కాన్స్టాంటినోపుల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బైజాంటైన్ కాన్స్టాంటినోపుల్ యొక్క పటము
ఆకాశం నుండి కాన్స్టాంటినోపుల్ యొక్క దృశ్యం

కాన్స్టాంటినోపుల్ (Greek: Κωνσταντινούπολις, Latin: Constantinopolis టర్కిష్: ఇస్తాంబుల్) అనే నగరం రోమన్, బైజాంటైన్/తూర్పు రోమన్, లాటిన్ మరియు ఒట్టోమాన్ సామ్రాజ్యాల రాజధాని నగరముగా ఉంది. మధ్య యుగపు కాలములో చాలా వరకు కాన్స్టాంటినోపుల్ యూరోప్‌లోల్లా అత్యంత పెద్దదయిన[1], ధనవంతమయిన నగరముగా ఉంది.

అతాతుర్క్ యొక్క జాతీయ సంస్కరణలలో భాగంగా, టర్కిష్ తపాలా సేవ చట్టం అమలులోకి రావడంతో, 1930[2][3] లో, టర్కిష్ పేరు ఇస్తాంబుల్ కోసం, కాన్స్టాంటినోపుల్ అనే పేరుని అధికారికంగా విడిచిపెట్టడం జరిగింది.[4][5] ఈ పేరు గ్రీకు మరియు స్లావిక్ వ్యావహారిక పేరు అయిన స్తాంబోల్ నుండి వచ్చింది; మరింత విస్తృతమయిన చర్చ కోసం ఇస్తాంబుల్ యొక్క పేర్లు చూడండి.

చరిత్ర[మార్చు]

బైజాంటియమ్[మార్చు]

కాన్స్టాంటినోపుల్ నగరాన్ని అప్పటికే ఉన్న బైజాంటియమ్ అనే నగరమున్న ప్రదేశంలో రోమన్ చక్రవర్తి కాన్శ్టాంటైన్ I స్థాపించాడు, సుమారు 671-622 BC మధ్య కాలంలో, గ్రీకు కాలనీలను విస్తరణ చేసే ముందు కాలంలో ఈ నగరం ఒక రూపం సంతరించుకున్నది. ఈ ప్రదేశం, యూరోపు నుండి ఆసియా వెళ్ళే భూమార్గంలో, నల్ల సముద్రం నుండి మెడిటరేనియన్ సముద్రం వెళ్ళ సముద్ర మార్గంలో ఉంది, దీనికి గోల్డెన్ హార్న్‌లో అద్భుతమయిన మరియు విశాలమయిన నౌకాశ్రయము ఉంది.

306–337[మార్చు]

సింహాసనం అధిష్టించిన మేరి మరియు క్రైస్ట్ శిశువుకు చర్చ్ మొజేక్‌లో కాన్స్టాంటినోపుల్ నగరం యొక్క నివేదికను కానుకగా సమర్పిస్తున్న చక్రవరి కాన్స్టాంటైన్ I.సెయింట్ సోఫియా, c.1000
కాయిన్ స్ట్రక్ బై కాన్స్టాంటైన్ I టు కమెమొరేట్ ది ఫౌండింగ్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్

కాన్స్టాంటైన్‌కు కాన్స్టాంటినోపుల్‌కు సంబంధించి చాలా అందమయిన ప్రణాళికలు ఉన్నాయి. సామ్రాజ్యపు ఐక్యతను పునఃప్రతిష్ఠించిన తరువాత, అతిపెద్ద ప్రభుత్వ సంస్కరణలు అమలు చేస్తూ, క్రిస్టియన్ చర్చ్‌ని బలోపేతం చేసే కార్యానికి ధనసాయం అందిస్తున్న దశలో, అతనికి రోమ్ నగరం తన సామ్రాజ్యానికి అసంతుష్ఠమయిన రాజధాని అని తెలుసు. రోమ్ నగరం సరిహద్దుల నుండి చాలా దూరంలో ఉంది, అదే కారణం వల్ల అది సైన్యాలకి మరియు సామ్రాజ్యపు న్యాయస్థానాలకు చాలా దూరంగా కూడా ఉంది, అంతే కాక, అది అసంతుష్ఠులయిన రాజకీయ నాయకులకు ఒక అవాంఛనీయమయిన ఆటస్థలంగా మారింది. అయినా కూడా అది, దేశానికి వెయ్యి సంవత్సరాలకు పైగా, రాజధానిగా ఉంది. అందువల్ల, రాజధానిని మరో ప్రదేశానికి తరలించడం అనే విషయం ఆలోచించడానికి చాలా దుర్భరంగా అనిపించేది. ఏది ఏమయినా, అతను బైజాంటియమ్ ఉన్న ప్రదేశాన్ని సరయిన స్థలంగా గుర్తించాడు: అక్కడ చక్రవర్తి కూర్చుని తనకి తాను అవసరమయితే సత్వరం రక్షణ కల్పించుకోగలడు, డాన్యూబ్ మరియు యూఫ్రటిస్ సరిహద్దులకు తేలిగ్గా వెళ్ళవచ్చు, అతని దర్బారుకి ఫలపుష్ప సంపద కలిగిన తోటల నుండి, రోమన్ ఆసియాలో ఉండే కార్యకుశలత కలిగిన కర్మాగారాల నుండి కావలిసినవి తెచ్చుకోవచ్చు, అతని కోశాగారాలను సామ్రాజ్యంలోని అత్యంత ధనికమయిన రాష్ట్రాల నుండి తెచ్చిన ధనంతో నింపవచ్చు.

కాన్స్టాంటినోపుల్‌ను ఆరేళ్ళుగా నిర్మించడం జరిగింది, దానిని మే 11, 330వ సంవత్సరంలో, సాంప్రదాయికంగా ఆచారకర్మలననుసరించి, నిర్దిష్టమయిన లక్ష్యానికి అంకితం చేయడం జరిగింది.[6] రోమ్‌ను విభజించినట్లుగా, కాన్స్టాంటైన్ ఈ నగరాన్ని కూడా 14 ప్రాంతాలుగా విభజించి, సామ్రాజ్యానికి చెందిన మహానగరపు రూపురేఖలు కనపడేలా అలంకరిచాడు.[7] అయినా కూడా కాన్స్టాంటైన్ యొక్క కొత్త రోమ్‌కు, మొదట్లో పాత రోమ్‌కు ఉన్న వైభవాలు లేవు. దానికి నగర ముఖ్య కార్యనివహణాధికారి లేడు కాని ఒక ప్రోకాన్సుల్ ఉన్నాడు. దానికి ప్రయేటర్స్, ట్రిబ్యూన్స్ (రోమ్ దేశపు అధికారులు) లేదా క్వేస్టర్స్ (కోశాధికారి) లేరు. దానికి సెనేటర్లు ఉన్నప్పటికీ వాళ్ళకి రోమ్‌లో మాదిరిగా క్లారిస్సిమస్ అన్న పేరు లేదు, వాళ్ళని క్లారస్ అనడం జరిగింది. ఆహార పంపిణీ, పోలీసు, విగ్రహాలు, గుళ్ళు, మురికినీళ్ళ కలువలూ, కాలువలూ లేదా ఇతర ప్రజాసేవలకు సంబంధించిన కార్యనిర్వహణ కార్యాలయాలకు ఉండే హంగు కూడా వాటికి లేదు. నిర్మాణపు కొత్త కార్యక్రమాన్ని అతి తొందరపాటుగా చేయడం జరిగింది: స్తంభాలు, రాళ్ళు, తలుపులు మరియు బండలు సామ్రాజ్యపు గుళ్ళ నుండి పెద్దమొత్తములో తీసుకుని కొత్త నగరానికి కదల్చడం జరిగింది. అదే విధంగా దాని కూడళ్ళు మరియు వీధులలో అత్యంత గొప్పవైన గ్రీకు మరియు రోమన్ కళకు సంబంధించిన కళాకృతులు వెంటనే కనపడసాగాయి. చక్రవర్తి ఆసియానా మరియు పోంటికాలలో రాజ్యానికి చెందిన ఆస్థులలోనుండి భూమిని కానుకగా ఇస్తానని చెప్పి వ్యక్తిగత నిర్మాణాలను ప్రోత్సహించాదు, మే 18, 332న, అతను, రోమ్‌లో మాదిరిగా కాన్స్టాంటినోపుల్‌లో కూడా ప్రజలకు ఆహార పంపిణీ ఉచితంగా చేస్తానని ప్రకటించాడు. ఆ సమయంలో మొత్తం రోజుకి 80,000 దినభత్యాల చొప్పున డబ్బు ఖర్చు అవ్వగా, దానిని నగరంలో మొత్తం 117 పంపిణీ కేంద్రాల నుండి దానం చేయడం జరిగింది.[8]

కాన్స్టాంటైన్ పాత బైజాంటియమ్ మధ్యలో ఒక కొత్త కూడలిని నిర్మించి, దానికి ఆగస్టియమ్ అని పేరు పెట్టాడు. కొత్త సెనేట్-హౌస్‌ను (సెనేట్ = పార్లమెంటులో ఒక భాగం) తూర్పు వైపు, ఒక రోమన్ కాథలిక్ చర్చిలోపల నిర్మించారు. మహాకూడలి దక్షిణ భాగాన, చాల్క్ అనబడే చక్కటి ద్వారంతో, పాలేస్ ఆఫ్ డాఫ్నె అనబడే పారంపరికమయిన గదుల పంక్తితో కలిపి, చక్రవర్తి యొక్క గ్రేట్ పాలేస్ (మహారాజ భవనం) నిర్మించారు. దగ్గరలో, రథాల పందేలకు, 80,000 ప్రేక్షకులు కూర్చుని వీక్షించగలిగే, అతిపెద్ద హిప్పోడ్రోమ్ (గుర్రపు పందేలు జరుగు స్టేడియం) ఇంకా ప్రసిధ్ధి గాంచిన జూక్సిప్పస్ యొక్క నీళ్ళ తొట్లు ఉన్నాయి. ఆగస్టియానికి పడమటి ద్వారం దగ్గర మిలియన్ ఉన్నది, అదొక విలువంపుగా కట్టిన స్మారక చిహ్నం, దాని నుండి తూర్పు రోమన్ సామ్రాజ్యమంతా కూడా దూరాలను కొలవవచ్చు.

