కాగితపు విమానం
కాగితపు విమానం అనగా ఆటలాడేందుకు కాగితంతో తయారు చేసుకున్న ఒక బొమ్మ విమానం, కాగితపు విమాన తయారీ విధానాన్ని కొన్నిసార్లు ఎయిరోగామిగా సూచిస్తారు, జపనీస్ కాగితపు మడత యొక్క కళను ఒరిగామి అంటారు
చరిత్ర
[మార్చు]మడచిన గ్లైడర్స్ యొక్క మెరుగు, అభివృద్ధి జపాన్ లోను అదే స్థాయిలో జరిగినటు సమాన ఆధారాలు ఉన్నప్పటికి మడచిన కాగితపు గ్లైడర్స్ మూలాలు సాధారణంగా పురాతన చైనాకి చెందినవిగా పరిగణిస్తారు. వాస్తవంగా, చైనాలో క్రీ.పూ. 500 లో విస్తృత స్థాయిలో కాగితం తయారీ జరిగింది, అలాగే ఒరిగామి, కాగితపు మడత సుమారు క్రీ.పూ. 460-390 కాలపు ఒక శతాబ్దంలో బాగా ప్రసిద్ధి చెందింది. మొదటి కాగితపు విమానాన్ని ఎక్కడ, ఏ రూపంలో తయారు చేశారో, ఎలా తయారు చేశారో నిర్ధారించడం అసాధ్యం.
శక్తితో నడిచే విమానము యొక్క మార్గదర్శ రూపకర్తలు పెద్ద యంత్రాలు రూపకల్పన చేయడానికి అన్ని రకాల కాగితపు విమాన నమూనాలపై అధ్యయనం చేశారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]లియొనార్డో డావిన్సి - ఎగిరే యంత్రాల గురించి ఆలోచించి విమాన నమూనాలను తయారుచేసినవాడు.
పేపర్ పాపర్ - కాగితాలతో చేసే చిలిపి చేష్ట