Jump to content

కాచిగూడ రైల్వేస్టేషను

వికీపీడియా నుండి
(కాచిగూడ రైల్వే స్టేషను నుండి దారిమార్పు చెందింది)
కాచిగూడ రైల్వే స్టేషను

కాచిగూడ రైల్వేస్టేషను, (నిలయ సంకేతము: KCG) దక్షిణమధ్య రైల్వే (South Central Railway) విభాగానికి చెందిన హైదరాబాదులోని ప్రధాన రైల్వేస్టేషన్లలో ఒకటి. శిల్పశైలి పరంగా దక్షిణ మధ్య రైల్వే విభాగములో అందమైన స్టేషన్లలో ఇది ఒకటి. 1916లో అప్పటి హైదరాబాదు నిజాం చేత కట్టించబడిన ఈ స్టేషను నిజాం రాష్ట్ర గ్యారంటీడ్ రైల్వే ప్రధాన కేంద్రంగా ఉంది.[1] సికింద్రాబాదు రైల్వే జంక్షన్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో విద్యానగర్, మలక్‌పేట రైల్వే స్టేషన్ల మధ్యలో కాచిగూడ ప్రాంతంలో ఉంది.నిజాం పరిపాలనలో ఉన్న మన్మాడ్ నాందేడ్, పర్భని, ఔరంగాబాద్ (ప్రస్తుతం ఇవి మహారాష్ట్రలో ఉన్నాయి) ప్రాంతాలను హైదరాబాద్‌తో అనుసంధానించడానికి ఈ రైల్వే మార్గం కీలకం. ప్రజల రద్దీ ఒక అంశం అయితే, ఇక్కడ ఉన్న నల్ల రేగడి నేల ప్రాంతాల నుండి పత్తిని రవాణా చేయడంలో ఈ రైల్వే మార్గం కీలక పాత్ర పోషించింది. ఈ ప్రాంతాన్ని గోదావరి వ్యాలీ రైల్వేమార్గం అని పిలుస్తారు. బ్రిటీష్ పాలకులకు, లండన్ నుండి పెట్టుబడిదారులకు నష్టపరిచేది అయినప్పటికీ వారి పెట్టుబడిపై నిజాం హామీ ఇవ్వడంతో దీనికి నిజాం గ్యారెంటీడ్ రైల్వే అని పేరు పెట్టారు.[2]

ఒక కేంద్ర ప్రధాన గుమ్మటము, రెండు ప్రక్క గుమ్మటాలు, మినార్లతో, ఈ కట్టడము గోథిక్ శైలిలో కట్టబడింది. రాజా ప్రసాదములాగా కట్టబడిన కాచిగూడా రైల్వేస్టేషను హైదరాబాదు చిహ్నాలలో ఒకటి. ఆధునిక ప్రయాణ సౌకర్యాలు కలిగిన ఈ స్టేషను ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలోని హైదరాబాదు విభాగానికి కేంద్రముగా పనిచేస్తున్నది. ఇచ్చటి నుండి బెంగుళూరు ఎక్స్‌ప్రెస్, తుంగభద్ర ఎక్స్‌ప్రెస్, చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్, వేంకటాద్రి ఎక్స్‌ప్రెస్, యశ్వంతపుర్ ఎక్స్‌ప్రెస్, మధురై ఎక్స్‌ప్రెస్, నాగర్కోవిల్ ఎక్స్‌ప్రెస్, మంగుళూరు ఎక్స్‌ప్రెస్, అకోలా ఎక్స్‌ప్రెస్, నార్ఖేడ్ ఎక్స్‌ప్రెస్ మొదలగునవి బయలుదేరును.[3]