ఆగస్టియం నుండి వరుసగా స్తంభాలు కలిగిన, మెసే (గ్రీకు: Μέση [Οδός]సాహిత్యం. "మధ్య (వీధి)" అనబడే ఒక గొప్ప వీధి బయలుదేరుతుంది. ఆ వీధి నగరం యొక్క మొదటి గుట్టను దిగి, రెండవ గుట్టను ఎక్కుతూ ఉండగా, అది ఎడమచేతి వైపు ఒక ప్రాయెటోరియం (ప్రాచీన రోమన్ జనరల్ యొక్క టెంటు) లేదా చట్టసభను దాటుతుంది. ఆ తరువాత అది రెండవ సెనేట్-హౌస్ కలిగిన గుడ్డు ఆకారపు ఫోరం ఆఫ్ కాన్స్టంటైన్ గుండా వెళ్తుంది. అక్కడ ఎత్తయిన స్తంభం కాన్స్టాంటైన్ యొక్క విగ్రహంతోపాటు ఉంది. కాన్స్టాంటైన్ విగ్రహం ఉదయిస్తోన్న సూర్యిడి దిశగా చూస్తూ, హీలియోస్ మాదిరిగా కనిపిస్తూ, ఏడు కిరణాల పరివేషముతో కిరీటధారణ చేయబడి కనిపిస్తుంది. అక్కడి నుండి మెసె ఫోరం ఆఫ్ టారస్ మరియు ఫోరం ఆఫ్ బౌస్ గుండా వెళ్ళి, చివరగా సెవెంత్ హిల్ (లేదా గ్జెరోఫస్) మరియు కాన్స్టాంటీనియన్ వాల్‌లోని గోల్డెన్ గేట్ గుండా వెళ్తుంది. 5వ శతాబ్దంలో థియోడీసియన్ గోడల నిర్మాణం తరువాత, అది కొత్త గోల్డెన్ గేట్ దాకా విస్తరించబడి, దాని పొడవు ఏడు రోమన్ మైళ్ళ పొడవుకి పెరుగుతుంది.[9]

395–527[మార్చు]

ఒక విభజింపబడని సామ్రాజ్యాన్ని పాలించిన చివరి రోమన్ చక్రవర్తి థియోడోసియస్ (కాన్స్టాంటినోపుల్ యొక్క గుర్రపు పందేల స్టేడియంలో ఒబెలిస్క్ నుండి వివరము

కాన్స్టాంటినోపుల్ నగరానికి మొదటి ముఖ్య కార్యనిర్వహణ అధికారి హొనోరేటస్, అతను 11 డిసెంబరు 359న కార్యభారం స్వీకరించి 361 వరకూ పదవిలో కొనసాగాడు. వాలెన్స్ చక్రవర్తి, ప్రొపోంటిస్ ఒడ్డున గోల్డెన్ గేట్ దగ్గర పాలేస్ ఆఫ్ హెబ్డోమోన్ నిర్మించాడు, అది బలగాలను సమీక్షించే ఉపయోగం కోసం నిర్మించి ఉండచ్చు. జేనో మరియు బాసిలిస్కస్ వరకు అందరు చక్రవర్తులకు రాజ్యాభిషేకం హెబ్డోమోన్‌లోనే జరిగింది. థియోడోసియస్ I, జాన్ ది బాప్టిస్ట్ యొక్క మెదడుని భద్రపరచడానికి, జాన్ ది బాప్టిస్ట్ చర్చిని స్థాపించాడు (ప్రస్తుతం అది టర్కీలోని ఇస్తాంబుల్‌లోని టాప్కాపి పాలేస్‌లో పరిరక్షింపబడి ఉంది), ఫోరం ఆఫ్ టారస్‌లో తనకోసం ఒక స్మారక స్థూపాన్ని నిర్మించుకున్నాడు, ఇంకా శిథిలమయిపోయిన ఆఫ్రొడైట్ గుడిని ప్రాయెటోరియన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారికి కోచ్ హౌస్‌గా (గుర్రపు బండ్లను ఉంచే స్థలం) మార్చాడు; అర్కేడియస్ మెసె మీద, కాన్స్టాంటైన్ గోడల దగ్గర తన పేరు మీదనే ఒక కొత్త బహిరంగ చర్చావేదిక నిర్మించాడు.

నెమ్మదిగా కాన్స్టాంటినోపుల్ యొక్క ప్రాముఖ్యత పెరిగింది. 378లో అడ్రియానోపుల్ యుధ్ధములో, చక్రవర్తి వాలెన్స్ అతని రోమన్ సైన్యాలు విసిగోత్స్ యొక్క కొద్ది రోజుల దాడిలో ధ్వంసమయ్యాక, ఆ ఘాతము తరువాత, నగరము తన రక్షణ కోసం స్పందించాల్సి వచ్చింది, థియోడోసియస్ II 413-414 సంవత్సరాలలో, 18 మీటర్ల (60 అడుగుల) పొడవైన మూడు గోడల కట్టడాలను నిర్మించాడు, అవి గన్‌పౌడర్ ఉపయోగించేంతదాక శత్రువులకు దుర్భేద్యమైన కట్టడముగా నిలుస్తాయి. ఫిబ్రవరి 27, 425వ తేదీన థియోడియస్ ఫోరం ఆఫ్ టారస్ దగ్గర ఒక విశ్వవిద్యాలయం కూడా స్థాపించాడు.

ఈ సమయంలో ఉల్దిన్, హన్నుల యొక్క రాజు, డాన్యూబ్ మీదుగా థ్రేస్‌లోకి చొచ్చుకు వచ్చాడు, కానీ చాలా మంది అతని సహచరులు అతన్ని వదిలి, రోమన్‌లతో చేతులు కలిపి, నదికి ఉత్తర దిశగా తమ రాజుని తరిమారు. తదనంతరముగా, నగరానికి రక్షణ కల్పించడానికి కొత్త గోడలు కట్టడం జరిగింది, అంతే కాక డాన్యూబ్ మీద ఓడల సముదాయాన్ని మెరుగుపరిచారు.

కొంత కాలం తరువాత బార్బేరియన్లు పెద్ద సంఖ్యలో పశ్చిమ రోమన్ సామ్రాజ్యం పై దండయాత్ర చేసారు: దాని చక్రవర్తులు వెనక్కు తగ్గి రావెన్న చేరుకున్నారు, అది ఆ తరువాత ఏమీ మిగలకుండా నాశనం అయిపోయింది. ఆ తరువాత, కాన్స్టాంటినోపుల్ నిజానికి రోమన్ సామ్రాజ్యానికే కాక యావత్ప్రపంచానికి అతిపెద్ద నగరముగా అవతరించింది. చక్రవర్తులు రాజభవనాలు, రాజధానుల మధ్య తిరగడం మానేసారు. వాళ్ళు, గొప్ప నగరములోని రాజభవనములో ఉంటూ, సైన్యాలకు నాయకత్వం వహించడానికి జనరల్స్‌ను పంపేవారు. తూర్పు మెడిటరేనియన్ మరియు పశ్చిమాసియాలోని సంపద కాన్స్టాంటినోపుల్‌లోకి ప్రవహించింది.

527–565[మార్చు]

కాన్స్టాంటినోపుల్ యొక్క పటము (1422) బై ఫ్లోరంటైన్ కార్టోగ్రాఫర్ క్రిస్టోఫోరో బ్యువొండెల్‌మోంటి[10] ఇది నగరం యొక్క అత్యంత పాతదయిన, జీవించి ఉన్న పటం, 1453లో నగరం పై టర్కిష్ గెలుపు తరువాత వచ్చిన వాటిల్లో మిగిలిన ఒకే ఒకటి.

చక్రవర్తి జస్టీనియన్ I (527-565) యుధ్ధములో విజయాలకు, చట్టపరమయిన సంస్కరణలకు, అతని ప్రజాహితమయిన కార్యాలకు ప్రసిధ్ధిగాంచాడు. డయొకీస్ ఆఫ్ ఆఫ్రికాను తిరిగి జయించడానికి, అతను రమారమి 21 జూన్ 533న మొదలు పెట్టిన సైనిక దండయాత్ర కాన్స్టాంటినోపుల్ నుండే బయలుదేరింది. యుధ్ధానికి వెళ్ళక ముందు కమాండర్ బెలిసారియస్ యొక్క నౌక ఇంపీరియల్ రాజభవనం ముందర లంగరు వేయబడింది, గోత్రజనకుడు ఉద్యమం యొక్క విజయం కొరకు ప్రార్థనలు చేసాడు. 70 ADలో రోమన్లు లూటీ చేసిన జెరుసలెం యొక్క గుడికి సంబంధించిన నిధిని 455 సంవత్సరంలో వాండల్స్ దోచుకుని కార్థేజ్‌కు తీసుకుపోయారు. 534లో విజయం తరువాత, ఆ నిధిని కాన్స్టాంటినోపుల్ తీసుకువచ్చి సెయింట్ పాలియూక్టస్ చర్చిలో ఉంచడం జరిగింది. ఆ తరువాత దానిని జెరుసలెంకు తిరిగి చర్చ్ ఆఫ్ రెసరెక్షన్‌లోనొ లేదా న్యూ చర్చ్‌లోనో ఇవ్వడం జరిగింది.[11]

శతాబ్దాలుగా రథాల పందేలు రోమ్‌లో చాలా ప్రాముఖ్యంత కలిగినవి. కాన్స్టాంటినోపుల్‌లో, కొంత సమయంలో హిప్పోడ్రోమ్ (గుర్రపు పందేలు, గుర్రపు బండ్ల పందేలు మొదలగునవి జరుగు స్టేడియం) రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక్కడే (పాత రోమ్ యొక్క జనామోదయోగ్యమయిన ఎన్నికల నీడగా) ప్రజలు కొత్త చక్రవర్తి పట్ల ఉత్సాహంతో కూడిన ఆమోదం తెలిపేవారు; ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించే స్థలం లేదా జనామోదం లేని మంత్రులను తొలగించమని ఆందోళన చేసే స్థలం కూడా అదే. జస్టీనియన్ చక్రవర్తిగా ఉన్న సమయంలో, కాన్స్టాంటినోపుల్‌లో ప్రజా శాంతి కీలకమయిన రాజకీయ అంశంగా మారింది.

రోమన్ల చివరి కాలంలో, బైజాంటైన్‌ల తొలికాలంలో గుర్తింపుకి సంబంధించిన ప్రాథమికమయిన ప్రశ్నలకు సంబంధించిన వివాదాలను క్రిస్టియానిటీ (క్రిస్టియన్ మతం) తీరుస్తూ ఉన్నది, అప్పుడు ప్రామాణికమయిన విలువలను గౌరవించే వర్గానికీ, మోనోఫిజైట్స్‌కీ మధ్య వివాదం తీవ్రమయిన అశాంతికి దారితీసింది, వాళ్ళు తమ వర్గం పట్ల అభిమానాన్ని గుర్రపు పందేల పక్షాలయిన బ్లూస్ మరియు గ్రీన్స్ పట్ల చాటి వ్యక్తం చేసేవారు. బ్లూస్ మరియు గ్రీన్స్‌కు మద్దతు పలికేవాళ్ళు[12], శ్రధ్ధ తీసుకోకుండా వదిలివేసిన ముఖంపైని జుత్తుతో, తల ముందు భాగం గొరుక్కొని, వెనుక భాగం పొడవుగా జుత్తు పెంచి, వెడల్పుగా ఉండే చొక్కా చేతులు, మోకాళ్ళ దాకా వదులుగా ఉండే దుస్తులు - మణికట్టు దగ్గర బిగువుగా ఉండేవి ధరించి ముఠాలుగా ఏర్పడి రాత్రివేళల దోపిడి దొంగతనాలు, వీధి హింసకు పాల్పడేవారు. చివరికి ఈ అశాంతి, అస్థిరతలు 532లో పెద్ద తిరుగుబాటు రూపం దాల్చాయి, దానిని ("విజయం" అని సింహనాదాలు చేసే యుధ్ధకారుల అరుపుల నుండి) "నిక" అల్లర్లుగా గుర్తించేవారు.

