‌కతా , పశ్చిమ బెంగాల్ , భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్
జీవిత భాగస్వామి సుదర్శన్ ఘోష్ దస్తీదార్
సంతానం 2
నివాసం మాధ్యమగ్రామ్
పూర్వ విద్యార్థి కింగ్స్ కాలేజ్ లండన్


ఆర్. జి. కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్

వృత్తి రాజకీయ నాయకుడు
మూలం

కాకోలి ఘోష్ దస్తీదార్ (జననం 23 నవంబర్ 1959) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె బరాసత్ లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

కాకోలి ఘోష్ దస్తీదార్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సిపిఐ (ఎం) అభ్యర్థి సామిక్ లాహిరి చేతిలో 60,956 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆమె 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హౌరా లోక్‌సభ నియోజకవర్గం నుండి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సిపిఐ (ఎం) అభ్యర్థి స్వదేశ్ చక్రవర్తి చేతిలో 1,03,449 ఓట్ల తేడాతో ఓడిపోయింది.

కాకోలి ఘోష్ దస్తీదార్ 2001లో జరిగిన పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో బల్లిగంజ్ శాసనసభ నియోజకవర్గం నుండి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సిపిఐ (ఎం) అభ్యర్థి రాబిన్ దేబ్ చేతిలో 3,349 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆమె 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బరాసత్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎఐఎఫ్‌బి అభ్యర్థి సుదిన్ చటోపాధ్యాయపై 1,22,901 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.

కాకోలి ఘోష్ దస్తీదార్ 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బరాసత్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎఐఎఫ్‌బి అభ్యర్థి మోర్తాజా హుస్సేన్ పై 1,73,141 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఆమె 2009 లోక్‌సభ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ] అభ్యర్థి డాక్టర్ మృణాల్ కాంతి దేబ్నాథ్ పై 110,169 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[3]

కాకోలి ఘోష్ దస్తీదార్ 202లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బరాసత్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థిస్వపన్ మజుందార్ పై 114,189 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా నాల్గొవసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[4][5]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Ten-member Panel of Chairpersons in Lok Sabha". The Economic Times. 2014-06-09. ISSN 0013-0389. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-05-10.
  2. "Kakoli Ghoshdastidar" (in ఇంగ్లీష్). The Indian Express. 4 June 2024. the original నుండి 11 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2025.
  3. "Fighting For A Fourth Term: Kakoli Ghosh Dastidar Banks On Barasat's Development" (in ఇంగ్లీష్). TimelineDaily. 31 May 2024. the original నుండి 11 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2025.
  4. "2024 Loksabha Elections Results - Barasat". Election Commission of India. 4 June 2024. the original నుండి 11 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2025.
  5. "Barasat Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). No. The Times of India. Election Commission of India. 4 June 2024. the original నుండి 11 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2025.