కాబూల్ నది
| కాబూల్ నది | |
|---|---|
ఆఫ్ఘానిస్తాన్లోని కాబూల్ నగరానికి తూర్పున ఉన్న కాబూల్ నది వరద మైదానం యొక్క వైమానిక చిత్రం | |
![]() | |
| స్థానం | |
| దేశాలు | ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ |
| నగరాలు | కాబూల్, సురోబి, జలాలాబాద్ (ఆఫ్ఘానిస్తాన్); పెషావర్, చర్సద్దా, నౌషెరా (పాకిస్తాన్) |
| భౌతిక లక్షణాలు | |
| మూలం | హిందూ కుష్ పర్వతాలు |
| • స్థానం | మైదాన్ షహర్ సమీపంలో, మైదాన్ వర్దక్ ప్రావిన్స్, ఆఫ్ఘానిస్తాన్ |
| • అక్షాంశరేఖాంశాలు | 34°21′25″N 68°50′21″E / 34.357°N 68.8392°E |
| • ఎత్తు | 2,400 m (7,900 ft) |
| సముద్రాన్ని చేరే ప్రదేశం | సింధు నది |
• స్థానం | కుండ్ పార్క్, అటాక్, పంజాబ్, పాకిస్తాన్ సమీపంలో |
• అక్షాంశరేఖాంశాలు | 33°55′0″N 72°13′56″E / 33.91667°N 72.23222°E |
| ప్రవాహం | |
| • స్థానం | నౌషెరా |
| • సగటు | 800 m3/s (28,000 cu ft/s) |
| పరీవాహక ప్రాంత లక్షణాలు | |
| Progression | మూస:RIndus |
| ఉపనదులు | |
| • ఎడమ | పంజ్షీర్ నది, అలింగార్ నది, చిత్రాల్ నది, స్వాత్ నది |
| • కుడి | లోగర్ నది, సుర్ఖాబ్ నది, బారా నది |
కాబూల్ నది[a] ఆఫ్ఘానిస్తాన్ లోని మైదాన్ వర్దక్ ప్రావిన్స్ ఈశాన్య భాగంలో ఉన్న హిందూ కుష్ పర్వత శ్రేణిలోని సంగ్లాఖ్ శ్రేణిలో ఉద్భవించే సుమారు 700 కిలోమీటర్ల పొడవైన నది. ఇది ఉనై కనుమ ద్వారా హెల్మండ్ నది జలవిభాజక ప్రాంతం నుండి వేరుచేయబడింది. కాబూల్ నది పాకిస్తాన్లోని అటాక్ సమీపంలో సింధు నదిలో కలుస్తుంది. ఇది తూర్పు ఆఫ్ఘానిస్తాన్‌లోను, పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోను ప్రధాన నది.[1]
పేర్లు
[మార్చు]ప్రాచీన కాలంలో కాబూల్ నదిని కుభా, అలాగే కోఫెన్ అని పిలిచేవారు.[2][3] నదికి ప్రాచీన నామమైన కుభా అనేది సంస్కృతం, అవేస్తా భాషలలో ఉపయోగించబడిన పదం. కాలక్రమేణా ఈ పదం కాబూల్గా రూపాంతరం చెందింది.[3][4] పర్షియన్ బహుశాస్త్రవేత్త అల్-బీరూనీ ఈ నదిని "ఘోర్వాండ్ నది" అని కూడా పేర్కొన్నాడు.[5] తరువాత ఈ కాబూల్ నది పేరే ఆ ప్రాంతానికీ, అక్కడి కాబూల్ నగరానికీ పేరు అయింది.[5]
ప్రవాహ మార్గం
[మార్చు]
సుమారు 700 కిలోమీటర్ల పొడవున్న కాబూల్ నది కాబూల్ నగరానికి వాయవ్య దిశలో ఉన్న కోహ్-ఎ బాబా పర్వతాలలో సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఉన్న సర్ చష్మా వద్ద, సంగ్లాఖ్ శ్రేణిలో ఉద్భవిస్తుంది.[6][7]
ఈ నది ఆఫ్ఘానిస్తాన్లోని కాబూల్, జలాలాబాద్ నగరాల గుండా ప్రవహిస్తుంది. దీని విస్తారమైన జలపారుదల ప్రాంతం నంగర్‌హార్, కునార్, లఘ్మాన్, లోగర్, కాబూల్, కాపిసా, పర్వాన్, పంజ్షీర్, బామ్యాన్ ప్రావిన్సులను ఆవరించి ఉంటుంది. అనంతరం ఇది టోర్ఖమ్ వద్ద ఉన్న డ్యూరాండ్ రేఖ సరిహద్దు దాటే ప్రాంతానికి ఉత్తరంగా సుమారు 25 కి.మీ. దూరంలో పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ప్రవేశిస్తుంది.[8]
ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో ఈ నది పెషావర్, చర్సద్దా, నౌషెరా నగరాల గుండా ప్రవహిస్తుంది. కాబూల్ నదికి ప్రధాన ఉపనదులు లోగర్ నది, పంజ్షీర్ నది, అలింగార్ నది, సుర్ఖాబ్ నది, చిత్రాల్ నది, బారా నది, స్వాత్ నది.[9]
జల విజ్ఞానం
[మార్చు]
సంవత్సరంలో ఎక్కువ కాలం కాబూల్ నదిలో నీటి ప్రవాహం తక్కువగానే ఉంటుంది. అయితే వేసవి కాలంలో హిందూ కుష్ పర్వత శ్రేణిలో మంచు కరుగుదల వల్ల నది ఉప్పొంగుతుంది.
