కాజ సోమశేఖరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాజ సోమశేఖరరావు ఆంధ్రప్రదేశ్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త.

జివిత విశేషాలు[మార్చు]

ఈయన కృష్ణా జిల్లా లోని గుడ్లవల్లేరు గ్రామంలో మార్చి 10, 1947 న జన్మించారు. తండ్రి పేరు రాఘవేంద్రరావు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయఖ్లో బి.ఎస్.సిని 1969 లో పూర్తిచేశారు. జబల్ పూర్ విశ్వవిద్యాలయం నుండి అప్లయిడ్ కెమిస్ట్రీ-ఇనార్గానికి ముఖ్యాంశంగా 1971 లో ఎం.ఎస్.సిని చేశారు. 1975 లో రవిశంకర్ విశ్వవిద్యాలయంలో పి.హె.డి చేసారు.

ఉద్యోగ పర్వం[మార్చు]

ఈయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా పనిచేశారు. ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో రసాయన శాస్త్ర అధిపతిగా, ప్రొఫెసరుగా, ప్రత్యేక అధికారిగా పనిచేశారు. బోర్డ్ ఆఫ్ స్టడిస్ ఇన్ పి.జి.కెమిస్ట్రీకి చైర్మన్ గా కూడా 2005 లో వ్యవహరించారు.[1] నాగార్జున విశ్వవిద్యాలయంలో సెనేట్ సభ్యునిగా కూడా ఉన్నారు.

పరిశోధనలు[మార్చు]

ఈయన రసాయన శాస్త్రంలో అనేక పరిశోధనలు చేసారు. దీని ఫలితంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. ఈయన చేసిన పరిశోధనలలో వ్యర్థపదార్థాలు అయిన మామిడి, తాటి టెంకలు, బత్తాయి తొక్కలు మొదలగు ఇతత పదార్థాల నుండి కార్బన్లను రూపొందించాఅరు. ఈ తరగా కార్బన్ లను "కాజాన్ కార్బన్స్"గా కీర్తి లభించింది. వీటిని నిస్సరణముల నుండి రంగులను, విషయుక్త పదార్థములను, రంగులను తొలగించడానికి కూడా ఉపయోగిస్తున్నారు. భూగర్భ జలాల నాణ్యత, నిర్దారితల అంశం మీద (యు.జి.సి నిధులతో) పరిశోధనలు చేసారు. అనేక పరిశోధనలు చేసి రసాయన శాస్త్ర రంగంలో అనేక విజయాలను సాధించారు.

ఈయన జాతీయ సైన్స్ పత్రికలలో 65 కు పైగా పరిశోధనా వ్యాసాలు వ్రాసారు. 50 కి పైగా జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నారు. రీసెర్చి ప్రాజెక్టుల రూపకల్పనలో విశేషానుభవం గడించారు. ఎం.ఎస్.సి విద్యార్థులకు రెండు పాఠ్య గ్రంథాల రచించారు. బి.ఎస్.సి విద్యార్థులకు ఏడు పాఠ్య గ్రంథాల రచనలలో సహ రచయిత గానూ ఉన్నారు. తెలుగువిజ్ఞాన మాస పత్రిక, తెలుగు విజ్ఞాన సర్వస్వము వంటి ప్రచురణలకు వ్యాసాలు అందింఆరు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కెమిస్ట్స్, ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎనలిటికల్ సైంటిస్టు, కెట్లసిస్ సొసైటీ, ఆఫ్ ఇండియా మొదలగు సంస్థలలో ప్రతిష్ఠాత్మక సభ్యునిగా ఉన్నారు.

అవార్డులు[మార్చు]

సోమశేఖరరావు అనేక అవార్డులను పొందారు. వాటిలో మ్యాన్ ఆఫ్ ద యియర్ (19998), 2000 మిలీనియం మెడల్ ఆఫ్ హానర్, లైఫ్ టైం అఛీవ్ మెంటు అవార్డు, భారత ఎక్స్‌లెన్స్ అవార్డు మొదలగు గౌరవాలను పొందారు. ఆకాశవాణిలో అనేక సైన్స్ మీద ఉపన్యాసాలు యిచ్చారు.

మూలాలు[మార్చు]