నికా అల్లరి మూకలు రాజేసిన నిప్పు, సెయింట్ సోఫియా యొక్క కాన్స్టాంటైన్ యొక్క బసిలికాను దహించివేసింది, అది ఆగస్టియానికి ఉత్తర దిశగా ఉన్న నగరపు ప్రధానమయిన చర్చ్. జస్టీనియన్ ట్రాలెస్ యొక్క ఆంథీమియస్‌ను మరియు మిలెటస్ యొక్క ఇసోడోర్‌ను, దానిని నూతనమయిన మరియు పోల్చడానికి అసాధ్యమయిన సెయింట్ సోఫియాతో భర్తీ చేయడానికి పనిలోకి దించాడు. ఇది ఆర్థడాక్స్ చర్చ్ గొప్పదైన మరియు అతిప్రముఖమయిన చర్చ్, దాని గుమ్మటము వంటి శిఖరాన్ని దేవుడే పైకెత్తి పట్ట్కున్నాడని చెప్పుకునేవారు, దానిని నేరుగా రాజభవనానికి అంటుకునే విధంగా నిర్మించారు, ఎందుకంటే రాజకుటుంబం దాని సేవలకు వెళ్ళడానికి వీధులగుండా వెళ్ళాల్సిన అవసరం ఉండదు.[13] 26 డిసెంబరు 537న, చక్రవర్తి అద్వర్యంలో దానిని అంకితం ఇవ్వడం జరిగింది, చక్రవర్తి అప్పుడు "ఓ సోలొమన్, నేను నిన్ను అధిగమించాను!" అని కేక వేశాడు.[14] సెయింట్ సోఫియా 600 మందితో సేవలందుకుంది, అందులో 80 మంది పూజారులు ఉన్నారు, దానిని నిర్మించడానికి 20,000 పౌండ్ల బంగారం అవసరం అయ్యింది.[15]

అదే లక్ష్యం కోసం జరిగిన ఆచార కర్మలో భాగంగా, జస్టీనియన్ ఆంథీమియస్ మరియు ఇసోడోర్‌లను కాన్స్టాంటైన్ నిర్మించిన హోలి అపోజిల్స్ యొక్క మొట్టమొదటి చర్చ్‌ని పడగొట్టించి కొత్త చర్చ్‌తో భర్తీ చేయించాడు. దీనిని సమానమయిన చేతులు కలిగిన క్రాస్‌తో పాటు అయిదు గుమ్మటాల వంటి శిఖరాల రూపంలో రూపకల్పన చేసి, అందమయిన మొజాయిక్‌తో అలంకరించారు. కాన్స్టాంటైన్ మొదలుకుని 11వ శతాబ్దం వరకు ఈ చర్చ్ చక్రవర్తులకు శ్మశాన వాటికగా నిలిచింది. 1453లో నగరం తురకలకు లొంగిపోయినపుడు, నగరాన్ని జయించినవాడయిన మెహ్మెత్ II యొక్క గోరీని నిర్మించడానికి ఈ చర్చ్‌ను పడగొట్టడం జరిగింది. జస్టీనియన్ నగరానికి చెందిన నిర్మించబడిన పర్యావరణానికి సంబంధించిన అంశాల పట్ల కూడా దృష్టి సారించాడు, అతను సముద్ర దృశ్యాన్ని కాపాడడం కోసం సముద్రపు ముందరి100 feet (30 m) భాగంలో నిర్మాణాలు చేయకూడదన్న చట్టాల అతిక్రమణకు వ్యతిరేకంగా చట్టాలు చేసాడు.[16]

జస్టీనియన్ I పాలించే సమయంలో, నగర జనాభా 5,00,000 లకు చేరుకుంది.[17] 541-542 AD సంవత్సరాల నడుమ ప్లేగు (ప్లేగ్ ఆఫ్ జస్టీనియన్) వ్యాధి ప్రబలడంతో, కాన్స్టాంటినోపుల్ నగరపు సామాజిక వ్యవస్థ కూడా దెబ్బ తినింది. అది బహుశా 40% నగరవాసులను బలితీసుకుంది.[18]

మధ్యయుగపు కాలంలో కాన్స్టాంటినోపుల్‌ని రక్షించిన కట్టడాల యొక్క పునరుధ్ధరించిన భాగం

జీవన ప్రక్రియ, 565–717[మార్చు]

7వ శతాబ్దపు ముందు భాగంలో, అవర్స్, తరువాత బల్గర్స్ బాల్కన్స్‌లోకి అధికంగా వచ్చారు, దాంతో పశ్చిమ దిశనుండి కాన్స్టాంటినోపుల్‌కు ముప్పు ఏర్పడింది. అదే సమయంలో పర్షియాకు చెందిన సస్సానిడ్స్ ప్రిఫెక్చర్ ఆఫ్ ది ఈస్ట్‌లో పూర్తిగా నిండిపోయి, అనటోలియాలోకి లోతుగా చొచ్చుకువచ్చారు. హెరాక్లయస్, ఆఫ్రికాలోని క్రిస్టియన్ మతగురువు యొక్క పుత్రుడు, సముద్రం గుండా నగరానికి విచ్చేసి రాచరిక హోదా స్వీకరించాడు. అతనికి సైనిక స్థితి చాలా విపత్కరంగా తోచింది, దాంతో అతను దేశ రాజధానిని కార్థేజ్‌కు తరలించాలని మొదట అనుకున్నాడని చెబుతారు, కానీ కాన్స్టాంటినోపుల్ యొక్క ప్రజలు ఉండమని బ్రతిమాలుకోవడంతో ఆ ఆలోచన మానుకున్నాడు. పర్షియన్ యుధ్ధాల వల్ల, నగరానికి ఈజిప్షియన్ మూలాల నుండి రావల్సిన సరుకులు రాక పోవడం జరుగుతోందని హెరాక్లియస్ తెలుసుకోగానే, 618లో కాన్స్టాంటినోపుల్ ఉచితంగా తిండిగింజలు పొందే హక్కుని కోల్పోయింది. దాంతో, కాన్స్టాంటినోపుల్ నగర జనాభా, చెప్పుకోతగ్గ రీతిలో 5,00,000 నుండి 40,000-70,000లకు పడిపోయింది.[19]

మహానగరం ఒక పక్క ఆక్రమణని ఎదురొడ్డి నిలబడగా, హెరాక్లియస్ 628వ సంవత్సరంలో పర్షియన్ భూభాగంలోకి లోతుగా చొచ్చుకువెళ్ళి, పర్షియన్లు తమ ఆక్రమణలను ధారాధాత్తం చేయడంతో కొంత మునుపటి స్థితికి తీసుకువచ్చాడు. కానీ ఆ తరువాత అరబ్బుల దాడుల నేపథ్యంలో, ఆఫ్రికన్ మరియు మెడిటరేనియన్ రాష్ట్రాలు కోల్పోవడంతో సామ్రాజ్యం బలహీనపడింది. ఈ యుధ్ధాల సమయంలో ముస్లింల చేత కాన్స్టాంటినోపుల్ కోట చుట్టు మొదటి దాడి, 674 నుండి 678 వరకు కొనసాగింది, రెండోది 717 నుండి 718 వరకు. భూమి పైనుండి నగరాన్ని థియోడోసియన్ గోడలు శత్రుదుర్భేద్యంగా మారిస్తే, కొత్తగా కనిపెట్టబడిన ఉద్దేశపూర్వకంగా మంటను రగిల్చే "గ్రీక్ ఫైర్" అనబడే పదార్థం, బైజాంటైన్ నావికాదళం అరబ్ ఓడలను ధ్వంసం చేయడానికి నగరానికి సరుకుల రవాణా జరగడానికి దోహద పడింది. రెండవ కోటచుట్టు ముట్టడిలో బల్గర్స్ నిర్ణాయకమైన సహాయం అందించారు. ఈ కోట ముట్టడి యొక్క వైఫల్యం ఉమయ్యాడ్ కలిఫాత్‌కి గొడ్డలిపెట్టు అయ్యింది, అది బైజాంటైన్-అరబ్బుల మధ్య సమతుల్యాన్ని స్థిమితపరిచింది.

717–1025[మార్చు]

జీసస్ క్రైస్ట్‌ను పూజిస్తున్న చక్రవర్తి లియో VI (886-912) హాగియా సోఫియాలో ఇంపీరియల్ గేట్ మీద ఉన్న మొజేక్
స్విడెన్‌లో హాగ్బి రూన్‌స్టోన్స్, c30 గ్రీస్ రూన్‌స్టోన్స్‌లో ఒకటి, అది వరాంగియన్ గార్డ్ సభ్యుల జ్ఞాపకార్ధం ఉద్దేశించినవి.

730వ దశాబ్దంలో లియో III తరచు జరిగిన హింసాయుతమయిన దాడుల వల్ల దెబ్బతిన్న థియోడోసియన్ గోడలకు విస్తృతమయిన మరమ్మతులు చేయించాడు; సామ్రాజ్యానికి చెందిన అందరు పురజనుల మీదా ప్రత్యేకమయిన పన్ను విధించడం ద్వారా ఈ పనికి నిధులు సమకూర్చడం జరిగింది.[20]

చక్రవర్తి థియోఫిలస్ (d. 842) యొక్క విధవరాలు అయిన థియోడోర, తన కుమారుడు మైకేల్ III బాల్యదశవీడి కార్యభారం స్వీకరించేంతదాకా, దేశానికి పాలకురాలిగా వ్యవహరించింది. మైకేల్ IIIను ఆమె సోదరుడు బార్దాస్ చెడ్డ అలవాట్లకు లోనయ్యేలా చేసాడని చెబుతారు. 856లో మైకేల్ పాలకుడు అయ్యాక, అతను అధికంగా త్రాగడానికి పేరొందాడు, అతను హిప్పోడ్రోంలో రథసారథిగా అగుపించాడు, ఇంకా క్రిస్టియన్ మతగురువులు చేపట్టే మతపరమయిన ఊరేగింపులను అవహేళన చేసేవాడు. అతను థియోడోరాను మహారజభవనం నుండి తొలగించి, కారియన్ రాజభవనానికి తరలించాడు, తరువాత గాస్ట్రియా యొక్క సన్యాసుల ఆశ్రమానికి ఆమెని తరలించాడు, కానీ బార్దాస్ మృతి చెందాక ఆమెను విడుదల చేసి సెయింట్ మామాస్ యొక్క రాజభవనంలో ఉండనిచ్చారు; ఆమెకు అంథేమియన్ రాజభవనంలో ఒక గ్రామీణ గృహం కూడా ఉన్నది, అక్కడే మైకేల్ 867వ సంవత్సరంలో హత్యకు గురయ్యాడు.[21]

