కాపర్(II) నైట్రేట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాపర్(II) నైట్రేట్
పేర్లు
IUPAC నామము
Copper(II) nitrate
ఇతర పేర్లు
Cupric nitrate
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [3251-23-8]
పబ్ కెమ్ 18616
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:78036
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య GL7875000
SMILES [Cu+2].[O-][N+]([O-])=O.[O-][N+]([O-])=O
ధర్మములు
Cu(NO3)2
మోలార్ ద్రవ్యరాశి 187.5558 g/mol (anhydrous)
241.60 g/mol (trihydrate)
232.591 g/mol (hemipentahydrate)
స్వరూపం blue crystals
hygroscopic
సాంద్రత 3.05 g/cm3 (anhydrous)
2.32 g/cm3 (trihydrate)
2.07 g/cm3 (hexahydrate)
ద్రవీభవన స్థానం 256 °C (493 °F; 529 K) (anhydrous, decomposes)
114.5 °C (trihydrate)
26.4 °C (hexahydrate, decomposes)
బాష్పీభవన స్థానం 170 °C (338 °F; 443 K) (trihydrate, decomposes)
trihydrate:[1]
381 g/100 mL (40 °C)
666 g/100 mL (80 °C)
hexahydrate:[1]
243.7 g/100 mL (80 °C)
ద్రావణీయత hydrates very soluble in ethanol, ammonia, water; insoluble in ethyl acetate
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
orthorhombic (anhydrous)
rhombohedral (hydrates)
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు Irritant, Oxidizer
భద్రత సమాచార పత్రము Cu(NO3)2·3H2O
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Nickel(II) nitrate
Zinc nitrate
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references
సజల కాపర్(II) నైట్రేట్ ద్రావణం

కాపర్(II) నైట్రేట్ ఒకరసాయన సమ్మేళన పదార్థం. ఇది ఒక ఆకర్బన రాయన సమ్మేళనపదార్థం.నీలి రంగులో, స్పటిక రూపంలో ఉండు ఘన సంయోగ పదార్థం.ఈ సంయోగ పదార్థం యొక్క రసాయన సంకేత పదంCu(NO3) ;కాపర్(II) నైట్రేట్ సంయోగ పదార్థం రాగి, నత్రజని, ఆక్సిజన్ పరమాణువుల సంయోగం వలన ఏర్పడును. ఈ సంయోగ పదార్థం పీడన రహిత స్థితి/వాక్యుంలో 150-200°Cవద్ద ద్రవీకరణ చెందకుండా నేరుగా ఆవిరిగా ఉత్పతనము(sublimation) చెందును.కాపర్ నైట్రేట్ 5 రకాల సార్ద్ర (hydrate) రూపాలలో లభిస్తుంది.ఈ జలయుత/జలయోజిత (hydrated) రూపాలలో మూడు, ఆరు నీటి అణువులను కలిగిన కాపర్‌నైట్రేట్‌లు సాధారణం.

భౌతిక ధర్మాలు[మార్చు]

నీలి రంగులో, స్పటిక రూపంలో ఉండు ఘన సంయోగ పదార్థం.నిర్జల కాపర్(II) నైట్రేట్ యొక్క అణుభారం 187.5558గ్రాములు/మోల్. మూడు నీటిఅణువులను కలిగిన సార్ద్రకాపర్(II) నైట్రేట్ అణుభారం 241.60గ్రాములు/మోల్.అలాగే అయిదు నిటిఅణువులను కలిగిన సార్ద్రకాపర్(II) నైట్రేట్ అణుభారం232.591గ్రాముల్/మోల్.25°Cవద్ద నిర్జల/అనార్ద్ర కాపర్(II) నైట్రేట్ యొక్కసాంద్రత 3.05 గ్రాములు/సెం.మీ3.మూడు నీటి అణువులను కల్గిన సార్ద్రకాపర్(II) నైట్రేట్ సాంద్రత 2.32గ్రాములు/సెం.మీ3.అయిదు నీటిఅణువులను కలిగిన కాపర్(II) నైట్రేట్ సాంద్రత 2.07 గ్రాములు/సెం.మీ3.నిర్జల కాపర్(II) నైట్రేట్ ద్రవీభవన స్థానం256°C (493 °F; 529K, ఈ ఉష్ణోగ్రత వద్ద కాపర్(II) నైట్రేట్ వియోగం చెందును.

సంశ్లేషణ-రసాయన చర్యలు[మార్చు]

నిర్జల కాపర్‌నైట్రేటులనుండి జలయోజిత కాపర్ నైట్రేటులను ఉత్పత్తి చెయ్యవచ్చును. రాగిలోహాన్ని సజల సిల్వర్ నైట్రేటు ద్రావణంలో రసాయనికచర్య వలన లేదా రాగిలోహాం గాఢనైట్రిక్ ఆమ్లంతో చర్య జరపడం వలన కాపర్ నైట్రేటులను ఉత్పత్తి చెయ్యవచ్చును.

Cu + 4 HNO3 → Cu(NO3)2 + 2 H2O + 2 NO2

రాగి లోహాన్ని N2O4తో చర్యజరిగేలా చూడటం వలన నిర్జల కాపర్ నైట్రేటు ఏర్పడును.