దీని అతిపెద్ద ఉపనది చిత్రాల్ నది. ఈ నది మొదట మస్తుజ్ నదిగా ప్రారంభమై, పాకిస్తాన్ లోని చిత్రాల్ జిల్లాలో ఉన్న బ్రోఘిల్ లోయలోని చియాంతర్ హిమానీనదం నుండి ప్రవహిస్తుంది. దక్షిణ దిశగా ప్రవహిస్తూ ఆఫ్ఘానిస్తాన్‌లోకి ప్రవేశించిన తరువాత, నూరిస్తాన్ ప్రావిన్స్ నుండి వచ్చే బష్‌గల్ నదిని కలుస్తుంది. అనంతరం జలాలాబాద్ సమీపంలో చిత్రాల్ నది కాబూల్ నదిలో సంగమిస్తుంది.
చిత్రాల్ నది కాబూల్ నదికంటే ఎక్కువ నీటిని తీసుకువచ్చినప్పటికీ, ఈ సంగమం తరువాత కూడా ప్రధాన ప్రవాహాన్ని కాబూల్ నదిగానే పిలుస్తారు. దీనికి ఆ పేరుకు ఉన్న చారిత్రక, రాజకీయ ప్రాధాన్యత కారణం.
నౌషెరా సమీపంలో, సింధు నదిలో కలిసే ముందు కాబూల్ నది యొక్క సగటు వార్షిక ప్రవాహం 800 m3/s (28,000 cu ft/s) ఉంటుంది. ఇందులో చిత్రాల్ నది ఒక్కటే 288 m3/s (10,200 cu ft/s) కంటే ఎక్కువ నీటిని అందిస్తుంది,[1] కాగా చర్సద్దా సమీపంలో కలిసే స్వాత్ నది 280 m3/s (9,900 cu ft/s) కంటే ఎక్కువ నీటిని అందిస్తుంది.[10]
ఆనకట్టలు
[మార్చు]
20వ శతాబ్దంలో నిర్మించబడిన అనేక అణకట్టల ద్వారా కాబూల్ నది నీటిని నిల్వ చేస్తున్నారు. వీటిలో మూడు అణకట్టలు ఆఫ్ఘానిస్తాన్లోని కాబూల్, నంగర్‌హార్ ప్రావిన్సుల్లో ఉన్నాయి. వాటిలో సురోబి అణకట్ట 1957లో జర్మనీ సహాయంతో నిర్మించబడింది. ఇది కాబూల్ నగరానికి జలవిద్యుత్ ఉత్పత్తి చేసే ప్రధాన వనరులలో ఒకటి. నఘ్లు ఆనకట్ట, దరుంటా అనకట్టలను 1960లలో సోవియట్ యూనియన్ శాస్త్రవేత్తలు నిర్మించారు.
పాకిస్తాన్లోని పెషావర్ లోయలో, పెషావర్ నగరానికి వాయవ్యంగా సుమారు 20 కి.మీ. దూరంలో వార్సాక్ అనకట్ట ఉంది.[8]
చరిత్ర
[మార్చు]ఆసియాపై అలెగ్జాండర్ మహారాజు దండయాత్ర
[మార్చు]అర్రియన్ రచించిన ది క్యాంపెయిన్స్ ఆఫ్ అలెగ్జాండర్ గ్రంథంలో కాబూల్ నదిని Κωφήν (కోఫేన్; లాటిన్ రూపం కోఫెన్) అని పేర్కొన్నారు.[2][11][12][13] ఫిలోస్ట్రాటస్ రచించిన లైఫ్ ఆఫ్ అపొల్లోనియస్ ఆఫ్ టయానా రెండవ పుస్తకంలో, అపొల్లోనియస్ కాకసస్ పర్వతాలు దాటి సింధు లోయ వైపు ప్రయాణించే సమయంలో కోఫెన్ నదిని దాటినట్లు పేర్కొనబడింది.