860వ సంవత్సరంలో, కొన్ని సంవత్సరాల ముందు కియెవ్‌లో ఇద్దరు వరాంగియన్ పెద్దలు ఆస్కోల్డ్ మరియు డీర్‌లచే స్థాపించబడిన కొత్త రాజ్యం దాడికి దిగింది: రెండు వందల చిన్న ఓడలు బోస్పోరస్ గుండా పయనించి ప్రిన్స్'స్ ఐలాండ్స్ యొక్క పట్టణపు పొలిమేర ప్రాంతాలలోని సన్యాసుల ఆశ్రమాలను, ఇతర ఆస్తులను దోచుకున్నాయి. బైజాంటైన్ ఓడల సమూహం యొక్క అడ్మిరల్ అయిన ఒరిఫస్, చక్రవర్తి మైకేల్‌ను జాగరూకుడిని చేసాడు, మైకేల్ వెంటనే ఆక్రమణదారులను పారిపోయేలా చేసాడు; కానీ హఠాత్తుగా జరిగిన దాడి దాని యొక్క క్రూరత్వం, పురజనుల మీద లోతయిన ముద్ర వేసింది.[22]

980వ సంవత్సరంలో బెసిల్ II చక్రవర్తి, కియెవ్ రాజు అయిన వ్లాదమీర్ నుండి అసాధారణమయిన కానుక అందుకున్నాడు: 6,000 వరాంగియన్ యుధ్ధకారులతో వరాంగియన్ గార్డ్ అనబడే కొత్త శరీరరక్షణ దళాన్ని బెసిల్ రూపొందించాడు. వారు తమ ఉగ్రత్వానికి, గౌరవానికి మరియు స్వామిభక్తికి పేరుగాంచారు. థ్రేస్ అనే స్థలంలో 1038వ సంవత్సరంలో వాళ్ళని శీతాకాలపు నివాసాలకు తరలించినపుడు, వాళ్ళలో ఒకడు గ్రామీణస్త్రీని చెరచడానికి ప్రయత్నించాడు, కానీ ఆ పెనుగులాటలో, ఆమె అతని కత్తిని లాక్కుని అతన్ని చంపివేసిందని చెబుతారు; కానీ అతని సహచరులు ఆమె పై ప్రతీకారం తీర్చుకునే బదులు ఆమె నడవడిని మెచ్చుకుని, ఆమెకు అతని దగ్గర ఉన్న వస్తువులన్నీ ఇచ్చి పరిహారం చెల్లించి, చచ్చిన అతని శరీరాన్ని పూడ్చిపెట్టకుండా అతను ఆత్మహత్య చేసుకున్నడు అన్నట్లుగా, నలుగురూ చూసే విధంగా అతని శవాన్ని బయట బహిర్గతం చేసి ఉంచారు.[23] కానీ, చక్రవర్తి మరణించాక, వారు రాజభవనాలలో దోపిడీలకు కూడా ప్రసిధ్ధిగాంచారు.[24] తరువాత 11వ శతాబ్దంలో, వరాంగియన్ గార్డ్‌పై ఆంగ్లో-సాక్సన్స్ ఆధిపత్యం ప్రదర్శించారు. ఇంగ్లాండ్ యొక్క కొత్త నార్మన్ రాజుల చేత అణచివేతకు గురయ్యేకంటే ఈ జీవనవిధానం మెరుగయినదని ఆంగ్లో సాక్సన్స్ భావించారు.[25]

10వ శతాబ్దానికి చెందిన పుస్తకం, బుక్ ఆఫ్ ది ఎపార్క్, ఆ సమయంలో నగర వాణిజ్య జీవితము ఇంకా దాని వ్యవస్థీకరణకు సంబంధించిన విస్తారమయిన చిత్రాన్ని అందిస్తుంది. కాన్స్టాంటినోపుల్‌లో వర్తకులచే వ్యవస్థీకరించబడిన సంస్థలను ఎపార్క్ పర్యవేక్షించేవాడు, అతను ఉత్పత్తి, ధరలు, దిగుమతి మరియు ఎగుమతుల లాంటి విషయాలను శాసనాల ద్వారా నియంత్రించేవాడు. ప్రతి వర్తక సమాజానికి తన సొంత గుత్తాధిపత్యం ఉన్నది, వర్తకులు ఒకటి కంటే ఎక్కువ వర్తక సమాజాలకు చెందిన వారయి ఉండకపోవచ్చు. 330వ సంవత్సరంలో రోమ్ యొక్క నాగరిక ముఖ్య కార్యనిర్వహణాధికారుల చేత నడపబడే జిల్లాల కార్యాలయాలను స్థాపించాక ఈ అమరికలు ఎంత తక్కువగా మార్పు చెందాయో అన్న విషయానికి సంబంధించి, సంప్రదాయం యొక్క బలానికి ఇది ఒక చక్కని సాక్ష్యం. ఈ కార్యాలయాలను అప్పుడు లాటిన్ పేరుతో గుర్తించేవారు.[26]

9వ మరియు 10వ శతాబ్దాలలో కాన్స్టాంటినోపుల్ యొక్క జనాభా 5,00,000 నుండి 8,00,000 దాకా ఉండేది.[27]

విగ్రహములను ధ్వంసం చేసిన వివాదము[మార్చు]

8 మరియు 9 శతాబ్దములలో విగ్రహములను ధ్వంసం చేసిన ఉద్యమము రాజ్యము మొత్తము చాలా పెద్ద అశాంతికి దారి తీసింది. చక్రవర్తి లియో III 726 లో ఒక శాసనమును విగ్రహములకు వ్యతిరేకముగా విధించాడు మరియు చల్కే యొక్క తలుపుల మీద ఉన్న ఒక జీసస్ క్రీస్తు యొక్క విగ్రహమును ధ్వంసము చేయమని ఆదేశించాడు. ఈ పనిని అక్కడి పౌరులు తీవ్రముగా వ్యతిరేకించారు, [28] ఆపివేశారు. కన్స్టన్టైన్ V ఒక చర్చ్ సంఘమును 754 లో ఏర్పాటు చేసాడు, అది విగ్రహారాధనను పూర్తిగా ఖండించింది, దాని తరువాత చాలా విగ్రహములు పగలగొట్టబడ్డాయి, తగలబెట్టబడ్డాయి, లేదా వాటిపై చెట్లు, లతలు, పక్షులు లేదా జంతువులతో ఉన్న చిత్రములు మార్పు చేయబడ్డాయి. ఒక ఆధారము ప్రకారము, బ్లాచేర్నే లోని హోలీ వర్జిన్ చర్చ్ ఒక "పండ్ల దుకాణము మరియు పక్షుల ఇల్లు" [29] అయింది. 780 లో, తన కుమారుడు లియో IV మరణించిన తరువాత, మహారాజ్ఞి ఇరేని, నికేయ యొక్క రెండవ సంస్థ ద్వారా విగ్రహారాధనను పునరుద్ధరించింది.

ఈ విగ్రహములను ధ్వంసం చేసిన ఉద్యమము మరలా 9వ శతాబ్దము మొదటిలో తిరిగి మొదలైంది,843లో మహారాజ్ఞి థియోడరా పరిపాలనలో మాత్రమే పరిష్కరించబడినది, ఆమె విగ్రహములని తిరిగి పెట్టించింది. ఈ వివాదములు పడమర మరియు తూర్పు ప్రాంతములకు చెందిన చర్చ్ ల మధ్య సత్సంబంధములను దెబ్బతీసాయి.

కమేనియన్ సమయమునకు మొదలు, 1025–1081[మార్చు]

1071లో ఆర్మేనియాలో మంజికర్ట్ యుద్ధములో రాచసైన్యము ఉహించని మరియు ఘోర పరాజయము పాలు అవ్వడముతో, 11 శతాబ్దము చివరలో గొప్ప క్షామము ఏర్పడింది. మహారాజు రోమనస్ డియోజీన్స్ పట్టుబడ్డాడు. ఆల్ప్ అర్సలాన్, సేల్జక్ టుర్క్స్ యొక్క సుల్తాన్ అడిగిన శాంతిసంధి యొక్క నిర్ణయములు ఎక్కువ కాకపోవడంతో రోమనస్ వాటిని అంగీకరించాడు. తాను విడుదల అయిన తరువాత, రోమనస్ తన శత్రువులు వారికి సంబంధించిన వ్యక్తిని తన సింహాసనము పై కూర్చుండ పెట్టినట్లు గమనించాడు, అతను వారికి లొంగిపోయాడు మరియు హింస వలన మరణించాడు, కొత్తగా రాజు అయిన మైకేల్ VII డ్యూకస్ ఆ శాంతి సంధిని అంగీకరించలేదు. దానికి జవాబుగా, 1073 లో తుర్కులు అనటోలియాలోకి రావడం మొదలు పెట్టారు. పాత రక్షణ పద్ధతిని వారు ఓడించారు అంటే వారికి ఎదురు లేకపోయింది మరియు మహారాజు యొక్క సైన్యము మొత్తము కూడా దృష్టి మరల్చబడినది మరియు మామూలు వరుస యుద్ధములలో మరణాల వలన తగ్గిపోయింది. రక్షణ లేని అనటోలియా యొక్క సరిహద్దులు దాటి వేలమంది తుర్కులు మరియు గిరిజనులు లోపలి చొరపడ్డారు. 1080 వరకు, చాలా భూభాగము తుర్కుల ఆధీనములోకి వెళ్లి పోయింది మరియు వారు కాన్స్టంట్నోపుల్ కు చాలా దగ్గరగా వచ్చేసారు.

1081–1185[మార్చు]

ది బైజాంటైన్ ఎంపైర్ అండర్ మాన్యువల్ I, c.1180
హాగియా సోఫియాలోని పై గాలరి నుండి 12వ శతాబ్దపు మొజేక్, కాన్స్టాంటినోపుల్.జాన్ II చక్రవర్తి (1118-1143) ఎడమ వైపు చూపబడ్డాడు, వర్జిన్ మేరి తన పసిపాపడు జీసస్‌తో మధ్యలో, మరియు జాన్ యొక్క భార్య రాణి ఐరీన్ కుడివైపున ఉంది.