దీపకాంతుల్లో సింకింద్రాబాద్ రైల్వేస్టేషన్

పరీవాహక ప్రాంతాలు

స్టేషనుస్టేషను కోడ్సమీపంలోని శివార్లలో విస్తరణ జరిగింది
సికింద్రాబాద్ఎస్‌సిమారేడ్‌పల్లి, ప్యాట్నీ, కార్ఖానా,
జేమ్స్ స్ట్రీట్జెఈటిఎమ్‌.జి.రోడ్డు, ప్యారడైజ్, రాణిగంజ్, మినిష్టర్ రోడ్డు, హుస్సేన్ సాగర్
సంజీవయ్య పార్క్ఎస్‌జెవిపినెక్లెస్ రోడ్డు, మినిష్టర్ రోడ్డు, మహాత్మా గాంధీ రోడ్, పట్టిగడ్డ
బేగంపేటబిఎమ్‌టిఅమీర్‌పేట, గ్రీన్‌ల్యాండ్స్, సోమాజిగూడ, పంజగుట్ట, బ్రాహ్మణవాడి
ప్రకృతి చికిత్సాలయఎన్‌సిహెచ్‌ఎస్బల్కంపేట్, అమీర్‌పేట, సంజీవరెడ్డి నగర్
ఫతే నగర్ఎఫ్‌ఎన్‌బిబాలానగర్, సనత్‌నగర్, యెల్లమ్మ గుడి
భరత్ నగర్బిటిఎన్‌ఆర్మూసపేట్, కూకట్‌పల్లి, నిజాంపేట్, సనత్‌నగర్
బోరబండబిఆర్‌బిడిఅల్లాపూర్, గాయత్రినగర్, తులసినగర్, మోతినగర్, రాజీవ్ నగర్, యర్రగడ్డ
హైటెక్ సిటీహెచ్‌టిసివైకూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలని కెపిహెచ్‌బి, ఇజ్జత్ నగర్, మాదాపూర్, జెఎన్‌టియు
హఫీజ్‌పేట్హెచ్‌ఎఫ్‌జడ్మాదాపూర్,కొండాపూర్, మియాపూర్
చందా నగర్సిడిఎన్‌ఆర్చందానగర్, మదీనాగూడ
లింగంపల్లిఎల్‌పిఐరామచంద్రాపురం (బీహెచ్ఈఎల్ టౌన్షిప్ , హెచ్‌సియు, గచ్చిబౌలి
సీతాఫల్‌మండిఎస్‌టిపిడిఈఎఫ్‌ఎల్‌యు, తార్నాక
ఆర్ట్స్ కాలేజ్ఎటిసిఉస్మానియా విశ్వవిద్యాలయం, వారాసిగూడ, ఆడిక్‌మెట్
జామియా ఉస్మానియాజెఒఒబర్కత్‌పుర, రాంనగర్
విద్యానగర్విఎఆర్శంకర్ మఠం, ఆర్టీసీ X రోడ్స్, చిక్కడపల్లి, శివం రోడ్, తిలక్‌నగర్,అంబర్‌పేట్
కాచిగూడకెసిజిబర్కత్‌పుర, చాదర్‌ఘాట్, నారాయణగూడ, కోటి, అబిడ్స్
మలక్‌పేటఎమ్‌ఎక్స్‌టిచాదర్‌ఘాట్, నల్గొండ 'X' రోడ్లు, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట్, చార్మినార్
దబీర్‌పురడిక్యుబిచంచల్‌గూడ, సైదాబాద్, ప్రింటింగ్ ప్రెస్, పురాణీ హవేలీ, మీర్ ఆలం మండి, సాలార్ జంగ్ మ్యూజియం
యాకుత్‌పురావైకెఎసైదాబాద్, సంతోష్ నగర్, మాదన్నపేట్, పిసాల్ బండ , రెయిన్ బజార్ ఎడిబజార్, బ్రాహ్మణ వాడి, బడా బజార్
ఉప్పుగూడహెచ్‌పిజిలాల్ దర్వాజా, అలియాబాద్, శాలిబండ, దారుషిఫా, జహనుమ, చార్మినార్
ఫలక్‌నామాఎఫ్‌ఎమ్ఉద్దేన్ గడ్డ, చాంద్రాయణ గుట్ట, బర్కాస్
హైదరాబాద్ దక్కన్హెచ్‌వైబిసాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, హైదర్‌గూడ, అబిడ్స్, మొజాంజాహి మార్కెట్, దేవి బాగ్, క్రిమినల్ కోర్ట్స్,
లక్డి కా పుల్ఎల్‌కెపిఎల్సైఫాబాద్, రెడ్ హిల్స్, పబ్లిక్ గార్డెన్స్, మాసాబ్ ట్యాంక్, నీలోఫర్ హాస్పిటల్
ఖైరతాబాద్కెక్యుడిబంజారా హిల్స్, రాజ్ భవన్ రోడ్, పంజగుట్ట, చింతల్ బస్తీ
నెక్లెస్ రోడ్ఎన్‌ఎల్ఆర్‌డిరాజ్ భవన్ రోడ్, సోమాజిగూడ, పంజగుట్ట, ఎమ్‌ఎస్ మఖ్త
లాలగూడఎల్‌జిడిహెచ్లాల్లగూడ , మల్కాజ్‌గిరి , శాంతినగర్, తుకారం గేట్
మల్కాజ్‌గిరిఎమ్‌జెఎఫ్మల్కాజ్గిరి, ఆనంద్‌బాగ్, హనుమాన్‌పేట్, మీర్జాల్‌గూడ
దయానంద్ నగర్డివైఈవాణి నగర్, మల్లికార్జున నగర్, ఆర్‌కె నగర్
సఫిల్‌గూడఎస్‌ఎఫ్‌ఎక్స్సఫిల్గూడ, వినాయక్ నగర్, సాయినాదపురం
రామకృష్ణాపురంఆర్‌కెఒనేరేడ్‌మెట్
అమ్ముగూడఎఎమ్‌క్యుసైనిక్‌పురి
కావల్రీ బ్యారక్స్సివిబిలోతకుంట
ఆల్వాల్ఎఎల్‌డబ్ల్యుపాత
బొల్లారం బజార్బిఒజడ్కొంపల్లి
బొల్లారంబిఎమ్‌ఒరిసాల బజార్ వాటర్ ట్యాంక్ / హకీంపేట్

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు". the original నుండి 2007-12-31 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2007-12-31.
  2. Nanisetti, Serish (2018-06-09). "Kacheguda Railway Station: a precursor of the architectural idiom". The Hindu (in Indian English). ISSN 0971-751X. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-02-02.
  3. "Kacheguda Railway Station in Hyderabad India".