కాపు రాజయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాపు రాజయ్య
జననంకాపు రాజయ్య
ఏప్రిల్ 7, 1925
మెదక్ జిల్లా కి చెందిన సిద్ధిపేట
మరణంఆగష్టు 20, 2012
నివాస ప్రాంతంమెదక్ జిల్లా కి చెందిన సిద్ధిపేట
ప్రసిద్ధిచిత్రకారుడు
తండ్రిరాఘవులు

కాపు రాజయ్య ( ఏప్రిల్ 7, 1925ఆగష్టు 20, 2012) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు.[1] గ్రామీణ నేపథ్యం గల చిత్రాలకు ఈయన పేరు పొందాడు.[2] ఈయన చిత్రపటాలు ప్రపంచం లోని పలు ప్రదేశాలలో ప్రదర్శింపబడినవి. ఈయన 1963 లో లలితకళా సమితిని స్థాపించారు.

జీవితం[మార్చు]

రాజయ్య సిద్ధిపేటలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. హైదరాబాదు లోని ప్రభుత్వ కళాశాల నుండి చిత్రకళలో డిప్లోమా పొందాడు.[3]

కళాకారునిగా[మార్చు]

డ్రాయింగ్‌లో మద్రాసు ప్రభుత్వ డిప్లమా కూడా పొందారు. లలితా కళా అకాడమీ ద్వారా ఆయన చెకోస్లోవికియా, హంగేరి, రుమేనియా, బల్గేరియా దేశాల్లో ప్రదర్శనలు పెట్టారు. జెఎన్‌టియు ఆయనను గౌరవ డాక్టరేట్ ద్వారా గౌరవించింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన కళారంగంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. ఆయన ఏ బొమ్మ గీసినా సజీవ లక్షణం ఉట్టిపడేది. ఆయన తండ్రి రాఘవులు సిద్ధిపేటలో చిన్నపాటి వ్యాపారి. రాఘవులుకు ఆయన మూడో సంతానం. ఆయనకు ముందు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. చిన్న వయస్సులోనే తండ్రి మరణించడంతో ఆయన తీవ్రమైన ఇబ్బందుల పాలయ్యారు. కాపు రాజయ్య కుటుంబాన్ని తండ్రి మిత్రుడు మార్క చంద్రయ్య ఆదుకున్నారు. ఆరో స్టాండర్డులో ఉన్నప్పుడు ఆయన మొదటి చిత్ర ప్రదర్శన జరిగింది. కుబేరుడు అనే ఉపాధ్యాయుడు చిత్రకళలో కాపు రాజయ్యను ప్రోత్సహించారు. రాజయ్యకు 50 దాకా అవార్డులు వచ్చాయి. రాష్ట్రప్రభుత్వం ఆయనను 1966లో రజత పత్రంతో సత్కరించింది. 1969లో తామ్ర పత్రంతో సత్కరించింది. 1975లో ఆయనకు చిత్ర కళాప్రపూర్ణ సత్కారం లభించింది. వడ్డెర మహిళ, ఎల్లమ్మ జోగి, గోపికా కృష్ణ, పంటపొలాలు, వసంతకేళి, కోలాటం వంటి ఎన్నో అద్భుతమైన కళాఖండాలకు ఆయన ప్రాణం పోశారు. కళాకారుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించినా ఆయన తన పుట్టిన గడ్డను మరిచిపోలేదు. ఆయన సిద్ధిపేటలో సైకిల్‌పై తిరుగుతూ ఉండేవారు. రాజయ్య తొలి చిత్రాలు సంప్రదాయబద్దమైన, కాలపరీక్షకు నిలిచిన ప్రాచ్య విధానంలో, అంటే వాష్ పద్ధతిలో చిత్రాలు వేశారు. ఆ తర్వాత నకాషీ చిత్రకారుల అద్భుతమైన టెక్నిక్ ఆయను ముగ్ధుడ్ని చేసింది. దాంతో టెంపరా రంగుల వాడకాన్ని ప్రారంభించారు. నకాషీ చిత్రకారులంటే ఆయనకు ఎనలేని అభిమానం. ఇరవై ఏళ్ల పాటు 1950 నుంచి 1970 వరకు ఆయన టెంపరా చిత్రాలు వేశారు.

ఈయన వేసే నకాషి శైలి చిత్రాలలో వడ్డెర మహిళ, ఎల్లమ్మ జోగి, గోపికా కృష్ణ, పంట పొలాలు, వసంత కేళి, కోలాటం, బోనాలు, బతుకమ్మలు నేపథ్యాలుగా ఉండేవి.

అస్తమయం[మార్చు]

20 ఆగష్టు 2012లో తన 87వ ఏట రాజయ్య పార్కిన్సన్స్ వ్యాధి వలన మరణించారు.[4][5][6] [7](Telugu)

అవార్డులు[మార్చు]

రాజయ్య 1993లో కళా ప్రవీణ, 1997లో కళా విభూషణ్, 2000లో హంస, 2007లో లలిత కళారత్న అవార్డు అందుకున్నారు. విదేశాల్లో సైతం ఆయన చిత్రాల ప్రదర్శనలు జరిగాయి. రాజయ్య చిత్రాలు పార్లమెంటు హౌస్, న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్, సాలార్‌జంగ్ మ్యూజియం, ఆంధ్రప్రదేశ్ లలితా కళా అకాడమీల్లో ప్రదర్శనకు ఉంచారు.

సూచికలు[మార్చు]

  1. "NATIONAL / ANDHRA PRADESH : Folk artist Kapu Rajaiah passes away in Siddipet". The Hindu. 1925-04-06. Retrieved 2012-08-22.
  2. By Ens - Sangareddy. "Artist Kapu Rajaiah dead". The New Indian Express. Archived from the original on 2016-03-04. Retrieved 2012-08-22.
  3. Nipuna (2022-07-06). "తెలంగాణ చిత్రకళాకారులు – ఘనతలు". Archived from the original on 2022-07-07. Retrieved 2022-07-07.
  4. "Artist Kapu Rajaiah dead - South India - Hyderabad - ibnlive". Ibnlive.in.com. Archived from the original on 2012-08-24. Retrieved 2012-08-22.
  5. "::The Hans India::". Thehansindia.info. 1925-04-06. Retrieved 2012-08-22.[permanent dead link]
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-01-17. Retrieved 2013-07-15.
  7. నమస్తే తెలంగాణ, సిద్దిపేట (18 November 2019). "దేశానికే వన్నె తెచ్చిన కాపు రాజయ్య". ntnews.com. Archived from the original on 20 నవంబరు 2019. Retrieved 20 November 2019.

యితర లింకులు[మార్చు]