కాగ్నిజాంట్‌

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మూస:See Wiktionary

Cognizant Technology Solutions Corporation
రకం Public (NASDAQCTSH)
స్థాపితం 1994
వ్యవస్థాపకు(లు) Kumar Mahadeva
ప్రధానకార్యాలయం Teaneck, New Jersey, United States
కీలక వ్యక్తులు Francisco D'Souza (President & CEO)
Lakshmi Narayanan
(Vice Chairman)
పరిశ్రమ IT services
IT consulting
ఆదాయం $4.50 billion (2010)[1]
నిర్వహణ రాబడి $618.49000 million (2009)[1]
లాభము $671 million (2010)[1]
ఆస్తులు $3.33800 billion (2009)[1]
మొత్తం ఈక్విటీ $2.65300 million (2009)[1]
ఉద్యోగులు 100,000 (2010)
వెబ్‌సైటు Cognizant.com

కాగ్నిజాంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ ('కాగ్నిజాంట్‌ ) NASDAQCTSH వ్యాపార, టెక్నాలజీ, కన్సల్టెన్సీ సేవలు అందించే అమెరికాకు చెందిన బహూళజాతి కంపెనీ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం టీనెక్‌లో ఉంది. 2010లో ఫార్చ్యూన్‌ టాప్‌ 100 అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీల జాబితాలో చోటుచేసుకుంది. కంపెనీ వరుసగా ఎనిమిదో ఏడాది ఈ ఘనత సాధించడం విశేషం.[2] దాంతోపాటు ఫార్చ్యూన్‌ 1,000, ఫోర్బ్స్‌ గ్లోబల్‌ 2,000 జాబితల్లో కూడా కాగ్నిజాంట్‌ చోటుచేసుకుంది. బిజినెస్‌ వీక్‌ '2010, 50 అమెరికాలో అతి వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీలు', బిజినెస్‌ వీక్‌ హాటెస్ట్‌ టెక్‌ కంపెనీస్‌ 2010', 'ఫోర్బ్స్‌ ఫాస్ట్‌ టెక్‌ 2010 లిస్ట్‌ ఆఫ్‌ ఫాస్టెస్ట్‌ గ్రోయింగ్‌ టెక్నాలజీ కంపెనీస్‌ ఇన్‌ అమెరికా ' వంటి జాబితాల్లో చోటు చేసుకోవడంతో పాటు స్థిరంగా, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీల జాబితాలో నిలుస్తూ వస్తోంది.

చరిత్ర[మార్చు]

కాగ్నిజంట్‌ను ద డన్‌, బ్రాడ్‌స్ట్రీట్‌ కార్పొరేషన్‌కు ఐటీ అభివృద్ధి, నిర్వహణ సేవల విభాగంగా 1994లో స్థాపించారు. కుమార్‌ మహదేవ[3] దానికి ఛైర్మన్‌, సీఈఓగా వ్యవహరించారు.[4] రెండేళ్ల తర్వాత ఇది స్వతంత్ర సంస్థగా మారింది. కుమార్‌ మహదేవ 2003లో రాజీనామా చేశారు. లక్ష్మీ నారాయణ్‌ ఆయన నుంచి సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు.[5] కీలకమైన పరిశ్రమ అంశాలతో పాటు టెక్నాలజీ ఆధారిత అంశాలను కేంద్రంగా చేసుకుని ఏర్పాటైన తొలినాళ్ల ఐటీ సేవల కంపెనీల్లో కాగ్నిజాంట్‌ ఒకటి. ప్రస్తుతం బిజినెస్‌ ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగ్‌ (బీపీఓ) వంటి పలు రకాల సేవలను కంపెనీ అందిస్తోంది. బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాలు, సమాచార సాధనాలు, వినియోగదారుల వస్తువులు, ఇంధన, సేవలు, ఆరోగ్యం, సమాచారం, మీడియా, వినోదం, బీమా, లైఫ్‌ సైన్సెస్‌, ఉత్పత్తి, రిటైల్‌, టెక్నాలజీ, రవాణా, లాజిస్టిక్స్‌, ఆతిథ్య, పర్యాటకం వంటి పలు రంగాల్లో విస్తృత సేవలను అందిస్తోంది.