కమేనియన్ వంశ పాలనలో (1081–1185), బైజాన్టియం గుర్తించదగిన రీతిలో సైనిక పరముగా, ఆర్థిక పరముగా మరియు రక్షణ పరముగా వృద్ధి సాధించింది. ఇదే కొన్నిసార్లు, కమేనియన్ రిస్టోరేషన్ అని పిలవబడినది, క్రొత్తగా సైన్య సమీకరణ, వ్యుహములతో, మహారాజు దాదాపు అనటోలియన్ లో పోగొట్టుకున్న భూమిలో దాదాపు సగము తిరిగి సాధించాడు. 1090–91 లో, పెచెంగేస్ తిరుగుతూ వచ్చే తుర్కుల సైన్యము, కాన్స్టంట్నోపుల్ గోడల వరకు వచ్చేసాయి, అక్కడ మహారాజు ఎలెక్షియస్, కిప్చాక్స్ యొక్క సహకారముతో మొత్తము సైన్యమును నిర్జించాడు.[30] 1091 లో వచ్చిన లివోయునియన్ యుద్ధం పునర్జన్మ నొందిన బైజాన్టైన్ శక్తినీ వందల సంవత్సరముల వరకు అది కలిగి ఉండబోయే ప్రభావము యొక్క ప్రారంభమును చూపించింది. ఎలెక్షియస్ I కామ్నెన్సస్ నుంచి సహాయము కొరకు వచ్చిన అభ్యర్ధనకు జవాబుగా, మొదటి ఉద్యమ సభ్యులు కాన్శంట్నోపుల్ లో 1096లో కలుసుకున్నారు, కానీ బైజాన్టిన్ నాయకత్వములో ముందుకు వెళ్ళడానికి అంగీకరించక, వారంతట వారే జెరూసలేంకు వెళ్ళిపోయారు.[31] జాన్ IIమానెష్టరి ఆఫ్ ది పాన్టోక్రాటర్ (ఆల్మైటి) అనే పేరుతో 50 పడకలతో బీదల కొరకు ఒక వైద్యశాల కట్టించాడు.[32]

గట్టి కేంద్ర ప్రభుత్వను తిరిగి ప్రతిష్ఠించగలగడముతో మహారాజు చాలా ధనవంతుడు అయ్యాడు. జనాభా కూడా పెరగటం ఆరంభించింది (12వ శతాబ్దంలో కాన్శంట్నోపుల్ జనాభా 100,000 నుండి 500,000 మధ్య మారుతూ ఉంది, రాజ్యము మొత్తములో పట్టణములు, నగరములు బాగా అభివృద్ధి చెందాయి. అదే సమయములో, వాడుకలో ఉన్న ధనము చాలా పెరిగింది. ఇది బ్లాకేర్నే రాజభవనమును కాన్శంట్నోపుల్ లో నిర్మించడం ద్వారా చూపబడినది, ఇది గొప్ప క్రొత్త పనితనము మరియు అప్పటి ఆర్థికస్థాయిని ప్రతిబింబించేలా నిర్మింపబడిన కట్టడము. ఇటాలియన్ నగర-రాష్ట్రములు పెరగడముతో, వ్యాపారాభివృద్ధి జరిగి, అదే ఆర్థికముగా బలపడానికి కారణము అయ్యి ఉండవచ్చు. వెనేటియన్లు మరియు ఇతరులు కాన్శంట్నోపుల్ లో చురుకుగా వ్యాపారము చేసేవారు కావచ్చును, వీరీ ముఖ్య జీవిక సహకారము అందించే అవుట్రిమర్ రాజ్యముల మధ్య మరియు పడమర ప్రాంతములకు సరుకు రవాణా చేయడము మరియు బైజాన్టియం, ఈజిప్ట్ లతో అధికముగా వ్యాపారము చేయడము. ఈ వెనేటియన్లకు గోల్డెన్ హార్న్ కు ఉత్తర ప్రాంతములో కర్మాగారములు కలిగి ఉన్నారు మరియు పడమర ప్రాంతీయులు 12వ శతాబ్దంలో, చాలా ఎక్కువ సంఖ్యలో ఆ నగరములో ఉండేవారు. మాన్యుల్ I యొక్క సమయము పూర్తి అయ్యే సమయమునకు మొత్తము మీద ఆ నగరములో ఉన్నమొత్తము జనాభా 400,000 అయితే, విదేశీయుల సంఖ్య 60,000-80,000 వరకు చేరుకుంది.[33] 1171లో కాన్శంట్నోపుల్ లో చిన్న సమూహములో 2,500 మంది జ్యూలు కూడా ఉండేవారు.[34]

చక్కటి మాటలలో చెప్పాలంటే, 12వ శతాబ్దం చాలా అభివృద్ధి కలిగిన సమయము. అప్పుడు నానా రకముల రాళ్ళు పొదిగిన గచ్చు పని చేసే కళ పునరుద్ధరించబడినది, ఉదాహరణకు: నానా రకముల రాళ్ళు పొదిగిన గచ్చు పని, త్రీ-డైమెన్షనల్ ఆకారములతో, చాలా సహజముగా మరియు అందముగా తీర్చి దిద్దబడ్డాయి. ఎక్కువమంది ప్రజల వద్ద ఈ కళల కొరకు వెచ్చించడానికి కావలసిన ఉపకరణములు మరియు ధనము ఉంది. ఎన్.హెచ్.బేన్స్ (బైజాన్టియం,యాన్ ఇంట్రడక్షన్ టు ఈస్ట్ రోమన్ సివిలైజేషన్ ) ప్రకారము:

"రంగుల పట్ల ఉన్న ఇష్టము మరియు సౌకర్యము వలన ఈ కళ చాలా గొప్ప గొప్ప కళాఖండములను సృష్టించగలుగుతోంది, ఇవి బైజాన్టియంకు పేరు తెస్తూ, మొత్తము క్రైస్తవ ప్రపంచములో విస్తరించాయి. కాన్శంట్నోపుల్ లోని నేత ప్రాంతముల నుండి అద్భుతమైన పట్టు వస్త్రములు, చక్కటి రంగులలో, సింహములు, ఏనుగులు, గ్రద్దలు మరియు గ్రిఫ్ఫిన్ లు వంటి జంతుజాలముతో, రాచరిక ఠీవి ఉట్టిపడుతూ, రాజు ఒక గుఱ్ఱము పై ఉన్నట్లుగా కానీ, లేదా వేటాడుతున్నట్లుగా కానీ చిత్రీకరించబడి, దేనికదే అధ్బుతము అని అనిపించేలా దొరుకుతున్నాయి."
"పడవ శతాబ్దం నుండి పన్నెండవ శతాబ్దం వరకు బైగాన్టియం పడమర ప్రాంతములకు ప్రేరణగా నిలిచింది. వెనిస్ లోని సెయింట్..మార్క్ మైర్యు టోర్సెలో లోని కాథేద్రెల్ లు వాటి పద్దతి, పెట్టిన తీరు మరియు వాటికవే సాటి వచ్చే తీరు వంటి వలన అవి బైగాన్టియం కు చెందినవి అని చెప్పకనే చెపుతున్నాయి. అలాగే, పలంటైన్ చాపెల్ లోని, పలెర్మో లోని మార్టోరన మరియు సేఫాలు లోని కాథేద్రెల్ లు, మాన్రియలె లోని కాథేద్రెల్ యొక్క అద్భుతమైన, గొప్ప అలంకరణలతో సంయుక్తముగా బైగాన్టియం యొక్క ప్రభావమును సిసిలీ లోని నార్మన్ కోర్ట్ పై పన్నెండవ శతాబ్దములో చూపించాయి. హిస్పనో-మూరిష్ కళ నిస్సందేహముగా బైగాన్టియం నుండి ఆవిర్భవించినది. రోమన్స్ కు కళ ఎక్కువగా తూర్పు ప్రాంతము నుండి వచ్చింది. రోమన్స్ కు కళ ఎక్కువగా తూర్పు ప్రాంతము నుండి వచ్చింది. అందులో ఇది ఆ ప్రాంతపు అలంకరణను మాత్రమే కాక, ఆ భవనముల నిర్మాణమును కూడా అనుకరించింది అని నిర్ధారించబడినది. ఉదాహరణ: ఫ్రాన్స్ లోని వంపు తిరిగిన దక్షిణ-పడమర ప్రాంతపు చర్చ్ లు. కీవ్ రాజకుమారి,వెనేటియన్ డోగ్స్,మాంటి కాసినో కు చెందిన పూజా గృహములు,అమల్ఫీ కు చెందిన వ్యాపారస్తులు మరియు సిసిలీ యొక్క రాజులూ కూడా ఈ పని చేయగలిగిన కళాకారుల కొరకు మరియు ఈ కళ కు సంబంధించిన వస్తువుల కొరకు బైగాన్టియం వైపే చూసేవారు. బైగాన్టియం పన్నెండవ శతాబ్దంలో ఎంతటి ప్రభావము కలిగి ఉండేదంటే, రష్యా, వెనిస్, దక్షిణ ఇటలీ మరియు సిసిలీ అన్నీ కూడా కేవలము ఈ కళకు సంబంధించిన వస్తు తయారీ కేంద్రములుగానే అయ్యాయి."

1185–1261[మార్చు]

ది ఎంట్రి ఆఫ్ ది క్రుసేడర్స్ ఇంటు కాన్స్టాంటినోపుల్, బై యూజీన్ డెలాక్రాఇక్స్, 1840.
ది లాటిన్ ఎంపైర్, ఎంపైర్ ఆఫ్ నికే, ఎంపైర్ ఆఫ్ ట్రెబిజోండ్, అండ్ ది డెస్పొటేట్ ఆఫ్ ఎపిరస్.ది బార్డర్స్ ఆర్ వెరి అన్‌సర్టెయిన్.

ఒక ఇతివృత్తం ప్రకారము సమయములో, ఫిలిప్ ఆఫ్ స్వాబియ, బనిఫేస్ ఆఫ్ మోంట్ఫెర్రాట్ మరియు డోగే ఆఫ్ వెనిస్ ల మధ్య, పోప్ కు సంబంధించిన పరిత్యాగము ఉన్నప్పటికీ, నాల్గవ ఉద్యమము, కాన్స్టెంట్నోపుల్ కు వ్యతిరేకముగా 1203 లో మార్పు చెందినది. చక్రవర్తి పీఠం నుండి తొలగింపబడిన ఐజాక్ ను గురించి అలెక్సిస్ కొడుకు అందరకు తెలిసేలా చేసిన ఆరోపణలను బాగా ప్రచారం చేసారు. అప్పటి చక్రవర్తి అలెక్సిస్ III దానికి తయారై రాలేదు. తీవ్రవాదులు గలాటాను వశం చేసుకుని, గోల్డెన్ హార్న్ ను కాపాడుతున్న గొలుసును విరగగొట్టారు మరియు ఓడరేవు లోకి వెళ్లారు, అక్కడ 27 జూన్ న వాళ్ళు సముద్ర సరిహద్దులు దాటారు; అలెక్సిస్ III పారిపోయాడు. కానీ అలెక్సిస్ IV నిధులు సరిపోవు అని గమనించాడు మరియు పడమర ప్రాంత స్నేహితులకు ఇస్తానని ప్రమాణం చేసిన బహుమతులు ఇవ్వలేకపోయాడు. పౌరుల మరియు లాటిన్ సైనికుల మధ్య స్పర్ధలు పెరిగాయి. జనవరి 1204 న ప్రోటోవెస్టిఅరయా స్ అలెక్సిస్ ముర్జుఫల్స్, బహుశా అలెక్సిస్ IVను భయపెట్టడానికి ఒక గొడవను లేవనెత్తాడు, కానీ దాని ఫలితముగా కేవలము అథేనా యొక్క గొప్ప విగ్రహము విరగగొట్టబడినది, ఇది పడమర ప్రాంతములను గురించిన వాగ్వివాదములో, చెడ్డ పనిగా చోటు చేసుకుంది.