ఆధునిక యుగం
[మార్చు]
1990ల నుండి కాబూల్ నది వేసవి కాలంలో తీవ్రమైన కరువు పరిస్థితులను ఎదుర్కొంటోంది.[8] సుమారు 2019 మార్చి నుండి, మక్రోయాన్ మురుగునీటి శుద్ధి కేంద్రం నుండి ప్రతి నెలా పదివేలల గ్యాలన్ల శుద్ధి చేయని మురుగునీరు కాబూల్ నదిలోకి విడుదల చేయబడుతున్నట్లు నివేదించబడింది. దీని కారణంగా నది తీరంలో నివసించే సుమారు 3,000 కుటుంబాల్లో జీర్ణాశయ సంబంధిత ఆరోగ్య సమస్యలు ఏర్పడినట్లు సమాచారం.[14]
ఇవి కూడా చూడండి
[మార్చు]గమనికలు
[మార్చు]మూలాలు
[మార్చు]- 1 2 Baig, Sohaib; Hasson, Shabeh ul (2023-12-21). "Flood Inundation and Streamflow Changes in the Kabul River Basin under Climate Change". Sustainability (in ఇంగ్లీష్). 16 (1): 116. Bibcode:2023Sust...16..116B. doi:10.3390/su16010116. ISSN 2071-1050.
- 1 2 Arrian, John Rooke; Arrian (1813). "A brief account of all the authors who have touched upon the history of Alexander". Arrian's History of the expedition of Alexander the Great: and conquest of Persia. అనువాదకులు: Rooke, John (2nd ed.). J. Davis.
- 1 2 Ramesh Chandra Majumdar, Achut Dattatrya Pusalker, A. K. Majumdar, Dilip Kumar Ghose, Bharatiya Vidya Bhavan, Vishvanath Govind Dighe Published by Bharatiya Vidya Bhavan (1962). The History and Culture of the Indian People : The Vedic age. p. 247.
The Kubha is the modern Kabul river which flows into the Indus a little above Attock and receives at Prang the joint flow of its tributaries the Swat (Swastu) and Gauri
{{cite book}}: CS1 maint: multiple names: authors list (link) - ↑ Muir, John. Original Sanskrit Texts on the Origin and History of the People of India. p. 352.
'In the older parts of the Rigved the Indian people appear to be settled on the north western border of India, in the Punjab and even beyond the Punjab on the borders of the Kubha river the Kowpher in Kabul. The gradual diffusion of these people from this point towards the east, beyond the Saraswati and Hindustan as far as the Ganges, can be traced almost step by step in the later portions of the Vedic writings
- 1 2 Bosworth, C.E. (1999). "Kabul". Encyclopaedia of Islam (CD-ROM Edition v. 1.0 ed.). Leiden, The Netherlands: Koninklijke Brill NV.
- ↑ "Kabul River | Afghanistan, Pakistan, Map, & Length | Britannica".
- ↑ "KABUL RIVER".[permanent dead link]
- 1 2 3 Wilde, A (April 19, 2012). "Kabul River".
- ↑ "One Land, Two Rules (9): Delivering public services in insurgency-affected Jalrez district of Wardak province". Afghan Analysts Network. 16 December 2019.
- ↑ "Feasibility study on the development of Munda Dam multipurpose project in Islamic Republic of Pakistan: Final report; Vol. 3. -Supporting report" (PDF). Japan International Cooperation Agency.
- ↑ Cawthorne, Nigel (2004). Alexander the Great. Haus Publishing.
- ↑ Heckel, Waldemar (2003). The wars of Alexander the Great, 336-323 B.C. Taylor & Francis.
- ↑ Romm, James S., ed. (2005). Alexander the Great: selections from Arrian, Diodorus, Plutarch, and Quintus Curtius. అనువాదకులు: Mensch, Pamela. Hackett Publishing.
- ↑ Lawrence, J.P.; Babakarkhail, Zubair (September 12, 2020). "Sewage from US Embassy, NATO headquarters dumped into Kabul River due to aging infrastructure". Stars and Stripes.
బాహ్య లింకులు
[మార్చు]- Pages using infobox river with unknown parameters
- Pages using infobox river with mapframe
- Articles containing Dari-language text
- Articles with dead external links from జూన్ 2026
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with GND identifiers
- కాబూల్ నది
- ఆఫ్ఘనిస్తాన్ నదులు
- పాకిస్తాన్ నదులు
- ఆసియాలో అంతర్జాతీయ నదులు
- ఋగ్వేద నదులు
- కాబూల్ ప్రావిన్స్ భౌగోళిక స్వరూపాలు
- నంగర్‌హార్ ప్రావిన్స్ భౌగోళిక స్వరూపాలు
- ఖైబర్ పఖ్తూన్ఖ్వా నదులు
- పంజాబ్ (పాకిస్తాన్) నదులు
- జలాలాబాద్
- కాబూల్
- సింధు నది పరీవాహక ప్రాంతం
