Jump to content

కాదంబరి దేవి

వికీపీడియా నుండి
కాదంబరి దేవి
స్థానిక పేరుকাদম্বরী দেবী
జననంమాతంగిని గంగోపాధ్యాయ
(1859-07-05)1859 జూలై 5
కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుత భారతదేశం
మరణం1884 ఏప్రిల్ 21(1884-04-21) (వయసు: 24)
కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
మరణ కారణంనల్లమందు వినియోగం
జాతీయతబ్రిటిష్ ఇండియన్
భార్య / భర్త
జ్యోతిరీంద్రనాథ్ ఠాగూర్
​
​
(m. 1868; died 1884)​
కుటుంబంఠాగూర్ కుటుంబం
తండ్రిశ్యామ్ గంగూలీ
తల్లిత్రైలోక్యసుందరీ దేవి

కాదంబరి దేవి (1859 జూలై 5 - 1884 ఏప్రిల్ 21) బెంగాలీ నాటక రచయిత, సంగీతకారుడు, సంపాదకుడు, చిత్రకారుడు జ్యోతిరేంద్రనాథ్ ఠాగూర్ భార్య, దేవేంద్రనాథ్ ఠాగూర్ కోడలు, రవీంద్రనాథ్ ఠాగూర్ వదిన.[1]

ప్రారంభ జీవితం

[మార్చు]

కాదంబరి దేవి 1859 జూలై 5న పశ్చిమ బెంగాల్ కోల్కతాలో శ్యామ్ గంగూలీ, త్రిలోకసుందరి దేవి దంపతులకు మాతంగిని గంగోపాధ్యాయగా జన్మించింది. ఆమె తన తల్లిదండ్రులకు మూడవ సంతానం. ఆమె తాత జగన్ మోహన్ గంగోపాధ్యాయ ప్రసిద్ధ సంగీతకారుడు, ఆయన వద్ద ఆమె సంగీత పాఠాలు నేర్చుకుంది.

వివాహం

[మార్చు]

ఆమె తన భర్త జ్యోతిరేంద్రనాథ్ ఠాగూర్ కంటే పదేళ్లు చిన్నది, వారి వివాహం 1868 జూలై 5న జరిగింది. భర్త ఆమెకు విద్యను అందించడానికి ఏర్పాట్లు చేశాడు.[2] రవీంద్రనాథ్ అనేక కవితలను రచించడానికి ఆమె ప్రేరణగా నిలిచింది. అయితే, ఠాగూర్ తో ఆమె సంబంధం వివాదాస్పదమైంది.

జ్ఞానదానందిని దేవి, సత్యేంద్రనాథ్ ఠాగూర్, కాదంబరి దేవి, జ్యోతిరేంద్రనాథ్ ఠాగోర్ (1867)

మరణం

[మార్చు]

తెలియని కారణాల వల్ల, రవీంద్రనాథ్ ఠాగూర్ వివాహం జరిగిన నాలుగు నెలల తర్వాత, కదంబరి 1884 ఏప్రిల్ 21న నల్లమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది.[3] ఆమె ఆత్మహత్య గురించి ఠాగూర్ కుటుంబం ఎప్పుడూ మౌనంగా ఉండేది. కుటుంబ సమస్యల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుందని పుకార్లు షికార్లు చేశాయి. ఆమె తన భర్త వ్యవహారం గురించి వెల్లడిస్తూ మరణానికి ముందు ఒక లేఖ రాసిందని ఆరోపించబడింది, కానీ మళ్ళీ, నిరూపించడానికి ఎవరూ లేరు. కాదంబరి దేవి మరణం తరువాత రవీంద్రనాథ్ పూర్తిగా కుప్పకూలిపోయాడు. ఆమె మరణించిన చాలా కాలం తరువాత, ఆమె జ్ఞాపకార్థం ఆయన అనేక పాటలు, కవితలు రాసాడు.

ప్రజాదరణ పొందిన సంస్కృతిలో

[మార్చు]
  • రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన నాస్తానిర్హ్ ఆధారంగా సత్యజిత్ రే రూపొందించిన క్లాసిక్ చిత్రం చారులతా ఆమె జీవితం, ఠాగూర్ తో ఆమె సంబంధం ఆధారంగా రూపొందించబడింది.[4]
  • సుకాంత రాయ్ బెంగాలీ చిత్రం ఛెలేబెలాలో (2002) దేబశ్రీ రాయ్ ఈ పాత్రను పోషించగా, ఠాగూర్ పాత్రను జిష్షూసేన్ గుప్తా పోషించాడు.[5][4]
  • బందనా ముఖోపాధ్యాయ బెంగాలీ చిత్రం చిరోశాఖా హే (2007) లో దీపాంజన పాల్ ఈ పాత్రను పోషించగా, ఠాగూర్ పాత్రను సయందిప్ భట్టాచార్య పోషించాడు.[6]
  • రితుపర్ణో ఘోష్ బెంగాలీ డాక్యుమెంటరీ చిత్రం జీవన్ స్మృతి (2011) లో సమదర్శి దత్త ఠాగూర్ పాత్రను పోషించాడు.[7]
  • సుమన్ ఘోష్ బెంగాలీ చిత్రం కాదంబరి (2015) లో కొంకణా సేన్ శర్మ ఈ పాత్రను పోషించింది, పరంబ్రతా ఛటర్జీ ఠాగూర్ పాత్రను పోషించాడు.[8]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Rabindranath Tagore: ఠాగూర్ జీవితంలో చాలా మంది మహిళలు.. అయితే అన్న భార్య కాదంబరి మాత్రం వెరీ స్పెషల్.. - Telugu News | The unrequited love story of brothers wife Kadambari Devi and Rabindranath Tagore | TV9 Telugu". web.archive.org. 2025-04-17. Archived from the original on 2025-04-17. Retrieved 2025-04-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. ↑ Ahmed, Wakil (2012). "Tagore, Jyotirindranath". In Islam, Sirajul; Jamal, Ahmed A. (eds.). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second ed.). Asiatic Society of Bangladesh. Archived from the original on 2021-12-12. Retrieved 2025-04-17.
  3. ↑ Tamal Ghosh. Kadambari. Ujjwal Sahitya Mandir. p. 432.
  4. 1 2 প্রতিবেদন, নিজস্ব. "Kadambari Devi: 'ঘুষ দিয়ে চুপ করানো হয়' সংবাদমাধ্যমকে! জন্মের ১৬৩ বছর পরও চর্চায় রবি-কাদম্বরী সম্পর্ক!" (in Bengali). Archived from the original on 2023-04-17. Retrieved 2025-03-20.
  5. ↑ "Chhelebela will capture the poet's childhood". rediff.com. Retrieved 25 February 2020.
  6. ↑ "Tagore or touch-him-not". The Times of India. 13 July 2007. Retrieved 1 March 2020.
  7. ↑ "Celebrating Tagore". The Hindu. 7 August 2013. Retrieved 1 March 2020.
  8. ↑ Banerjee, Kathakali (12 January 2017). "Kadambari explores Tagore and his sis-in-law's relationship responsibly". Times of India. Retrieved 15 October 2018.