ఫిబ్రవరిలో ప్రజలు మరలా తిరుగుబాటు చేసారు: అలెక్సియస్ IV జైలులో పెట్టబడ్డాడు మరియు చంపబడ్డాడు, ముజుప్హ్లుస్ అలెక్సియస్ V గా స్థానము తీసుకున్నాడు. ఆయన గోడల మరమ్మత్తులు చేసి, ప్రజల రాకపోకలు జరిగేలా చూడాలని కొంత ప్రయత్నము చేసాడు, కానీ ప్రజలను దగ్గరి ప్రాంతముల నుండి తేవడానికి అవకాశము రాలేదు మరియు అక్కడి రక్షకులు ఈ తిరుగుబాటు వలన భయపడిపోయారు. తీవ్రవాదులచే ఏప్రిల్ 6న చేయబడిన ఒక ముట్టడి ఫలించలేదు, కానీ రెండవసారి ఏప్రిల్ 12న గోల్డెన్ హార్న్ నుంచి చేసిన ముట్టడిలో వారు విజయము సాధించారు మరియు వేలమంది తీవ్రవాదులు లోపలకు వచ్చేసారు. అలెక్సియస్ V పారిపోయాడు. అప్పుడు దేశమును పాలిస్తున ప్రభుత్వమునకు చెందిన వారంతా సైంట్.సోఫియాలో కలిసారు మరియు అంగ్లిడ్ కుటుంబమునకు చెందిన వనితను పెండ్లాడిన థియోడరే లాస్కారిస్ కు కిరీటమును అప్పగిస్తామని అన్నారు, కానీ అప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయింది. ఆయన మూలగురువు తోటి గోల్డెన్ మైల్స్టోన్ బయటకు వచ్చాడు మరియు అక్కడ కాపలా ఉన్న రక్షకుడిని ఉద్దేశించి మాట్లాడాడు. ఆ తరువాత వారిద్దరూ ఆసియాకు పారిపోయారు. మరునాటికి, డోగ్ మరియు అప్పుడు నడుస్తున్న ఫ్రాంక్ లు గొప్ప రాజభవనములో పెట్టబడ్డాయి మరియు నగరము మూడు రోజులపాటు దోచుకోబడింది.

ఈ ఉద్యమముల చరిత్రకారుడు అయిన సర్.స్టీవెన్ రన్సిమాన్, ఈ కాన్స్టెంట్నోపుల్ కథను "చరిత్రలో సాటిలేనిది , అన్పారలల్డ్ ఇన్ హిస్టరీ" అని వ్రాసాడు.

“For nine centuries,” he goes on, “the great city had been the capital of Christian civilisation. It was filled with works of art that had survived from ancient Greece and with the masterpieces of its own exquisite craftsmen. The Venetians wherever they could seized treasures and carried them off. But the Frenchmen and Flemings were filled with a lust for destruction: they rushed in a howling mob down the streets and through the houses, snatching up everything that glittered and destroying whatever they could not carry, pausing only to murder or to rape, or to break open the wine-cellars. Neither monasteries nor churches nor libraries were spared. In St Sophia itself drunken soldiers could be seen tearing down the silken hangings and pulling the silver iconostasis to pieces, while sacred books and icons were trampled under foot. While they drank from the altar-vessels a prostitute sang a ribald French song on the Patriarch’s throne. Nuns were ravished in their convents. Palaces and hovels alike were wrecked. Wounded women and children lay dying in the streets. For three days the ghastly scenes continued until the huge and beautiful city was a shambles. Even after order was restored, citizens were tortured to make them reveal treasures they had hidden.

[35]

ఆ తరువాతి అర్ధ శతాబ్దం వరకు, కాన్స్టెంట్నోపుల్ లాటిన్ రాచరికపు ప్రదేశం అయింది. బైజాన్టిన్ గొప్పదనము చెల్లాచెదురు అయింది. చాలా మంది థియోడరే లాస్కరిస్ గొప్ప రాచరిక న్యాయస్థానం పెట్టిన నికాయియకు వెళ్ళిపోయారు, ఇంకొంతమంది థియోడరే యాన్గిలస్ అలాగే నెలకొల్పిన ఎపిరాస్ కు వెళ్ళిపోయారు, మిగిలిన వారు ట్రేబిజాండ్ కు వెళ్ళిపోయారు, అక్కడ అప్పటికే జార్జియన్ సహకారముతో కొమిని లలో ఒకడు తన స్వంతంత్ర రాజ్యమును స్థాపించుకున్నాడు.[36] నికాయియ మరియు ఎపిరాస్ రెండు రాజ్యము హోదా కొరకు పోరు జరిపాయి మరియు కాన్స్టెంట్నోపుల్ ను తమ ఆధీనములోకి తెచ్చుకునే ప్రయత్నము చేసాయి. 1261 లో కాన్స్టెంట్నోపుల్ ను, అప్పటి రాజు అయిన బాల్డ్విన్ II పై గెలుపు సాధించి నికాయియ రాజు అయిన మైకేల్ VIII పాలేఈలోగూస్ వశం చేసుకున్నాడు.

ది 1453 సీజ్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్, పెయింటెడ్ 1499

1261–1453[మార్చు]

కాన్స్టెంట్నోపుల్ ను మైకేల్ VIIIతిరిగి వశము చేసుకున్నప్పటికీ, అప్పటికే ఆ రాజ్యం చాలా ముఖ్యమైన సంపదను కోల్పోయింది, తిరిగి నిలబడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. బోస్పోరస్ ఒడ్డున ఉన్న పాత గొప్ప రాజభవనము, బాగా దెబ్బతినడముతో, నగరము యొక్క ఉత్తర-పడమర ప్రాంతములో ఉన్న బ్లాకేర్నే రాజభవనము అధికారిక నివాసము అయింది. మైకేల్ VIII నగరమును తిరిగి వశము చేసుకున్నప్పటికి అక్కడి జనాభా 35,000గా ఉండేది, అతని పదవీ కాలములో జనాభా 70,000 చేరుకునేలా చేయడములో అతను విజయము సాధించాడు.[37] అతను తీవ్రవాదులు నగరమును ఆక్రమించుకున్నప్పుడు పారిపోయిన విదేశీయులను తిరిగి వెనుకకు పిలవడము మరియు అంతకు ముందే తిరిగి గెలిచిన పిలోఫోన్నేస్ నుండి గ్రీకులను రాజధానికి రప్పించడం ద్వారా జనాభాను పెంచడంలో విజయం సాధించాడు.[38] 1347లో కాన్స్టెంట్నోపుల్ లో చాలా మందిని మృత్యువు కబళించింది.[39] 1453లో, ఒట్టోమన్ తుర్క్ లు, నగరమును వశపరచుకున్నప్పుడు నగర జనాభా 50,000 ఉంది.[40]

ప్రాముఖ్యత[మార్చు]

ఈగిల్ అండ్ స్నేక్, 6th సెంచురి మొజేక్ ఫ్లోరింగ్ కాన్స్టాంటినోపుల్, గ్రాండ్ ఇంపీరియల్ పాలేస్.

సంస్కృతి[మార్చు]

తూర్పు మెడిటెర్రనియన్ సముద్రము ప్రాంతములో, తూర్పు రోమన్ రాజ్యపాలన సాగుతున్న ఆఖరు సమయములో, కాన్స్టెంట్నోపుల్ అతి పెద్ద మరియు సుసంపన్నమైన నగర ప్రాంతము, ఎక్కువగా ఏజియన్ మరియు బ్లాక్ సముద్రముల మధ్య చక్కగా వ్యుహములతో అమలుపరచబడుతున్న వ్యాపార మార్గముల వలన ఇది సాధ్యం అయింది. అది దాదాపు వేయి సంవత్సరములకు పైగా గ్రీక్ మాట్లాడే రాజ్యము యొక్క ముఖ్య పట్టణముగా ఉంది. దాని ముఖ్య రోజులలో, కొంచెం అటుఇటుగా మధ్య కాలములలో, ఇది యురోపియన్ నగరములలో పెద్దది మరియు సుసంపన్నమైన నగరము, ఇది అప్పుడు బలమైన నాగరికతల కలియిక మరియు మెడిటేరియాన్ లో శాసించగలిగే ఆర్థిక జీవితము కలిగి ఉంది. వ్యాపారస్తులు మరియు యాత్రికులు ఇక్కడి సుందర ప్రదేశములు మరియు చర్చ్ లు చూసి, ముఖ్యముగా హాగియా సోఫియా లేదా చర్చ్ అఫ్ హోలీ విజ్డమ్ చూసి చూపు తిప్పుకోలేక పోయేవారు: ఒక 14వ శతాబ్దపు యాత్రికుడు, నోవ్గోర్డ్ కు చెడిన స్టీఫెన్ " సైంట్ సోఫియా కు సంబంధించినంత వరకు మనిషి మెదడు దాని గురించి చెప్పడం కానీ లేదా వర్ణించడం కానీ చేయలేదు." అని వ్రాసాడు.

పడమర ఐరోపా మరియు ఉత్తర ఆఫ్రికాలలో, సాముహికముగా హత్యలు, దోపిడీలు జరుగుతున్న సమయములలో వాటి గ్రంథాలయములో గ్రీక్ మరియు లాటిన్ రచయితల చేతిరాతతో ఉన్న గ్రంథములను కాపాడడం చాలా ముఖ్యము; అలా నగరములోని గొడవలలో, చాలా మంది పారిపోయిన వాళ్ళ చేతులతో ఇటలీకు తేబడ్డాయి మరియు తిరిగి మొదలుపెట్టడానికి, ఈ కాలమునకు చెందిన దానిగా మార్పు చెందడంలో కీలక పాత్ర పోషించాయి. శతాబ్దముల తరబడి ఈ నగరము పై పడమర ప్రాంత ప్రభావము గణించటానికి కుదరదు. సాంకేతికపరముగా, కళలు మరియు నాగరికత పరముగా, అలాగే దాని ప్రాంతము పరముగా, కాన్స్టంట్నోపుల్ వేయి సంవత్సరముల పాటు ఐరోపాలో ఎదురులేకుండా నిలిచింది.

అంతర్జాతీయ హొదా[మార్చు]

కాన్స్టాంటినోపుల్'స్ మాన్యుమెంటల్ సెంటర్.

ఈ నగరము ఐదవ శతాబ్దంలో, బార్బేరియన్ల దాడుల నుండి ప్రాచీన రోమన్ల రాజ్యపు తూర్పు సరిహద్దులను కాపాడడంలో, రక్షణ ఇచ్చింది. 18 మీటర్ల ఎత్తున థియోడోసిస్ II చే నిర్మింపబడిన గోడలు ముఖ్యముగా దక్షిణ డానుబే నది మీదుగా వస్తున్న బార్బేరియన్ల దాడులకు లొంగలేదు, దానివలన వారు సుసంపన్నమైన ఆసియా తూర్పు ప్రాంతముల కంటే, పడమర ప్రాంతములను గెలవడం సులభం అని తెలుసుకున్నారు. ఐదవ శతాబ్దము నుండి ఈ నగరము, అనాస్తాషియన్ గోడ అని పిలవబడే అరవై కిలోమీటర్ల గోడల హారముతో త్రసియన్ పెనిజుల కూడా రక్షించబడుతున్నది. చాలా మంది మేధావులు[ఎవరు?] ఈ రకమైన రక్షణ సదుపాయముల వలన తూర్పు ప్రాంతము ఏ ఇబ్బంది లేకుండా ఎదిగింది, అదే సమయములో ప్రాచీన రోమ్ మరియు పడమర ప్రాంతములు చాలా దెబ్బతిన్నాయి. క్రైస్తవమతం రావడము మరియు ఇస్లాం పెరగడంతో, కాన్స్టంట్నోపుల్ ఎదుగుతున్న ఇస్లాం ఉన్న క్రైస్తవ ఐరోపాకు తలుపులు తెరిచింది. బైజాన్టిన్ సామ్రాజ్యం ఇస్లాం ప్రపంచము మరియు పడమర క్రైస్తవముల మధ్య ఉండడంతో, కాన్స్టంట్నోపుల్ కూడా అరబ్బుల దాడి నుండి కాపాడే మొదటి రక్షణగా ఏడు మరియు ఎనిమిది శతాబ్దములలో వర్ధిల్లింది. ఈ నగరము, రాజ్యము కూడా 1453లో తురకల దాడులలో పడిపోయినప్పటికీ, దాని అంతం కాని వారసత్వము, రోమ్ పతనానాంతరము కూడా ఐరోపా తిరిగి నిర్మించబడేలా చేసింది.

