Jump to content

కాపలాదారుడు

వికీపీడియా నుండి
చైనాలో సెక్యూరిటీ గార్డు.
చైనాలో సెక్యూరిటీ గార్డు.

కాపలాదారులూ లేదా సెక్యూరిటీ గార్డులు (security guard) వ్యక్తులకి, సంస్థలకి రక్షణ కలిగిస్తారు.. వివిధ రంగాలో పని చేసే అవకాశం వుంటుంది. ద్వారాల దగ్గర కాపలా, సందర్శకులకు చీటీలివ్వడం, వస్తువుల రాకపోకలను నమోదు చేయడం లాంటి పనులు వుంటాయి. మహిళలు బయట ఎక్కువగా పనిచేస్తుండటముతో, మహిళలకు కూడా అవకాశాలున్నాయి. ప్రైవేటు, ప్రభుత్వ రంగాలలో అవకాశాలున్నాయి.

ప్రైవేటు రంగం

[మార్చు]

10 వ తరగతి చదివిన వారు స్వల్ప కాల శిక్షణ పొంది, వివిధ సంస్థలలో ఉద్యోగం పోందవచ్చు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో యువతకి ఉపకారవేతనాలు ఇచ్చి శిక్షణ ఇస్తున్నది. దీనికై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA) [1] పని చేస్తోంది.

ప్రభుత్వ రంగం

[మార్చు]

ఈ ఉద్యోగార్ధులు (ఉదా: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ) సాధారణంగా 10 వ తరగతి ఉత్తీర్ణుడై వుండాలి. 18 నుండి 23 సంవత్సరాల మధ్య వయస్సులో వుండాలి. దేహ ధారుఢ్యములో కనీస ప్రమాణాలు (ఉదా: 170 సెంమీ ఎత్తు, 80-85 సెంమీ ఛాతీ , కంటి దూరపు చూపు కళ్లజోడు లేకుండా 6/6 లేక 6/9 వుండాలి. మంచి శారీరక, మానసిక ఆరోగ్య స్థితిలో వుండాలి. భౌతిక శక్తి పరీక్ష, రాత పరీక్ష, ఆరోగ్య పరీక్షల ద్వారా ఎంపిక జరుగుతుంది. భౌతిక శక్తి పరీక్షలో 5 కిమీ దూరాన్ని 24 నిముషాలలో పూర్తి చేయుట, 11 అడుగుల లాంగ్ జంప్,3.5 అడుగుల హై జంప్, (మూడు అవకాశాలు) వుంటాయి. 100 మార్కుల రాత పరీక్షలో, సాధారణ జ్ఞానం, సామాన్య లెక్కలు, ఆలోచనా శక్తి పరీక్ష ప్రశ్నలుంటాయి. కొన్ని వర్గాల వారికి, అర్హతలలో సఢలింపు వుంటుంది.

పోలీస్

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ [2] శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగానికి కనీసం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అవసరము.

సైన్యం

[మార్చు]

భారత సైనిక దళం సంవత్సరములో చాలా సార్లు రాలీలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తుంది. స్థానిక పత్రికలలో 2 వారాల ముందు ప్రకటన వెలువడుతుంది.

మూలాలు

[మార్చు]
  1. గ్రామీణాభివృద్ధి సంస్థ
  2. ఆంధ్రప్రదేశ్ పోలీస్

బయటి లింకులు

[మార్చు]