ఆర్థిక పరిస్థితి[మార్చు]

కాగ్నిజాంట్‌ 1998లో నాస్‌డాక్‌లో నమోదైంది. 2004లో నాస్‌డాక్‌-100 సూచీలోకి ప్రవేశించింది. 2006 నవంబరు 16న ట్రేడింగ్‌ ముగిసిన తర్వాత మిడ్‌ క్యాప్‌ ఎ స్‌ అండ్‌ పీ 400 నుంచి ఎస్‌ అండ్‌ పీ 500లోకి కాగ్నిజాంట్‌ ప్రవేశించింది.

నిర్వహణ[మార్చు]

నిర్వహణ: ఎగ్జిక్యూటివ్‌ బృందం

 • ఫ్రాన్సిస్కో డిసౌజా, అధ్యక్షుడు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌
 • లక్ష్మీ నారాయణ్‌, ఉపాధ్యక్షుడు
 • గార్డన్‌ కౌబర్న్‌, చీఫ్‌ ఫైనాన్షియల్‌ అండ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌
 • చంద్రశేఖరన్‌, అధ్యక్షుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌, గ్లోబల్‌ డెలివరీ
 • రాజీవ్‌ మెహతా, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, గ్లోబల్‌ క్లయింట్‌ సర్వీసెస్‌[6]

సేవలు[మార్చు]

విస్తృతమైన ఐటీ, కన్సల్టింగ్‌, బిజినెస్‌ టెక్నాలజీ కన్సల్టింగ్‌, కాంప్లెక్స్‌ సిస్టమ్స్‌ ఇంటిగ్రేషన్‌, అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ మెయింటెనేన్స్‌ బిజినెస్‌ ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగ్‌ (బీపీఓ) సేవలు, బిజినెస్‌ ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగ్‌, ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సర్వీసెస్‌, అనలెటిక్స్‌, వెబ్‌ అనలెటిక్స్‌, బిజినెస్‌ ఇంటలిజెన్స్‌, డాటా వేర్‌హౌజింగ్‌, సీఆర్‌ఎం, సోషల్‌ సీఆర్‌ఎం, సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌, ఇంజనీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ సొల్యూషన్స్‌, ఈఆర్‌పీ, ఆర్‌ అండ్‌ డీ ఔట్‌సోర్సింగ్‌, టెస్టింగ్‌ సొల్యూషన్స్‌ వంటి పలు రకాలైన బీపీఓ సేవలను కాగ్నిజాంట్‌ అందిస్తోంది.

ఆఫ్‌షోరింగ్‌, అమెరికాలో ఉపాధి[మార్చు]

విదేశీ నిపుణులను అమెరికా రప్పించేందుకు అత్యధిక సంఖ్యలో ఎల్‌1 వీసాలు పొందుతున్న టాప్‌ 10 కంపెనీల జాబితాలో కాగ్నిజాంట్‌ కూడా ఉంది. 2008 నవంబరు నాటి ఎస్‌ఈసీ 10-క్యూ ఫైలింగ్‌లో కంపెనీ, వర్ధమాన దేశాల నుంచి, ముఖ్యంగా భారత్‌ నుంచి సాంకేతిక, ప్రాజెక్ట్‌ నిర్వహణ నైపుణ్యాలు అపారంగా ఉన్న నిపుణులను ఆకర్షించడం, వారిని నిలుపుకోవడంపైనే మా భావి విజయం ఆధారపడి ఉంటుంది. అమెరికా, యూరప్‌లలోని మా అపారమైన ఐటీ ప్రొఫెషనల్స్‌లో భారతీయుల సంఖ్యే అధికం. భారత నిపుణుల తాలూకు అమెరికా, యూరప్‌లలో పనిచేయగల అవకాశం వారి సామర్థ్యంపై, వారికి కావాల్సిన వీసాలు, వర్క్‌ పర్మిట్లు సంపాదించగల మా సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది అని పేర్కొంది.[7]