వాస్తుశిల్పం[మార్చు]

ఇంటీరియర్ వ్యూ ఆఫ్ ది హేగియా సోఫియా మ్యూజియం.

బైజాన్టిన్ రాజ్యము రోమన్ మరియు గ్రీకుల నిర్మాణ శైలిని మరియు వారి విధానములను వాడుకుని వారి స్వంత నిర్మాణ శైలిని అభివృద్ధి చేసుకుంది. బైజాన్టిన్ నిర్మాణ శైలి యొక్క ప్రభావము ఐరోపా మొత్తములో ఎక్కడ చూసినా తెలుస్తుంది. ముఖ్యమైన ఉదాహరణలలో వెనిస్ లోని, డి బసలికా ఆఫ్ రావేన్నా మరియు తూర్పు ప్రాంతము నుండి చాలా చర్చ్ లు కూడా వస్తాయి.సైంట్.మార్క్'స్ బసిలికా ఇంకా, కేవలము ఐరోపాలో 13వ శతాబ్దంలో ఇటాలియన్ వెండి నాణెము, బంగారు రూపాయలను ముద్రించేవారు, మధ్య కాలము వరకు సాలిడాస్ ఆఫ్ డయోక్లేతియాన్బీజంట్ బాగా ప్రశంసించబడేది. ఈ నగర గోడలు, చాలా అనుకరించబడ్డాయి (ఉదాహరణకు, కాఏర్నర్ఫాన్ కోటను చూడండి) మరియు దీని పట్టణ నిర్మాణ శైలి, కళను, నైపుణ్యాన్ని మరియు సాంకేతిక పరిజ్ఞానమును పునర్జీవింపచేస్తూ ఉండి, మధ్య ప్రాంతముల వరకు చాలా గొప్పగా భావించబడింది.

మతపరంగా[మార్చు]

కన్స్టంటైన్ యొక్క సంస్థ, బిషప్ ఆఫ్ కాన్స్టంట్నోపుల్ కు చాలా గౌరవం ఇచ్చింది; ఆయన ఆ తరువాతి కాలములో ఎక్మేనికల్ పాటియార్క్ అని పిలవబడ్డాడు మరియు పోప్ [41]తో గౌరవము కొరకు పోటిపడగలిగాడు. ఈ పరిస్థితి గొప్ప విరోధమునకు కారణం అయ్యి, పడమర కాథలిజమ్ ను తూర్పు ప్రాంతపు చాదస్తము నుండి 1054 ప్రాంతము నుండి వేరు చేసింది.

ప్రజాదరణ[మార్చు]

1493లో అంటే తురకలకు నగరం లొంగిపోయిన నలభై ఏళ్ళ తర్వాత, న్యూరంబర్గ్ క్రానికల్‌లో ప్రచురించబడిన కాన్స్టాంటినోపుల్‌ని చూపిస్తోన్న పుట.
 • విలియం బట్లర్ యీట్స్ యొక్క 1926 పద్యం "సెయిలింగ్ టు బైజాంటియమ్"లో కాన్స్టాంటినోపుల్ ఒక అద్భుతమయిన రాజతేజస్సు కలిగిన, అందం, దూరము, మరియు ఆపేక్ష కలుగ చేసే నగరముగా కనిపిస్తుంది.
 • బైజాంటైన్ చక్రవర్తి థియోడోసియస్ II సారధ్యంలో చూపిన విధముగా, కాన్స్టాంటినోపుల్, టెలివిజన్ మినిసీరీస్ "అట్టిల"లో తూర్పు రోమన్ సామ్రాజ్యపు రాజధానిగా అనేక పర్యాయాలు తెరపై కనిపిస్తుంది.
 • I, క్లాడియస్ వ్రాసిన, రచయిత రాబర్ట్ గ్రేవ్స్, కౌంట్ బెలిసారియస్ కూడా రచించాడు, అది బెలిసారియస్ గురించిన ఒక చారిత్రాత్మక నవల. గ్రేవ్స్ తన నవలలో చాలా భాగం, జస్టీనియన్ I యొక్క కాన్స్టాంటినోపుల్ నేపథ్యంలో చూపాడు.
 • ఉంబెర్టో ఎకో యొక్క 2000 నవల బాడొలీనో లో చాలా మటుకు చైతన్యపూరితమయిన కార్యాచరణ యొక్క నేపధ్యాన్ని కాన్స్టాంటినోపుల్ ఇస్తుంది.
 • ది ఫోర్ లాడ్స్ ప్రాచుర్యంలోకి తెచ్చిన పాట, తరువాత దే మైట్ బి జెయింట్స్ ఇంకా చాలా మంది అవచ్చాదము చేసిన "ఇస్తాంబుల్ (నాట్ కాన్స్టాంటినోపుల్)" అనే పాటకు కాన్స్టాంటినోపుల్ యొక్క పేరుని మార్చడం కథావస్తువు.
 • 1978లో విడుదల అయిన ది రెసిడెంట్స్' EP డక్ స్టాబ్ ! యొక్క ఓపెనింఘ్ ట్రాక్‌కు కాన్స్టాంటినోపుల్ టైటిల్.
 • "ఎ ఫ్లేం ఇన్ బైజాంటియమ్" (ISBN 0-312-93026-7) అన్న చెల్సియా క్విన్ యార్బ్రో రచించిన, 1987లో విడుదల అయిన పుస్తకానికి జస్టీనియన్ సారథ్యంలో కాన్స్టాంటినోపుల్ అనే విషయం దృశ్యచిత్రం.
 • ది డిసెంబరిస్ట్స్ పాడిన పాటకు "కాన్స్టాంటినోపుల్" టైటిల్.
 • స్టీఫెన్ లాహెడ్ యొక్క నవల బైజాంటియం (1996) కు 9వ శతాబ్దపు కాన్స్టాంటినోపుల్ నేపథ్యం.
 • ఒకేవిషయం పైన మూడు రచనల ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్‌ లోని మినాస్ టిరిత్ యొక్క చిత్రాలు "కాన్స్టాంటినోపుల్ ఇన్ ది మార్నింగ్"లో లాగా ఉండాలని చిత్రనిర్మాత పీటర్ జాక్సన్ చెప్పాడు.[this quote needs a citation]
 • ఫోక్ మెటల్ బాండ్ అయిన ట్యురిసాస్ అనేక పర్యాయాలు, కాన్స్టాంటినోపుల్‌ను "కాన్స్టాంటినోపోలిస్" అనీ, "ట్సార్‌గ్రాడ్" మరియు "మిక్లాగార్డ్" అని అంటూ, తమ "మిక్లగార్డ్ ఒవర్చర్"లో గుర్తు చేసుకుంటుంది.
 • MMORPG గేమ్ సిల్క్‌రోడ్లో ఒక పెద్ద రాజధానిగా, ఒక పెద్ద చైనీస్ రాజధానితో కలిసి కాన్స్టాంటినోపుల్ కనిపిస్తుంది.
 • గేమ్ "Age of Empires II: The Age of Kings"లో బార్బరోస్స కాంపెయింగ్ యొక్క అయిదవ సినారియోలో కాన్స్టాంటినోపుల్ దర్శనమిస్తుంది, మళ్ళీ ఎక్స్పాన్షన్ పాక్ "Age of Empires II: The Conquerors Expansion"లో, అట్టిల ది హున్ కాంపెయిన్ యొక్క మూడవ సినారియోలో కనపడుతుంది.

వీటిని కూడా చూడండి[మార్చు]

కాన్స్టాంటినోపుల్ నుండి వ్యక్తులు[మార్చు]

 • కాన్స్టాంటినోపుల్‌లో మనుషుల జాబితా

లౌకిక కట్టడాలు మరియు స్మారక చిహ్నాలు[మార్చు]

ఈనాడు జీవించి ఉన్న విధంగా బ్యూకోలియన్ పాలేస్
ఎ ఫ్రాగ్‌మెంట్ ఆఫ్ ది మిలియాన్ (గ్రీకు: Μίλ (λ) ιον), అ మైల్-మార్కర్ మాన్యుమెంట్
 • ఆగస్టేయాన్
  • జస్టీనియన్ యొక్క స్తంభం
 • బెసిలిక సిస్టెర్న్
 • జూక్సిప్పస్ యొక్క నీళ్ళతొట్లు
 • మార్సియాన్ యొక్క స్తంభం
 • కాన్స్టాంటైన్ యొక్క అభిప్రాయ వేదిక
  • కాన్స్టాంటైన్ యొక్క స్తంభం
 • కాన్స్టాంటినోపుల్ యొక్క మహారాజ భవనం
  • బ్యూకోలియన్ రాజ భవనం
 • కాన్స్టాంటినోపుల్‌లో గుర్రపు పందేలు జరుగు స్థలం
  • సెయింట్ మార్క్ యొక్క గుర్రాలు
  • ఒబెలిస్క్ ఒఫ్ థియోడోసియస్
  • సర్పెంట్ కాలమ్
  • వాల్డ్ ఒబెలిస్క్
 • మిలియాన్
 • లౌసస్ యొక్క రాజభవనం
  • ఫిలోగ్జెనోస్ యొక్క తొట్టి
 • బ్లేషర్నే యొక్క రాజభవనం
  • పోర్ఫీరోజెనిటస్ యొక్క రాజభవనం
  • అనీమాస్ యొక్క జైలు
 • వాలెన్స్ ఆక్వీడక్ట్
 • కాన్స్టాంటినోపుల్ యొక్క గోడలు

చర్చ్‌లు, సన్యాసుల ఆశ్రమాలు మరియు మసీదులు[మార్చు]

 • అతీక్ ముస్తఫా పాషా మసీదు
 • బోడ్రమ్ మసీదు
 • చోరా చర్చ్
 • సెయింట్స్ సెర్గియస్ మరియు బాకస్ యొక్క చర్చ్
 • సెయింట్ పాలియూక్టస్ యొక్క చర్చ్
 • హోలి అపోజిల్స్ యొక్క చర్చ్
 • ఎస్కి ఇమారత్ మసీదు
 • ఫెనారి ఇసా మసీదు
 • గుల్ మసీదు
 • హగియా ఐరీన్
 • హగియా సోఫియా
 • హిరామి అహ్మద్ పాషా మసీదు
 • కలందరానె మసీదు
 • కోకా ముస్తఫా పాషా మసీదు
 • నియా ఎక్లెసియా
 • పమ్మాకరిస్టోస్ చర్చ్
 • స్టౌడియోస్ సన్యాసుల ఆశ్రమం
 • వెఫా కిలిసే మసీదు
 • జేరెక్ మసీదు

