కాప్రా చెరువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాప్రా చెరువు
ప్రదేశంహైదరాబాద్, తెలంగాణ భారతదేశం
అక్షాంశ,రేఖాంశాలు17°29′44″N 78°33′10″E / 17.49558°N 78.55278°E / 17.49558; 78.55278
రకంసహజ చెరువు
ప్రవహించే దేశాలుభారతదేశం
ఉపరితల వైశాల్యం113 ఎకరం (46 హె.)
సరాసరి లోతు547.873 మీ. (1,797.48 అ.)
గరిష్ట లోతు551.614 మీ. (1,809.76 అ.)
ఉపరితల ఎత్తు1,759 అ. (536 మీ.)
ప్రాంతాలుకాప్రా, సైనిక్ పురి, ఏ.ఎస్.రావు నగర్


కాప్రా చెరువు (ఒపేరా చెరువు) గ్రేటర్ హైదరాబాదుకు ఈశాన్యభాగంలో సైనిక్ పురి సమీపంలో ఉన్న చెరువు.[1] ఈ చెరువు పొడవు 1254 మీటర్లు ఉంటుంది. పాలాలకు సాగునీరు అందించడంలోను, భూగర్భ జలాల పరిరక్షణలోను ఈ చెరువు ఒకప్పుడు కీలక భూమికను పోషించింది. అంతేకాకుండా ప్రజలకు ప్రధాన తాగునీటి వనరుగా కూడా నిలిచింది.

నిర్మాణం[మార్చు]

ఈ కాప్రా చెరువు రామకృష్ణాపురం చెరువు, నాగారంలోని అన్ననారాయణ్ చెరువు, యెల్లారెడ్డిగూడ యాదిబాయిగుంటకు అనుసంధానించబడి ఉంటుంది.

చరిత్ర[మార్చు]

ఒక దశాబ్ధం క్రితం కాలుష్యరహితంగా ఉన్న ఈ చెరువు గతకొంతకాలంగా కలుషితమయింది. దాన వీర శూర కర్ణ సినిమా షూటింగ్‌ సమయానికి కాప్రా చెరువు 204 ఎకరాల విస్తీర్ణంతో ఉండేది.[2] ఇప్పుడు 123 ఎకరాలకు కుంచించుకు 2002లో నిర్వహించిన సర్వే ప్రకారం, 113 ఎకరాలలో ఉన్న చెరువు యొక్క ప్రాంతం, భూ ఆక్రమణల కారణంగా 70 ఎకరాలకు తగ్గింది.[3] ప్రస్తుతం ఈ చెరువు గంగపుత్రుల సంఘం ఆధ్వర్యంలో ఉంది. దాదాపు 160 గంగపుత్రుల కుటుంబాలు ఈ చెరువుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Kapra Lake in Hyderabad is now a cesspool".
  2. విశాలాంధ్ర (18 November 2012). "కాప్రా చెరువు కనుమరుగు!". టి.మల్కయ్య, కాప్రా. Retrieved 14 December 2017.[permanent dead link]
  3. "Save Kapra Lake". The Hans India.