Cu + 2 N2O4 → Cu(NO3)2 + 2 NO

అయితే సార్ద్రకాపర్II) నైట్రేటులను వేడిచేసి నిర్జలికరణము చెయ్యడం వలన నిర్జల కాపర్‌నైట్రేటులకు బదులు కాపర్‌ఆక్సైడులు ఏర్పడును. 80°Cవద్ద సార్ద్రకాపర్(II) నైట్రేటు మౌలిక/మూలకాపర్ నైట్రేటు (Cu2(NO3) (OH) 3) గా మొదట పరివర్తన చెంది, తరువాత క్రమంలో 180 °Cవద్ద కాపర్ ఆక్సైడు(CuO) గా మారును. కాపర్ నైట్రేటుల ఈ రసాయనచర్య గుణాన్ని ఆధారంగాచేసుకొని, కాపర్ నైట్రేటులను, వియోగం చెందేలా వేడి చేసి, వెలువడిన ఆవిరులను నీటిలోకి పంపి నైట్రిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చెయ్యుదురు.ఈ రసాయన ప్రక్రియ విధానం ఒస్టవాల్డ్ ప్రక్రియ(Ostwald process) లోని చివరి దశని పోలి ఉంది.

2 Cu(NO3)2 → 2 CuO + 4 NO2 + O2
3NO2 + H2O → 2HNO3 + NO

అణు సౌష్టం[మార్చు]

నిర్జల/అనార్ద్ర కాపర్(II)నైట్రేట్[మార్చు]

నిర్జల కాపర్(II) నైట్రేట్ స్పటికాలు రెండు రకాల ద్రావణీయయోజన బహురూపకాలను కలిగి ఉంది. అవి3D సమన్వయపాలిమరు జాలాకార వ్యవస్థ కలిగిన α-, β-Cu(NO3) 2. ఇందులో α-రూపక సౌష్టవంలో ఒక Cu కేంద్రకంపరిణామకముగా [4+1]సంసంయోజనియతను కలిగి ఉండును.β-రూపంలో రెండు కాపర్ కేంద్రకాలుఉండి, [4+1]సంసంయోజనియతను కలిగి ఉండి, అందులో ఒకరూపకం చదర సమీకృత రూపములో ఉండును.

జలసంయోజిత కాపర్ (II)నైట్రేట్[మార్చు]

అయిదు రకాల జలసంయోజిత కాపర్(II) నైట్రేట్‌లను గుర్తించడం జరిగింది.అవి మోనో హైడ్రేట్ కాపర్ నైట్రేట్(Cu(NO3) 2•H2O), సేసిక్యు హైడ్రేట్ కాపర్ నైట్రేట్ ((Cu(NO3) 2•1.5H2O), హైడ్రేట్ కాపర్ నైట్రేట్(Cu(NO3) 2•2.5H2O, ట్రై హైడ్రేట్ కాపర్ నైట్రేట్(Cu(NO3) 2•3H2O, హెక్సా హైడ్రేట్ కాపర్ నైట్రేట్(Cu(H2O) 6](NO3) 2).

సేంద్రియ పదార్థాల సంశ్లేషణ[మార్చు]

ఆరోమాటిక్ సంయోగపదార్థాలను నత్రీకరణము చెయ్యుటకై కాపర్‌నైట్రేట్‌ను అసిటిక్ అనహైడ్రేట్‌తో కలిపి ఉపయోగిస్తారు.బంకమన్నుతో శోషితమైన/ పీల్చబడ్డ సార్ద్రకాపర్ నైట్రేట్‌ను క్లేకాప్(Claycop) అంటారు.ఈ క్లేకాప్ ను డై సల్ఫైడులను, థైయొల్స్/థిఒల్స్(thiols) లను ఆక్సీకరణ కావించుటకు ఉపయోగిస్తారు.అలాగే డైథయోఅసిటాల్స్(dithioacetals) ను కార్బోనైల్స్ మార్చుటకు కుడా ఉపయోగిస్తారు.

ఉపయోగాలు[మార్చు]

కాపర్ (II) నైట్రేట్‌ను పలురకాల పదార్థఉత్పత్తులలో ఉపయోగిస్తారు.ముఖ్యంగా ఈ రసాయనపదార్థం నుండి సేంద్రియ రసాయనశాస్త్రంలో ఉత్పెరకంగా (catalyst) గా విరివిగా ఉపయోగించు కాపర్(II) ఆక్సైడును ఉత్పత్తి చెయ్యుదురు.కాపర్ నైట్రేటు ద్రావణాలను టెక్సుటైలు జవుళినేత ) పరిశ్రమలో, ఇతర లోహాలను మెరుగు పెట్టుటకు(polish) ఉపయోగిస్తారు.కొన్ని రకాల బాణాసంచాల తయారీలో కూడా ఉపయోగిస్తారు.పాఠాశాల లలోని ప్రయోగశాలలో వోల్టావిద్యుద్ఘటము(voltaic cell) ప్రదర్శనలో ఉపయోగిస్తారు.

ఇవికూదా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Perrys' Chem Eng Handbook, 7th Ed