అమెరికాలో కూడా పనివారి సంఖ్యకు కంపెనీ పెంచుకుంటోంది. 2001 జనవరిలో అమెరికాలో డెలివరీ కేంద్రాలను విస్తృత పరిచేందుకు పథకాలను కంపెనీ ప్రకటించింది. దాంతోపాటు అరిజ్‌లోని ఫీనిక్స్‌లో కొత్తగా 1,000 మంది పనివారితో కూడిన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ప్రకటించింది.[8]

కార్పొరేట్ సామాజిక బాధ్యత[మార్చు]

  • కాగ్నిజాంట్‌ ఫౌండేషన్‌ ఆర్థిక, నిర్వహణపరమైన మద్దతు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ ఉద్యోగుల సాయంతో ప్రపంచవ్యాప్తంగా కాగ్నిజాంట్‌ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. 2005 మార్చిలో భారత కంపెనీల చట్టం కింద కాగ్నిజాంట్‌ ఫౌండేషన్‌ ఒక సేవా సంస్థగా నమోదైంది. ఆర్థిక, సాంకేతిక సాయం అందించడం, విద్య, వైద్య రంగ అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించి, అమలు చేయడం వంటివాటి ద్వారా సమాజంలోని అణగారి వర్గాలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందేలా చేస్తుంది. పలు స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీఓలు), విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ల సాయం కూడా తీసుకుంటుంది.
  • ప్రాజెక్ట్‌ ఔట్‌రీచ్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా స్కూళ్లు, అనాథ శరణాలయాల్లోని 2 లక్షల మంది పిల్లల కోసం 400కు పైగా కార్యక్రమాలను కూడా కాగ్నిజాంట్‌ రూపొందించింది.
  • గో గ్రీన్‌ పేరుతో 2008లో కాగ్నిజాంట్‌ రూపొందించిన పథకం కూడా ముఖ్యమైనది. ఇంధన సంరక్షణ, రీసైక్లింగ్‌, బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణ వంటివాటిని ఈ పథకం కింద కాగ్నిజాంట్‌ చేపట్టింది.

  కాగ్నిజాంట్‌ అకాడెమీ[మార్చు]

  కాగ్నిజాంట్‌ అకాడెమీ పేరుతో సంస్థ మొదలు పెట్టిన సొంత సంస్థలో శిక్షణ కార్యక్రమాలన్నీ కొనసాగుతుంటాయి. సంస్థల తెర తీసిన నాలుగు కీలక విద్యా పథకాలు: కంటిన్యూయింగ్‌ ఎడ్యుకేషన్‌, పాత్ర ఆధారిత శిక్షణ, ఎగ్జిక్యూటివ్‌ ట్రైనింగ్‌ కార్యక్రమం, సర్టిఫికేషన్‌. వీటికి, అంతర్గత శిక్షణ కార్యక్రమాలకు తోడు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, కాలేజీల ద్వారా పలు నిర్వహణ లక్షిత శిక్షణ కార్యక్రమాల్లో కూడా కాగ్నిజాంట్‌ ఉద్యోగులు పొందుతారు. హార్వర్డ్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వంటివి ఇందులో ఉన్నాయి. ఈ నియమిత అభ్యసనకు ఉద్దేశించి తరగతి గదులకు తోడు శిక్షణ కార్యక్రమాలను ఉద్యోగుల డెస్క్‌టాప్‌ల వద్దకే కాగ్నిజాంట్‌ తీసుకెళ్తోంది. మల్టీ మోడల్‌ లెర్నింగ్‌, టెక్నాలజీ ఆధారిత శిక్షణ (టీబీటీ) వంటి వాటిని ఇవి ఉపయోగిస్తాయి.[9]

  ప్రపంచ కార్యాలయాలు[మార్చు]

  సూచనలు[మార్చు]

  బాహ్య లింకులు[మార్చు]

  Lua error in package.lua at line 80: module 'Module:Portal/images/c' not found. మూస:NASDAQ-100