నానా విధవిషయ సంగ్రహము[మార్చు]

మెహ్మెడ్ II, ఎంటర్స్ కాన్స్టాంటినోపుల్, బై ఫాస్టో జొనారో
 • అహ్మద్ బైకన్ యాజిసియోగ్లు
 • బైజాంటైన్ కాలెండర్
 • బైజాంటియమ్
 • ఎక్యుమెనికల్ పాట్రియార్క్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్
 • ఎపార్క్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ (లిస్ట్ ఆఫ్ ఎపార్క్స్)
 • కాన్స్టాంటినోపుల్ యొక్క పతనం
 • గోల్డెన్ హార్న్
 • ఇస్తాంబుల్
 • కాన్స్టాంటినోపుల్‌లో మనుషుల జాబితా
 • లాటిన్స్ యొక్క ఊచకోత
 • నికా అల్లర్లు
 • నొటిషియా అర్బిస్ కాన్స్టాంటినోపొలిటనే
 • కాన్స్టాంటినోపుల్ యొక్క కోట చుట్టు ముట్టడులు
 • మూడవ రోమ్
 • కాన్స్టాంటినోపుల్ విశ్వవిద్యాలయము

గమనికలు[మార్చు]

 1. పౌండ్స్, నార్మన్ జాన్ గ్రెవిల్. ఆన్ హిస్టారికల్ జియోగ్రఫి ఆఫ్ యూరోప్, 1500-1840 , ప్.124. CUP ఆర్కైవ్, 1979. ISBN 0-521-22379-2.
 2. BBC - టైంలైన్: టర్కీ.
 3. రూమ్, అడ్రియాన్, (1993), ప్లేస్ నేమ్ చేంజెస్ 1900-1991 , మెటుచెన్, N.J., & లండన్: ది స్కేర్క్రో ప్రెస్, Inc., ISBN 0-8108-2600-3 pp. 46, 86.
 4. బ్రిటానిక, ఇస్తాంబుల్.
 5. లెక్సికొరియెంట్, ఇస్తాంబుల్.
 6. 330వ దశాబ్దంలో జ్ఞాపకార్ధం విడుదల చేసిన నాణేలు, నగరాన్ని అప్పటికే కాన్స్టాంటినోపోలిస్ లేదా "కాన్స్టాంటైన్'స్ సిటీ" అనడం జరిగింది (చూడండి ఉదాహరణకి మైకేల్ గ్రాంట్, ది క్లైమాక్స్ ఆఫ్ రోమ్ (లండన్ 1968), p. 133). రేల్‌లెక్సికన్ ఫర్ ఆంటికె అండ్ క్రిస్టెంటమ్ , vol. 164 (స్టట్‌గార్ట్ 2005), 442వ కాలమ్ ప్రకారం, కాన్స్టాంటైన్ "న్యూ రోమ్" (నొవా రోమా ) నగరాన్ని అనుకరించిందన్న సంప్రదాయానికి ఎలాంటి సాక్ష్యం లేదు. 5వ శతాబ్దపు చర్చ్ చరిత్రకారుడు సోక్రటిస్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ నివేదించినట్లుగా, చక్రవర్తి నగరాన్ని అధికారిక నిర్ణయం ద్వారా "రెండవ రోమ్" (Greek: Δευτέρα Ῥώμη Deutéra Rhōmē ) అని ఉండవచ్చు: కాన్స్టాంటినోపుల్ యొక్క పేర్లను చూడండి.
 7. నొటిషియా అర్బిస్ కాన్స్టాంటినొపోలిటనేలోపల ఒక వివరణని చూడగలము.
 8. సోక్రటిస్ II.13, సైటెడ్ బై J B బరి, హిస్టరి ఆఫ్ ది లేటర్ రోమన్ ఎంపైర్, p. 74.
 9. J B బరి, హిస్టరి ఆఫ్ ది లేటర్ రోమన్ ఎంపైర్, p. 75 et seqq .
 10. Liber insularum Archipelagi, Bibliothèque nationale de France, Paris.
 11. మార్గెరెట్ బార్కర్, టైంస్ లిటరరి సప్లిమెంట్ 4 మే 2007 p. 26.
 12. ప్రొకోపియస్' సీక్రెట్ హిస్టరి : చూడండి P నెవిల్-యూర్, జస్టీనియన్ అండ్ హిస్ ఏజ్, 1951.
 13. ఒట్టోమాన్ నగరాన్ని గెలిచి ఆక్రమనిచుకున్న తరువాత, సెయింట్ సోఫియాను మసీదుగా మార్చారు, అది ప్రస్తుతం ఒక మ్యూజియమ్.
 14. సోర్స్ ఫర్ కోట్: స్క్రిప్టోర్స్ ఒరిజినం కాన్స్టాంటినోపొలిటనేరం , ed T ప్రెగెర్ I 105 చూడండి A.A.వాసిలెవ్, హిస్టరి ఆఫ్ ది బైజాంటైన్ ఎంపైర్ , 1952, vol I p. 188).
 15. T. మాడెన్, క్రుసేడ్స్: ది ఇలస్ట్రేటెడ్ హిస్టరి , 114.
 16. జస్టీనియన్, నావెల్లే 63 అండ్ 165.
 17. అర్లి మెడీవల్ అండ్ బైజాంటైన్ సివిలైజేషన్: కాన్స్టాంటైన్ టు క్రుసేడ్స్, Dr. కెన్నెత్ W. హార్ల్.
 18. పాస్ట్ పాండెమిక్స్ దట్ రావేజ్డ్ యూరోప్, BBC న్యూస్, నవంబర్ 7, 2005.
 19. ది ఇన్‌హెరిటెన్స్ ఆఫ్ రోం, క్రిస్ విక్‌హాం, పెంగ్విన్ బుక్స్ లిమిటెడ్. 2009, ISBN 978-0-670-02098-0 (page 260)
 20. వాసిలియెవ్ 1952, p. 251.
 21. జార్జ్ ఫిన్లే, హిస్టరి ఆఫ్ ది బైజాంటైన్ ఎంపైర్, డెంట్, లండన్, 1906, pp. 156-161.
 22. ఫిన్లే, 1906 pp. 174-5.
 23. ఫిన్లే, 1906, p. 379.
 24. ఎనోక్సేన్, లార్స్ మాగ్నర్. (1998). రూనర్ : హిస్టోరియా, టైడ్నింగ్, టోక్నింగ్ . హిస్టోరికా మీడియా, ఫాలన్. ISBN 91-88930-32-7 p. 135.
 25. J M హుసే, ది బైజాంటైన్ వర్ల్డ్, హచిన్సన్, లండన్, 1967, p. 92.
 26. వాసిలెవ్ 1952, pp. 343-4.
 27. సిల్క్ రోడ్ సియేటల్ - కాన్స్టాంటినోపుల్, డేనియల్ C. వాఘ్.
 28. పని అప్పచెప్పబడిన అధికారిని గుంపులోని ప్రజలు చంపివేసారు, చివరికి చిత్రాన్ని నాశనం చేయకుండా తొలగించారు: దానిని ఐరీన్ పునరుధ్ధరించాలి ఆ తరువాత లియో V మళ్ళీ తొలగించాలి: ఫిన్లే 1906, p. 111.
 29. వాసిలెవ్ 1952, p. 261
 30. The Pechenegs, స్టీవెన్ లోవ్ అండ్ డ్మిట్రీయ్ V. ర్యాబోయ్.
 31. ఈ సంఘటనలకు చక్కటి మూలం ఉంది: రచయిత్రి మరియు చరిత్రకారురాలు అన్నా కోమ్నేనా తన రచన ది అలెక్సాయిడ్‌లో.
 32. వాసిలెవ్ 1952, p. 472.
 33. J. ఫిలిప్స్, ది ఫోర్త్ క్రుసేడ్ అండ్ ది సాక్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ , 144.
 34. J. ఫిలిప్స్, ది ఫోర్త్ క్రుసేడ్ అండ్ ది సాక్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ , 155.
 35. Steven Runciman, History of the Crusades, Penguin Books, Harmondsworth, 1965, vol 3, pp. 111-128.
 36. హుసే 1967, p. 70.
 37. T. మాఏన్, క్రుసేడ్స్: ది ఇలస్ట్రేటెడ్ హిస్టరి , 113.
 38. J. నార్విచ్, బైజాంటియమ్: ది డిక్లైన్ అండ్ ఫాల్ , 217.
 39. ది బ్లాక్ డెత్, చానెల్ 4 - హిస్టరి.
 40. D. నికొలి, కాన్స్టాంటినోపుల్ 1453: ది ఎండ్ ఆఫ్ బైజాంటియం , 32.
 41. ది ఫోర్త్ కానన్ ఆఫ్ ది ఫర్స్ట్ కౌన్సిల్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్: CCEL.org

సూచనలు[మార్చు]

 • Bury, J. B. (1958). History of the Later Roman Empire: From the Death of Theodosius I to the Death of Justinian. Dover Publications.
 • Crowley, Roger (2005). Constantinople: Their Last Great Siege, 1453. Faber and Faber. ISBN 978-0-571221851.
 • Murr Nehme, Lina (2003). 1453: The Fall of Constantinople. Aleph Et Taw. ISBN 2868398162.
 • Freely, John (1998). Istanbul: The Imperial City. Penguin. ISBN 9780140244618.
 • Freely, John (2004). The Byzantine Monuments of Istanbul. Cambridge University Press. ISBN 9780521772570. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 • Gibbon, Edward (2005). The Decline and Fall of the Roman Empire. Phoenix Press. ISBN 9780753818817.
 • Hanna-Riitta, Toivanen (2007). The Influence of Constantinople on Middle Byzantine Architecture (843-1204). A typological and morphological approach at the provincial level. Suomen kirkkohistoriallisen seuran toimituksia 202 (Publications of the Finnish Society of Church History No. 202). ISBN 9789525031416.
 • Harris, Jonathan (2007). Constantinople: Capital of Byzantium. Hambledon Continuum. ISBN 978-1-84725-179-4.
 • Harris, Jonathan (2003). Byzantium and the Crusades. Hambledon and London. ISBN 978-1-85285-501-7.
 • Herrin, Judith (2008). Byzantium: The Surprising Life of a Medieval Empire. Princeton University Press. ISBN 978-0-69113-151-1.
 • Mansel, Philip (1998). Constantinople: City of the World's Desire, 1453-1924. St. Martin's Griffin. ISBN 9780312187088.
 • Phillips, Jonathan (2005). The Fourth Crusade and the Sack of Constantinople. Pimlico. ISBN 978-1-84413-080-1.
 • Runciman, Steven (1990). The Fall of Constantinople, 1453. Cambridge University Press. ISBN 9781844130801.
 • Treadgold, Warren (1997). A History of the Byzantine State and Society. Stanford University Press. ISBN 9780804726306.

బాహ్య లింకులు[మార్చు]

మూస:Byzantine Empire topics

Coordinates: 41°00′44″N 28°58′34″E / 41.01224°N 28.976018°E / 41.01224; 28.976018