కామేపల్లి (జరుగుమిల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కామేపల్లి
రెవిన్యూ గ్రామం
కామేపల్లి is located in Andhra Pradesh
కామేపల్లి
కామేపల్లి
నిర్దేశాంకాలు: 15°20′13″N 80°01′08″E / 15.337°N 80.019°E / 15.337; 80.019Coordinates: 15°20′13″N 80°01′08″E / 15.337°N 80.019°E / 15.337; 80.019 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంజరుగుమల్లి మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,144 హె. (2,827 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం3,284
 • సాంద్రత290/కి.మీ2 (740/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08599 Edit this at Wikidata)
పిన్(PIN)523271 Edit this at Wikidata

కామేపల్లి, ప్రకాశం జిల్లా, జరుగుమల్లి మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్ నం. 523 271., ఎస్.టి.డి కోడ్:08599.

గ్రామ భౌగోళికం[మార్చు]

ఈ గ్రామం ఒంగోలు నగరము నుంచి 50 కి.మీ దూరము లోనున్నది.

సమీప పట్టణాలు[మార్చు]

టంగుటూరు 20 కి.మీ, సింగరాయకొండ 18.6 కి.మీ, కందుకూరు 14.3 కి.మీ, కొండపి 10 కి.మీ.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

బస్సు రూటు: కామేపల్లి నుండి టంగుటూరు వెళ్ళు బస్సు, లేదా టంగుటూరు నుండి కొండేపి (వయా కామేపల్లి). చిర్రికూరపాడు మీదుగా కందుకూరు పట్టణానికి సులభమైన మార్గం ఉంది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

ఈ పాఠశాల, ప్రతి ఏటా ఎస్.ఎస్.సి పరీక్షా ఫలితాలలో మండలంలో ప్రథమ స్థానమును సాధిస్తుంది. ఈ పాఠశాలలో 2016-17 విద్యాసంవత్సరంలో పదవ తరగతి చదివిన తక్కెళ్ళపాటి అశ్విని అను విద్యార్థిని, పదవ తరగతి పరీక్షలలో 10/10 గ్రేడ్ మార్కులు సాధించింది. ఈమేరకు ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి, పదికి పది గ్రేడ్ మార్కుల సాధించిన విద్యార్థులలో జిల్లాకు ఒక విద్యార్థిని ఎంపికచేసి, 2017,మే-25న సచివాలయంలో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో వీరికి ఈ ప్రశంసా పత్రాలూ, పుస్తకాలూ అందించారు. [4]

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాలలు-2[మార్చు]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామంలో ఒక ఉప విద్యుత్ కేంద్రము, పెట్రోల్ బానికి ఉంది.

గ్రామానికి వ్యవసాయం , సాగునీటి సౌకర్యం[మార్చు]

ప్రధాన నీటి వనరు పాలేరు ఏరు. పాలేటి ఏరు నుంచి ఈ ఊరికి మంచి నీటి సరఫారా ఉంది. పశువలకు, ఇతర అవసరములకు నీటిని కామేపల్లి చెరువు నుంచి నీటిని వాడుతారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

  • ఈ ఊరిలో ప్రధాన రాజకీయ పార్టీలు తెలుగుదేశం.
  • ఈ గ్రామానికి 2013 జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో శ్రీ ఏలూరి రాంబాబు సర్పంచిగా ఎన్నికైనారు. తరువాత వీరు జరుగుమిల్లి మండల మండల సర్పంచుల సంఘం అధ్యక్షులుగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

ఈ గ్రామంలో ప్రఖ్యాతి గాంచిన పోలేరమ్మ తల్లి గుడి ఉంది. ఇక్కడకు ప్రతి అదివారము, మంగళవారము ఎంతో మంది భక్తులు వచ్చి తమ మొక్కులను తీర్చుకుంటారు

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

ఇక్కడి ప్రధాన పంటలు పొగాకు, శనగ.అపరాలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

కామేపల్లి గ్రామం వ్యవసాయ ఆధారిత గ్రామం.

గ్రామ ప్రముఖులు[మార్చు]

గంటా శ్రీనివాసరావు పెట్టుబడుల మంత్రి,అనకాపల్లి శాసన సభ్యులు.

ఈ గ్రామానికి చెందిన కుమారి పోతినేని వెంకటసుధారాణి, గుంటూరులో బి.టెక్ 3వ సం. చదువుచున్నది. ఈమె మొదట అథ్లెటిక్స్ లోనూ తరువాత ఇప్పుడు క్రికెట్టులోనూ రాణిస్తోంది. పలు వయసు విభాగాలలో ఆంధ్ర క్రికెట్టు జట్టుకి ప్రాతినిధ్యం వహించింది. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర సీనియర్ మహిళా జట్టులో ఆడుచున్నది. ఇటీవలే మరోసారి రాష్ట్ర సీనియర్ మహిళాజట్టుకి ఎంపికైనది. ఈ సీజనులో జరిగిన దక్షిణభారత స్థాయి పోటీలలో ఆంధ్ర జట్టు విజయంలో కీలకపాత్ర వహించింది. తన ప్రతిభతో ఆంధ్ర క్రికెట్టు జట్టును దక్షిణభారత స్థాయిలో రెండవ స్థానంలో నిలిపింది. ఆంధ్ర క్రికెట్టు జట్టు నుండి దక్షిణ భారత మహిళా క్రికెట్టు జట్టుకి ఎంపికైన తొలి క్రీడాకారిణి ఈమె. ఈమె తల్లిదండ్రులు లక్ష్మి & కృష్ణయ్య. [2]

గ్రామ విశేషాలు[మార్చు]

కామేపల్లి ఒక ఆదర్శ గ్రామం. ప్రధాన పండుగ సంక్రాంతి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,284 - పురుషుల సంఖ్య 1,685 - స్త్రీల సంఖ్య 1,599 - గృహాల సంఖ్య 878;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,133.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,610, మహిళల సంఖ్య 1,523, గ్రామంలో నివాస గృహాలు 679 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1,144 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం; 2013,అక్టోబరు-14; 9వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2013,డిసెంబరు-5; 16వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2017,మే-26; 6వపేజీ.